యూట్యూబ్‌లో కొన్ని చిల్లర ఎకౌంట్స్ ఎకవుంట్స్ ఉంటాయి. సినిమా హీరోయిన్స్ మీదో, హీరోల మీదో, లేదంటే ఇద్దరినీ కలిపో... వాడిష్టమొచ్చిన నీచనికృష్ట కథొకటి అల్లుతాడు. దానికి పరమ ఛండాలపు థంబ్‌నెయిలొకటి పెడతాడు. లక్షల్లో వ్యూస్ వస్తాయి. వాడి లక్ష్యం నెరవేరుతుంది.
వాడి స్థాయి అదే. వాడి బ్రతుకుతెరువు అదే.
ఇప్పుడు దేశంలోని అత్యధిక టీవీ ఛానెల్స్ కూడా ఈ స్థాయికి దిగజారాయి.
ప్రపంచం ముందు పరువుపోతోంది.
"జర్నలిజం" అన్న పదమే సిగ్గుపడుతోంది.
"జర్నలిజం" అన్న పదమే సిగ్గుపడుతోంది.
డిఫెన్స్ మినిస్ట్రీ ఇన్ని స్టోరీలు, ఇంత కంటెంట్ ఈ ఛానెల్స్‌కు ఎప్పుడిచ్చింది? నిజంగా ఇచ్చివుంటే, అదంతా ప్రింట్ మీడియాలో కూడా వస్తుంది కదా? ఫారిన్ ప్రెస్‌లో కూడా వస్తుంది కదా?
కట్ చేస్తే -
చిల్లర యూట్యూబ్ థంబ్‌నెయిల్ బ్యాచ్ స్థాయికి దిగజారిన ఛానెల్స్ చూపిస్తున్న బ్రేకింగ్ న్యూస్‌నే నిజమని నమ్ముతూ, ఆ న్యూస్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న మన దేశభక్తులకు నా సానుభూతి.
బార్డర్ దగ్గర అనేక కష్టనష్టాలనుభవిస్తున్న మన దేశ ప్రజలందరికీ... దేశం కోసం పోరాడుతున్న మన త్రివిధదళాల ఫైటర్స్ అందరికీ నా సెల్యూట్.
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 14/100.
100 Days, 100 Posts. 14/100.
.jpeg)








.jpeg)








