Showing posts with label స్పిరిచ్యువాలిటీ. Show all posts
Showing posts with label స్పిరిచ్యువాలిటీ. Show all posts

Saturday, 10 May 2025

మీ ఎకౌంట్లో ఇంకెన్ని వీకెండ్స్ ఉన్నాయో తెలుసా?


యావరేజ్‌న మనిషి ఒక 4000 వారాలు బ్రతుకుతాడట.

అంటే ఒక 77 ఏళ్ళు. 

ఒక పెన్నూ పేపర్ తీసుకుంటే ఇట్టే అర్థమైపోతుంది... ఇంకెన్నివారాలు మనం బ్రతుకుతాం అన్నది. 

ఈలోపు మన లిస్టులో కనీసం ఒక 1001 బాధ్యతలు, పనులు, లక్ష్యాలు, కోరికలు, ఆశలు గట్రా చాలా ఉన్నాయి. 

ఎలా సాధ్యం?

మనకు మిగిలిన వారాలెన్ని? 
ఈలోపు ఇన్ని ఉరుకులు పరుగులు అవసరమా? 

మన శరీరానికి విశ్రాంతి ఎప్పుడు? 
మన మనసుకి ప్రశాంతత ఎప్పుడు? 
మనకున్న ఈ ఒకే ఒక్క జీవితానికి ఆనందం ఎప్పుడు? 

కట్ చేస్తే -

అవ్వా బువ్వా అన్నీ కావాలంటే కుదరదు. 

నీకు ఇష్టమైన పనిచేస్తూ, నీకు నచ్చినట్టు నువ్వు జీవించటం ముఖ్యమా? ఎవరో ఏదో అనుకుంటారని నీది కాని బ్రతుకు బ్రతకడం ముఖ్యమా? 

ఆలోచించు. 
ఈలోగా నీ జీవితంలోంచి ఇంకో వారం వెళ్ళిపోకుండా చూసుకో. 

- మనోహర్ చిమ్మని 

100 Days, 100 Posts. 15/100. 

Friday, 9 May 2025

యుద్ధం మరింత తీవ్రం కావద్దనే కోరుకొందాం


పాకిస్తాన్‌ను లేవకుండా కొట్టడానికి భారత్‌కు ఒక 48 గంటలు చాలు. కాని, చైనా పాకిస్తాన్‌కు అండగా వస్తే ప్రమాదం. యుద్ధం కొనసాగుతుంది. 

లోపల్లోపల మన ప్రభుత్వంలో, అంతర్జాతీయంగా సి ఐ ఏ స్థాయిలో కూడా ఎన్నెన్నో ప్లాన్స్ జరుగుతుంటాయి. మనకు బయట కనిపించేది ఒకటి ఉంటుంది. లోపలి స్ట్రాటెజీలు వేరేగా ఉంటాయి.  

పాకిస్తాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోసి, భారత్‌కు అనుకూల నాయకున్ని అధినేతగా చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇదే సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి భారత్‌లో కలుపుకొనే పని కూడా పూర్తి కావచ్చు. 

చెప్పలేం. ఏది ఎక్కడినైనా దారితీయొచ్చు. 

యుద్ధం కొనసాగితే మాత్రం సాధారణ జనజీవితం, ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం అవుతాయి. అలా జరగొద్దనే ఆశిద్దాం. ఇంకొన్ని గంటల్లో ముగియాలనే కోరుకొందాం. 

కట్ చేస్తే - 

ఆ అంశం పైన సోషల్ మీడియాలో మనం రాసుకునేవన్నీ ఎలా ఉంటాయంటే... టీవీలో ఐపియల్ మ్యాచ్ చూస్తూ, "విరాట్ కొహ్లి ఆ బాల్‌ను అలా కొట్టాల్సింది కాదు..." అని, క్రికెట్‌లో అ-ఆ లు తెలీని మనం కొహ్లీకి ఉచితసలహాలు ఇచ్చినట్టుంటుంది.

ఫీల్డులో యుద్ధం చేసేవాళ్లకు, వాళ్ళ కుటుంబాలకు తెలుస్తుంది... అసలు యుద్ధం అంటే ఏంటో, దాని ప్రభావం ఎలా ఉంటుందో. 

దేశ భద్రత కోసం పోరాడుతున్న మన త్రివిధదళాల ఫైటర్స్‌కు సెల్యూట్ చేద్దాం. వారి క్షేమం కోసం ప్రార్థిద్దాం. 

జై హింద్. జై భారత్. 

- మనోహర్ చిమ్మని 

100 Days, 100 Posts. 13/100.          

Tuesday, 29 April 2025

ఒక మిత్రుడు, 12 నిమిషాలు...


ఒక అధ్యయనం ప్రకారం - నీకు నచ్చిన ఒక మంచి స్నేహితునితో-లేదా-స్నేహితురాలితో... ఎలాంటి అరమరికలు లేకుండా, ఏమీ దాచిపెట్టుకోకుండా, డిప్లొమసీ లేకుండా, బుర్ర నిండా ఉన్న టెన్షన్స్ పక్కన పెట్టేసి, ఫ్రీగా ఒక 12 నిమిషాలు మాట్లాడగలిగితే చాలు... నీ మొత్తం ఆలోచించే విధానమే మారిపోతుందట. 

అదెలా అంటే... ఎన్నో రోజులుగానో, నెలలుగానో, సంవత్సరాలుగానో... ఏదో ఒక అంశం గురించో, ఒక సమస్య గురించో, ఒక రిలేషన్‌షిప్ గురించో, ఒక నిర్ణయం గురించో... నీ ఆలోచనలన్నీ ఒక్కటే లూప్‌లో తిరుగుతుంటాయి. అది నీకు తెలుసు, కాని గుర్తించవు. అదే నీ కమ్‌ఫర్ట్ జోన్. ఆ జోన్ విడిచిపెట్టి నువ్వు బయటికిరాలేవు. అయినా సరే... అవే కష్టాలు భరిస్తూ, అదే టెన్షన్లో, నీకు తెలియకుండా నిన్ను కమ్మేసిన ఒక క్రానిక్ డిప్రెషన్లో నువ్వు బ్రతుకుతుంటావు. అంతా బాగా లేదని నీకు తెలుసు. కాని బాగున్నట్టే ఫీలవుతుంటావు. బయటికి కూడా నువ్వు అలాగే కనిపిస్తుంటావు అందరికీ. కాని, అది నిజం కాదు. 

ఇదిగో ఇదంతా ఒక ఒక బ్యాగేజీ. నువ్వు మోయలేని ఒక పెద్ద బరువు. ఇదంతా పక్కనపెట్టి... నీకు నచ్చిన ఫ్రెండుతో పైన చెప్పినట్టు అన్ని ఫిల్టర్సూ తీసేసి, ఫ్రీగా ఒక 12 నిమిషాలు మాట్లాడగలిగితే చాలు. నువ్వొక కొత్త మనిషివవుతావు. కొత్తగా ఆలోచిస్తుంటావు. 

ఇప్పటిదాకా నిన్ను వేధిస్తున్న సమస్యలకు, నువ్వే ఒక కొత్త పరిష్కారం కనుగొంటావు. నువ్వే ఒక నిర్ణయం తీసుకొంటావు. 

కాని, ఇది ఎవ్వరూ చేయరు. ఎవ్వరికీ అంత సమయం లేదు. 12 నిమిషాలు కాదు, ఎన్నో వందల నిమిషాలు వృధాగా వెచ్చిస్తుంటారు. కాని, అదే పనికిరాని ఫెయిల్యూర్ లూప్‌లో కొనసాగుతుంటారు. 

దీన్ని బ్రేక్ చేసినవాళ్ళు కింగ్స్, క్వీన్స్. 

కట్ చేస్తే -

There is a reminder that I always have 12 minutes for you. 

- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 3/100.

Wednesday, 16 April 2025

సినిమాల్లోకి ఎంట్రీనే ఉంటుంది... ఎక్జిట్ మన చేతుల్లో ఉండదు!


'సినిమా కష్టాలు' పడకుండా ఇండస్ట్రీలో పైకివచ్చినవారు లేరు!

ఎంత సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నా సరే, ఎంత డబ్బున్నా సరే, ఎంతో టాలెంట్ ఉండి మరెంతో టాప్ రేంజ్‌లోకి వచ్చినా సరే... ఏదో ఒక టైమ్‌లో, ఏదో ఒక రూపంలో, ఈ సినిమా కష్టాలనేవి ఈ రంగంలో ఉండేవాళ్లను తప్పక ఎటాక్ చేస్తాయి.

ఈ స్టేట్‌మెంట్‌కు ఎలాంటి రిలాక్సేషన్ లేదు. ఎవ్వరూ దీనికి అతీతులు కాదు. 

ఒక టాప్ రేంజ్ హీరోగా తన సినిమాలతో దేశాన్ని ఉర్రూతలూగించిన ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ నివసించే ఇంటిని బ్యాంక్ వాళ్లు వేలానికి పెట్టే పరిస్థితి వచ్చింది ఒక దశలో.

అప్పటికే సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి, బాగా సంపాదించి, ఇంకా అదే రేంజ్‌లో సినిమాలు చేస్తున్న సమయంలోనే దర్శకుడు పూరి జగన్నాథ్ సుమారు వంద కోట్లు పోగొట్టుకొని ఆర్థికంగా ఒక్కసారిగా మైనస్‌లోకి వెళ్లిపోయాడు. మొన్నీమధ్యకూడా "ఇస్మార్ట్ శంకర్" కు ముందు, పూరీ దగ్గర యాభై వేలుకూడా లేని పరిస్థితి గురించి కొన్నిరోజులక్రితం ఆయన పుట్టినరోజునాడు ఒక కార్యక్రమంలో ఛార్మి ఎంతో ఎమోషనల్‌గా చెప్పింది.    

ఒక పెద్ద రచయిత, అప్పట్లో చదివించే స్థోమతలేక తన కొడుకు చదువుని ఇంటర్‌మీడియట్‌తోనే ఆపేశారు.

ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా ఇచ్చి, ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించిన తర్వాత కూడా, ఒక మేవరిక్ దర్శకుడు, ఆయన టీమ్... తమ సొంత బేనర్లో మరో సినిమా చేస్తున్న సమయంలో... లంచ్‌కి డబ్బుల్లేక బండిమీద రేగుపళ్లు కొనుక్కుని తిన్నారంటే నమ్ముతారా? 

ఇలా ఎన్నయినా ఉదాహరణలు ఇవ్వగలను. దీన్నిబట్టి అసలు అవకాశాలు, సక్సెస్‌లు లేనివారి కష్టాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ఎవరైనా చాలా ఈజీగా ఊహించవచ్చు.  

సినిమా కష్టాలకు సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవాటితో అస్సలు సంబంధం ఉండదు అని చెప్పడమే ఇక్కడ నా పాయింట్. మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే - సినిమాల్లోకి ఎంట్రీనే ఉంటుంది. ఎక్జిట్ మన చేతుల్లో ఉండదు. 

సినిమా ఎవ్వర్నీ వదలదు, దీన్లోకి ఎంటరయినవాడు సినిమానీ వదల్లేడు!

ఇది నిజం... నేనెప్పుడూ సినిమాఫీల్డులోకి పూర్తిస్థాయిలో దిగలేదు. అయినా సరే, దీన్ని వదలాలంటే ఇప్పుడు నాకు జేజమ్మ కనిపిస్తోంది. 

దటీజ్ సినిమా! 

పైనరాసిన మొత్తానికి ఒక పాజిటివ్ ఎపిలోగ్ ఏంటంటే... సినిమాను ఒక పక్కా క్రియేటివ్ బిజినెస్‌గా, ఒక ప్రొఫెషన్‌గా మాత్రమే తీసుకొని, ఆ పరిధిలోనే, ఎక్కడా టెంప్ట్ కాకుండా, కొన్ని అతి మామూలు జాగ్రత్తలు తీసుకొని, కొంచెం బేసిక్ డిసిప్లిన్ పాటిస్తే మాత్రం అసలు ఏ కష్టాలు రావు. బాగా సంపాదించొచ్చు కూడా.   

స్పిరిచువల్‌గా చెప్పాలంటే... ఒక రకమైన 'డిటాచ్‌డ్ అటాచ్‌మెంట్' పాటించాలి. కాని, ఎవరు పాటిస్తారు? 

ఇదంతా అందరికీ తెలిసిందే. కాని ఆచరణ దగ్గరే తడబడుతుంటారు.

అలా తడబడనివాళ్ళే ఫీల్డులో నిలదొక్కుకుంటారు. వాళ్ళే లైమ్‌లైట్‌లో ఉంటారు. 

The film world rewards the fearless. If you’re waiting for permission, you’ll be watching, not creating.

- మనోహర్ చిమ్మని  

Saturday, 12 April 2025

సినిమా అవతల లైఫ్ చాలా ఉంది...


ఒక్కటే ఒక్క సినిమా. 
మరీ టెంప్ట్ అవుతే -
మరీ అవసరమైతేనే -
ఇంకో సినిమా.
వన్+వన్.   
బస్.  
ఖేల్ ఖతమ్. 
దుకాణ్ బంద్.  

ముందు నేను అనుకున్నది ఇదే. ఇప్పటికీ కట్టుబడి ఉన్నదీ దీనికే. 

ఈలోగా ప్రభుత్వాలు మారాయి. రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో స్టకప్ వచ్చింది. అదే అన్నిచోట్లా రిఫ్లెక్ట్ అయింది. ఆ ఎఫెక్ట్ ప్రత్యక్షంగా పరోక్షంగా నాకూ పడింది. నా టీమ్ మీద కూడా పడింది. అందరం బాగా సఫరయ్యాం.    

కట్ చేస్తే - 

మధ్యలో అనుకోకుండా, అసలు ప్లాన్‌లో లేని... ఒక రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా "ఎర్ర గులాబి" వచ్చింది. చూస్తుండగానే దాని షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో డబ్బింగ్ దశలో ఉంది.  

ఎర్రగులాబి రిలీజ్ చెయ్యడం.
Yo! పూర్తిచేసి, రిలీజ్ చెయ్యడం. 
దట్సిట్. 

సయొనారా టు ఫిలిమ్స్! 

సినిమా అవతల లైఫ్ చాలా ఉంది. సమయం చాలా తక్కువగా ఉంది. 

- మనోహర్ చిమ్మని    

Friday, 11 April 2025

మంథన్ - ఒక చరిత్ర!


1976 లోనే, సుమారు 50 ఏళ్ళక్రితం, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా క్రౌడ్-ఫండింగ్ పద్ధతిలో దర్శకుడు శ్యాం బెనెగల్ రూపొందించిన సినిమా - మంథన్. 

దీనికి కథ శ్యాం బెనెగల్, వర్గీస్ కురియన్ రాయగా, స్క్రీన్‌ప్లే ప్రఖ్యాత రచయిత విజయ్ టెండూల్కర్ అందించారు. ప్రఖ్యాత పాటల రచయిత కూడా అయిన కైఫీ అజ్మీ ఈ సినిమాకు సంభాషణలు రాశారు. సంగీతం వనరాజ్ భాటియా సమకూర్చారు. స్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్, అనంత్ నాగ్, నసీరుద్దీన్ షా, కుల్భూషణ్ కర్బందా, అమ్రిష్ పురి వంటి హేమాహేమీలు ఈ సినిమాలో నటించారు. 

1977లో బెస్ట్ ఫిలిం, బెస్ట్ స్క్రీన్‌ప్లే జాతీయ అవార్డులు అందుకున్న ఈ సినిమా, ఎన్నో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై అద్భుత చిత్రంగా ప్రశంసలందుకుంది. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ వాళ్ళు - ఫిలిం నెగెటివ్ మీద చేసిన ఈ సినిమాను భవిష్యత్ తరాలవారికి కూడా అందుబాటులో ఉండేవిధంగా - శివేంద్రసింగ్ దుంగార్పూర్ సారథ్యంలో డిజిటల్ రూపంలోకి ఇటీవలే 2024లో మార్చారు. అదే సంవత్సరం మే నెలలో, 77 వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. ఆ ప్రత్యేక ప్రదర్శనకు డైరెక్టర్ శ్యాం బెనెగల్‌తో పాటు - దివంగత స్మితాపాటిల్ కుమారుడు ప్రతీక్ బబ్బర్, నసీరుద్దీన్ షా హాజరయ్యారు. ఆ తర్వాత సుమారు 7 నెలల్లోనే శ్యాం బెనెగల్ మరణించారు. 

చాలా మందికి తెలియని విషయం... శ్యాం బెనెగల్ పుట్టింది, పెరిగింది, చదువుకొంది అంతా కూడా మన హైద్రాబాద్‌లోనే అన్నది! ఉస్మానియా యూనివర్సిటీలోనే ఆయన ఎమ్మే ఎకనామిక్స్ చదివారు. శ్యాం బెనెగల్ జన్మించిన తిరుమలగిరి ఏరియా మా ఆఫీసుకి జస్ట్ ఒక 6 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.    

కట్ చేస్తే -

గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు "మిల్క్ కాపిటల్ ఆఫ్ ఇండియా" అని పేరుంది. ప్రఖ్యాత మిల్క్ ప్రొడక్ట్స్ సంస్థ "అమూల్" (AMUL) ఇక్కడే ఉంది. అమూల్ అంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ (AMUL) అని ఎంతమందికి తెలుసు? 

త్రిభువన్ దాస్ పటేల్ లాంటి సోషల్ వర్కర్, వర్గీస్ కురియన్ లాంటి శ్వేత విప్లవకారుల విశేష కృషి ఫలితంగానే గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో మొట్టమొదటి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం రూపొందింది. ఆ సహకార సంఘం ఏర్పాటుకు ముందు ఎంతో మంది నిస్వార్థ నాయకుల కృషి, వారు భరించిన కష్టనష్టాలు, ఎదుర్కొన్న కుల సంబంధమైన కుట్రలు, ద్వేషాలు మొదలైనవాటన్నిటిని నేపథ్యంగా తీసుకొని అల్లిన అందమైన నిజజీవిత కథే శ్యాం బెనెగల్ "మంథన్". 


తమ నిజజీవిత కథను సినిమాగా తీయడం కోసం గుజరాత్ లోని 5 లక్షల మంది పాల ఉత్పత్తిదారులు చెరొక 2 రూపాయలు విరాళంగా ఇచ్చి - మంథన్ సినిమా బడ్జెట్ 10 లక్షల రూపాయలను సమకూర్చారు. ఈ మహత్కార్యానికి పూనుకొని సక్సెస్ చేసిన మనీషి వర్గీస్ కురియన్. 1976 లో మంథన్ విడుదలైనప్పుడు - ఇదే 5 లక్షల మంది పాల ఉత్పత్తిదారులు... వారి డబ్బులతో రూపొందించిన, వారి జీవిత కథనే, వెండితెర మీద చూసుకొని ఆనందించడానికి... గుజరాత్ నలుమూలల నుంచి బండ్లు కట్టుకొని సినిమా థియేటర్లకు వెళ్ళారు.  

చదువుతుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది కదా?  

ఇదీ మంథన్ సినిమా నేపథ్యం. దురదృష్టవశాత్తు, సినీ ప్రేమికులందరూ తప్పక అధ్యయనం చేయాల్సిన ఇలాంటి చరిత్ర, ఎక్కడో నిశ్శబ్దంగా దాగుండిపోవటం, కనుమరుగైపోవడం అనేది పెద్ద విషాదం. 

ఇదీ - మనదేశంలో 50 ఏళ్ళ క్రితమే క్రౌడ్ ఫండింగ్ పద్ధతిలో నిర్మించిన ఒక అద్భుత సినిమా కథ. మరి 50 ఏళ్ళ క్రితమే ఇంత అద్భుతంగా సక్సెస్ సాధించిన క్రౌడ్-ఫండింగ్ పద్ధతి ఇప్పుడెందుకు ఇండియాలో సక్సెస్ కావడం లేదు?... అదే మిలియన్ డాలర్ కొశ్చన్.          

- మనోహర్ చిమ్మని 

మనదేశపు తొలి క్రౌడ్ ఫండింగ్ సినిమా - మంథన్


"క్రౌడ్ ఫండింగ్" అనే పదం ఈ మధ్యనే అమెరికాలో పుట్టింది. క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్స్ వచ్చాయి. అక్కడ బాగా విజయవంతమయ్యాయి.

కానీ, దాదాపు 50 ఏళ్లక్రితమే శ్యాం బెనెగల్ దర్శకత్వం వహించిన సెన్సేషనల్ సినిమా "మంథన్" మనదేశపు తొలి క్రౌడ్ ఫండింగ్ సినిమా. ఇది 1976 లోనే వచ్చింది. 

"సెన్సేషనల్" అన్న పదం ఇక్కడ నేను కావాలని ఉపయోగించాను. మంథన్ సినిమాకు సంబంధించిన క్రింది వివరాలు కొన్ని చదవండి... మీకే తెలుస్తుంది నేనెందుకు ఆ పదం వాడానో.   

కట్ చేస్తే - 

మంథన్ ఉట్టి సినిమా కాదు. ఒక చరిత్ర. 

మంథన్ సినిమా నిర్మించడానికి కావల్సిన మొత్తం 10 లక్షల బడ్జెట్‌ను అప్పట్లో "వైట్ రెవల్యూషన్" కు కారకుడు, "అమూల్" సంస్థ చైర్మన్ డాక్టర్ కురియన్ వర్గీస్ ఈ క్రౌడ్ ఫండింగ్ పధ్ధతిలోనే సమకూర్చిపెట్టాడు.

మొత్తం 5 లక్షలమంది పాల ఉత్పత్తిదారుల నుంచి, మనిషికి 2 రూపాయల చొప్పున సేకరించి, ఈ సినిమా నిర్మాణానికి కావల్సిన మొత్తం బడ్జెట్ 10 లక్షల రూపాయలను శ్యాం బెనెగల్‌కు ఇచ్చి సినిమా చేయించాడాయన. 

అలా తీసిన భారతదేశపు తొలి క్రౌడ్ ఫండెడ్ సినిమా మంథన్, ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను రివార్డులను సాధించిపెట్టింది. పేరు, అవార్డులతోపాటు మంథన్ సినిమాకు లాభాలు కూడా బాగానే వచ్చాయి అప్పట్లో.  

స్మితాపాటిల్, గిరీష్ కర్నాడ్, నసీరుద్దీన్ షా వంటి గొప్ప నటీనటులు నటించిన ఈ సినిమా డిజిటల్ వెర్షన్ 2024 లో, 77 వ కాన్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. దానికి దర్శకుడు శ్యాం బెనెగల్, నసీరుద్దీన్ షా, రత్నా పాఠక్, స్మితాపాటిల్ కుమారుడు ప్రతీక్ బబ్బర్ హాజరయ్యారు. ఆ తర్వాత 2024 డిసెంబర్లోనే శ్యాం బెనెగల్ మరణించారు. 

మనిషికి 2 రూపాయల చొప్పున, మొత్తం 5 లక్షల మంది పాల ఉత్పత్తిదారుల నుంచి క్రౌడ్ ఫండింగ్ అప్పుడెలా చేయగలిగారు? దానివెనుక చరిత్ర ఏంటి? ... 1976 లోనే చరిత్ర సృష్టించిన ఈ సినిమాకు సంబంధించిన మరి కొన్ని సెన్సేషనల్ అంశాలు రేపటి నా బ్లాగ్‌లో, ఇక్కడే చదవండి.

- మనోహర్ చిమ్మని  

Monday, 7 April 2025

మిస్టర్ కాంప్లెక్సిటీ!


నా సినిమాటోగ్రాఫర్ మిత్రుడు వీరేంద్రలలిత్‌కు, నాకూ మాత్రమే తెలిసిన కొన్ని కోడ్ వర్డ్స్ ఉన్నాయి. సెట్స్ లోపల, బయటా సందర్భం వచ్చినప్పుడు మా కోడ్ భాషలో మేము తరచూ ఉపయోగించే పదం - కాంప్లెక్సిటీ!

జీవితంలో కాంప్లెక్సిటీ అంటే మా ఇద్దరికీ చాలా ఇష్టం. "కాంప్లెక్సిటీ లేని లైఫ్ అసలు లైఫే కాదు" అన్నది మా ఫిలాసఫీ. 

అయితే - ఇది అందరూ మామూలుగా అనుకొనే కాంప్లెక్సిటీ కాదు. మా కోడ్ భాషలో దీనర్థం వేరే!

నా రెండో చిత్రం "అలా" తో పరిచయమయ్యాడు వీరేంద్రలలిత్. అప్పటినుంచీ  ప్రొఫెషనల్‌గా దాదాపు రెండు దశాబ్దాల పరిచయం మాది. అంతకుమించి, వ్యక్తిగతంగా రెండు దశాబ్దాల స్నేహం మాది. ఈ రెండు దశాబ్దాల్లో ఇద్దరం కలిసి 3 సినిమాలు చేశాము. 

బయట అందరికీ తెలిసింది ఒక్కటే. వీరేన్‌కు సినిమా అన్నా, ఫోటోగ్రఫీ అన్నా పిచ్చి ప్యాషన్ అని. కానీ, దీన్ని మించి ఆయన గురించి నేను చెప్పాల్సింది చాలా ఉంది.

డిల్లీ యూనివర్సిటీలో ఫిలాసఫీలో ఎం ఫిల్ చేశాడు వీరేన్. పెద్ద ఒరేషియస్ రీడర్. ఎప్పుడు నిద్రపోతాడో తెలియదు. మన చరిత్ర, మన సంస్కృతి, మనం మర్చిపోయిన మన సంస్కృత భాష, మన వేదాలు, మన వైద్యం, మన ఫిలాసఫీల గురించి ఎంతయినా మాట్లాడగలడు.

అయితే - ఇదంతా ఏదో ఉపన్యాసంలా చెప్పడు. చాలా సింపుల్‌గా చెప్తాడు. జీవితంలో మనం మళ్లీ మర్చిపోకుండా!

సినిమాటోగ్రఫీకి సంబంధించి తనకు నచ్చిన ప్రతి పనీ చేస్తాడు. ఒక్క సినిమాలకే కాదు .. డాక్యుమెంటరీలకు, మ్యూజిక్ వీడియోలకు, యాడ్‌లకు కూడా పనిచేసే ఈ అంతర్జాతీయ స్థాయి కెమెరామన్ పాస్‌పోర్ట్ బుక్కులు బుక్కులుగా అయిపోతుంటుంది.

సినిమాటోగ్రాఫర్‌గా ఇప్పటికే ఒక 20 సినిమాలు, డైరెక్టర్‌గా 4 సినిమాలు, వందలాది కమర్షియల్ యాడ్స్, డాక్యుమెంటరీస్ చేసిన వీరేన్ .... మన భూమ్మీద ఉన్న దాదాపు 195 దేశాలుంటే, ఒక 20 తప్ప అన్ని దేశాలు విజిట్ చేశాడు. నాకు తెలిసి, ఇంకో అయిదారేళ్లలో మిగిలిన ఆ కొన్ని కూడా కవర్ చేసి "లోకం చుట్టిన వీరుడు" అవుతాడు. 

ఇండస్ట్రీలో కొంతమంది కెమెరామన్‌లు సెట్స్ పైన ఎంత గొడవ గొడవగా అరుస్తారో అందరికీ తెలిసిందే. వీరేన్ నోటి నుంచి ఎప్పుడూ అరుపులూ కేకలు రావు. లైట్‌మెన్‌నీ, అసిస్టెంట్‌లనీ బూతులు తిట్టడు. లైట్ బాయ్‌లు చెయ్యాల్సిన ఎన్నో పనుల్ని తనే స్వయంగా చేసుకుంటాడు.

ఈగో లేదు. కోపం రాదు. చిరునవ్వు చెరగదు.

వీరేన్ లేకుండా కూడా నేను మరో కెమెరామన్‌తో షూటింగ్ చేయగలను. కానీ, ప్రతిరోజూ 101 కొత్త టెన్షన్‌లను ఎదుర్కొంటూ ఇంత కూల్‌గా మాత్రం చేసేవాన్ని కాదేమో. 

కట్ చేస్తే -  

వీరేంద్ర లలిత్ రెమ్యూనరేషన్‌ను మొన్న నేను చేసిన రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా "ఎర్ర గులాబి" బడ్జెట్ భరించలేదు. "ఇంతే ఇవ్వగలుగుతాం... చెయ్యాలి" అన్నాను. నాకోసం సంతోషంగా ఒప్పుకొన్నాడు. 

ముంబై నుంచి వచ్చాడు. సుమారు 40 రోజులపాటు హైద్రాబాద్‌లోనే మేం ఏర్పాటు చేసిన ఒక చిన్న గెస్ట్ హౌజ్‌లో ఎలాంటి కంప్లెయింట్ లేకుండా అడ్జస్ట్ అయి ఉన్నాడు.

ఒక్క సినిమాటోగ్రాఫర్‌గానే కాదు... అన్ని డిపార్ట్‌మెంట్లూ తనవే అనుకొని ప్రాజెక్టు త్వరగా పూర్తికావడం కోసం చాలా కష్టపడ్డాడు. ఇందుకు ప్రతిఫలంగా - ఆయన స్థాయిని గుర్తించలేని కొంతమందిచేత ప్రత్యక్షంగా, పరోక్షంగా అవమానించబడ్డాడన్న విషయం నా ఒక్కడికే తెలుసు. 

ఇలాంటి విషయాల ప్రస్తావన తెచ్చినప్పుడు "వదిలేయండి. వాళ్లకు ఏం తెలీదు. మనకు ప్రాజెక్టు ముఖ్యం" అంటాడు వీరేన్. 

మొన్న "ఎర్ర గులాబి" షూటింగ్ పూర్తయ్యాక దాదాపు టీమ్ అంతా ప్రాజెక్టు గురించి మర్చిపోయారు... ముఖ్యమైనవాళ్లతో సహా. వీరేన్ మాత్రం, తను ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా, దాదాపు ప్రతిరోజూ నన్ను అడుగుతుంటాడు, "పోస్ట్ ప్రొడక్షన్ ఏ స్టేజిలో ఉంది సర్... ఎలా వస్తోంది" అని. 

అదీ వీరేన్ సిన్సియారిటీ.

థాంక్యూ సో మచ్ వీరేన్!    

త్వరలో ప్రారంభం కానున్న "Yo!" షూటింగ్‌తో పాటు, మేమిద్దరం కలిసి పూర్తిగా ముంబైలోనే ఇంకో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాము. దానికి ముహూర్తాలు, ఓపెనింగ్స్, ఎనౌన్స్‌మెంట్స్ ఏమీ ఉండవు. 

లైట్స్-కెమెరా-యాక్షన్! ... దట్సిట్. 

- మనోహర్ చిమ్మని    

Tuesday, 1 April 2025

అనుక్షణమ్ యవ్వనమ్!


ఆమధ్య ఒక మోస్ట్ ట్రెండీ సబ్జెక్ట్‌తో "ఓకే బంగారం" సినిమా తీసి హిట్ చేసి, ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ 2 ఎపిక్ హిస్టారికల్ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చి, "నాయకుడు" తర్వాత 35 ఏళ్ళకు, కమల్‌హాసన్‌తో మళ్ళీ ఒక ఎపిక్ "థగ్ లైఫ్" ప్రారంభించిన మణిరత్నం వయస్సు 68.

"వెస్ట్ సైడ్ స్టోరీ", "ది ఫేబుల్‌మాన్స్" సినిమాలను బ్యాక్ టు బ్యాక్ తీసి, మొన్నే 2022లో రిలీజ్ చేసిన స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఇప్పుడు మరో కొత్త సినిమా ప్లాన్‌లో ఉన్నారు. స్పీల్‌బర్గ్ వయస్సు 78. 
 
2032 దాకా "అవతార్" 3, 4, 5 సినిమాలను ప్లాన్ చేసుకొని, ప్రస్తుతం ఒకవైపు "అవతార్ 3" (19 Dec 2025 release) పోస్ట్‌ప్రొడక్షన్ జరుపుతూ, మరోవైపు "అవతార్ 4" షూటింగ్ చేస్తూ, 2032లో రిలీజ్ ప్లాన్ చేసుకున్న "అవతార్ 5" క్రియేషన్ బిజీలో మునిగితేలుతూ తన క్రియేటివ్ జీవితపు ప్రతి నిముషం జుర్రుకొంటూ ఎంజాయ్ చేస్తున్న జేమ్స్ కెమెరాన్ వయస్సు 70. 

రంగీలా, కంపెనీ, సర్కార్ వంటి క్లాసిక్స్‌తో మెప్పించిన మేవరిక్ డైరెక్టర్ ఆర్జీవీ, ఆమధ్య పోర్న్‌స్టార్ మియా మల్కోవాతో "గాడ్, సెక్స్ అండ్ ట్రుత్" కూడా తీశాడు. ఏ కుర్ర డైరెక్టర్ కూడా పెట్టలేని కెమెరా యాంగిల్స్‌లో షాట్స్ పెట్టి "ఎంటర్ ది గాళ్ డ్రాగన్" తీసిన ఆర్జీవీ, తన క్రియేటివిటీని ఆమధ్య "పూర్తిగా ఒక అర్థం పర్థం లేని పొలిటికల్ మెస్‌కు అంకితం చేసుకున్నాడు" అని అందరూ అనుకుంటూవుండగానే, కొత్తగా తన మార్క్ సినిమాల కోసం, ఒక మైండ్‌బ్లోయింగ్ "డెన్" ప్రారంభించాడు. ఇప్పుడు మళ్ళీ ఒక భారీ స్టార్-స్టడ్డెడ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ మేవరిక్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ వయస్సు ఇప్పుడు 63. 
 
సో వాట్?!

నాగార్జునకు 65, చిరంజీవికి 69 అంటే ఎవరన్నా నమ్ముతారా? వారి ఫిజికల్ ఫిట్‌నెస్, మెంటల్ ఫిట్‌నెస్ ముందు ఇప్పటి యంగ్ హీరోలు ఎంతమంది పనికొస్తారు?

మర్చిపోయాను...

తన చిత్రాలకు, తనకు కలిపి 41 ఆస్కార్ నామినేషన్స్, 13 ఆస్కార్ అవార్డుల్ని ఖాతాలో వేసుకున్న ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, దర్శకుడు క్లింట్ ఈస్ట్‌వుడ్ వయస్సుకి మామూలుగా అయితే అందరూ రిటైర్ అయిపోయి, మంచం మీద నుంచి లేవలేమనో, చచ్చిపోతామనో ఫిక్స్ అయిపోతారు. కాని, ఆయన తాజాగా వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ హౌజ్ కోసం "జూరర్ నంబర్ 2" అని ఓ కొత్త సినిమా ప్రారంభించారు, అయిపోవచ్చింది కూడా. క్లింట్ ఈస్ట్‌వుడ్ వయస్సు ఇప్పుడు జస్ట్ 94.  

Age is just a number.
 
మన ఆలోచనలు, మైండ్‌సెట్ యంగ్‌గా ఉన్నప్పుడు వయస్సు అనేది... జస్ట్ బుల్ షిట్. 

ఒక్క సినిమాలే కాదు... ఎవరు ఎప్పుడు ఏదైనా ప్రారంభించవచ్చు. ఏదైనా సాధించవచ్చు. 

- మనోహర్ చిమ్మని 

Wednesday, 12 March 2025

"ఎక్స్" ఒక్కటి చాలు!


ఏం ప్రమోట్ చెయ్యాలనుకున్నా, ఏది సాధించాలనుకున్నా ఎక్స్ ఒక్కటి చాలు. 

సోషల్ మీడియా కోసం మనం కాదు. మన కోసం సోషల్ మీడియా.  

మినిమలిజమ్‌లో ఇది నా ఫస్ట్ స్టెప్. 

ఇన్‌స్టాగ్రామ్, బ్లాగ్, ఫేస్‌బుక్ ఎటెస్ట్రా... అన్నిటికీ గుడ్ బై. వీటికోసం నేను పెట్టే కొన్ని నిమిషాల సమయం కూడా - నాకు స్క్రిప్టులు రాసుకోడానికి, డెడ్‌లైన్‌తో కూడిన నా ఇతర సినిమా పనులకు - ఎంతో కొంత తప్పక ఉపయోగపడుతుంది.  

బియాండ్ సినిమా... ఇంకెన్నో పనులూ బాధ్యతలూ ఉన్నాయి నాకు.  

కట్ చేస్తే - 

ఒక్కో దశలో, అప్పటి పరిస్థితులను, అప్పటి అవసరాలను బట్టి మన ఆలోచనలు మారుతుంటాయి. మన ప్రయారిటీస్ మారుతుంటాయి. మన నిర్ణయాలు మారుతుంటాయి. 

ఇదీ అలాంటి నిర్ణయమే. 


- మనోహర్ చిమ్మని. 

Thursday, 28 November 2024

మన ఆలోచనలు, మైండ్‌సెట్ యంగ్‌గా ఉన్నప్పుడు...


ఆమధ్య ఒక మోస్ట్ ట్రెండీ సబ్జెక్ట్‌తో "ఓకే బంగారం" తీసి, హిట్ చేసి, ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ 2 ఎపిక్ హిస్టారికల్ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చి, "నాయకుడు" తర్వాత 35 ఏళ్ళకు, కమల్‌హాసన్‌తో మళ్ళీ ఒక ఎపిక్ "థగ్ లైఫ్" ప్రారంభించిన మణిరత్నం వయస్సు 68. 

"వెస్ట్ సైడ్ స్టోరీ", "ది ఫేబుల్‌మాన్స్" సినిమాలను బ్యాక్ టు బ్యాక్ తీసి, మొన్నే 2022లో రిలీజ్ చేసిన స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఇప్పుడు మరో కొత్త సినిమా ప్లాన్‌లో ఉన్నారు. స్పీల్‌బర్గ్ వయస్సు 77. 2032 దాకా "అవతార్" 3, 4, 5 సినిమాలను ప్లాన్ చేసుకొని, ప్రస్తుతం ఒకవైపు "అవతార్ 3" పోస్ట్‌ప్రొడక్షన్ జరుపుతూ, మరోవైపు "అవతార్ 4" షూటింగ్ చేస్తూ, 2032లో రిలీజ్ ప్లాన్ చేసుకున్న "అవతార్ 5" క్రియేషన్ బిజీలో మునిగితేలుతూ తన క్రియేటివ్ జీవితపు ప్రతి నిముషం జుర్రుకొంటూ ఎంజాయ్ చేస్తున్న జేమ్స్ కెమెరాన్ వయస్సు 70. 

రంగీలా, కంపెనీ, సర్కార్ వంటి క్లాసిక్స్‌తో మెప్పించిన మేవరిక్ డైరెక్టర్ ఆర్జీవీ, ఆమధ్య పోర్న్‌స్టార్ మియా మల్కోవాతో "గాడ్, సెక్స్ అండ్ ట్రుత్" కూడా తీశాడు. ఏ కుర్ర డైరెక్టర్ కూడా పెట్టలేని కెమెరా యాంగిల్స్‌లో షాట్స్ పెట్టి "ఎంటర్ ది గాళ్ డ్రాగన్" తీసిన ఆర్జీవీ, తన క్రియేటివిటీని ఇప్పుడు పూర్తిగా ఒక అర్థం పర్థం లేని పొలిటికల్ మెస్‌కు అంకితం చేసుకున్నాడు అని అందరూ అనుకుంటూవుండగానే, కొత్తగా తన మార్క్ సినిమాల కోసం, ఒక మైండ్‌బ్లోయింగ్ "డెన్" ప్రారంభించి, మల్టిపుల్ సినిమాల్లో బిజీగా ఉన్నాడు. అవి ఏవైనా కానీ, అతనిష్టం. పని చేస్తున్నాడు. ఈ మేవరిక్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ వయస్సు ఇప్పుడు 62. "సర్కార్" అని ఫ్రెండ్లీగా ఆర్జీవీ పిలుచుకునే "బిగ్ బి" అమితాబ్ బచ్చన్ వయస్సు 82.  

సో వాట్?! 

నాగార్జునకు 65, చిరంజీవికి 69 అంటే ఎవరన్నా నమ్ముతారా? వారి ఫిజికల్ ఫిట్‌నెస్, మెంటల్ ఫిట్‌నెస్ ముందు ఇప్పటి యంగ్ హీరోలు ఎంతమంది పనికొస్తారు? మర్చిపోయాను... తన చిత్రాలకు, తనకు కలిపి 41 ఆస్కార్ నామినేషన్స్, 13 ఆస్కార్ అవార్డుల్ని ఖాతాలో వేసుకున్న ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, దర్శకుడు క్లింట్ ఈస్ట్‌వుడ్ వయస్సుకి మామూలుగా అయితే అందరూ రిటైర్ అయిపోయి, మంచం మీద నుంచి లేవలేమని ఫిక్స్ అయిపోతారు. కాని, ఆయన తాజాగా వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ హౌజ్ కోసం "జూరర్ నంబర్ 2" అని కొత్త సినిమా ప్రారంభించారు, అయిపోవచ్చింది కూడా. క్లింట్ ఈస్ట్‌వుడ్ వయస్సు ఇప్పుడు జస్ట్ 94.  

ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్. మన ఆలోచనలు, మైండ్‌సెట్ యంగ్‌గా ఉన్నప్పుడు వయస్సు అనేది... జస్ట్ బుల్ షిట్. 

- మనోహర్ చిమ్మని  

(మొన్న 26/11/2024 నాడు, నా పుట్టినరోజు సందర్భంగా ఈ పాతపోస్టునే ఇప్పుడు మరోసారి ఫ్రెష్‌గా పోస్ట్ చేశాను.)

Monday, 25 November 2024

Happy Birthday to Me!


ఇంకొన్ని గంటల్లో నా పుట్టినరోజు.

నేనేం పెద్ద సెలబ్రిటీ కాదు.

కానీ, ఫేస్‌బుక్ టైమ్‌లైన్ ఓపెన్ పెట్టాలి. వాట్సాప్‌లు, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్/ట్విట్టర్లు చూసుకొంటూ ఉండాలి. ఫోన్‌కు అందుబాటులో ఉండాలి. మిత్రులు, ఆత్మీయుల గ్రీటింగ్స్‌కు రెస్పాండ్ అవుతుండాలి. 

నా మిత్రులు, శ్రేయోభిలాషులైనవారందరి శుభాకాంక్షలను నేను తప్పక గౌరవిస్తాను. వారి అభిమానానికి సర్వదా కృతజ్ఞుణ్ణి. కానీ, ఎక్కువభాగం, ఇదంతా ఒక అనవసరమైన ఆబ్లిగేషన్, హిపోక్రసీ, అనవసరంగా కొనితెచ్చుకొనే ఒక మానసిక వత్తిడి... అని నాకనిపిస్తుంది. 

నేను కరెక్టు కాకపోవచ్చు, కాని నాకు మాత్రం అలాగే అనిపిస్తుంది. 

కొన్ని తప్పవు. అంతే. 

కట్ చేస్తే -

ఈసారి నా పుట్టినరోజు నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే పుట్టినరోజు అవుతుంది. ఎందుకంటే, ఈ పుట్టినరోజు నేపథ్యంగా, దాదాపు ఒక 40 రోజుల క్రితమే, ఒకటి రెండు చాలా పెద్ద నిర్ణయాలు తీసుకున్నాను... వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కూడా. గట్టిగా సంకల్పించాను. సాధిస్తాను కూడా. 

Wish me the best. 

- మనోహర్ చిమ్మని 

Saturday, 23 November 2024

నేను ఊహించని బహుమతి


అంతకు ముందు నా పుట్టినరోజుల్ని నేను పెద్దగా పట్టించుకొనేవాన్ని కాదు. ఈమధ్య మాత్రం బాగానే పట్టించుకుంటున్నాను. పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోవాలని మాత్రమే కాదు... 

నేను ఎంత పెద్దవాన్నయిపోతున్నానో గుర్తుచేసుకోడానికీ, నన్ను నేను చాలా విషయాల్లో అలర్ట్ చేసుకోడానికీ. 

ఈసారి మరింత బాగా గుర్తుపెట్టుకున్నాను నా పుట్టినరోజుని. ఎందుకంటే, ఈ పుట్టినరోజు నేపథ్యంగా, దాదాపు ఒక నెల క్రితమే, ఒకటి రెండు చాలా పెద్ద నిర్ణయాలు తీసుకున్నాను... వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కూడా. 

అందుకే, ఈసారి నా పుట్టినరోజు నాకు చాలా ముఖ్యమైంది.  

కట్ చేస్తే - 

ఈసారి నా పుట్టినరోజుకి సుమారు 14 వేల కిలోమీటర్ల దూరం నుంచి ఒక ప్రత్యేక అతిథి వస్తున్నాడు. ఇది నేను ఊహించని బహుమతి.   

- మనోహర్ చిమ్మని  

Friday, 22 November 2024

నిన్ను ప్రేమించేవారిని గురించి ఆలోచించు...


మన జీవితంలోని ఏ దశలోనైనా, మన చుట్టూ ఉన్నవారిలో...  30 శాతం మందే మనల్ని ప్రేమిస్తారు. 30 శాతం మంది మనల్ని ఇష్టపడరు , లేదా ద్వేషిస్తారు. మిగిలిన 40 శాతం మంది అసలు మన గురించి పట్టించుకోరు! 

ఎవరి గొడవలు వారికున్నాయి. ఇంకొకరి గురించి ఆలోచించే అంత తీరిక, ఓపిక ఎవరికీ లేవు.

ఒకవేళ ఎవడైనా అంత తీరిగ్గా మీ గురించి ఆలోచిస్తూ బయట కామెంట్ చేస్తున్నాడు అంటే అసలు వాడికేం పనిలేదు. వాడెందుకూ పనికిరానివాడని ఖచ్చితంగా అనుకోవచ్చు. 

అలాంటి నీ చుట్టుపక్కల ప్రపంచానికి భయపడి, ఎవరేమనుకుంటారో అని అనుకొంటూ, నువ్వు చెయ్యాలనుకున్న పని చక్కగా చెయ్యలేకపోతున్నావు అంటే ఆ తప్పు నీ చుట్టుపక్కల వారిది కాదు, నీది. 

నిన్ను ప్రేమించేవారిని గురించి ఆలోచించు,
నీ గురించి ఆలోచించు.
మిగిలిందంతా ఉట్టిదే... జస్ట్ బి యస్.  

- మనోహర్ చిమ్మని 

Sunday, 10 November 2024

ఏప్రిల్లో మళ్ళీ అమెరికా ప్రయాణం!


ఏప్రిల్లో మళ్ళీ అమెరికా వెళ్తున్నాను. ఈసారి కూడా ఒక 20 రోజులకంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. కాని వెళ్లాలి అనుకున్నాను. వెళ్తున్నాను. 

కట్ చేస్తే -

Everything is Spiritual in this World. 

నేను చెయ్యాల్సింది ఇంకేదో ఉంది. 

ఇప్పుడు నేను చెయ్యాలని కమిట్ అయిన సినిమా షూటింగ్ అంతా అయిపోయి, ఏప్రిల్ నాటికి దాదాపు కాపీ వచ్చేస్తుంది. ఫైనల్ ప్రమోషన్స్, బిజినెస్ నెగొషియేషన్స్ ఉండే టైంలో ఇలా అమెరికా ప్రయాణం పెట్టుకోవడం అంత కరెక్టు కాదేమో అనిపిస్తుంది. 

కాని, అంత టెన్షన్ ఏం లేదు. ఫోన్లు, జూం మీటింగ్స్ ద్వారానే ఇప్పుడు అన్ని డీల్సూ అయిపోతున్నాయి. 

ఎలాంటి టెన్షన్స్ లేవు, ఉద్యోగసద్యోగాల్లేవు, బాదర బందీల్లేవు, ఘోస్ట్ రైటింగుల్లేవు, ఫ్రీలాన్సర్ ప్రాజెక్టుల్లేవు... మంచి ఫ్రీ టైం ఎంజాయ్ చేస్తూ, ఒక 2, 3 సినిమాలు చాలా బాగా చెయ్యాలనుకున్నాను. ఈ ఫిలిం మేకింగ్ జర్నీని సంపూర్ణంగా ఆస్వాదించాలనుకున్నాను.   

కాని, నా చుట్టూ వున్న మరీ నిరాసక్త, నిర్లిప్త, ఇమ్‌ప్యాషనేట్, ఇన్ఎఫెక్టివ్, ఇనాక్టివ్, అన్‌సెక్సీ టీమ్ పనితీరు, వాతావరణం... నాలో పూర్తిగా అసలు సినిమా పట్లనే విరక్తికి కారణమయ్యాయి. 

తప్పు టీమ్‌ది కాదు... నాది, నా నమ్మకానిది. 

ఎలాగూ సగం దాకా ఇరుక్కుపోయాం కాబట్టి పూర్తిచెయ్యక తప్పదు. దీనికో టైం పెట్టుకున్నాను. ఏప్రిల్ వరకు అన్ని షూటింగ్స్ అయిపోతాయి. ఇంకో 3 నెలలు బిజినెస్, రిలీజ్ గట్రా అయిపోతాయి.  

ఖేల్ ఖతం, దుకాణ్ బంద్! 

ఇన్‌వెస్టర్స్ హాపీ, నేనూ హాపీ. 

నేను హాపీ, నాకొచ్చే ప్రాఫిట్ షేర్ వల్ల కాదు. నేను పొందబోయే ఫ్రీడం వల్ల! 

సో, అదంతా ఇప్పుడే ఫీలవుతున్నాను. మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది కాబట్టి గుడ్-బై చెప్పినట్టే. ఇంక ఈ 6 నెలలు నేను చేస్తున్నదీ, చేయబోయేదీ అంతా ఉట్టి బ్యాలెన్స్ వర్క్ అన్నమాట. 

అలా నా మైండ్‌ను సెట్ చేసేసుకున్నాను. 

ఈ డిజిటల్ డెయిలీలు, ఈ సినిమా రాతలు... ఇవన్నీ పూర్తిగా బంద్. ఈ నగ్నచిత్రం బ్లాగ్ కూడా బంద్. షూటింగ్ తర్వాత, అసలు సినిమాలతో సంబంధం లేని అద్భుతమైన ఇంకో కొత్త బ్లాగ్ ప్రారంభిస్తున్నాను.  

కొన్నిటిని బాహాటంగానే ప్రకటించుకోవాలి. అప్పుడే దానికి కట్టుబడి ఉంటాం. ఇదీ అలాంటిదే. 

నేను ఫిక్స్ అయిపోయాను. నా ఎకౌంటబిలిటీ పార్టనర్ నేనే. 
    
ఖచ్చితమైన టార్గెట్స్ ఉన్నాయి కాబట్టి, నాక్కొంచెం స్ట్రెస్ ఉంటుంది. కొంచెమేంటి, చాలానే ఉంటుంది. కాని,  తప్పదు.

తెచ్చుకోబోయే ఫ్రీడం ఊహించుకొంటూ, నేను ఫుల్ హాపీ. 

దస్విదానియా... మై డియర్ సినిమా! 

- మనోహర్ చిమ్మని   

Friday, 11 October 2024

"...ఇజమ్" ప్రేమికులు తెలుసుకోవాల్సిన నిజం!


తమ ఆదాయంలో సుమారు 65% డబ్బు, అంటే మొత్తం ఒక 102 బిలియన్ డాలర్స్‌ను చారిటీ కోసం వెచ్చించిన రతన్ టాటాను కూడా విమర్శించే 'పనికిమాలిన బ్యాచ్' పోస్టులను ఫేస్‌బుక్‌లో చూసి కంపరం పుడుతోంది. 

వీళ్ళంతా 'మేధావులు', 'మేధో జర్నలిస్టులు'... అని వీళ్ళకి వీళ్ళే అనుకుంటారు. 

వీళ్ళ లెక్క ప్రకారం, రతన్ టాటా లాంటివాళ్ళు బాగా సంపాదించి, ఇలాంటి పనిదొంగలకు అన్నీ పుక్యానికి ఇవ్వాలి. అప్పుడే టాటా కాని, ఇంకో ఇండస్ట్రియలిస్టు గాని మంచోళ్ళయిపోతారు. 

కట్ చేస్తే -

కమ్యూనిజం నామరూపాల్లేకుండా పోయి చాలా కాలమైంది. 

అదొక ఫెయిల్యూర్ యుటోపియా. 

తూర్పు యూరోప్ దేశాలు కమ్యూనిజం నేపథ్యంలో పూర్తిగా కొలాప్స్ అయి, చివరికి కేపిటలిస్టిక్ డెమోక్రసీనే సరైందని తెలుసుకున్నాయి. సోషలిస్టు అగ్రరాజ్యంగా ఒక ఊపు ఊపిన సోవియట్ యూనియన్ కూడా ముక్కలవక తప్పలేదు.

ప్రపంచపటం మీద ఇప్పుడు మిగిలి ఉన్న ఒకే ఒక్క చెప్పుకోదగ్గ అత్యంత శక్తివంతమైన కమ్యూనిస్టు దేశం చైనాలో కూడా ఇప్పుడు దాదాపు 3 వేల కోట్ల యు యస్ డాలర్ల వ్యక్తిగత సంపద ఉన్న జాక్ మా లాంటి బిలియనేర్లు ఎందరో పుట్టుకొస్తున్నారు.  

చైనా కాకుండా... క్యూబా, లావోస్, వియత్నాం, ఉత్తర కొరియా తప్ప ప్రపంచపటం మీద కమ్యూనిస్టు పాలన ఆనవాళ్లెక్కడున్నాయి? 

అవి కూడా క్రమక్రమంగా లిబరలైజ్ కావడం లేదా? 

'ఇలా ఉండాలి... అలా ఉండాలి' అని నాలుగు గోడల మధ్య కూర్చొని రాసే రాతలతో ప్రపంచదేశాలు ప్రగతిపథంవైపు వెళ్ళవు. 

ప్రఖ్యాత రచయిత్రి ఐన్ రాండ్ కూడా అప్పటి రష్యా నుంచి పారిపోయి అమెరికా వెళ్ళింది. ఇంగ్లిష్ నేర్చుకొంది. హాలీవుడ్‌లో స్క్రీన్ రైటర్‌గా పనిచేసింది. తర్వాతనే ఫౌంటేన్ హెడ్. అట్లాస్ ష్రగ్గ్‌డ్ లాంటి సెన్సేషనల్ నవలలు రాసింది. ఆబ్జెక్టివిజం అనే కొత్త ఫిలాసఫీ సృష్టించింది. 

ముందు ఇలాంటి చిన్న చిన్న సాధారణ వాస్తవాలను తెలుసుకోవాలి. అయినాసరే, మేమింతే అనుకుంటే, ముందు మీ కుటుంబంలో ఉన్న నలుగురినైనా మీ బాటలో నడపడానికి ప్రయత్నించండి. రతన్ టాటా లాంటివాళ్ళను విమర్శించగలిగే కనీస హక్కు మీకు అప్పుడొస్తుంది.   

- మనోహర్ చిమ్మని

Wednesday, 2 October 2024

మనం మర్చిపోలేనివి కొన్నుంటాయి...


మీ అమానాన్నలు ఇంకా మీ కళ్ళముందున్నారా? 

అయితే మీరు అదృష్టవంతులు. 

ఇప్పుడు మీరు ఎంత బిజీగా ఉన్నా సరే, ప్రతిరోజూ కొంచెం ఎక్కువ సమయం మీ తల్లిదండ్రులతో గడపండి.  

తర్వాత ఏదో ఒకరోజు మీరు నాకు థాంక్స్ చెబుతారు. 

కట్ చేస్తే -

ఇవ్వాళ పితృ అమావాస్య. వరంగల్లో నా చిన్నతనం నుంచీ "పెత్రమావాస"గా ఈరోజు గురించి నాకు బాగా తెలుసు. తల్లిదండ్రులకు బియ్యం ఇచ్చేరోజు. 

ఇప్పుడే గుడికెళ్ళి, మా తల్లిదండ్రులకు బియ్యం ఇచ్చే కార్యక్రమం పూర్తిచేసి వచ్చాను. 

మా వరంగల్, మా ఉర్సు-ప్రతాప్ నగర్, మా 14 దర్వాజాల పెద్ద ఇల్లు, మా అమ్మ-నాన్నలు నాకు పంచిన ప్రేమ... నేనెలా మర్చిపోగలను? 

మా అమ్మ, నాన్న ఇద్దరు గుర్తుకొస్తున్నారు. కళ్ళల్లోంచి నీళ్ళు అదేపనిగా వస్తున్నాయి. 

నిశ్శబ్ద దుఖం. 

వారి చివరిరోజుల్లో వారికి దగ్గరగా ఉండలేకపోయాను. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేని బాధ. కాని, జరిగింది మార్చలేను కదా... 

- మనోహర్ చిమ్మని  

Friday, 23 August 2024

ఒకరికోసం ఒకరు మారటం అనేది పెద్ద హంబగ్!


ఎవరో ఏదో అనుకుంటారన్న మొహమాటంతో మళ్ళీ అదే మనకి నచ్చని పనులు చేస్తూ సమయం వృధా చేసుకోవడం, మన ఆలోచనులు వృధాచేసుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. 

ముఖ్యంగా - మన ముందు చేయాల్సిన పనులు ఎక్కువగా ఉండి, చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు అసలు ఈ కోణంలో ఆలోచించనే వద్దు. అన్ని ప్లాన్లూ పనులూ పేకమేడలా కూలిపోతాయి. 

ఒక్కొక్కరి నేపథ్యం ఒక్కోలా ఉంటుంది. ఒక్కొక్కరి ఆలోచనా విధానం ఒక్కోలా ఉంటుంది. జీవితాన్ని చూసే పద్ధతి కూడా ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. ఎవరికి వారే యూనిక్. అలాంటప్పుడు... "నువ్విలాగే ఉండాలి", "నువ్విలా చేయాల్సింది" వంటి మాటలు ఎదుటివారిని నిజంగానే ఇబ్బంది పెడతాయి. ఆ పొరపాటు నేను చేయలేను.   

ఒకరికోసం ఒకరు మారటం అనేది కూడా పెద్ద హంబగ్. నిజమైన స్నేహం, ప్రేమ ఉన్నచోట ఇలాంటి ఆలోచనే రాదు. మనకు నచ్చినవారిని యాజిటీజ్‌గా నచ్చటం కంటే ఆనందం ఇంకేముంటుంది? అసలు ఏ ప్రేమైనా, స్నేహమైనా పుట్టేది అలాగే కదా?

ఈమధ్య మా యూనివర్సిటీ మిత్రుల గ్రూప్‌లో వివిధకోణాల్లో కొంత అలజడి చూసిన తర్వాత ఎందుకో ఇది రాయాలనిపించింది. 

కలిసామా, కలిసినంతసేపు వీలైనంత హాయిగా, బిందాస్‌గా ఉన్నామా... దట్సిట్. 

కట్ చేస్తే -

జీవితం ఒక్కటే. 

మన కోసం మనం, కనీసం కొన్నేళ్ళయినా, మనం ఉండాలకున్నట్టు ఉండాలి. చెయ్యాలనుకున్నది చేసెయ్యాలి.  

మిగిలిందంతా జస్ట్ బుల్‌షిట్!   

- మనోహర్ చిమ్మని 

Monday, 19 August 2024

జ్ఞాపకాలే బాగుంటాయ్!


మా అమ్మానాన్నలకు మేం అయిదుగురం అబ్బాయిలమే. 

నాకు కూడా ఇద్దరూ అబ్బాయిలే.  

ఇది ఒక లోటు అని మా పేరెంట్స్ ఇద్దరూ బాగా ఫీలవుతుంటే నేను లైట్ తీసుకునేవాణ్ణి. కాని, ఇంట్లో ఒక అమ్మాయైనా లేకపోవడం నిజంగా లోటేనని కొన్ని కొన్ని సందర్భాల్లో లోపల్లోపలే బాగా ఫీలయ్యేవాణ్ణి.

కొన్ని షేర్ చేసుకోడానికో, కొన్ని దాచుకోడానికో, కొన్ని సలహాలు తీసుకోడానికో, కొన్ని సహాయాలు అడగడానికో... ఒక అక్కో చెల్లో నిజంగా అవసరం. 

నా జీవితాన్నే సంపూర్ణంగా మార్చివేయగలిగిన ఒకటి రెండు అతి ముఖ్యమైన సందర్భాల్లో... నేనిది చాలా పెద్ద లోటుగా ఫీలయ్యాను. కాని, ఎప్పుడూ ఎవ్వరిదగ్గరా బయటపడలేదు.  
 
కట్ చేస్తే - 

మా చిన్నప్పుడు (వరంగల్లో) మా చిన్నమ్మల కూతుళ్ళు... ఇందిర, మంజుల... ఇద్దరూ ప్రతి రాఖీ పండుగకు టంచన్‌గా టైమ్‌కు మా ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడొస్తారా అని ఎదురుచూసేవాళ్ళం. ఈసారి ఏ మాడల్ రాఖీలు తెస్తారా అని గెస్ చేస్తుండేవాళ్లం.

కొత్త రాఖీలు పట్టుకొని మా చెల్లెళ్ళు వస్తున్నారన్న ఆ ఊహ... ఆ ఎదురుచూపు కూడా చాలా ఆనందంగా ఉండేది.

మా అందర్నీ వరుసగా పీటలమీద కూర్చోబెట్టి, బొట్టుపెట్టి, నోట్లో చక్కెర పోసి... తర్వాత రాఖీలు కట్టేవాళ్ళు మా ఇందిర, మంజుల.  

వాళ్లకి మా అమ్మ రాఖీ పండుగ కట్నం డబ్బులు ఇచ్చేది. కొన్నిసార్లు బట్టలు పెట్టేది. అది పద్ధతి. 

ఇక ఆ రోజంతా మాకు పండగే.  

ఇలాంటిదే - ప్రతి మూడేళ్ళకో, నాలుగేళ్ళకో ఒకసారి "కుడుకలు ఇవ్వటం" అనే పండుగ ఒకటి వచ్చేది. ఇందిర, మంజుల వచ్చి మాకు కుడుకలు ఇచ్చి, నోటి నిండా చక్కెర పోసేవారు. ఈ పండుగ సమయంలో కూడా మా ఇందిర, మంజుల ఎప్పుడొస్తారా అని ఎదురుచూసేవాళ్లం మేము. 

ఈ రెండు సందర్భాల్లోనూ ఇందిర, మంజులకు డబ్బులు ఇవ్వటం, బట్టలు పెట్టడం ఇవన్నీ పద్ధతి ప్రకారం మా అమ్మ బాగా చేసేది. 

థాంక్స్ టు మన సంప్రదాయం, సంసృతి, మన సనాతన ధర్మం... నిష్కల్మశమైన అప్పటి ప్రేమలు అంత అద్భుతంగా, అంత ఆనందమయంగా ఉండేవి.      

కట్ చేస్తే - 

1983లో నేను వరంగల్ వదిలేసి హైద్రాబాద్‌కు వచ్చాను...

హైద్రాబాద్‌లో నేను హెచ్ ఎం టి లో మెషినిస్టుగా పనిచేస్తున్నప్పుడు నా రూమ్‌కు పోస్ట్ ద్వారా వచ్చేవి రాఖీలు.

తర్వాత యూనివర్సిటీలో చదువుకొంటున్నప్పుడు ఓయూలో నా హాస్టల్‌కు కూడా పోస్ట్‌లో వచ్చేవి రాఖీలు.

తర్వాత నేను నవోదయ విద్యాలయ, గుంటూరులో పనిచేస్తున్నప్పుడు... ఆలిండియా రేడియో ఎఫ్ ఎం కర్నూల్లో పనిచేస్తున్నప్పుడు కూడా మా ఇందిర, మంజుల రాఖీలను పోస్టులో కనీసం రెండురోజుల ముందుగానే చేరేలా పంపేవాళ్ళు.

నా పెళ్లయిన కొత్తలో కూడా ఒకటి రెండేళ్ళు రాఖీలు పోస్టులో వచ్చాయి నాకు. 
 
అంతే. నాకు అంతవరకే గుర్తుంది.

క్రమంగా రాఖీలు పోస్టులో రావడం ఆగిపోయింది. కుడుకలు ఇచ్చే పండుగ గురించి పూర్తిగా మర్చిపోయాను. 

తర్వాత్తర్వాత మేము కలుసుకున్నది కూడా చాలా తక్కువసార్లే. 

వరంగల్‌లోని మా బంధువులందరితో దాదాపు నా కనెక్షన్ కట్ అయిపోయింది. ఏ స్థాయిలో కట్ అయిపోయిందంటే - అక్కడ వరంగల్లో ఏదైనా ఫంక్షన్ అయితే పిలవడానికి కూడా నేను వారికి గుర్తుకురానంతగా! 

కట్ చేస్తే - 

ఎవరు ఎలా మారినా, ఏవి ఎలా మారినా... అవన్నీ చిన్నప్పటి నా జ్ఞాపకాలను ఏ మాత్రం మార్చలేవు. 

ఆ తర్వాత కూడా, నా జీవితంలోని ప్రతి దశలోనూ, నేను ఏరి కోరి ప్రోదిచేసుకున్న నాకిష్టమైన ఇంకెన్నో జ్ఞాపకాలను కూడా ఎవ్వరూ మార్చలేరు.  

ఆ జ్ఞాపకాలు చాలు నాకు.    

అందుకే -
మళ్ళీ ఇంకొక్కసారి, 
ఈ జన్మలో చివరిసారి,
నేను నేనుగానే మారి, 
నన్ను నేను పునర్నిర్మించుకొంటూ 
మళ్ళీ ప్రేమించడం మొదలెట్టాను...
నా జ్ఞాపకాలనూ,
ఆ జ్ఞాపకాలకు కారణమైనవారినీ. 

***

అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు! 
- మనోహర్ చిమ్మని 

Tuesday, 16 July 2024

అంతం కాదిది... ఆరంభం!


నా ఫేవరేట్ ప్రపంచస్థాయి రచయితల్లో చలం ముందు వరసలో ఉంటారు. ఆకాలంలోనే ఆయన రాయగలిగిన ఆ అందమైన తెలుగు శైలిని ఇప్పుడు 2024 లో కూడా ఎవ్వరూ రాయడం లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. 

అలాంటి చలం, ఆరోజుల్లోనే, ఎంత అగ్రెసివ్, ఎంత అన్‌ట్రెడిషనల్ టాపిక్స్ పైన రచనలు చేశారంటే... ఆ టాపిక్స్ అప్పుడే కాదు, ఇప్పుడు కూడా సంచలనాత్మకమైనవే!

అలాంటి రచయిత కూడా చివరికి స్పిరిచువాలిటీ అంటూ రమణ మహర్షి ఆశ్రమం చేరారు. 

చేరటం తప్పుకాదు. చేరక తప్పలేదన్నది నా పాయింట్.

కట్ చేస్తే -

అన్నీ వదిలేయడమే ఆధ్యాత్మికం కాదు. 

ఆధ్యాత్మికం వైపు ఆకర్షించబడటానికి వయసుతో కూడా పన్లేదు. 

దైనందిన జీవితంలోని పనులు చేసుకొంటూనే, జీవితాన్ని ఆస్వాదిస్తూనే, ఆధ్యాత్మికానందాన్నీ అనుభవించవచ్చు.  

- మనోహర్ చిమ్మని