Thursday, 31 December 2015

2015 .. ఇప్పుడొక జ్ఞాపకం!

చాలా గ్యాప్ తర్వాత డైరెక్టర్‌గా మళ్లీ  ఒక సినిమా తీసి రిలీజ్ చేశాను. అదీ - ఇండియా, యు కె ల్లో.

స్విమ్మింగ్‌పూల్!

శ్రీ శ్రీ మూవీ క్రియేషన్స్, శ్రీ శ్రీ ఇంటర్నేషనల్ అధినేత అరుణ్ కుమార్ గారి సంకల్పం, సహకారం నాకు ఈ విషయంలో బాగా తోడ్పడ్డాయి.

స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ తేదీని 40 రోజులముందే ప్రకటించాను. మాకున్న పరిమిత రిసోర్సెస్‌తోనే - ఆ తేదీకే - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో భారీగానే రిలీజ్ చేశాను. ఇది చిన్న సినిమాల విషయంలో అంత ఈజీ కాదు. ఆమాటకొస్తే, కోట్లు పెట్టి తీసిన  సినిమాలు కూడా ఎన్నో అసలు రిలీజ్‌కు నోచుకోక ఇంకా అలా పడిఉన్నాయి. అది వేరే విషయం.

ఈ అనుభవంతో నా తర్వాతి సినిమా రిలీజ్ డేట్‌ను షూటింగ్ ప్రారంభం రోజే ప్రకటించగల ఆత్మవిశ్వాసం నాలో మరింతగా పెరిగింది.

సినిమా హిట్టా, ఫట్టా అన్నది ఓ పెద్ద సబ్జెక్టు. దాన్ని గురించి ఇక్కడ చర్చించడంలేదు. దాని వెనక ఎన్నో కారణాలుంటాయి. ఎప్పుడూ ట్రాక్‌మీద లైవ్‌గా లైమ్‌లైట్‌లో ఉండటం అనేది చాలా ముఖ్యం. అది ఈ సినిమాతో నేను సాధించగలిగాను.

కట్ టూ ది అదర్ సైడ్ ఆఫ్ సినిమా - 

వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, ఆర్థికంగా .. సమస్యలూ, సంఘర్షణ సమాంతరంగా 2015 అంతా వెంటాడాయి. షోబిజినెస్ కాబట్టి అంతా బాగున్నట్టే ఉండాలి. ఉన్నాను. దటీజ్ సినిమా! ఈ విషయంలో కొందరు స్నేహితులు, శ్రేయోభిలాషులకు ఇబ్బంది కలిగించాను. సినీఫీల్డులో ఎప్పుడూ ఉండే అనిశ్చితి వల్లనే తప్ప ఇది కావాలని చేసింది కాదు అని వారికీ తెలుసు. అయినా - బాధ్యత బాధ్యతే.

జీవితంలో ఏ తప్పైనా చేయొచ్చు కానీ, అప్పు మాత్రం చేయకూడదన్న వాస్తవాన్ని 2015 లో మరింత బాగా అర్థం చేసుకోగలిగాను. కానీ, భారీ సక్సెస్‌లు ఇచ్చిన పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లకే ఇది తప్పలేదు. నేనెంత!

కట్ బ్యాక్ టూ సినిమా - 

స్విమ్మింగ్‌పూల్ సినిమా విషయంలో నా సినిమాటోగ్రాఫర్ మిత్రుడు వీరేంద్రలలిత్, హీరో అఖిల్ కార్తీక్, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్లంతా నాకు బాగా సహకరించారు.

ప్రదీప్‌చంద్రను స్విమ్మింగ్‌పూల్ చిత్రం ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేయడం వ్యక్తిగతంగా నాకెంతో సంతృప్తినిచ్చిన విషయం.

మా రష్యన్ ప్రొఫెసర్ మాధవ్ మురుంకర్, కామేశ్వర రావు, కె జె దశరథ్, శీను6ఫీట్, ఐశ్వర్య, బ్రాహ్మిణి లతోపాటు హీరోయిన్ ప్రియ వశిష్టను ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేశాను. రష్యన్ ఇంటర్నేషనల్ మోడల్ కాత్య ఐవజోవాను ఈ చిత్రం ద్వారా ఐటమ్ డాన్సర్‌గా పరిచయం చేశాను.

ఈ సినిమాలో నటించిన మిత్రుడు 'జబర్దస్త్' రచ్చ రవి, ఈ సినిమా రిలీజ్ తర్వాతవరకు కూడా ఇచ్చిన కోపరేషన్ గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించడం నా బాధ్యత.

అలాగే, యు ఎస్ లో నా ఆత్మీయ మిత్రుడు సదానందం భరత నా కోసం, ఈ సినిమాకోసం చాలా శ్రమ తీసుకోవడం మరో గొప్ప విశేషం.    

దాదాపు ఒక దశాబ్దం క్రితం నేను కోల్పోయిన క్రియేటివ్ ఫ్రీడమ్‌ను తిరిగి సంపాదించుకొనే క్రమంలో మొన్నటి స్విమ్మింగ్‌పూల్ సినిమా నా ఫస్ట్ స్టెప్ గా భావిస్తున్నాను. 2016 లో ఈ పరంపర ఇక మరింత వేగంగా కంటిన్యూ అవుతుంది.

అయితే - సినిమా ఒక్కటే జీవితం కాదు. సినిమా అవతల కూడా లైఫ్ ఉంది. ఆ లైఫ్ కూడా చాలా ముఖ్యం అన్న వాస్తవం ఎప్పుడూ వాస్తవమే. ఈ వాస్తవాన్ని నేను అశ్రధ్ధ చేయదల్చుకోలేదు. మర్చిపోదల్చుకోలేదు.  

Wednesday, 23 December 2015

ఫేస్ లేని ఫేస్‌బుక్ ఫ్రెండ్స్!

జకెర్‌బర్గ్ పెట్టిన లిమిట్ 5000 టచ్ అయ్యాక గానీ తెలియలేదు .. ఫేస్‌బుక్ లో ఫ్రెండ్స్ ఎంత తక్కువుంటే అంత మంచిదని!

ఏదో .. యాడ్ రిక్వెస్ట్ పెట్టినవాళ్లెందరినీ ఏమాత్రం ఆలోచించకుండా, వారిని డిసప్పాయింట్ చెయ్యలేక, యాడ్ చేసుకున్నాను.

కానీ, చాలా చిత్రమైన ఎక్స్‌పీరియన్స్ అది.

కొన్ని ఫ్రెండ్ రెక్వెస్టులొస్తాయి. సమ్ సుబ్బారావ్ అని పేరుంటుంది. అక్కడ ప్రొఫైల్ ఫోటోలో, కవర్ ఫోటోలో మాత్రం ఏ ప్రభాసో, పవన్ కల్యాణో ఉంటాడు! కొందరి పేర్లు అసలు ఉండటమే చిత్రంగా ఉంటాయి. న్యూటన్, టింగ్ టాంగ్, టఫ్ గై, బులెట్ కిక్ .. ఇలా ఉంటాయి. ప్రొఫైల్ ఫోటోలో ఏ విప్లవకారుడో, ఇంకే అర్థంలేని ఫోటోనో, అసలు ఫేస్ కనిపించని ఫోటోనో ఉంటుంది.

ఇక కొందరు ఆడాళ్లు, అమ్మాయిల విషయం మరీ గమ్మత్తుగా ఉంటుంది. వీరిలో దాదాపు 90% పేర్లు నిజం కావనిపిస్తుంది. హరి హరిణి, సిని హాసిని, సుని సునీత, ఆ పండు, ఈ పండు .. ఇలా ఉంటాయి పేర్లు. ప్రొఫైల్ పిక్చర్లో సమంత, నందిత, రకుల్‌ప్రీత్ ఉంటారు!

తమ ఐడెంటిటీని ఓపెన్‌గా చెప్పుకోలేని ఇలాంటి ఎఫ్ బి ఫ్రెండ్స్ "ఎబౌట్"లో కూడా ఏముండదు. జస్ట్ శూన్యం!

ఎవరో ఏంటో తెలీని ఇలాంటి ఫోర్స్‌డ్ ఎడాలిసెంట్స్ అసలు మన ఫేస్‌బుక్‌లో అవసరమంటారా?

5000 టచ్ అయ్యాకగానీ ట్యూబ్‌లైట్ వెలగలేదు .. :) 

Saturday, 12 December 2015

తెలుగు ఇండస్ట్రీ, 2 స్కూళ్లు!

ఓ గుప్పెడు టాప్‌స్టార్స్, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు .. వారి కుటుంబాలు, వారసులు. ఇదొక స్కూలు. ఈ స్ఖూల్లో ఎవరికి వాళ్లకే ఫిక్స్‌డ్‌గా లాబీలుంటాయి. ఆ లాబీలు దాటుకొని ఓ కొత్త డైరెక్టర్ ఈ స్కూళ్లోకి ప్రవేశించడం చాలా అరుదు. అసాధ్యం. ఈ స్కూల్‌తో సంబంధం లేకుండా బయట ఏదయినా పెద్ద హిట్ ఇచ్చినప్పుడే ఇక్కడ కొత్తవాళ్లకు ఎంట్రీ సాధ్యమౌతుంది.

ఇది పక్కా ట్రెడిషనల్ స్కూల్.

రెండో స్కూల్ పూర్తిగా ఇండిపెండెంట్ స్కూల్. ఆర్‌జివి, శేఖర్ కమ్ముల లాంటి డైరెక్టర్లు ఈ కేటగిరీలోకొస్తారు. ఎవరినో దృష్టిలో పెట్టుకొని కాకుండా, అనుకున్నట్టుగా సినిమా తీస్తూ వీళ్లకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు.

ఇది పూర్తిగా ఒక అన్‌ట్రెడిషనల్ స్కూల్.

వీళ్లు క్రియేట్ చేసుకున్న బ్రాండ్‌ని బట్టి వీళ్లకు అప్పుడప్పుడూ ట్రెడిషనల్ స్కూల్లోని హీరోలు, నిర్మాతలతో సినిమాలు తీసే అవకాశముంటుంది.

కట్ టూ నా స్కూల్ -

హీరోలకోసం ప్రత్యేకంగా రాసుకొన్న బౌండెడ్ స్క్రిప్టులు చంకలో పెట్టుకొని, ఎలాంటి గ్యారంటీలేని ఈ ట్రెడిషనల్ స్కూళ్ల చుట్టూ ఏళ్లతరబడి తిరగడం నాకు కుదరని పని. ఎందుకంటే సినిమానే నా జీవితం కాదు. దాన్ని మించిన జీవితం బయట ఎంతో ఉంది.

సినిమాలపట్ల అమితమైన ప్యాషన్ ఉన్న కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, నిర్మాతలను నేనే క్రియేట్ చేసుకుంటాను. వారికోసం నా అన్వేషణ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అలా అన్నీ కుదిరినప్పుడే సినిమా తీస్తాను.

తక్కువ బడ్జెట్‌లో, అతి తక్కువ షూటింగ్ డేస్‌లో సినిమా తీసి క్లిక్ కావడమే నాకిష్టం. చెప్పాలంటే - కొంచెం అంట్రెడిషనల్, కొంచెం అగ్రెసివ్ కూడా.

ఇదే నా స్కూల్ ..   

Friday, 11 December 2015

9 మినిట్ బ్లాగింగ్!

ఇకనుంచీ నా బ్లాగ్‌పోస్టుల్లో అనవసరపు "ఇంట్రో"లుండవు. "కట్ టూ"లుండవు. ఉంటే గింటే ఒకే ఒక "కట్ టూ" ఉంటుంది. దాంతర్వాత ఒకే ఒక్క వాక్యంలో బ్లాగ్ పోస్ట్ ముగుస్తుంది. అంటే - ఓ రకంగా - అది "కట్ టూ ఫినిషింగ్" అన్నమాట!

అరుదుగా ఎప్పుడో ఒకసారి భారీ సైజులో నేనేదైనా బ్లాగ్ పోస్ట్ రాయొచ్చుగానీ, ఇకనుంచీ నా బ్లాగ్ పోస్టులన్నీ సుమారు 10-12 లైన్లలోనే  "టిడ్‌బిట్స్" సైజులో ఉంటాయి.

మినీ బ్లాగ్ పోస్టులన్నమాట!

నేను సినిమాల్లో ఉన్నంతకాలం, "నగ్నచిత్రం"లో పోస్టులన్నీ దాదాపు సినిమాలకు, క్రియేటివిటీకి సంబంధించినవే అయ్యుంటాయి.

ఈ 9 మినిట్ బ్లాగింగ్ గురించి అప్పట్లో అనుకున్నానుగానీ, కొనసాగించలేకపోయాను. కానీ, ఇప్పుడు నేనే దీన్ని తప్పనిసరి చేసుకుంటున్నాను.

ఏదో ఒకటి రాసే నాకత్యంత ప్రియమైన హాబీని నేనే కిల్ చేసుకోదల్చుకోలేదు.

రాయడం అనేది ఒక ఎడిక్షన్ నాకు. ఒక రిలాక్స్. ఒక రిలీఫ్. ఒక మెడిటేషన్. ఒక ఆనందం.

సో, బ్యాక్ టూ మై 9 మినిట్ బ్లాగింగ్ ..  

Wednesday, 11 November 2015

నా బ్లాగింగ్ ఎందుకు స్లో అయ్యింది?

ఏదో కొంచెం స్లో అవుతుందనుకున్నాను కానీ, మరీ ఇంతలా నెలకు కేవలం ఓ 5, 6 పోస్టుల స్థాయికి పడిపోతుందనుకోలేదు!

నా కొత్త సినిమాల ప్లానింగ్, మీటింగ్స్, అగ్రిమెంట్లు, కమిట్‌మెంట్లు వంటి అన్నో అతిముఖ్యమైన పనుల్లో పూర్తిగా మునిగిపోయి పిచ్చి బిజీగా ఉంది లైఫ్.

కట్ టూ నాణేనికి మరోవైపు - 

పైన చెప్పిన బిజీ షెడ్యూల్ కారణంగానే నిజంగా ఏమీ రాయలేకపోతున్నానా? నాకెంతో ఇష్టమైన ఒక హాబీని, థెరపీని నిర్లక్ష్యం చేస్తున్నానా?

దీన్ని కేవలం ఒక 10 శాతం కారణంగానే నేను ఒప్పుకుంటాను.

ఎన్ని వ్యక్తిగతమైన, ఆర్థిక, వృత్తిపరమైన వత్తిళ్లు ఉన్నా - ఒక మెడిటేషన్ ప్రక్రియలా కనీసం ఓ పది నిమిషాలు ఏదో ఒకటి రాయగల శక్తి, ఓపిక, ఇష్టం నాకున్నాయి.

అయినా ఆ పని చేయటంలేదు, చేయలేకపోతున్నాను అంటే ఇంకేదో కారణం ఉండాలి.

ఉంది.  

2016 చివరివరకు, ఎన్ని వీలైతే అన్ని ఫీచర్ ఫిలిం ప్రాజెక్టులను సెట్ చేసుకుంటున్నాను. వచ్చే 365 రోజులూ చాలా చాలా బిజీగా ఉండేట్టు చూసుకుంటున్నాను.

ఈ స్టేజ్‌లో ఇప్పుడిది చాలా అవసరం నాకు.

నాకున్న అతికొద్దిమంది ఆత్మీయ మిత్రులలో ఒకరిద్దరితో నాకున్న ఒకటిరెండు కమిట్‌మెంట్‌లు, నా కుటుంబం, నా బాధ్యతలు, నా వ్యక్తిగత క్రియేటివ్ ఫ్రీడమ్ - ఇప్పుడు ప్రతి క్షణం నా ఫోకస్ అంతా ఇదే.

వీటి మీదే.

ఇదే ఆర్డర్‌లో.

ఈ ఫోకస్‌ను పక్కనపెట్టి ఒక పది నిమిషాలు బ్లాగ్ రాసినా, దానికొక ప్రయోజనం ఉండాలి. ఆ ప్రయోజనం నా ఫోకస్‌తో కనెక్ట్ అవ్వాలి. అందుకే ఈ మధ్య నేను బ్లాగ్ రాయడం చాలా స్లో అయ్యింది.

నా ఫేస్‌బుక్ టైమ్‌లైన్‌లో చాలా కొటేషన్లు, పోస్ట్‌లు నాకోసం నేను పోస్ట్ చేసుకున్నట్తే .. ఈ బ్లాగ్ పోస్ట్ కూడా నాకోసం నేను రాసుకున్నది.

ఇది సంజాయిషీ కాదు. స్వీయ అంతరంగ విశ్లేషణ.  

Thursday, 29 October 2015

ఆడిషన్స్ క్లారిటీ! చివరిసారిగా ..

ఒక మైక్రో బడ్జెట్ సినిమా అంటే దానికి 101 లిమిట్స్ ఉంటాయి. ప్రొడక్షన్ ఖర్చులపరంగా, క్రియేటివిటీపరంగా కూడా.

భారీ మనీ వగైరా అన్నీ టైమ్‌కు సమకూర్చుకోవడం అన్న భారీ టెన్షన్‌ల గురించి అసలింక చెప్పలేం.

అదో మాయ.

ఇలాంటి చిన్న సినిమాల జోనర్ ఏదయినా కావచ్చు - ప్రేమకథ, యూత్ ఎంటర్‌టైనర్, కామెడీ, హారర్ .. ఏదైనా కానీండి. ఒక సినిమాలో హీరో హీరోయిన్లు, ఇతర ప్రధానపాత్రలు అన్నీ కలిపి కేవలం ఒక 10-12 కు మించి ఉండే అవకాశం లేదు. కొన్ని సీన్లలో ఇంకో రెండో మూడో చిన్నా చితకా కేరెక్టర్స్ కూడా ఉండే అవకాశముంటుంది.

అంటే - ఈ సినిమాలో మొత్తం కలిపి ఒక 15 కేరెక్టర్లను మించి ఉండే అవకాశం లేదు. ఉండదు.

ఈ 15 కేరెక్టర్లలో కనీసం 50% కొద్దిగా తెలిసిన ఫేస్ లున్న అప్‌కమింగ్ ఆర్టిస్టులను, మిగిలిన 50% పూర్తిగా కొత్తవాళ్లను తీసుకోనే ప్రయత్నం చేస్తాము. మార్కెట్ అవసరాల దృష్ట్యా ఇది మాకు తప్పనిసరి.

ఈ లెక్కన - కేవలం ఒక 6 లేదా 7 కేరక్టర్లకోసం మాత్రమే ఆడిషన్స్ ఉంటాయి. ఇది మీరంతా గమనించి అర్థం చేసుకోవాల్సిన వాస్తవం.

కట్ టూ అసలు పాయింట్ - 

"నాకు చాన్స్ ఇవ్వండి," "ఇంకా ఆడిషన్స్ ఎప్పుడు", "నాకు చాలా కష్టాలున్నాయి మీరెలాగయినా చాన్సివ్వాలి" .. వంటి నానా రకాల మెసేజ్‌లు నా ఫేస్‌బుక్ లో రోజుకి కనీసం 100 కి పైగా వస్తున్నాయి. ఇలా పెట్టవద్దని నేను ఇంతకుముందు ఎన్నిసార్లు విన్నవించినా ఇదే జరుగుతోంది.

అసలు తప్పంతా నాదేనని అర్థమయ్యిందిప్పుడు. "కొత్తవాళ్లను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము..ఆడిషన్స్ ఉంటాయి" అని ఒక్కసారి చెప్పడం పొరపాటయిపోయింది.

సినిమా చిన్నది కావొచ్చు. పెద్దది కావొచ్చు. అందులో ఒక చిన్న పాత్ర వేయడానికయినా "చాన్స్ దొరకడం" అన్నది మాత్రం అంత చిన్న విషయం కాదు. పైన చెప్పిన ఎన్నో తలనొప్పులు, టెన్షన్స్ మాకుంటాయి. ఔత్సాహికులకు ఎంతో కాంపిటిషన్ ఉంటుంది.

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే - ఇక మీరు ఆడిషన్స్ విషయం పూర్తిగా మర్చిపోండి. దానికి సంబంధించి ఎలాంటి మెసేజ్‌లు నాకు పెట్టకండి. దీనికి సంబంధించి నేను స్వయంగా ఏదయినా యాడ్ పోస్ట్ చేసినప్పుడే ఆడిషన్స్ ఉన్నట్టు లెక్క. అప్పుడు ఆ యాడ్ ను ఫాలో కండి. అన్ని వివరాలూ అందులోనే ఉంటాయి.

కట్ టూ మరో ముఖ్యమైన పాయింట్ - 

నాకు మెసేజ్ లు పెట్టినంత మాత్రాన మీరు సెలెక్ట్ అవరు. స్క్రిప్ట్ లో ఉన్న పాత్రకు మీరు బాగా సరిపోవాలి. ఆ రేంజ్ టాలెంట్ మీలో ఉండాలి.

అంతే.

మిగిలిన ఏ విషయాలూ కౌంట్ కావు. ఇదే వాస్తవం.

సో, ఇంక మెసేజ్ లు పెట్టడం పూర్తిగా మర్చిపోండి. దీనివల్ల ముఖ్యమైన నా మెసేజ్‌లెన్నిటినో నేను మిస్ అయిపోతున్నాను. చాలా సమయం వృధా అయిపోతోంది.

అయినా అలాగే పంపిస్తే, నాకున్నది ఒక్కటే దారి.

జస్ట్ అన్‌ఫ్రెండ్ చెయ్యడం! 

Sunday, 4 October 2015

చివరాఖరికి స్పిరిచువాలిటీ!

నిన్న సాయంత్రం ఓ 20 నిమిషాలపాటు ప్రముఖ రచయిత, కవి .. కొనకంచి గారితో ఫోన్లో మాట్లాడాను.

హిపోక్రసీ లేని ఆయన "ఎ కె 47 టైప్" రైటింగన్నా, టాకింగన్నా నాకిష్టం.

నిన్న మా ఫోన్ టాక్ సబ్జెక్ట్: స్పిరిచువాలిటీ!  

1926 లో చలం "మైదానం" రాశాడు. నా ఫేవరేట్ ప్రపంచస్థాయి రచయితల్లో చలం ముందు వరసలో ఉంటాడు. ఆకాలంలోనే ఆయన రాయగలిగిన ఆ అందమైన తెలుగు శైలిని ఇప్పుడు 2015 లో కూడా ఎవ్వరూ రాయడం లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

అలాంటి చలం .. ఆరోజుల్లోనే .. ఎంత అగ్రెసివ్, ఎంత అన్‌ట్రెడిషనల్ టాపిక్స్ పైన రచనలు చేశాడో అందరికీ తెలిసిందే. ఆ టాపిక్స్ అప్పుడే కాదు, ఇప్పటి మన హిపోక్రసీ నేపథ్య సమాజంలో కూడా సంచలనాత్మకమైనవే!

అలాంటి రచయిత కూడా చివరికి స్పిరిచువాలిటీ అంటూ రమణ మహర్షి ఆశ్రమం చేరాడు.

ఇలాంటి ఉదాహరణలు కనీసం ఒక వంద ఇవ్వగలను నేను.

లైఫ్ అంతా ఉవ్వెత్తు కెరటాల్లా రకరకాలుగా ఎగిసిపడి, మిడిసిపడి, యుధ్ధాలు చేసి, దేన్నీ లెక్కచేయకుండా ఎన్నోరకాలుగా ఎంజాయ్ చేసి, చివరాఖరికి వచ్చేటప్పటికి స్పిరిచువాలిటీ అంటారెందుకు అన్నది నా హంబుల్ కొష్చన్!  

దానికి కొనకంచి గారిచ్చిన సమాధానం నాకు బాగా నచ్చింది. అదేంటన్నది ఇక్కడ బ్లాగ్ లో రాయడం కొంచెం కష్టం.

అయితే, కొనకంచి గారు ఈ మధ్యే, ఇదే టాపిక్ పైన తన ఫేస్‌బుక్ లో ఏదో పోస్ట్ చేశారట. వీలయితే చూడండి. నేనూ చూస్తాను. షేర్ చేస్తాను.

కట్ టూ 1001 ఉదాహరణ -

ఇప్పటిదాకా అనుకున్న ఈ స్పిరిచువల్ "ట్రాన్స్‌ఫార్మేషన్" కేవలం క్రియేటివ్ రంగాలవారిలోనే వస్తుందని కాదు. చరిత్రలో అలెక్జాండర్ వంటి రారాజు నుంచి, సాధారణ రొటీన్ మనుషుల విషయంలోనూ జరుగుతుంది.

ఈ లెక్కన నేనిందాక న్నట్టు 100 ఉదాహరణలు కాదు. 1000 ఉదాహరణలు కూడా ఇవ్వగలను. వెయ్యిన్నొక్క ఉదాహరణ కూడా నాదగ్గర రెడీగా ఉంది.

అది ఎవరని మాత్రం ఇప్పుడే నన్నడక్కండి ప్లీజ్ ..

Tuesday, 22 September 2015

ఒక సంవత్సరంలో 10 సినిమాలు డైరెక్ట్ చేసి రిలీజ్ చేయగలరా?

అవును. చేయొచ్చు అని 1980 లోనే నిరూపించారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు.

అంటే నెలకి ఒక సినిమా కంటే ఎక్కువే!

అలాగని ఏదో చుట్టచుట్టి అవతపడేసిన సినిమాలు కావవి. వాటిల్లో కనీసం 80% సినిమాలు హిట్లు, సూపర్ హిట్లు, సిల్వర్ జుబ్లీలు.

స్వప్న, శ్రీవారి ముచ్చట్లు, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు, సీతారాములు మొదలైనవి ఆ లిస్ట్ లోనివే!

ఇంకో విశేషం ఏంటంటే - ఈ 10 సినిమాల్లో 2 హిందీ సినిమాలు కూడా ఉన్నాయి!

జ్యోతి బనే జ్వాల, యే కైసా ఇన్సాఫ్.

నిజంగా గురువుగారికి వందనం .. అభివందనం!

ఆయన రికార్డుల గురించి, ఆయన గురించి ఒక పుస్తకమే రాయొచ్చు.

కట్ టూ 2015 - 

ఫిలిం నెగెటివ్ తో సినిమాలు చేసిన ఆ రోజుల్లో - ఎడిటింగ్ నుంచి, ప్రతి ఒక్క శాఖలో పని చాలా ఎక్కువే. ఒక్కొక్క ఫిలిం ముక్క చేత్తో పట్టుకొని చూస్తూ, అతికించాల్సిన రోజులవి. ప్రతి చిన్న ట్రాన్సిషన్స్‌కు కూడా గంటలకి గంటలు, రోజులకి రోజులు మాన్యువల్‌గా పని చేసిన రోజులవి.

అలాంటి రోజుల్లోనే, నెలకో సినిమా చేసి రిలీజ్ చేయగలిగినప్పుడు .. ఇంత అడ్వాన్స్‌డ్ డిజిటల్ టెక్నాలజీ వచ్చిన ఈ రోజుల్లో ఒక్కో సినిమాకు సంవత్సరాలు పడుతుండటం నిజంగా విచారకరం.

గ్రాఫిక్ వర్క్‌లతో తీసే మాగ్నమ్ ఓపస్ ల గురించి నేను మాట్లాడ్డం లేదు. మామూలు మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాల గురించి మాట్లాడుతున్నాను.

అదంతే. దీనికి వంద రీజన్స్ చెప్తారు.

ఈ పాయింటాఫ్ వ్యూలో .. నాకు తెలిసినంతవరకు, ఇప్పటి తెలుగు దర్శకుల్లో టెక్నికల్‌గా మంచి క్వాలిటీతో, వెరైటీ సబ్జెక్ట్స్‌తో, సూపర్ టైటిల్స్‌తో, ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్న దర్శకులు ఇద్దరే ఇద్దరు.

పూరి జగన్నాధ్. ఆర్ జి వి.

హిట్లూ, ఫ్లాపులూ అందరికీ ఉంటాయి. టెక్నాలజీతోపాటు మనం ఎంత ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నామన్నదే ఇక్కడ పాయింట్.   

Monday, 21 September 2015

క్రాస్‌రోడ్స్‌లో సినిమా పడితేనే సినిమానా?

"..మన చిన్న సినిమాల దౌర్భాగ్యం ఎమిటంటే మనకింతకంటే మంచి థియేటర్లు రెగ్యులర్ షోస్ కి దొరకవు. అందుకని చిన్న సినిమాలు రెగ్యులర్ షోస్ కాన్సెప్ట్ మానుకోవాలి. మల్టిఫ్లెక్స్ లల్లొ ఒక షొ దొరికినా చాలు, వీలైనన్ని ఎక్కువ మల్టిఫ్లెక్స్ లల్లో విడుదల చేసుకోవడం మంచిది!" -- రామ్‌కుమార్ భరతం

"అసలు క్యూబ్ వాళ్లు ఏం చేస్తున్నట్టు?" అని మొన్న నేను రాసిన ఒక బ్లాగ్ కి కామెంట్ చేస్తూ - ఫిల్మ్ లవర్, ఫిల్మ్ క్రిటిక్ రామ్‌కుమార్ గారు రాసిన కామెంట్‌లోని చివరి ముక్కనే కోట్ చేస్తూ ఇది రాస్తున్నాను.

దాదాపు ఓ రెండువారాల క్రితం అనుకుంటాను. ఇదే పాయింట్ మీద నేనూ, మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్ చాలాసేపు మాట్లాడుకున్నాము.

క్రాస్‌రోడ్స్‌లో థియేటర్ దొరకటం లేదు అనో, రెంట్లు కట్టలేమనో బాధపడుతూ చేసిన తప్పుల్నే మళ్ళీ మళ్ళీ చేయడం వృధా. వీలైనన్ని ఎక్కువ సెలెక్టెడ్ సెంటర్లలోని మల్టిప్లెక్స్‌లలో కేవలం రోజుకి ఒక్క షో చొప్పున ఏర్పాటుచేసుకొని సినిమా రిలీజ్ చేసుకున్నా చాలు అన్నది నా ఉద్దేశ్యం.

ఈ పని చేయడం కోసం ప్రత్యేక దళారులో, తలారులో ఎవ్వరూ అవసరం లేదు. ఎవ్వరి మాయమాటలకో తెలిసీ లొంగిపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ప్రొడ్యూసర్, డైరెక్టర్ స్వయంగా మల్టిప్లెక్స్‌లను కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోవచ్చు. అంత సింపుల్.

941 సీట్ల పురాతన కాలపు గోడౌన్ థియేటర్లకంటే ఇవి చాలా చాలా బెటర్.

ప్రేక్షకులకు లేటెస్ట్ టెక్నాలజీ సినిమా అనుభూతినివ్వొచ్చు. ఆ తర్వాత, సినిమాలో ఏమాత్రం స్టఫ్ ఉన్నా ప్రేక్షకులు ఆదరిస్తారు. థియేటర్లు అవే పెరుగుతాయి. పైగా, ఇలా చేయడం ద్వారా చిన్న సినిమాల అతి ప్రధాన సమస్య ఒకటి సులభంగా పరిష్కారమవుతుంది.

మార్కెట్‌లో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొనేవరకూ ఏ చిన్న సినిమా ప్రొడ్యూసర్‌కయినా, డైరెక్టర్‌కయినా ఈ శ్రమ తప్పదు.

రామ్‌కుమార్ గారి లాంటి సీనియర్‌లు ఇంత మోడర్న్‌గా ఆలోచిస్తోంటే, యూత్ అనుకున్నవాళ్లు మాత్రం ఇంకా పాత కాలపు ఆలోచనలకే అతుక్కుపోయి ఉండటం నిజంగా బాధాకరం.  

Wednesday, 16 September 2015

అసలు క్యూబ్ వాళ్లు ఏం చేస్తున్నట్టు?

నా సినిమా థియేటర్లో నడుస్తుండగా ఈ టాపిక్ పైన బ్లాగ్ రాస్తానని అసలు నేను అనుకోలేదు.

కానీ రాయక తప్పడం లేదు.

ఈ సమస్య వల్ల నేరుగా సఫర్ అయినవాణ్ణయి ఉండీ .. నేను దీని గురించి రాయకపోతే .. అంతకంటే ఫూలిష్‌నెస్ ఇంకోటి ఉండదు. అందుకే రాస్తున్నాను.

కనీసం, దీన్ని చదివిన మా సినిమావాళ్లు కొందరయినా ముందు ముందు జాగ్రత్తపడతారనీ, పడాలనీ నా ఉద్దేశ్యం.

డిజిటల్ ఫిలిం మేకింగ్ వచ్చాక, సినిమా థియేటర్లకు ఫిల్మ్ రీళ్ల డబ్బాలు వెళ్లే పాతరాతియుగానికి తెరపడింది. అయినా - మనవాళ్ళు ఇంకా ఆ భ్రమలోనే ఉన్నారు. ఆ వాసనలు వదళ్లేదు. అప్పటి పధ్ధతిలోనే పని చేస్తున్నారు. లేదా, అప్పటి పధ్ధతిలోనే పని తప్పించుకుంటున్నారు.

కోట్లు కుమ్మరించి సినిమాలు తీసి, తమ సినిమాలను థియేటర్లకు  పంపుతున్న నిర్మాతల, డైరెక్టర్ల, ఆర్టిస్టుల జీవితాలతో ఆడుకుంటున్నారు!

కట్ టూ క్యూబ్ -

డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ పధ్ధతి వచ్చాక, ఇప్పుడు థియేటర్లకు ఫిలిం రీళ్ల డబ్బాలు వెళ్లవు. క్యూబ్, యు ఎఫ్ వో, పి ఎక్స్ డి, స్క్రాబుల్ వంటి డిజిటల్ ఫార్మాట్స్ ద్వారా సినిమా హాల్స్‌లో సినిమాలు ఆడతాయి. వీటిగురించి ఇంతకంటే వివరంగా చెప్పడం అనేది ఇప్పుడు మనం చర్చిస్తున్న టాపిక్ కు అనవసరం. సో, డైరెక్టుగా పాయింటుకొస్తున్నాను.

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో ఉన్న థియేటర్లలో ఎక్కువ భాగం క్యూబ్, యు ఎఫ్ వో సిస్టమ్‌ల ద్వారానే నడుస్తున్నాయి.

మొన్న మేము రిలీజ్ చేసిన స్విమ్మింగ్‌పూల్ చిత్రం నడుస్తున్న మెయిన్ థియేటర్ ఆర్ టి సి క్రాస్ రోడ్స్ లో ఉన్న శ్రీ మయూరి. అలాగే - సిటీలో, ఉప్పల్ లో ఉన్న సినీ స్క్వేర్ మల్టీప్లెక్స్ లో కూడా స్విమ్మింగ్‌పూల్ రిలీజయింది. ఈ రెండు థియేటర్లలోనూ ఉపయోగిస్తున్న ప్రొజెక్టర్ సిస్టమ్ ఒక్కటే.

క్యూబ్.

శ్రీ మయూరిలో సినిమా కనీసం ఒక 30% డిమ్‌గా కనిపిస్తుంది. డిటిఎస్ సిస్టమ్ కూడా పరమ చెత్తగా కేవలం ఒక్కవైపే పనిచేస్తోంది. ఇందులో ఎంత కొత్త సినిమా వేసినా - దాన్ని చూస్తున్న ప్రేక్షకులకు "ఇది ఏ కాలం నాటి సినిమారా బాబూ" అనిపిస్తుంది.

మరోవైపు, అదే క్యూబ్ సిస్టమ్ ద్వారా నడుస్తున్న ఉప్పల్ లోని సినీ స్క్వేర్ మల్టిప్లెక్స్ లో మాత్రం - సినిమా ఒక ఆడియోవిజువల్ ట్రీట్ లా అద్భుతంగా ఉంటుంది!

స్విమ్మింగ్‌పూల్ సినిమాను పై రెండు థియేటర్లలో చూసిన తర్వాత - సదరు క్యూబ్ కంపనీ వాళ్లను మా కలరిస్ట్ ఇంజినీర్ రత్నాకర్ రెడ్డి "ఎందుకిలా?" అని కారణం అడిగారు.

అక్కడా ఇక్కడా, రెండుచోట్లా మా ప్రొజెక్టరే పనిచేస్తోంది. ఇంకా చెప్పాలంటే - శ్రీ మయూరిలో ఇంకా మంచి ప్రొజెక్టర్ ఉంది అన్నారు.

"మరెందుకిలా గుడ్డి గుడ్డిగా సినిమా కనిపిస్తోంది?" అన్న మా హంబుల్ కొశ్చన్‌కు క్యూబ్ వాళ్ల సమాధానం విని షాకయ్యాం.

"సినీస్క్వేర్ లో వాళ్లు మేము ఇచ్చిన స్టాండర్డ్ బల్బులు వాడుతున్నారు. వీళ్లు చైనా బల్బులు వాడుతున్నారు!"

ఇదెంతవరకు నిజమోగానీ, ఇదేగాని నిజమయితే, ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు.

ఇలా ఎన్నిచోట్ల జరుగుతోందో?! 

ఇలాంటి ఘోరాలు జరుగుతోంటే - కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతల మండలులు, దర్శకుల సంఘాలు ఏం చేస్తున్నట్టు? అసలు తమ కంపనీ ప్రమాణాలు పాటించనందుకు ఇలాంటి థియేటర్లను క్యూబ్ వాళ్లు ఎందుకని చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు?

సినీ ఫీల్డు ఇనుప తెర వెనుక మీకు కనిపించని నగ్నసత్యాలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వాటిలో ఇది కేవలం ఒకే ఒక్క ఉదాహరణ.

జస్ట్ మీతో షేర్ చేసుకుందామని.

అంతే.  

Sunday, 13 September 2015

వాటీజ్ దిస్ #SwimmingPoolChallenge ?

కేవలం 12 రోజుల్లో షూటింగ్ పూర్తిచేసి నిర్మించిన మా స్విమ్మింగ్‌పూల్ చిత్రాన్ని 11 సెప్టెంబర్ 2015 నాడు రిలీజ్ చేస్తామని కనీసం ఒక 40 రోజులముందే ప్రకటించాను.

ఎలాంటి మార్పులేకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో సుమారు 20 ప్లస్ థియేటర్లలో రిలీజ్ చేశాము.

యు కె లో రిలీజ్ చేశాము. కొన్ని సాంకేతిక కారణాలవల్ల కొంచెం ఆలస్యంగా జర్మనీ, యు ఎస్ లలో కూడా రిలీజ్ చేయబోతున్నాము.

బాహుబలి, రుద్రమదేవి వంటి "మాగ్నమ్ ఓపస్"లే ఈ పని చేయలేకపోయాయి. వాటి నేపథ్యం వేరు. వాటికుండే సమస్యలు వేరు.

అలాంటప్పుడు కూడా - "అంతా పూర్తయ్యాకే వాళ్లు డేట్ ప్రకటించొచ్చుకదా" అన్నది నా హంబుల్ కొశ్చన్.

ఈ కొశ్చన్ ఎందుకంటే - ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్లలో పదే పదే మార్పు అనేది చిన్న సినిమాలెన్నిటి ప్రాణాలనో నిర్దాక్షిణ్యంగా తీసేసింది!

ఈ నిజం ఇండస్ట్రీకి తెలుసు.

కట్ టూ మరికొన్ని సినిమా ఆలస్యాలు -  

3 కోట్లనుంచి, 30 కోట్లదాకా బడ్జెట్ ఖర్చుపెట్టి, సినిమా అన్నివిధాలుగా పూర్తిచేసి, సెన్సార్ అయిపోయి, రిలీజ్‌కు అన్నివిధాలా రెడీ అయిన మరికొన్ని సినిమాలు కూడా వాటి రిలీజ్ డేట్ విషయంలో ఇలాగే చాలా గందరగోళాన్ని సృష్టించాయి.

ఈ లిస్టులో మా స్విమ్మింగ్‌పూల్ హీరో అఖిల్ కార్తీక్ నటించిన "క్రిమినల్స్" కూడా ఉండటం విశేషం. పైగా ఆ సినిమా, మా స్విమ్మింగ్‌పూల్ సినిమా షూటింగ్ ప్రారంభించేనాటికే పూర్తయ్యింది!

నాకు తెలుసు. వీటన్నిటి ఆలస్యాల వెనుక ఎన్నో సాంకేతిక, ఆర్థిక, న్యాయపరమైన కారణాలుంటాయి. ఆర్థికపరమైన లిటిగేషన్సే ఎక్కువగా ఉంటాయన్నది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్.

ఇదంతా నేను ఒక పాజిటివ్ కోణంలోనే చెప్తున్నానన్న విషయం మీరు గమనించాలి.

బట్, నా బాధ ఒక్కటే.

అంతా పూర్తిగా క్లియర్ కాకుండా, ఆదరాబాదరా డేట్ ఎనౌన్స్ చేసి, ఎన్నో చిన్న సినిమాల రిలీజ్‌ను గందరగోళంలో పడేసి, వాటి ప్రాణం తీసే పాపం మూటకట్టుకోవడం ఎందుకూ అని..

కట్ టూ మా కష్టాలు - 

అవడానికి మైక్రో బడ్జెట్ సినిమానే అయినా - మా స్థాయిలో మాకూ 101 కారణాలు, కష్టాలున్నాయి. సినిమా వాయిదా వేయడానికీ, అసలు రిలీజ్‌నే ఆపేసుకోడానికి!

అయినా - మేం అడుగు ముందుకే వేశాం. చెప్పిన తేదీకే రిలీజ్ చేశాం. చేయగలిగాం.

అదే రోజు రిలీజయిన మరో భారీ చిత్రంతో హోరాహోరీగా పోటీపడి, దానికంటే మంచి కలెక్షన్లు, మంచి టాక్ తెచ్చుకోగలిగాం. సాధించుకోగలిగాం.

ఇదంతా, అసలు ఎలాంటి ప్రమోషన్ లేకుండా!

అదే మా  #SwimmingPoolChallenge! 

Monday, 31 August 2015

అసలు స్విమ్మింగ్‌పూల్ ఎందుకు చూడాలి?

1. ఈ సినిమా కేవలం 12 రోజుల్లో షూట్ చేశాము. అలాగని, ఏదో చుట్ట చుట్టి అవతల పడేయలేదు. క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ కాలేదు. అలా ఎలా సాధ్యమైందన్న క్యూరియాసిటీతో మీరీ సినిమా చూడొచ్చు.

2. ఈ 12 రోజుల షూటింగ్‌లోనే ఒక ఐటమ్ సాంగ్, ఒక మెలొడీ సాంగ్ కూడా షూట్ చేశాము. ఎలా చేశామో అదీ చూడొచ్చు.

3. అంతే కాదు. సినిమాలో కొంత భాగం అమెరికాలోని హారిస్‌బర్గ్ లో కూడా షూట్ చేశాము. మాకున్న మైక్రో బడ్జెట్‌లో ఇదెలా సాధ్యమైందన్నది కూడా మీరు గమనించవచ్చు.

4. ఇంతకు ముందు, ఈ మధ్య కూడా బోల్డన్ని హారర్ సినిమాలు వచ్చాయి. బట్ .. ఇది మాత్రం ఒక "హాట్ రొమాంటిక్ హారర్!" ఆ డిఫరెన్స్ చూడండి. ఎంత హాట్‌గా ఉందో కూడా చూడండి.

5. నా బెస్ట్ ఫ్రెండ్, డి ఓ పి వీరేంద్రలలిత్; ఇంకో మిత్రుడు, స్టడీకామ్ ఆపరేటర్ సురేష్ బాబు .. వీళ్లిద్దరూ రెడ్ ఎమెక్స్ కెమెరాతో ఒక ఆట ఆడుకుంటూ, అంత స్పీడ్ రెనగేడ్ ఫిల్మ్ మేకింగ్‌లో కూడా క్రియేట్ చేసి ఇచ్చిన ఈ 'విజువల్ ట్రీట్'ని మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు.

6. హారర్ కాబట్టి సినిమాలో రెండు కంటే ఎక్కువ పాటల్ని పెట్టలేకపోయాను. ఆ రెండు పాటల్నీ .. ప్లస్ .. అవసరమైన ప్రతిచోటా అదరగొట్టిన ప్రదీప్‌చంద్ర రీరికార్డింగ్‌నీ మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు.

7. హారర్ సినిమా అన్నప్పుడు కనీసం ఓ రెండయినా గ్రాఫిక్ షాట్స్ ఉంటాయి. అవేవీ లేకుండానే నేనీ సినిమా తీశాను. మైక్రో బడ్జెట్‌లో అదెలా సాధ్యమయ్యిందో కూడా మీరు చూడొచ్చు.

8. మా హీరో అఖిల్ కార్తీక్ ఈ సినిమాలో ఒక్క హీరోగానే కాదు. మేకింగ్ పరంగా నా స్ట్రాటెజీకి అన్‌కండిషనల్‌గా చాలా సపోర్ట్ ఇచ్చాడు. షూటింగ్ ఆగిపోయే లాంటి ఊహించని ఎన్నో సిచువేషన్స్‌లో కూడా నాతోపాటు కూల్‌గా కూర్చొని "డిస్కస్" చేశాడు. అఖిల్ కార్తీక్ నుంచి, లైట్ బాయ్ శివమణి వరకు, ప్రతి ఒక్క ఆర్టిస్టు, టెక్నీషియన్ నాకోసం, ప్రాజెక్ట్ కోసం పనిచేశారు తప్ప, కాల్‌షీట్స్ లెక్కలతో చేయలేదు. మోస్ట్ అన్‌ట్రెడిషనల్ పధ్ధతిలో తీసిన ఈ సినిమా చూడడం ద్వారా మా టీమ్ అందరి శ్రమకు గుర్తింపునిచ్చిన క్రెడిట్ మీకే దక్కుతుంది.

9. మా ప్రొడ్యూసర్ అరుణ్‌కుమార్ ముప్పన, శ్రీ శ్రీ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మించిన తొలి చిత్రం ఇది. ఒక ప్రేక్షకుడిగా, ఒక ప్రొడ్యూసర్‌గా ఫైనల్ ప్రొడక్ట్ ఆయనకు బాగా నచ్చింది. మీరూ చూస్తే ఆయన డబ్బులు ఆయనకొస్తాయి. భయం లేకుండా ఇంకో సినిమా వెంటనే ప్రారంభిస్తాడు.

10. నేను చాలా సెల్ఫిష్. నా సినిమా ఎలాగయినా హిట్ కావాలని కోరుకుంటాను. అయితే ఈ సెల్ఫిష్‌నెస్ నా ఒక్కడి కోసం కాదు. నా ద్వారా మరో 100 మంది కొత్తవారికి పని కల్పించే అవకాశం నాకు మళ్లీ రావాలని! అదే నా స్వార్థం!! నా ఈ స్వార్థం సఫలం కావాలంటే, మీరీ సినిమాను చూడాలి. హిట్ చేయాలి.  

Sunday, 30 August 2015

12 రోజుల్లో సినిమా తీయొచ్చా?

నేను తీశాను.

దీని గురించి చెప్పేముందు - ఇక్కడ రెండు ఉదాహరణలు చాలా అవసరం. చెప్పాలి.

అమితాబ్ బచ్చన్ రేంజ్ ఆర్టిస్టుతో కేవలం 20 రోజుల్లో "నిశ్శబ్ద్" తీశాడు రామ్‌గోపాల్‌వర్మ. ఇదే వర్మ, రవితేజ, ఛార్మిలతో ఆ మధ్య 5 రోజుల్లో "దొంగల ముఠా" సినిమా తీశాడు.

గట్స్!

పైన చెప్పిన రెండు సినిమాలూ పక్కా మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలే. అయితే - దొంగల ముఠా మాత్రం - ఫిలిం మేకింగ్‌లో కొత్తగా వచ్చిన డిజిటల్ కెమెరాలను పరిచయం చేస్తూ తీసిన ఎక్స్‌పరిమెంటల్ సినిమా.

అయితే ఏంటట?

అమితాబ్, వర్మ బ్రాండెడ్ పర్సనాలిటీలు. రవితేజ, ఛార్మి ఆల్రెడీ ఇండస్ట్రీలో తమకంటూ ఒక స్థానం క్రియేట్ చేసుకున్న హీరోహీరోయిన్లు.

వాళ్లు ఏ ఆట ఆడినా నడుస్తుంది. లేదా ఇండస్ట్రీలో చెల్లుతుంది.

కట్ టూ మన పాయింట్ - 

ఇంతవరకూ ఇండస్ట్రీలో ఎలాంటి బ్రాండ్ లేని అప్‌కమింగ్/కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో నేను 12 రోజుల్లో ఒక రొమాంటిక్ హారర్ సినిమా తీశాను.

అదే స్విమ్మింగ్‌పూల్.

ఒక మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ సినిమా తీయాలంటే యావరేజ్‌న కనీసం 40 రోజుల షూటింగ్ అవసరం. నా లేటెస్ట్ సినిమా స్విమ్మింగ్‌పూల్ కూడా ఒక కమర్షియల్ సినిమానే. పైగా, రొమాంటిక్ హారర్! దీని సబ్జెక్టునుబట్టి చూస్తే, కనీసం ఓ 40 రోజులయినా షూటింగ్ చేయాలి.

కాని, నేను 12 రోజుల్లోనే మొత్తం షూటింగ్ పూర్తిచేశాను.

అది కూడా .. ఒక మెలొడీ సాంగ్, ఒక ఐటెమ్ సాంగ్‌తో కలిపి!

ఎలాంటి ప్యాచ్ వర్క్, గ్రాఫిక్ వర్క్ లేకుండా.  

ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే .. నేను చెప్పే కారణాలు రెండే రెండు: ఒకటి అవసరం. రెండోది లేటెస్ట్ టెక్నాలజీ.

మైక్రో బడ్జెట్ కాబట్టి, మనం అనుకున్నన్ని రోజులు లీజర్‌గా సినిమాతీసే అవకాశం అసలుండదు. బట్ .. ఫిలిం మేకింగ్‌లో వచ్చిన లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీ ముందు ఇదసలు సమస్యే కాదు.

సో .. అదన్నమాట.

12 రోజుల్లో నేను షూట్ చేసిన స్విమ్మింగ్‌పూల్ సినిమా - వచ్చే 11 సెప్టెంబర్ నాడు యు కె, యు ఎస్ ఏ ల్లో కూడా రిలీజవుతోంది.

ఇంక చెప్పేదేముంది? చిన్న బడ్జెట్ సినిమాలకు అవసరమైనంత ప్రమోషన్ ఉండదు. సరైన థియేటర్స్ కూడా దొరకవు. అదలా పక్కనపెడితే - ఈ సినిమాలకు ఓపెనింగ్స్ మరో పెద్ద సమస్య. ఓపెనింగ్స్ తెచ్చుకోగలిగితే చాలు. సినిమాలో ఏమాత్రం స్టఫ్ ఉన్నా మన రూటే సెపరేట్ అయిపోతుంది.

దానికోసమే ఇదంతా ..  

Sunday, 23 August 2015

డబ్‌స్మాష్ .. అంత ఈజీ కాదు!

డబ్‌స్మాష్ వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. చెప్పాలంటే - అసలు ఆ కాన్‌సెప్టే ఓ పెద్ద ఫన్నీ ఐడియా. డబ్‌స్మాష్ వీడియోల్ని చూసిన ఆ కొన్ని సెకన్లు, లేదా ఒకటి రెండు నిమిషాలు అవి పిచ్చిగా నవ్విస్తాయి. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌నిస్తాయి.

ఓ కోణంలో ఆలోచిస్తే - లైఫ్‌లో అసలు ఫన్ అనేది చాలా మిస్ అయిపోతున్నాం మనం. కారణాలు యేమయినా, ఇది నిజం. ఈ లోటుని ఇలాంటి చిన్న చిన్న యాప్స్ ఇలా పూరిస్తున్నాయి. భారీ రేంజ్‌లో సక్సెస్ అవుతున్నాయి.

పాయింట్ ఏంటంటే - ఇప్పుడు సోషల్ మీడియా ప్రభుత్వాలనే కూల్చేస్తోంది. ప్రతి రంగంలోనూ, పర్సనల్ లైఫ్‌లోనూ మన ప్రపంచాన్నే తల్లకిందులు చేస్తోంది.

దటీజ్ సోషల్ మీడియా పవర్!

ఈ విషయంలో డబ్‌స్మాష్ కూడా తక్కువేం కాదు. సరిగ్గా ఉపయోగించుకొంటే ఇది కూడా ఫస్ట్ క్లాస్ ప్రమోషనల్ టూల్ అవుతుంది. నో డౌట్!

కట్ టూ స్విమ్మింగ్‌పూల్ చాలెంజ్ - 

మొన్నరాత్రి మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్ర చాలా ఉత్సాహంగా ఓ డబ్‌స్మాష్ వీడియో క్రియేట్ చేసి, #SwimmingPoolChallenge హాష్ ట్యాగ్‌తో మా టీమ్‌లో, నాతో కలిపి ఓ ఐదుగురికి సరదాగా సవాల్ విసిరాడు. ప్రదీప్ విసిరిన ఆ సవాల్‌ను మేం స్వీకరించామా లేదా అన్నది వేరే విషయం అనుకోండి.

పైన టైటిల్ లో చెప్పినట్టు .. అదంత ఈజీ కాదు.

కానీ, అప్పుడు నాకు బాలీవుడ్ డబ్‌స్మాష్ క్వీన్ సోనాక్షి గుర్తొచ్చింది. సల్మాన్ ఖాన్ గుర్తొచ్చాడు. డబ్‌స్మాష్‌తో ఒక ఆటాడుకున్న ఇంకెందరో టాప్ సెలెబ్రిటీలు గుర్తొచ్చారు.

నేనెప్పుడూ డబ్‌స్మాష్ ట్రై చెయ్యలేదు కాబట్టి వెంటనే ఈ విషయంలో రియాక్ట్ అవలేకపోయాను. బట్ .. అవుతాను. మరో రెండు మూడు రోజుల్లో.

బికాజ్ .. ఇట్స్ రియల్లీ ఫన్నీ.

బికాజ్, లైఫ్‌లో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు ఎన్నో మిస్ అయిపోతున్నాం మనం.

Sunday, 16 August 2015

స్విమ్మింగ్‌పూల్ లో జ్యోతిష్కుడు!

కామేశ్వరరావు దామరాజు తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి పి హెచ్ డి పట్టా అందుకున్న డాక్టర్. మంచి భావుకత్వం ఉన్న కవి, రచయిత, సాహితీ విమర్శకుడు కూడా.

చిక్కడపల్లి అరోరా డిగ్రీ కాలేజ్ లో లాంగ్వేజెస్ డిపార్ట్‌మెంట్ హెడ్. అదొక్కటే కాదు. అరోరా కాలేజ్‌కు సంబంధించిన ఏ సాంస్కృతిక కార్యక్రమమో, ఈవెంటో జరగాలన్నా మన కామేశ్వరరావు లేకపోతే నడవదు.  

కట్ టూ సినిమారంగం - 

కామేశ్వరరావు మంచి స్క్రిప్ట్ రచయిత కూడా. అయితే - దానిమీద ఏకాగ్రత చూపించి, ఏదయినా సాధించే అవకాశాన్ని మాత్రం క్రియేట్ చేసుకోలేకపోయాడు.

నాకు తెలిసి ఇలా చాలామంది విషయంలో జరుగుతుంది. ముందు బ్రెడ్ అండ్ బట్టర్. తర్వాతే .. ఏ క్రియేటివిటీ అయినా.

సినిమా ఫీల్డు పూర్తిగా వేరే.

ఎవరయినా .. ఏ చిన్న అవకాశం అయినా ఇస్తూ .. పనికోసం పిలుస్తున్నారూ అంటే .. ఎక్కడున్నా వెంటనే వచ్చి వాలిపోవాల్సి ఉంటుంది.

ఎట్‌లీస్ట్ దానికంటూ కొంత సమయం విధిగా కెటాయించాల్సి ఉంటుంది. కెటాయించి తీరాలి. ఏ పనుల్లో ఉన్నా, ఎలా ఉన్నా.

ఫీల్డులో పరిస్థితులు అలా ఉంటాయి.

అయితే, అలాంటి అవకాశం కామేశ్వరరావుకు లేకపోవడంవల్ల స్క్రిప్ట్ రచయితగా ఇప్పటివరకయితే అంతగా ప్రయత్నించలేదు. రాణించలేదు. కానీ, రాయగల సత్తా అతనిలో చాలా ఉంది.

కామేశ్వరరావు మంచి పాటల రచయిత కూడా. పైన చెప్పిన కారణం వల్లనే, లిరిక్ రైటర్‌గా కూడా పూర్తిస్థాయిలో ఏమీచేయలేకపోయాడు. "ముద్దు" అనే ఒక సినిమాకు మాత్రం మొత్తం పాటలు రాశాడు. ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్‌స్‌కు రాశాడు.

ఉస్మానియా యూనివర్సిటీలో నా ఎమ్ ఏ క్లాస్‌మేట్ కూడా అయిన ఈ "కాముడు"కి, చాలా గ్యాప్ తర్వాత, నా రెండో చిత్రం "అలా"లో పాటలు రాసే అవకాశం నేనిచ్చాను. ఈ చిత్రంలో .. రష్యన్, ఇంగ్లిష్, హిందీ, తెలుగు భాషల్లో ఉండే ఒక్క ర్యాప్ టైటిల్ సాంగ్ మాత్రం నేను రాశాను. "అలా" చిత్రంలోని మిగిలిన అన్ని పాటలూ మా కాముడు చాలా బాగా రాశాడు.

"అలా" చిత్రం కోసం కామేశ్వరరావు రాసిన పాటలన్నీ యూట్యూబ్‌లో చూడొచ్చు.

వాటన్నిటిలోకీ, "బాడీ చూస్తే బ్రాడీపేట" అనే ఐటమ్ సాంగ్ పిచ్చి హైలైట్ అనుకోండి. అది వేరే విషయం.

కట్ టూ యాక్టర్ కామేశ్ - 

కామేశ్‌లో మంచి నటుడు కూడా ఉన్నాడని నాకు బాగా తెలుసు. రచయితగా, పాటల రచయితగా కంటే .. నటుడిగానే కామేశ్ వెండితెరమీద బాగా సక్సెస్ అవుతాడని చాలా రోజులనుంచి నా గట్టి నమ్మకం.

కట్ చేస్తే - 

మొన్న స్విమ్మింగ్‌పూల్ లో .. ఒకే ఒక్క సీన్‌లో ఫ్లాష్‌లా కనిపించే ఒక జ్యోతిష్కుని పాత్రలో కామేశ్‌ను తొలిసారిగా వెండితెరకు పరిచయం చేశాను.

ఇంక చెప్పేదేముంది. సూపర్ యాక్టింగ్!

స్విమ్మింగ్‌పూల్ తర్వాత వెంటనే ఒక అగ్రదర్శకుని చిత్రంలో మరో చిన్న క్యారెక్టర్ వేసే అవకాశం వచ్చింది. వేసేశాడు.

ఇక ఇప్పుడు నెమ్మదిగా .. ఒక యాక్టర్‌గా .. ఆ వైపు బిజీ అవుతున్నాడు.

అతనికిప్పుడు తను పనిచేస్తున్న అరోరా కాలేజ్ యజమాన్యం, ప్రిన్సిపాల్, స్టాఫ్, స్టుడెంట్స్ అందరి నుంచి కూడా మంచి ప్రోత్సాహం ఉంది.

జస్ట్ ఒక్క బ్రేక్ చాలు. తెలుగులో ఓ మంచి సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా నిలబడిపోయే సత్తా ఉన్న నటుడు కామేశ్. అతి త్వరలోనే నా మిత్రుడు కామేశ్‌కు ఆ బ్రేక్ కూడా రావాలని ఆశిస్తున్నాను. వస్తుందని నా నమ్మకం.   

Friday, 14 August 2015

ఆన్నా వెట్టిక్కాడ్, అన్నపూర్ణ సుంకర ఏం సాధించారు?

పొగడ్తలో, తిట్లో, బూతులో .. మొత్తానికి వెట్టిక్కాడ్, సుంకర అనుకున్నది సాధించారన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

బాహుబలిలో ప్రభాస్, తమన్నాల మధ్య ఆ రొమాంటిక్ ఎపిసోడ్‌ను ఒక "రేప్"గా అభివర్ణిస్తూ వెట్టిక్కాడ్ రాసిన ఆర్టికల్ ఒక సూడో సంచలనం టార్గెట్‌గా రాసింది. ఈ బిస్కట్‌కి చానెళ్లు, పేపర్లు, మేగజైన్లు, సోషల్ మీడియా మొత్తం పడిపోయాయి. వెట్టిక్కాడ్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోడానికి పోటీపడి మరీ మస్త్‌గా సహకరించాయి.

"రేప్" అన్న ఒక్క మాట ఉపయోగించి, వెట్టిక్కాడ్ తను అనుకున్న టార్గెట్‌ను అతి సునాయాసంగా రీచ్ అయింది.

మొన్నటిదాకా ఎవరికీ తెలియని ఆన్నా వెట్టిక్కాడ్ అంటే ఇప్పుడు దాదాపు సోషల్ మీడియాలో ప్రతి అడ్డమైన పోస్ట్‌కు లైక్‌లు కొట్టే ప్రతివాడికీ తెల్సు!

సో, వెట్టిక్కాడ్ ఈజ్ ఎ విన్నర్ ..

కట్ టూ అన్నపూర్ణ సుంకర - 

వెట్టిక్కాడ్ వ్యాసంలోని "రేప్" పదం బేస్‌గా పట్టుకొని అన్నపూర్ణ సుంకర ఒక పూర్తి స్క్రిప్ట్ రాసుకొంది. సెల్ఫీలో చెడా మడా వాగుతూ చెలరేగిపోయింది.

వెంటనే గోడకి కొట్టిన బంతిలా కనీసం ఓ 100 మంది ఊహించని రేంజ్‌లో రిటార్టయ్యారు ఆమె మీద. సుంకరకు కావల్సింది కూడా అదే!

ఓవర్‌నైట్ ఫేమ్ ...

మిషన్ ఎకమ్‌ప్లిష్‌డ్!!

ఈ ఇద్దరి విషయంలో - ఇక్కడ బఫూన్‌లెవరు? ఇంటలిజెంట్స్ ఎవరు??

కట్ టూ మనలో మాట - 

నాకర్థం కానిదొక్కటే. ఆన్నా వెట్టిక్కాడ్, అన్నపూర్ణ సుంకర గానీ .. వీళ్లిద్దరి డిక్షనరీ ప్రకారం అసలు "రేప్" అంటే అర్థం ఏంటి? .. మీలో ఎవరికయినా తెలిస్తే చెప్పండి దయచేసి. థాంక్స్ ఎ మిలియన్ ఇన్ అడ్వాన్స్!

వీళ్లిద్దరి లెక్క ప్రకారం సిన్మాలో హీరోహీరోయిన్‌లు దగ్గినా, తుమ్మినా రేపే అవుతుంది. రాజమౌళి నుంచి, రేపు కొత్తగా సినిమా ప్రారంభించే ఫ్రెష్ డైరెక్టర్ దాకా .. అందరూ ఇంక వీళ్ల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గుర్తుపెట్టుకోవాలేమో!

ఇంక సెన్సార్ ఎందుకు మధ్యలో.. దండగ?! పీకి అవతల పడేస్తే గవర్నమెంటుకు జీతాలయినా మిగుల్తాయి!!

అంతా సూడో పబ్లిసిటీ స్టంట్.

ఇదొక మానసిక వ్యాధి. దీనికి శాస్త్రీయనామం కూడా ఒకటుంది. తెలిసి కొందరు, తెలియక కొందరు .. ఈ వ్యాధి బారినపడిన చాలామంది మేధావులమని అనుకొనేవారు కూడా నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు. ఎవరి పిచ్చి వారికానందం. ఎవరి జీవితం వారిది. ఆ విషయం అలా వదిలేద్దాం.

కట్ బ్యాక్ టూ మన టాపిక్ - 

యూట్యూబ్ లోని ఒక స్పూఫ్‌లో ఎవరో అన్నారు. "సినిమాల గురించి ఇంత బాగా తెలిసిన ఈ సుంకరలు, వెట్టిక్కాడ్‌లు వాళ్ల అద్భుతమైన ఆదర్శాలు, ఆలోచనలతో 'ఇదిగో, సినిమా అంటే ఇలా ఉండాలి!' అని ఒక మాంచి సినిమా ఎందుకు తీయకూడదు? అంతా ఫాలో అవుతాం గా .." అని.

ఇది వాళ్లు తప్పక వినే ఉంటారు. అయితే - సినిమా తీస్తారో లేదో మాత్రం చూడాలి మరి ..

ఇదంతా ఎలా ఉన్నా ..  వీళ్లిద్దరూ కల్సి నా "స్విమ్మింగ్‌పూల్" సినిమా తప్పక చూడాలన్నది నా కోరిక. ఎంచక్కా ఒకరు మస్త్ వ్యాసం రాస్తారు. ఇంకోరు జబర్దస్త్ సెల్ఫీ వీడియో పెడతారు!

అది చాలు .. 

Tuesday, 11 August 2015

జీవితం ఒక్కటే .. ఒక్కసారే !

హాయ్ ..
హాయ్ బ్రో! ..
హవ్ ఆర్యూ? ..
ఏం టిఫిన్ తిన్నారు? ..
లంచ్ అయిందా? ..
హావ్ ఎ గుడ్ డే !! ..

ఇలాంటి చాట్ లు దయచేసి నా ఫేస్‌బుక్ లో వద్దు.

నా ఫేస్‌బుక్ మిత్రుల్లో ఉన్న అందరితో ఈ ఫార్మాలిటీస్ చాట్ చేస్తూ కూర్చోడం అన్నది అస్సలు కుదరని పని. అసాధ్యం కూడా. మీకూ, నాకూ ఎన్నో పనులుంటాయి. ఎన్నో టార్గెట్‌లుంటాయి.

నాకు వ్యక్తిగతంగా కొన్ని చిన్న చిన్న కమిట్‌మెంట్‌లున్నాయి. భారీ టార్గెట్‌లున్నాయి. వాటికోసమే ప్రస్తుతం నేను ఈ ఫీల్డులో పనిచేస్తున్నాను. అసలు సినీఫీల్డు కాకుండా కూడా నా రెగ్యులర్ పనులు వేరే ఉన్నాయి. అలాంటప్పుడు నా మొత్తం సమయం దీనికే కెటాయించలేను.

నిజంగా ఏదయినా అర్జెంట్, ఇంపార్టెంట్ అంటూ .. ఉంటే డైరెక్టుగా దానిగురించే ఒక చిన్న మెసేజ్ పెట్టండి. తప్పక నేను రిప్లై ఇస్తాను. అవసరమైతే ఫోన్ చేస్తాను.

కట్ టూ కొత్త సినిమా ఛాన్స్ - 

నా కొత్త సినిమాల వివరాల గురించి కూడా నేనే మర్చిపోకుండా ఫేస్‌బుక్ లో వివరంగా ఎనౌన్స్ చేస్తాను. ఆ వివరాలు కూడా దయచేసి  పదే పదే మెసేజ్‌లద్వారా, కామెంట్స్ ద్వారా అడగొద్దని మనవి.

సింగర్స్ గురించి గానీ, ఆర్టిస్టుల గురించిగానీ, అసిస్టెంట్ డైరెక్టర్‌ల గురించిగానీ .. నా ఫేస్‌బుక్‌లో, బయట ఫిల్మ్ మాగ్స్‌లో, ఫిల్మ్ వెబ్‌సైట్స్‌లో నేను పోస్ట్ చేసినప్పుడు .. అప్పుడు మాత్రమే అప్ప్లై చేసుకోండి. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఆడిషన్స్ కు పిలుస్తాను. టాలెంట్ ఉన్నవాళ్లు తప్పక ఎన్నికవుతారు.

మళ్లీ మన పాయింట్‌కొస్తే, వందలాదిమందికి చాటింగ్ లో సింపుల్‌గా "హాయ్" చెప్పడం కూడ కష్టమే. ఈ విషయం మీరూ ఒప్పుకుంటారనుకుంటాను. నన్ను తప్పుగా అనుకోరని భావిస్తాను. ఈ విషయంలో అడ్వాన్స్‌గా మీకు థాంక్ యూ సో మచ్!

కట్ టూ ఒక రియాలిటీ - 

ఇది మనలో మాట.

మనం గుడ్ మార్నింగ్ అనుకున్నంత మాత్రాన ఆ రోజు ఉదయం ఏదయినా ఊహించని గుడ్ మనకు జరుగుతుందంటారా? ఎదుటివారికయినా, మనకయినా ఒక మంచి జరగాలని పాజిటివ్ కోణంలో ఆశించడంలో తప్పులేదు. కానీ ఊరికే ఆశించి కూర్చుంటే పనులు కావు. ఏ పని అయినా ముందు మనం చెయ్యాలి. చేస్తేనే అవుతుంది.

ఊరికే ఆశించి కూర్చుంటేనో, దండంపెట్టుకొని కూర్చుంటేనో పనులు వాటికవే కావు.

సో .. మనం పని చేసుకుందాం. పనిలో ఒకరికొకరం సహకరించుకుందాం. అందరం ఎదుగుదాం. కలిసినప్పుడు తప్పక హాయ్ .. హలో అని పలకరించుకుందాం. కష్టసుఖాలు, మంచీ చెడు పంచుకుందాం.

అంతే తప్ప .. ఫేస్‌బుక్కే జీవితం కాదు. సినిమానే జీవితం కాదు.

వీటికి అవతల కూడా లైఫ్ ఉంది. దాన్ని కూడా ఎంజాయ్ చేద్దాం.

ఎందుకంటే .. జీవితం ఒక్కటే. ఒక్కసారే.

దాన్ని గౌరవిద్దాం. అనుక్షణం అనుభవిద్దాం.    

Monday, 10 August 2015

సెప్టెంబర్ 11 విడుదల!

ఎన్నోరకాల ఆలస్యాలు, సాంకేతిక సమస్యల మధ్య .. ఎట్‌లాస్ట్ ..

మొన్నరాత్రి, నాతో ఫోన్‌లో మాట్లాడ్డం అయిపోతూనే, మా ప్రొడ్యూసర్ అరుణ్ ముప్పన తన ఫేస్‌బుక్ టైమ్‌లైన్‌లో పోస్ట్ చేయడంద్వారా స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ డేట్ ను ప్రకటించేశారు.

ప్రస్తుతం మాముందున్న టార్గెట్ ఒక్కటే.

చేతిలో ఉన్న అత్యంత పరిమితమైన రిసోర్సెస్‌తోనే స్విమ్మింగ్‌పూల్ చిత్రాన్ని వీలయినంత బాగా రిలీజ్ చేయగలగాలి. ఒక రకంగా - ఇది నాకూ, మా టీమ్‌కూ ఓ పెద్ద ఛాలెంజ్. బట్, ఇక్కడివరకూ చేయగలిగిన మాకు .. ఇది పెద్ద లెక్కేం కాదు అన్న  నమ్మకం నాకుంది.

కట్ టూ ది బిగ్ డిఫరెన్స్ - 

ఆల్‌రెడీ ఒక బ్రాండున్న పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లు, పెద్ద బ్యానర్‌ల సినిమాలకు మామూలుగానే ఒక అంచనా, ఒక హైప్ ఉంటాయి. మార్కెట్‌లో ఒక రేట్ కూడా ఉంటుంది.

ఆ సినిమాల రిలీజ్‌కు ఓపెనింగ్స్ అంటూ ఉంటాయి .. ఒక రేంజ్‌లో.    

చిన్న బడ్జెట్ సినిమాల విషయంలో ఇదంతా ఏం ఉండదు. కోరుకున్న థియేటర్‌లు దొరకవు. చివరి నిమిషంలో కూడా చాలా మంది, చాలా రకాలుగా హాండిస్తారు.

ఒక 100 చిన్న బడ్జెట్ సినిమాలు రిలీజైతే, వాటిలో కేవలం ఒక 5% చిత్రాలకే మార్కెట్‌లో ఒక అంచనా ఉంటుంది. ఒక రేంజ్ హైప్ క్రియేట్ చేసుకోగలుగుతాం. ఇలాంటివాటికి మాత్రం ఎంతోకొంత ఓపెనింగ్స్ అంటూ ఉంటాయి. సినిమాలో ఏమాత్రం స్టఫ్ ఉన్నా, మంచి టాక్ వస్తుంది.

మౌత్ టాక్ ఒక్కటే చిన్న సినిమాలకు ఊపిరి. "సినిమా బాగుంది" అన్న టాక్ వస్తే చాలు. ఒక్కసారిగా సీన్ మారిపోతుంది.

సో, ఏరకంగా చూసినా .. చిన్న సినిమాలకు ఓపెనింగ్స్ చాలా చాలా ముఖ్యం.  

ఇక స్విమ్మింగ్‌పూల్ విషయానికొస్తే - పైన చెప్పిన 5% సినిమాల కేటగిరీలోకి మా స్విమ్మింగ్‌పూల్ వస్తుందని నేననుకొంటున్నాను. 

Tuesday, 4 August 2015

కొత్త సింగర్‌లు ఎందుకు?

స్విమ్మింగ్‌పూల్ చిత్రం ద్వారా నేను పరిచయం చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్ర అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఇష్టానికి కారణమైన అంశాలు రెండు.

అతని టాలెంట్. అతని వ్యక్తిత్వం.

విషయమేంటంటే - ప్రదీప్‌చంద్ర వయసులో నా కంటే చాలా చిన్నవాడు. కేవలం ఇండస్ట్రీకి కొత్త అనే కాకుండా, ఈ పాయింటాఫ్ వ్యూలో కూడా .. ప్రదీప్‌చంద్రకు నేను అప్పుడప్పుడూ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు చెప్తూ విసిగిస్తుంటాను.

కట్ టూ మన కొత్త సింగర్‌ల టాపిక్ - 

స్విమ్మింగ్‌పూల్ మ్యూజిక్ సిట్టింగ్స్ 'డే వన్' నుంచి నేను ప్రదీప్‌చంద్రకు ఒక విషయం చెబుతూ వస్తున్నాను ..

"మన సినిమాలో పాటలకోసమని నువ్వు ఇండస్ట్రీలోని టాప్ సింగర్స్‌తోనే పాడించాలని పొరపాటున కూడా అనుకోకు. నాకలాంటి భ్రమలు లేవు.

అలా .. టాప్ సింగర్స్ పేర్లు నీ సీడీలో ఉంటేనే నీకు పేరొస్తుందనీ, మ్యూజిక్ కంపెనీలవాళ్లు ఆడియో రైట్స్ కొనుక్కోడానికి ఎగబడతారనీ అనుకోకు.

ఏ క్యాబ్ వాడో తప్ప, ఇప్పుడు ఆడియో సీడీలు ఫ్రీగా ఇచ్చినా ఎవ్వడు తీసుకోడంలేదు. ఇంకా చెప్పాలంటే - ఇప్పుడు ఆడియో రిలీజ్ కంటే ముందే ఆ సాంగ్స్ ఇంటర్‌నెట్‌లో లీకయిపోతున్నాయి.

సో, మన పాటలు కూడా బాగుంటే వద్దన్నా పబ్లిక్‌లోకి వెళ్లిపోతాయి. వినాలనుకున్నవాడు డౌన్‌లోడ్ పెట్టుకుంటాడు."

కాబట్టి -

"నువ్వు కొత్త సింగర్స్‌ను పరిచయం చేసి, వాళ్లను నీ ద్వారా టాప్ సింగర్స్‌ను చెయ్యి!" అని కూడా ప్రదీప్‌చంద్రకు చెప్పాను.

ఇలా నేను చెప్పడానికి చాలా కారణాలున్నాయి ..

వెనకటి రోజుల్లో గాయనీగాయకుల్లాగా ఏ ఒకరిద్దరో మాత్రమే పాడుతూ .. 'దశాబ్దాలకొద్దీ గాన సామ్రాజ్యాల్ని ఏలాలి' అనుకొనే రోజులు కావివి. అప్పుడంటే అలా నడిచింది. ఇప్పుడలా నడవదు గాక నడవదు. ఇప్పటి ప్రేక్షకులు, శ్రోతలు ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకొంటున్నారు. కొత్త గొంతులు వినాలనుకొంటున్నారు. విని ఆనందిస్తున్నారు.

ఈ కోణంలో ఆలోచించినప్పుడు - టాలెంట్ బాగా ఉండి, అవకాశం కోసం ఎదురుచూస్తున్న కొత్త సింగర్స్‌ను పరిచయం చెయ్యాలన్నది నా ఉద్దేశ్యం.

అలాగే - ఇప్పటికే పరిచయమైనా, రకరకాల కారణాలవల్ల, టాలెంట్ ఉండీ పైకి రాలేకపోతున్న అప్‌కమింగ్ సింగర్స్‌ను కూడా వీలయినంత ఎంకరేజ్ చెయ్యాలన్నది నా ఇంకో ఆలోచన.

కట్ టూ క్లయిమాక్స్ - 

పైనంతా ఏదో చెప్పానని .. ఇండస్ట్రీలోని టాప్ సింగర్స్ మీద నాకేదో ఇష్టం లేదని కాదు. ఆ రేంజ్‌కు రావడం కోసం వాళ్లంతా ఏ రేంజ్‌లో శ్రమపడి ఉంటారో నాకు బాగా తెలుసు.

పైగా వాళ్ల రేంజ్‌నుబట్టి - వాళ్లకు ఎప్పుడూ ఏవేవో స్టేజ్ షోలు ఉంటాయి. అలాంటప్పుడు .. వాళ్ళు మన సినిమాలో పాడినప్పటికీ, రేపు మన ఆడియో లాంచ్‌కు డబ్బులిచ్చిరమ్మన్నా రాలేని పరిస్థితులుంటాయి వాళ్లకు.  

అక్కడ షోలకెళ్తే లక్షలొస్తాయి. ఇక్కడ ఆడియో లాంచ్‌కొస్తే మనం బోడి ఏ ఐదు వేలో, పది వేలో ఇస్తాం.

ఎలా కుదురుతుంది?

ఏదయినా సరే, రియలిస్టిక్‌గా ఆలోచించాలన్నది నా పాయింటు.

కాకపోతే - దీనికో మినహాయింపు కూడా ఉంది.

చిన్న సినిమాల ఆడియో లాంచ్‌లను రకరకాల కారణాలతో లైట్ తీసుకోనే ఇదే సింగర్స్ .. పెద్ద హీరోలు, పెద్ద బ్యానర్‌ల సినిమాల ఆడియో లాంచ్‌లకు మాత్రం స్లీవ్‌లెస్‌ల్లో అటెండవుతారు.

అక్కడ తప్పదు. అది వేరే విషయం.

ఎవర్నీ తప్పుపట్టడానికిలేదు. ఎవరి రీజన్స్ వారివి. ఎవరి బాధ వారిది.

సో, మై డియర్ ప్రదీప్! ఇప్పుడయినా కొత్త సింగర్స్‌ను పరిచయం చెయ్యి. ఆడిషన్స్ పెట్టు. మన కొత్త సినిమా కోసం ..

Monday, 3 August 2015

ఇక ముందుకే!

అయితే లెఫ్ట్ .. లేదంటే రైట్. అంతే గాని, లెఫ్ట్, రైట్ రెండూ కావాలంటే చాలా కష్టం. అది జరగనిపని.

అవ్వో, బువ్వో ఏదో ఒక్కటే!

తాడిచెట్టు కిందకెళ్లి పాలు తాగుతానంటే కుదర్దు. అక్కడ కల్లే తాగాలి.

ఒకదానికొకటి పొంతనలేని ఈ రాతలన్నీ పిచ్చెక్కిస్తున్నాయి కదూ? నాకూ అంతే. పిచ్చెక్కిపోతోంది.

అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకున్న తర్వాత కూడా మళ్ళీ అవే నిర్ణయాలు తీసుకొంటే ఫలితాలు కొత్తగా ఉండవు. జిరాక్స్ కాపీలా మళ్ళీ ఆ పాత ఫలితాల్నే చూడాల్సి వస్తుంది. 

ఆర్టిస్టులే మారతారు. క్యారెక్టర్స్ మాత్రం అవే.

కట్ టూ స్విమ్మింగ్‌పూల్ -

ఈ మధ్యకాలంలో ఒక్క చిన్న సినిమా కూడా హిట్ కాలేదు. ఆ పనేదో స్విమ్మింగ్‌పూల్ చేస్తుందని నా నమ్మకం. ఆ నమ్మకం నిజం కావడానికి మాత్రం మేం చాలా చేయాల్సి ఉంది. చేసి తీరాలి.

అవును. ఒక్క హిట్ జీవితాన్నే మార్చేస్తుంది. 

Saturday, 1 August 2015

స్టడీకామ్ సురేష్ @ స్విమ్మింగ్‌పూల్

అసలు తెలుగులో స్టడీకామ్ టెక్నిక్‌ను బాగా ఉపయోగించి, దానికి బాగా పాపులారిటీ తెచ్చింది రామ్‌గోపాల్‌వర్మ. తర్వాత అందరూ అవసరమున్నా, లేకపోయినా .. అయినదానికీ, కానిదానికీ .. ఎడా పెడా .. ఈ టెక్నిక్‌నే ఉపయోగిస్తున్నారనుకోండి. అది వేరే విషయం.

కట్ టూ సురేష్ - 

తెలుగు ఇండస్ట్రీలో - సురేష్‌తో కలిపి, మంచి స్టడీకామ్ ఆపరేటర్‌లు ఒక ఆరుగురికంటే ఎక్కువ ఉండే అవకాశం లేదనుకుంటున్నాన్నేను.

తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ ఇండస్ట్రీల్లోని దాదాపు అందరు ప్రముఖ హీరోలు, డైరెక్టర్లతో కలిసి పనిచేసిన రికార్డ్ సురేష్‌కు ఉంది. హిందీలో కూడా వాంటెడ్, బద్మాష్ కంపనీ సినిమాలకు పనిచేశాడు సురేష్.

2006 లో నా రెండో చిత్రం "అలా" కు ఫోకస్‌పుల్లర్ గా పనిచేసిన సురేష్, ఇప్పుడు నా లేటెస్ట్ సినిమా "స్విమ్మింగ్‌పూల్" కు కూడా పనిచేశాడు. కాకపోతే, ఇప్పుడు స్టడీకామ్ ఆపరేటర్‌గా.

కట్ టూ సురేష్ ఫిలిం ఎంట్రీ - 

సురేష్ పుట్టింది కడపలో.

డిగ్రీ అయిపోయాక, వెబ్ డిజైనింగ్ పేరుతో హైద్రాబాడ్‌లో అడుగుపెట్టాడు సురేష్. ఒకటి రెండు ట్విస్టుల తర్వాత - వెబ్ డిజైనింగ్ కాస్తా పబ్లిసిటీ డిజైనింగ్ వైపు రూటు మార్చింది. పబ్లిసిటీ డిజైనర్ కళాభాస్కర్ "నువ్వు చెయ్యాల్సింది ఇది కాదు. ఏదయినా టెక్నికల్ సైడ్ వెళితే బాగుంటుంది" అని సలహా ఇచ్చారు.

కట్ చేస్తే -

స్టడీకామ్ శ్రీధర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిలో చేరిపోయాడు సురేష్. ఆ తర్వాత - స్టడీకామ్ పార్తీపన్ దగ్గర శిష్యుడిగా చేరాడు. పార్తీపన్‌కు మొదటి శిష్యుడు, చివరి శిష్యుడూ కూడా సురేషే కావడం విశేషం.

స్టడీకామ్ షాట్స్ తెరపైన చూడ్డానికి చాలా బాగుంటాయి. అయితే ఆ షాట్స్ అంత బాగా రావడం వెనుక స్టడీకామ్ ఆపరేటర్ కష్టం చాలా ఉంటుంది.

యావరేజ్‌న సుమారు 40 కిలోలకు తక్కువకాని కెమెరా ఇక్విప్‌మెంట్ బరువునంతా తన శరీరం పైన మోస్తూ - డైరెక్టర్ చెప్పిన ఎఫెక్ట్ రావడం కోసం - పడుతూ, లేస్తూ, పరుగెత్తుతూ షాట్స్ తీయాల్సి ఉంటుంది.

షాట్‌ను, లొకేషన్‌ను బట్టి - ఏ చిన్న పొరపాటు జరిగినా లైఫ్ రిస్క్ కాచుకొని ఉంటుంది. అలాంటి ఒక రిస్కీ షాట్ తీసిన అనుభవం కూడా సురేష్‌కు ఉంది.

మళయాళంలో మోహన్‌లాల్ సినిమా షికార్ కోసం కొడైకెనాల్ లోని గుణ కేవ్స్ లో ప్రాణాలకు తెగించి షూట్ చేశాడు సురేష్.

మొన్నటి బాహుబలి కోసం కూడా మహారాష్ట్రలోని పంచ్‌గనిలో - బురదలో కూడా కష్టపడి షూట్ చేశాడు సురేష్.

అంతేకాదు. తమిళంలో సిరుత్తై సినిమాలో ఒక మొత్తం ఫైట్ ను సింగిల్ షాట్‌లో స్టడీకామ్‌లో షూట్ చేశాడు సురేష్. అలాగే - టార్గెట్ సినిమా కోసం, శివబాలాజీ, శ్రధ్ధాదాస్‌ల మీద పూర్తి పాటను స్టడీకామ్‌లో షూట్ చేసిన రికార్డ్ సురేష్‌కు ఉంది.

ఎన్ని చేసినా - తెలుగులో రాజమౌళి మాగ్నమ్ ఓపస్ బాహుబలి కి పనిచేయడం మాత్రం ఒక మర్చిపోలేని గొప్ప అనుభవంగా చెప్తాడు సురేష్.

ఇదంతా సురేష్‌కు స్టడీకామ్‌ ఆపరేషన్ పట్ల, సినిమాటోగ్రఫీ పట్ల ఉన్న అమితమైన ప్యాషన్‌ను తెలుపుతుంది.

కట్ టూ మా స్నేహం - 

2006 లో నా రెండో చిత్రం "అలా" కు ఫోకస్‌పుల్లర్‌గా పనిచేసినప్పుడు ఎలా ఉన్నాడో, సురేష్ ఇప్పుడూ అలాగే ఉన్నాడు.

అదే చిరునవ్వు. అదే పలకరింపు. అదే ఫ్రెండ్లీ నేచర్. అదే ప్యాషన్.

ఈ ప్యాషన్‌తోనే - స్టడీకామ్ ఆపరేటర్ స్థాయి నుంచి, ఇన్‌డిపెండెంట్‌గా డి ఓ పి (డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ) స్థాయికి త్వరలోనే వెళ్లనున్నాడు సురేష్. నా అంచనా ప్రకారం అది ఈ 2015 లోనే జరగొచ్చు!

సురేష్, యూ రాక్ ..  

Tuesday, 28 July 2015

ఒక దేశభక్తుని 4 కొటేషన్లు

> నిద్రలో కలలు కనడం కాదు. నీ కల నిన్ను నిద్రపోనివ్వకూడదు.

> సక్సెస్ స్టోరీలు చదవొద్దు. అవి కేవలం ఒక సందేశాన్నే ఇస్తాయి. ఫెయిల్యూర్ స్టోరీలు చదవండి. అవి, నువ్వు సక్సెస్ సాధించడానికి అవసరమైన ఎన్నో ఐడియాలనిస్తాయి.

> కష్టాలనేవి నిన్ను నాశనం చేయడానికి రావు. నీలో దాగి ఉన్న శక్తుల్ని బయటకుతీయడంలో సహకరించడానికి  వస్తాయి. నీ కష్టాలకు తెలియజేయి .. నువ్వే ఓ పెద్ద కష్టమని!

> ఒక మంచి పుస్తకం 100 మంది మంచి స్నేహితులతో సమానం. కాని, ఓ మంచి స్నేహితుడు ఓ గ్రంథాలయంతో సమానం.

***

పేపర్ బాయ్ నుంచి మిసైల్ మ్యాన్ దాకా ఎదిగిన అబ్దుల్ కలాం జీవితమే ఒక సక్సెస్ సైన్స్. ఆయన చెప్పిన ఎన్నో మాటల్లో ఈ నాలుగు కొటేషన్‌లు నాకు బాగా గుర్తున్న కొటేషన్‌లు. నాకు బాగా నచ్చిన కొటేషన్‌లు.

అబ్దుల్ కలాం తను చనిపోతే ఒక రోజు సెలవు ఇవ్వద్దు. ఒకరోజు ఎక్కువ పనిచేయండి అన్నారు. నేనీరోజు సెలవు తీసుకోకుండా ఇంకో గంట ఎక్కువ పనిచేస్తున్నాను. ఇది మాత్రమే ఆయనకు ఈరోజు నేనివ్వగలిగిన అత్యుత్తమ నివాళి అనుకుంటున్నాను. 

Thursday, 23 July 2015

స్విమ్మింగ్‌పూల్ లో రచ్చ రవి!

జబర్దస్త్ చూసేవాళ్లకు రచ్చ రవిని ప్రత్యేకంగా పరిచయంచేసే అవసరం లేదనుకుంటాను. జబర్దస్త్ ప్రోగ్రామ్‌తోపాటే, ఎన్నో సినిమాల్లో కూడా నటించిన రచ్చ రవి .. స్టేజ్ షోల్లో కూడా పిచ్చి బిజీనే!

సినీ ఫీల్డులో ఎప్పుడు, ఎవరు, ఎవరితో పరిచయమై, ఎంత తొందరగా బాగా క్లోజ్ అయిపోతారన్నది చెప్పలేరు. కొన్ని పరిచయాలు అలా అనుకోకుండా జరిగిపోతాయి.  

రచ్చ రవితో నా పరిచయం కూడా అలాంటిదే!

కట్ టూ స్విమ్మింగ్‌పూల్ -

కొన్ని కారణాలవల్ల ఆరోజు ఒక ఆర్టిస్టుకు ముందే ప్రోగ్రాం కాల్ వెళ్లలేదు. షూటింగ్ స్పాట్ నుంచి అప్పటికప్పుడు ఫోన్ చేసేటప్పటికి, ఆ ఆర్టిస్ట్ అప్పటికే వేరొక చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాడు. షూటింగ్‌కు రావడం అనేది అసాధ్యం.

"ఇంకా సినిమాలో ఎంటర్ అవని క్యారెక్టర్ కదా - షూటింగ్ మర్నాడు పెట్టుకుందాంలే" అని అనుకోడానికిలేదు. ఆరోజు ఆ రెండు సీన్‌లూ ఆ లొకేషన్‌లో పూర్తిచేసితీరాలి. ఆరోజుతో మొత్తం టాకీ పార్ట్ పూర్తవుతుంది!

నిజానికి అది చాలా పెద్ద టెన్షన్.

కానీ .. కూల్‌గా నేనూ, కార్తీక్ కూర్చుని ఆలోచించాము.

కట్ చేస్తే - 

హీరో అఖిల్ కార్తీక్ ఇనిషియేషన్‌తో రచ్చ రవి స్విమ్మింగ్‌పూల్ లోకి ఎంటరయ్యాడు .. హీరో ఫ్రెండ్‌గా. ఆరోజు రవి ఫ్రీగా ఉండటం నిజంగా లక్కీ!

ఇక, రవిది ఎంత మంచి మనసు అంటే - సమస్యను అవతలివారి కోణంలోంచికూడా అలోచిస్తాడు. ఒక్క నిమిషం వృధా కానివ్వడు.

'విషయం ఇదీ' అని చెప్పాక - వెంటనే చేస్తానని ఒప్పేసుకున్నాడు రవి. "కారు పంపిస్తాం పికప్‌కి" అన్నప్పుడు ఒక్కటే మాటన్నాడు.

"అన్నా! మీ కారు సికింద్రాబాద్ నుంచి మణికొండ వచ్చి, దాన్ని నేను ఎక్కి, మళ్ళీ మీ సికింద్రాబాద్ షూటింగ్ లొకేషన్‌కు వచ్చేటప్పటికి హాఫ్ డే అయిపోద్ది అనవసరంగా. నేనే బైక్ మీద డైరెక్ట్‌గా వస్తాలే!" అని, అడ్రస్ తీసుకున్నాడు.

సరిగ్గా 45 నిమిషాల్లో లొకేషన్‌కు వచ్చేసాడు!

ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి కోపరేషన్ చాలా అరుదు.

కట్ టూ స్విమ్మింగ్‌పూల్ ఆడియో లాంచ్ - 

"అన్నా! ఎంత బిజీగా ఉన్నా సరే, నేను మన సినిమా ఆడియో ఫంక్షన్‌కు వస్తాను. కాకపోతే, నాకు ఒక రెండ్రోజుల ముందు చెప్పండి!" అని నాకూ, కార్తీక్‌కూ మాట ఇచ్చినట్లుగానే - మొన్న జరిగిన మా ఆడియో ఫంక్షన్‌కు సరిగ్గా టైమ్‌కు వచ్చాడు రవి.

తప్పకుండా వస్తామన్న పెద్ద గెస్ట్‌లు పెద్ద హాండిచ్చారు. అది వేరే విషయం.

బ్యాక్ టూ రచ్చ రవి - 

ఆడియో ఫంక్షన్‌కు ఏదో గెస్ట్‌లా ఊరికే అలా రావడం, పోవడం కాకుండా - స్టేజ్ మీద  రవి  సోలోగానూ, గాలిపటం సుధాకర్‌తో కలిసి కంబైండ్ గానూ .. తన కామెడీతో రచ్చ రచ్చ చేసి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా!

ఆ చిరునవ్వు, ఆ పలకరింపు, ఆ చొరవ, ఆ ఆత్మీయత .. సింప్లీ హాట్సాఫ్ టూ రవి!

షూటింగ్‌లో కూడా అంతే. హీరో అఖిల్ కార్తీక్, హీరోయిన్ ప్రియ వశిష్ట కాంబినేషన్లో తను నటించిన రెండు సీన్‌లను దడదడలాడించేస్తూ అద్భుతంగా నటించాడు రవి.  

టీవీ, స్టేజ్ ప్రొగ్రామ్‌లతో పాటు సినిమాల్లోనూ రచ్చ రవి ఇంకా బాగా పైకి రావాలని నా కోరిక. వస్తాడని నా నమ్మకం.

ఫినిషింగ్ టచ్ ఏంటంటే - 

ఇది షూటింగ్ అయ్యాక ఏదో మాటల సందర్భంలో తెల్సిన విషయం.

"మీది తెనాలి .. మాది తెనాలి" లాగా - రచ్చ రవి పుట్టిందీ, పెరిగిందీ వరంగల్ కావడం విశేషం. నేను పుట్టిన ఊరు కూడా అదే! 

Wednesday, 22 July 2015

ఫిల్మ్ మేకింగ్ మేడ్ ఈజీ!

బాహుబలి, రుద్రమదేవి వంటి మాగ్నమ్ ఓపస్ లను పక్కన పెట్టండి. టాప్ స్టార్‌ల 30-40 కోట్ల సినిమాలను పక్కన పెట్టండి. ఇవన్నీ సాధ్యం కావడానికి వెనక చాలా కృషి ఉంటుంది. మనకు తెలియని మతలబులు, నేపథ్యం కూడా చాలా ఉంటుంది.

లేదా ఒక డైరెక్టర్ తన ఖాతాలో అప్పుడే ఒక అద్భుతమయిన సూపర్ హిట్ ఇచ్చి ఉండాలి. లేదంటే .. ఒక బలమైన సినిమా కుటుంబ నేపథ్యం ఉండాలి. అలా లేనప్పుడు, ఆ లాబీల కాంపౌండుల్లోకి కూడా ఎంటర్ కాలేరెవ్వరూ.

ఇదంతా నాణేనికి ఒకవైపు. ఇప్పుడు నేను చర్చిస్తున్నది నాణేనికి మరోవైపు.  

ఇంతకు ముందొకసారి ఈ టాపిక్ పైన, ఇదే బ్లాగ్‌లో రాశాను. సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ రాస్తున్నాను.

కట్ టూ మన డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ -  

ఇప్పుడు సినిమా యెవరైనా తీయొచ్చు. దానికి 30,40 కోట్లు లేదా 300 కోట్లు అవసరం లేదు. ఒకటి, రెండు కోట్లు చాలు.
తక్కువలో తక్కువ కొన్ని లక్షలు చాలు.

24 యూనియన్‌లు కూడా అక్కర్లేదు. కొంతమంది లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ తో కూడిన ఒక చిన్న క్రియేటివ్ టీమ్ చాలు. అర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ అదే టీమ్!

టీమ్ ఫోకస్ అంతా ఉండాల్సింది కాల్ షీట్ టైమింగ్స్, బేటాలు, డబుల్ బేటాలూ, యూనియన్ రూల్స్ పైన కాదు. సినిమా, సినిమా మీద తమకున్న ప్యాషన్ పైన.

అప్పుడు మాత్రమే .. మంచి సినిమా - అనుకున్న కథతో - అనుకున్న విధంగా తీయవచ్చు. రిలీజ్ చేయవచ్చు.

అవును. నమ్మటం కష్టం. కానీ నిజం. ఇప్పుడంతా డిజిటల్ యుగం.  ల్యాబ్ లూ, స్టూడియోలూ, ఫిల్మ్ నెగెటివ్ లూ, ప్రాసెసింగ్ లూ, పడిగాపులూ ... ఆ రోజులు పోయాయి.

మినిమమ్ 30 లక్షలు ఉంటే చాలు.  కేవలం 45 రొజుల్లో ఒక మంచి కమర్షియల్ సినిమా తీయవచ్చు. ఇంకో 45 రోజుల్లో .. మరొక 20 లక్షల ప్రమోషన్‌తో .. ఆ సినిమాని యే టెన్షన్ లేకుండా రిలీజ్ చేయవచ్చు.

మంచి కథతో, కథనంతో ప్రేక్షకులను ఒప్పిస్తే చాలు. సినిమాలు ఆడతాయి.

కోటి నుంచి 2 కోట్లవరకు బడ్జెట్ ఉంటే  మరీ మంచిది. ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే అవసరం అస్సలు రాదు.

ఏదయినా .. పిండికొద్దీ రొట్టె! బడ్జెట్ పెరిగినా కొద్దీ సినిమా రేంజ్ వేరేగా ఉంటుంది.  

నిజంగా ఒక చిన్న సినిమా ఆడిందంటే చాలు. ఓవర్‌నైట్‌లో థియేటర్‌ల సంఖ్య పెరిగిపోతుంది. బయ్యర్‌లు పోటీపడి సినిమా కొనుక్కుంటారు.  లాభం ఊహించనంతగా ఉంటుంది. కనీసం 100 మంది కొత్తవాళ్లకు బ్రతకడానికి పని దొరుకుతుంది. మరిన్ని మంచి అవకాశాలొస్తాయి.

మార్కెట్‌ను బాగా స్టడీ చేయడం, కంప్లీట్ క్రియేటివ్ ఫ్రీడమ్‌తో .. ముందు ప్లాన్ చేసుకున్న విధంగా, అనుకున్న బడ్జెట్‌లోనే  .. సినిమా తీయడం ముఖ్యం. కృష్ణా నగర్, గణపతి కాంప్లెక్సుల్లో పనిలేక తిరిగే పరాన్నజీవులు చెప్పే పనికిరాని మాటలు విని, ప్లాన్ నుంచి ఏ కొంచెం పక్కదారి పట్టినా అంతే సంగతులు.

అయితే - ఈ వాస్తవం ఎవరికైనా కేవలం అనుభవం మీద మాత్రమే తెలుస్తుంది.

కట్ టూ ఒక సంచలనం -       

2007 లో వచ్చిన 'పేరానార్మల్ యాక్టివిటీ' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనానికి నాంది పలికింది. అతి తక్కువ బడ్జెట్ లో తీసిన ఆ సినిమా 655,000% రిటర్న్స్ పొందింది!

అప్పటి నుంచీ, మనవాళ్లకు యెన్ని రకాలుగా చెప్పినా - యెన్ని వుదాహరణలతో చూపించినా - వినలేదు యెవరూ. చివరికి ఒక పేరున్న దర్శకుడు చేసి చూపించాకగానీ మనవాళ్లకు విషయం అర్థం కాలేదు.

ఇక ఇప్పుడంతా అదే దారి. డిజిటల్ ఫిలిం మేకింగ్ .. డిఎస్సెల్లార్  ఫిలిం మేకింగ్.

సో .. ఇప్పుడింక ఫిల్మ్ నెగెటివ్ అన్నదే లేదు. బాహుబలి అయినా సరే, బస్టాప్ అయినా సరే - ఫిల్మ్ మేకింగ్ అంతా డిజిటల్ లోనే! టెక్నాలజీ మొత్తం ఇప్పుడు డిజిటల్‌మయమైపోయింది.

కట్ టూ ఫిల్మ్ ఫాక్టరీ -

అంతా కొత్తవాళ్లు లేదా అప్‌కమింగ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లతో ఇప్పుడు నేను ఒక సీరీస్ ఆఫ్ సినిమాలను మైక్రో బడ్జెట్‌లో ప్లాన్ చేస్తున్నాను.

ఇదొక ప్యాషనేట్ ప్రాజెక్ట్.

ఒక్కో సినిమా బడ్జెట్ రేంజ్ 50 లక్షల నుంచి కోటి రూపాయలు మినిమమ్.

నిజంగా .. సినిమాల పైన, సినిమా బిజినెస్ పైన .. మొత్తంగా ఈ ఫీల్డు పైన ఆసక్తి, ప్యాషన్ ఉన్న .. కొత్త ప్రొడ్యూసర్లు / కో-ప్రొడ్యూసర్లు / మైక్రో ఇన్వెస్టర్లు మీ ఫోన్ నంబర్ ఇస్తూ, ఈమెయిల్ ద్వారా  నన్ను సంప్రదించవచ్చు. లేదా, మీ ఫోన్ నంబర్ తో నా ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టండి. మా ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వస్తుంది. లేదా నేనే ఫోన్ చేస్తాను.

ఇన్వెస్టర్-హీరోలు/హీరోయిన్లు/సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా నన్నుసంప్రదించవచ్చు. హీరో/హీరోయిన్/సపోర్టింగ్ ఆర్టిస్టు కావాలన్న మీ కల ఇలా కూడా నిజం అవుతుంది. మీ ఇన్వెస్ట్ మెంట్ కి బిజినెస్ లో షేర్ కూడా ఉంటుంది.

అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే - ఈ ప్రాజెక్ట్‌లో నాతో అసోసియేట్ కావడం ద్వారా, సినిమా బిజినెస్‌ను మీరు డైరెక్ట్‌గా తెలుసుకోవచ్చు.  ఇది అంతటా, అంత ట్రాన్స్‌పరెంట్‌గా సాధ్యమయ్యే పని కాదు. మరెన్నో లాభాలూ, కనీసం ఒక 20 చానెళ్లు కవర్ చేసే ప్రెస్ మీట్‌లు, ఊహించని ఓవర్ నైట్ ఫేమ్, పెద్ద రేంజ్ నెట్‌వర్క్, లైమ్ లైట్‌లో హడావిడీ .. ఇంకెన్నెన్నో ఉంటాయి.

ఇదొక షో బిజినెస్.

ఈ వైపు ఇష్టం ఉన్నవాళ్లు మాత్రమే ఇటు రావాలి. బిజినెస్ గా అయినా సరే, క్రియేటివ్ బిజినెస్ గా అయినా సరే. ప్యాషన్ ముఖ్యం. అనుకున్నది ఏదయినా సరే చేయాలన్న గట్స్ ముఖ్యం.

ఫేమ్, డబ్బూ .. వద్దన్నా అవే ఫాలో అవుతాయి ..

email: manutimemedia@gmail.com

Wednesday, 15 July 2015

స్విమ్మింగ్‌పూల్ లో సత్తెన్న ఎలా మిస్ అయ్యాడు?

స్విమ్మింగ్‌పూల్‌లో - రెండు సీన్‌లలో - హీరోహీరోయిన్లతో కనెక్ట్ అయ్యే ఒక ముఖ్యమయిన పాత్రకు  సత్తెన్నను అనుకున్నాం.

అన్న ఆఫీస్‌కు వచ్చాడు.

హాయిగా మాట్లాడుకున్నాం. అంతా ఓకే అనుకున్నాం. షూటింగ్‌కు ఒక్క రోజు ముందు మాత్రం చెప్తాను. రావాలని చెప్పాను. సత్తెన్న ఓకే అన్నాడు.

కానీ ఆ తర్వాత పొరపాటు నావైపునుంచే జరిగింది. సత్తెన్న విషయంలో.

మా ప్రాజెక్ట్ అసలే ఒక మైక్రో బడ్జెట్ ఫిలిమ్. షూటింగ్ అంతా ఒక మాదిరి గెరిల్లా ఫిలిం మేకింగ్‌లా జరిగింది. ఒక టైమ్ అంటూ లేదు. మొత్తం 40 రోజుల షూటింగ్‌ను - డే అండ్ నైట్ కష్టపడి - కేవలం 13 రోజుల్లో పూర్తిచేశాం. ఎలాంటి ప్యాచ్ వర్క్ కూడా బ్యాలెన్స్ లేకుండా!

అంత 'అన్‌ట్రెడిషనల్‌' గా వెళ్లాం .. ఫిలిం మేకింగ్ కు సంబంధించి. కాల్‌షీట్స్, హాలిడేస్ .. అవన్నీ ఏం లేవు. మొత్తం 24 క్రాఫ్ట్స్ అనబడే వాటిల్లో సగానికిపైగా అన్నీ మేమే చేసేసుకున్నాం.

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే - చివరికి మా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో కూడా అంతా కొత్తవాళ్లే. నేను వాళ్లకు ఏదయినా చెప్పి చేయించుకోవాలితప్ప, వాళ్లు నాకు ఏదయినా గుర్తు చేసి, అలర్ట్ చేసే అనుభవం వారికి లేదు.

బాయ్-టూ-అసిస్టెంట్ డైరెక్టర్-టూ-ప్రొడక్షన్ మేనేజర్-టూ-డైరెక్టర్ .. అన్నీ నేనే.

ప్రొడ్యూసర్ అరుణ్ గారు కూడా ఫీల్డుకి కొత్త కాబట్టి, పూర్తి స్థాయిలో ఇండియాలో ఉండరు కాబట్టి .. ఆయనవైపు చాలా చాలా పనులు కూడా నేనే ఫాలో అప్ చేసుకోవాల్సి వచ్చేది.

ఇలాంటి సిచువేషన్‌లో .. అది చివరి రోజు షూటింగ్ .. ఒక లొకేషన్‌లో.

అక్కడ, ఆరోజు .. సత్తెన్న రావాలి.

ముందురోజే ప్రోగ్రాం చెప్పాల్సింది. మర్చిపోయాం.

ఆ రోజు కాల్ చేస్తే - అప్పటికే అన్న వేరే చాలా చాలా ముఖ్యమయిన పర్సనల్ పనిలో బిజీ అయిపోయి ఉన్నాడు. రావడానికి ఏమాత్రం వీలు లేదు.

సారీ చెప్పాను. తర్వాత ఇంకో మైక్రో బడ్జెట్ ప్రాజెక్టు వెంటనే ఉంది. ఈ సారి ఇలాంటి పొరపాటు జరగదు అని చెప్పాను. అన్న "నో ఇష్యూస్" అంటూ అర్థం చేసుకున్నాడు. మంచి మనసుతో మొన్నటి మా ఆడియో లాంచ్ ఫంక్షన్‌కు కూడా వచ్చాడు.

దటీజ్ సత్తెన్న!

Saturday, 11 July 2015

ఇక రుద్రమదేవి!

బాహుబలి హడావిడి అయిపోయింది.

ఇప్పటివరకూ ఇండస్ట్రీ చరిత్రలో ఎన్నడూ, ఏ సినిమాకూ లేని స్థాయిలో - దాదాపు ఒక మాఫియా రేంజ్‌లో - బ్లాక్ టికెట్‌ల మార్కెటింగ్ రికార్డులు తిరగరాసిందీ సినిమా.

వాట్ నెక్స్‌ట్?

రుద్రమదేవి.

13వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన ఈ రాణి రుద్రమదేవి కథను ఎప్పుడో తను చిన్నప్పుడు నాన్-డిటైల్‌డ్ పుస్తకంలో చదివిన ఇన్‌స్పిరేషన్‌తో ఈ మహా యజ్ఞాన్ని గుణశేఖర్ తలపెట్టాడంటే .. ఆయనకు రియల్లీ హాట్సాఫ్!

ఆర్థికంగా ఎంతో రిస్క్ తీసుకొని, తానే ప్రొడ్యూసర్ కూడా అయి, కేవలం తన ప్యాషన్ కోసం, రుద్రమదేవి చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించాడు గుణశేఖర్. ఈ సినిమా ఆడియోను కూడా వరంగల్‌లో అత్యంత భారీగా జరిపాడు. అయితే - బాహుబలికి ముందే రిలీజ్ కావల్సిన రుద్రమదేవి చిత్రం ఏవో సాంకేతిక కారణాలవల్ల వాయిదా పడింది.

కట్ టూ స్పాట్ - 

"అంతా మనమంచికే" అన్నది అన్నిసార్లూ నిజం కాదు. కాని, రుద్రమదేవి విషయంలో అది నిజమే అనిపిస్తుంది.

ఆలస్యం అయితే అయింది. తీసుకోవల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొని, రుద్రమదేవి రిలీజ్ కోసం - ఓ మంచి డేట్‌కు గుణశేఖర్ ఇప్పుడు స్పాట్ పెట్టొచ్చు. పెట్టిన ఆ స్పాట్ మళ్లీ మారకుండా ఉండటం చాలా ముఖ్యం.

సుమారు 80 కోట్ల బడ్జెట్‌తో - దర్శక నిర్మాతగా కత్తిమీద సాము చేస్తూ - అనుష్క హీరోయిన్‌గా గుణశేఖర్ రూపొందించిన రుద్రమదేవి ఆయనకు భారీ సక్సెస్‌ను సాధించిపెట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

Thursday, 9 July 2015

రేపే బాహుబలి!

ఈ పిచ్చిని సైకాలజీలో "మాస్ హిస్టీరియా" అంటారన్నట్టు ఎక్కడో చదివాను.

నో డౌట్ .. ఇప్పటివరకు దేశంలో ఏ సినిమాకూ పెట్టనంత బడ్జెట్‌తో ఈ సినిమాని తీశారు. సుమారు రెండున్నరేళ్లపాటు వందలాదిమంది కష్టపడ్డారు. ఎన్నో రిలీజ్ డేట్స్ మార్పు తర్వాత, చివరికి రేపు సినిమా రిలీజవుతోంది.

ఎంతో ఎంతో హైప్ మధ్య!

తెలుగు, హిందీ, తమిళం, మళయాళంతో పాటు .. మొత్తం ఓ పది భాషల్లో - ప్రపంచవ్యాప్తంగా సుమారు నాలుగున్నరవేల థియేటర్స్‌లో రిలీజవుతున్నట్టు విన్నాను.

180 కోట్లు అని కొందరంటారు. 280 కోట్లు అని మరికొందరంటారు. మొత్తానికి బాగానే పెట్టారు.

కట్ టూ ప్రి-రిలీజ్ స్పాయిలర్స్ - 

మధ్యాహ్నం తర్వాత, ఇవాళ ఒక స్టూడియోలో ఓ చిన్న యాడ్ పనిమీద వెయిట్ చేస్తూ ఉన్నపుడు - నా మొబైల్ తీసి, అలా కాసేపు బ్రౌజ్ చేశాను.

ఎవరో లేడీ 2/5 పాయింట్స్ ఇస్తూ, బాహుబలికి అంత సీన్ లేదంటూ బాంబు పేల్చింది. అది యు ఎ ఇ నుంచి.

తర్వాత - యాక్చువల్‌గా రేపు విడుదల కాబోతున్న బాహుబలి మీద వరసపెట్టి ఎన్నెన్ని న్యూస్‌లు, వ్యూస్‌లు  చెప్పనక్కర్లేదు.

సైమన్ బర్చ్ కాపీ అంటూ రెండు పోస్టర్లను కంపేర్ చేస్తూ ఆన్‌లైన్‌లో వందలాది పిక్స్ పెట్టారు. వాటిల్లో ఒకదాన్ని నేనిక్కడ బ్లాగ్‌లో పెట్టాను.

కన్నడలో డాక్టర్ రాజ్‌కుమార్ 'మయూర' సినిమాకు కాపీ ఈ బాహుబలి అని కూడా వార్తలున్నాయి ఆన్‌లైన్‌లో. కొంతమంది వీరాభిమానులు - అసలు బాహుబలి షో అంటూ ఇంకా పడనే లేదు .. ఇదంతా ఫేక్ అంటున్నారు.

ఒక్క సెన్సార్‌కు మాత్రమే చూపించారట. వాళ్లు కూడా పూర్తిస్థాయి సినిమా చూళ్లేదట .. సెన్సార్ వాళ్లకు చూపించినప్పుడు  బ్యాక్‌గ్రౌండ్ ఏదో ఉండదట!!

ఇంతకంటే విచిత్రం ఇంకేముండదు.

థియేటర్‌లో ప్రేక్షకులు ఏ సినిమానయితే చూస్తారో, ఇంక మార్పులు, చేర్పులు ఉండని ఆ ఫైనల్ కాపీనే సెన్సార్ వారికిచ్చి సెన్సార్ చేయించుకుంటారన్నది కామన్‌సెన్స్! ఈ మాత్రం తెలవకుండా ఏవో వెర్రివెంగళప్ప రాతలు ఎందుకు రాస్తారో అర్థం కాదు.

ఏది ఏమయినా - రేపు రిలీజ్ కాబోతున్న బాహుబలి - అన్ని కోట్లు పెట్టి, అన్ని రోజులు పనిచేసి, ఎంతో హైప్ చేసిన రేంజ్‌లో .. సక్సెస్ సాధించాలని ఆశిద్దాం.

బెస్టాఫ్ లక్, రాజమౌళి అండ్ టీమ్!  

Wednesday, 8 July 2015

యు కె లో స్విమ్మింగ్‌పూల్ సెన్సార్!

స్విమ్మింగ్‌పూల్ సినిమాను మన తెలంగాణ, ఎ పి, లతో పాటు - ఎబ్రాడ్‌లో యు కె, యూరోప్, అమెరికాల్లో కూడా ఏకకాలంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి.

అమెరికాలో కనీసం ఒక ఐదు ముఖ్యమయిన సెంటర్లలో రిలీజ్‌కు ఏర్పాట్లు ఎప్పుడో జరిగిపోయాయి.

యు కె, యూరోప్‌ల్లో స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ ఏర్పాట్లను ప్రొడ్యూసర్ అరుణ్‌కుమార్ ముప్పన తన స్వంత డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన శ్రీ శ్రీ ఇంటర్నేషనల్ ద్వారా స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నారు.

సో, ఇక్కడి రిలీజ్ డేట్స్‌తో పాటు ఎబ్రాడ్‌లో కూడా రిలీజ్ డేట్స్ కుదరాలి కాబట్టి, స్విమ్మింగ్‌పూల్ రిలీజ్‌కు ఇంకొన్ని వారాల సమయం పట్టవచ్చు.

కట్ టూ బ్లాక్ కార్డ్ -  

యు కె లో స్విమ్మింగ్‌పూల్ సెన్సార్ మొన్ననే పూర్తయింది. మన దగ్గర సెన్సార్ పూర్తయ్యాక ఇచ్చే సెన్సార్ "సర్టిఫికేట్‌"నే అక్కడ యు కె లో "బ్లాక్ కార్డ్" అంటారు.

ఈ బ్లాగ్ పోస్ట్‌లో మీరు చూస్తున్న ఫోటో అదే. యు కె లో స్విమ్మింగ్‌పూల్ ప్రదర్శన కోసం ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ అన్నమాట. దీని ప్రకారం 12 సంవత్సరాలు దాటిన ఎవరైనా ఈ సినిమాను చూడొచ్చు అని బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిలిం క్లాసిఫికేషన్ (BBFC) సర్టిఫికేట్ ఇచ్చింది.

సినిమా జోనర్ హారర్ అయితే చాలు .. ఇదే సినిమాకు మన దగ్గర సెన్సార్ రూల్స్ ప్రకారం - అందులో ఏం ఉన్నా, లేకపోయినా - మనకు వాళ్లిచ్చేది మాత్రం 'ఎ' సర్టిఫికేట్!  

Monday, 6 July 2015

చచ్చే హక్కు కూడా ఉంది!

చివర్లో ఒక పంచ్ ఉంది. ఆ పంచ్ వేయడానికి ఈ న్యూస్ ఐటమ్ చాలా సూటబుల్ అనిపించి రాస్తున్నాను.

కట్ టూ చచ్చే హక్కు -   

చచ్చే హక్కునే ఇంగ్లిష్‌లో "రైట్ టు ఎండ్ లైఫ్" అంటారు.

రాత్రి ఏదో చూస్తుంటే, నెట్‌లో ఈ న్యూస్ ఐటమ్ కనిపించింది. ముందు ఇదేదో టిట్‌బిట్‌లా అనిపించింది. న్యూస్ చదివిన తర్వాత గాని విషయం అర్థం కాలేదు.

బెల్జియంలో దీన్ని ఏకంగా చట్టబధ్ధం చేసేశారేప్పుడో.

"నాకు లైఫ్ మీద విరక్తి కలిగింది. ఇంక నాకు బ్రతకాలని లేదు. చచ్చిపోతాను" అని పిటిషన్ పెట్టుకుంటే చాలు. అన్నీ జాగ్రత్తగా స్టడీ చేసి, అంతా ఓకే అనుకుంటే, అక్కడి కోర్టు కూడా ఓకే చెప్పేస్తుంది.

ఇలాంటి సైకోలు, డిప్రెషనిస్టులు, యూతనేషియా బాధితులు ఎవరో ఒక్కరో ఇద్దరో ఉంటారు కావొచ్చు అనుకోడానికి లేదు. బెల్జియంలో సంవత్సరానికి సగటున ఓ 1500 మంది ఇలా కోరి చచ్చిపోతున్నారు!

కట్ టూ లారా - 

లారా వయస్సు ఇరవై నాలుగు.

లేటెస్టుగా బెల్జియంలో చట్టప్రకారం చావడానికి అనుమతి పొందిన ఈ యువతి .. డిప్రెషన్‌ను ఇంక తట్టుకోలేనని డిసైడయిపోయింది. తనకు తానే చావడానికి అఫీషియల్‌గా అనుమతి పొందింది. అక్కడి సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు ఏం చేస్తున్నారో తెలీదుగాని - లారా మాత్రం తన "దహన సంస్కారాలు" ఎలా జరగాలో ప్లాన్ చేసుకుంటోంది కూల్‌గా!

ఇలాంటి హక్కేదో ఉందని - ఇక్కడ మనదగ్గర .. 'ఏమీ చేయడం చేతగాక, పక్కోడిని కెలుకుతూ టైమ్ పాస్ చేసే' ప్రపంచస్థాయి మేధావులు కొందరికి తెలిస్తే బావుండు! దాని కోసం పోరాడితే ఇంకా బాగుండు!!

Tuesday, 30 June 2015

క్రిమినల్స్, స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ ఒక్కసారేనా?!

నిన్న ఫేస్‌బుక్ లో చూశాను. క్రిమినల్స్ రిలీజ్ ఎప్పుడు అని ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు "జూలై నెలాఖరుకు ఉంటుంది .. బిఫోర్ మై బర్త్‌డే" అని చెప్పాడు అఖిల్ కార్తీక్.

అఖిల్ కార్తీక్ బర్త్‌డే జూలై 30. అంటే, ఆలోపే క్రిమినల్స్ రిలీజ్ ఉంటుందన్నమాట!

కొంచెం అటూఇటూగా స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ కూడా అప్పుడే ఉండే అవకాశం ఉంది.

స్విమ్మింగ్‌పూల్ సినిమాను తెలుగుతోపాటు తమిళంలో కూడా ఒకేసారి రిలీజ్ చేసే దిశలో చర్చలు ప్రస్తుతం చివరి స్టేజ్ లో ఉన్నాయి. అది కూడా ఉన్నట్టయితే - తమిళంలో డబ్బింగ్, సెన్సార్ పనులు కొంచెం వేగంగానే చేయాల్సి ఉంటుంది.

ఎబ్రాడ్ రిలీజ్ గురించి ఏర్పాట్లు ఆల్రెడీ చేసి ఉన్నాం కాబట్టి, ఆ వైపు పెద్ద ఇబ్బంది లేదు. అసలు ఇబ్బందంతా ఇక్కడే.

ఇక్కడ ఏదీ ష్యూర్ కాదు!

రాజకీయంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినా - మొత్తం సినిమా ఇండస్ట్రీ లావాదేవీల్లో, సిస్టమ్‌లో మాత్రం సెంటీమీటర్ మార్పులేదు.

కొన్ని పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో బోలెడంత కన్‌ఫ్యూజన్, అస్పష్టతల కారణంగా - చిన్న సినిమాల రిలీజ్ అనేది ఒక పెద్ద తలనొప్పి వ్యవహారమై కూర్చుంది. వారానికి ఏకంగా అయిదారు చిన్న సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. పోతున్నాయి.

స్విమ్మింగ్‌పూల్ విషయంలో అలా జరగకూడదన్నదే నా ప్రయత్నం.

కట్ టూ కార్తీక్ బర్త్‌డే - 

నిషా కొఠారి జంటగా ఓషో తులసీరాం డైరెక్షన్‌లో రూపొందిన క్రిమినల్స్ అఖిల్ కార్తీక్ కు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.

ఇక స్విమ్మింగ్‌పూల్ విషయానికొస్తే - ఈ జూలై 30 కి తన బర్త్‌డే జరుపుకోబోతున్న అఖిల్ కార్తీక్ కెరీర్‌లో ఇప్పటివరకూ ఏ సినిమాకూ రానంతటి ఫోకస్ స్విమ్మింగ్‌పూల్ ద్వారా లభించింది. అంతే కాదు .. ఇండస్ట్రీలోని చాలామంది ఈ సినిమా కదలికలను గమనిస్తున్నారు. ఇది ఖచ్చితంగా మైక్రో బడ్జెట్ ఫిలిమ్ మేకింగ్‌లో మేము సాధించిన తొలి విజయం.

నిజంగా ఈ రెండు సినిమాలూ అఖిల్ కార్తీక్ బర్ట్‌డే సందర్భంగా రిలీజ్ అయినట్లయితే .. అంతకంటే పెద్ద బర్త్‌డే గిఫ్ట్ అఖిల్ కార్తీక్ కు ఇంకేముంటుంది?   

Saturday, 27 June 2015

స్విమ్మింగ్‌పూల్ లో బ్రాహ్మిణి, ది బ్యూటిఫుల్!

ఎస్ఆర్‌నగర్ కాఫీడే లో అనుకుంటాను .. నాకు బ్రాహ్మిణి ఫస్ట్ టైమ్ కలిసింది.

తన ఫస్ట్ అపియరెన్స్ నాకెందుకో అప్పుడు 'ది బెస్ట్' అనిపించింది. జీన్స్, టీషర్ట్‌లో ఉన్న బ్రాహ్మిణి 'చూపు'లోనే ఉండాల్సింది అంతా ఉందనిపించింది నాకా క్షణం.

బ్రాహ్మిణిని నాకు పరిచయం చేసింది షాని. నా మొదటి సినిమా "కల"కు కోరియోగ్రాఫర్‌గా పనిచేసిన నిక్సన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నప్పట్నుంచీ షాని నాకు పరిచయం. ఇప్పుడు షాని హీరో కూడా అయ్యాడు.

షానితోనూ, బ్రాహ్మిణితోనూ నేను అక్కడే, అప్పుడే, అదే కాఫీడేలో చెప్పాను.

స్విమ్మింగ్‌పూల్ లో బ్రాహ్మిణిని తీసుకుంటున్నానని!

అప్పుడే ఇంకో విషయం కూడా చెప్పాను బ్రాహ్మిణికి - కొంచెం కష్టపడితే తను హీరోయిన్ కావడం కూడా ఏ మాత్రం కష్టం కాదని.

నేను చెప్పినట్టు, స్విమ్మింగ్‌పూల్ తర్వాత ఇప్పుడు రెండు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా చేస్తోంది బ్రాహ్మిణి. ఎంత బిజీ అయిపోయిందంటే .. ఇప్పుడు నాకు కాల్ చేయడానికి కూడా బ్రాహ్మిణికి టైమ్ దొరకట్లేదు! ;)

కట్ టూ స్విమ్మింగ్‌పూల్ - 

నేను ఆరోజు కాఫీడేలో ప్రామిస్ చేసినట్టుగానే బ్రాహ్మిణికి స్విమ్మింగ్‌పూల్ లో ఓ మాంచి ఎట్రాక్టివ్ అండ్ పవర్‌ఫుల్ రోల్ ఇచ్చాను. తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది.

ఎంత బాగా యాక్ట్ చేసిందంటే, మా మురుంకర్ సార్ కూడా "హర్ ఐస్ స్పీక్ ఎ లాట్!" అని బ్రాహ్మిణిని తెగ మెచ్చుకుంటారు. అన్నీ దాదాపు సింగిల్ టేక్సే!

కాకపోతే, మా టీమ్ మొత్తంలో అప్పుడు "లేట్ గాల్" గా బాగా పాపులర్ అయ్యింది కూడా తనొక్కతే! ;)

ఇప్పుడు బహుశా ఆ అలవాటుకు గుడ్ బై చెప్పేవుంటుంది బ్రాహ్మిణి. ఈ ఒక్క అలవాటు మర్చిపోతే, బ్రాహ్మిణి ఇంకా ఇంకా బిజీ అవుతుంది. అవ్వాలని ఆశిస్తున్నాను.  

Thursday, 25 June 2015

స్విమ్మింగ్‌పూల్ .. తర్వాత!?

అయితే పాండిచ్చేరి, లేదంటే గోవా. ఈ రెండు లొకేషన్లలో ఏదో ఒక చోట నా తర్వాతి సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తున్నాను.

ఇంతకూ కథేంటి?

థ్రిల్లర్ కావొచ్చు. హారర్ మాత్రం కాదు. ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్‌లా ఉండేలా లొకేషన్స్‌ను మనసులో ఆల్రెడీ ఫిక్స్ చేసేసుకున్నాను.

ఈసారి మూడు కెమెరాలుంటాయి.

ఒకటి రెండు చిన్న ఫిలిం రిలేటెడ్ కమిట్‌మెంట్‌లున్నాయి. అవి తొందరగా క్లియర్ చేసుకున్నాను అంటే - ఇంక నాకు సినిమా తీయడానికి అంత బడ్జెట్స్ కూడా అవసరం లేదు.

అంతా వన్ మాన్ ఫిలిం మేకింగ్! ఇప్పుడు ప్రపంచమంతా, ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్‌లో ఇదే చాలా వోగ్‌లో ఉంది.

కట్ టూ షూటింగ్ - 

స్విమ్మింగ్‌పూల్‌తో పోలిస్తే మరింత తక్కువ బడ్జెట్‌లో చేసే ఈ సినిమా షూటింగ్ కూడా సింగిల్ షెడ్యూల్ లోనే పూర్తవుతుంది. మరిన్ని తక్కువ డేస్‌లో షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నాను.

తప్పదు. లేటెస్ట్ ఫిలిం మేకింగ్ టెక్నాలజీని, మనకున్న తక్కువ బడ్జెట్‌లోనే, మనం మరింత బాగా ఉపయోగించుకోగలగాలి. ఈ దిశలో మనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి.

దానికోసమే ఇంత శ్రమ. ఇంత ఓపిక. ఇంత కూల్‌గా!    

Tuesday, 23 June 2015

స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ ఇంకా .. ఎప్పుడు?

బడ్జెట్, ఎన్నుకున్న సబ్జెక్ట్, క్రియేటివ్ ఫ్రీడమ్ .. ఒక భాగం. ప్రమోషన్, రిలీజ్ టైమింగ్, దొరికే థియేటర్‌ల స్థాయి .. మరో భాగం.

ఒక సినిమా జయాపజయాల్ని శాసించేవి, నిర్ణయించేవి ఇవేనని నా ఉద్దేశ్యం.

వీటిలో - మొదటి భాగంలో మేము పూర్తిగా సక్సెస్ సాధించాము. ఇప్పుడిక అదే ఊపుతో రెండో భాగం కూడా పూర్తిచేసే పనిలో ఉన్నాము.

కట్ టూ స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ డేట్ -  

మా గెరిల్లా టీమ్ ఎంతో బాగా కష్టపడి రూపొందించిన స్విమ్మింగ్‌పూల్ సినిమాను 'ఏదో అలా' రిలీజ్ చేయడం నాకిష్టం లేదు. మా హీరోకి, ప్రొడ్యూసర్‌కి, మొత్తంగా .. మా టీమ్ అందరికీ కూడా ఇది ఏ మాత్రం ఇష్టం లేదు.

ఇప్పటి మా అంచనా ప్రకారం స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ జూలై చివర్లో ఉండొచ్చు. ఎందుకింత లేటు అంటే .. కారణాలు చాలా ఉన్నాయి.

యు కె లో స్విమ్మింగ్‌పూల్ సెన్సార్ ఈవారంలో పూర్తవుతోంది.

యు ఎస్, యు కె, యూరప్‌ల్లో ఎబ్రాడ్ రిలీజ్‌తోపాటు - ఈలోగా, ఏకకాలంలో స్విమ్మింగ్‌పూల్‌ను తెలుగుతోపాటు తమిళంలో కూడా రిలీజ్ చేసే బిజినెస్ వ్యవహారాలు ఫుల్‌స్వింగ్‌లో ఉన్నాయి.

ఇవన్నీ ఇలా నడుస్తుండగానే, స్విమ్మింగ్‌పూల్ రిలీజ్‌కు ముందే నా కొత్త సినిమా కూడా ప్రారంభం కావాలి.
ఆ పనిలోకూడా చాలా చాలా బిజీగా ఉన్నాన్నేను.

Sunday, 21 June 2015

ఒక జ్ఞాపకం!

కొన్ని నేరాలు క్షమించరానివి. అలాంటి నేరం నేను చేశాను.

మా నాన్న విషయంలో.

అలాంటి నేరం చెయ్యాల్సిన చక్రవ్యూహంలో చిక్కుకుపోయాను. నిస్సహాయంగా. అలాగని ఏ చట్టమో, ఇంకెవరో కాదు నన్ను క్షమించాల్సింది.

నన్ను నేనే క్షమించుకోవాలి. కానీ, ఇప్పటికీ, ఎప్పటికీ .. నన్ను నేను క్షమించుకోలేను. క్షమించమని ఆయనను అడగలేను.

ఆయనకు అందరికంటే ఇష్టమైన కొడుకును నేనే. వృధ్ధాప్యంలో ఆయనకు అవసరానికి ఏ లోటూ జరక్కుండా అన్నివిధాలా చూసుకున్నదీ నేనే.

కానీ, ఆయన చివరి రోజుల్లో మాత్రం ఆయనకు దగ్గరగా ఉండలేకపోయాను. ఇదే నేను చేసిన నేరం.

కారణం ఏదయినా కావొచ్చు. ఎంత బలమైందయినా కావచ్చు. జరిగిన వాస్తవం మాత్రం ఇదే.

ఆయన కొనుక్కున్న శంకర్‌నారాయణ్ ఇంగ్లిష్ డిక్షనరీని, గ్రామర్ పుస్తకాల్నీ, ఇంకెన్నో పుస్తకాల్నీ నా చిన్నతనంలో ఎన్ని వందలసార్లు తిరగేశానో నాకింకా గుర్తు. ఆయన నాకు, నేను ఆయనకు .. మేమిద్దరం రాసుకున్న వందలాది ఉత్తరాలు ఒక రికార్డు. ఒక అద్భుత అనుభూతి.

స్కూలుకెళ్ళి ఏం చదువుకోకపోయినా ఆయన అలవోకగా వందలాది ఉత్తరాలు రాశాడు. ఎలాంటి సంకోచం లేకుండా ఇంగ్లిష్, హిందీ, మరాఠీ మాట్లాడాడు. రాశాడు. అది ఆయన స్వయంకృషి.

ఆయన ఎందరికో సహాయం చేశాడు కానీ, ఎవ్వరి సహాయం తీసుకోలేదు.

ఆయన జ్ఞాపకాల్ని కూడా క్రమంగా మర్చిపోతానేమో .. ఈ పనికిరాని నగర జీవనశైలిలో ఇంకా ఇంకా మునిగిపోయి. మరింతగా కూరుకుపోయి.

అది జరక్కూడదు. ఆయన జ్ఞాపకాల్ని నేను మర్చిపోకూడదు.

ఆయన మా నాయిన.

నాయినా!

నాకిప్పుడు ఏ హిపోక్రసీలూ లేవు, ఎవరో ఏదో అనుకుంటారన్న ఇన్‌హిబిషన్స్ కూడా లేవు. నేను కోల్పోయిన స్వతంత్రాన్ని తిరిగి వెంటనే పొందేలా నన్ను ఆశీర్వదించు నాయినా...

Wednesday, 17 June 2015

'యువత' రుద్రాక్ష్ @ స్విమ్మింగ్‌పూల్!

"నేను చనిపోయిన తర్వాత కూడా బ్రతకాలంటే ఎలా?"

ఈ రొటీన్ చదువులు, ఉద్యోగాలు కాదు. ఇంకేదో చెయ్యాలి, ఇంకేదో కావాలి అన్న ఆలోచనలోంచి పుట్టిందా ప్రశ్న.

ఆలోచిస్తే కళ్లముందు మూడే మూడు ఫీల్డులు కనిపించాయి - క్రికెట్, సినిమా, రాజకీయాలు. ఈ మూడిట్లో మొదటిది, చివరిది మనకు కష్టం అనుకొని సినిమాను ఎన్నుకున్నాడో యువకుడు.

అతనే రుద్రాక్ష్.

పుట్టింది వరంగల్ జిల్లా, జనగాం దగ్గరలోని ఒక ఊళ్లో అయినా - పెరిగిందీ, డిగ్రీదాకా చదివిందీ మాత్రం మహారాష్ట్రలోని భీవండీలో.

కట్ చేస్తే -

భీవండీ-టూ-ముంబై చాలా దగ్గర. ఫస్ట్ స్టెప్ అంటూ ఒకటి వెయ్యాలి కాబట్టి - వెంటనే ముంబైలోని ఓ ఫోటోగ్రాఫర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరిపోయాడు రుద్రాక్ష్.

అదీ ప్రారంభం.

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే సినిమా కష్టాలు మొదలయ్యాయి రుద్రాక్ష్‌కు. ఓ రోజు టికెట్ లేకుండానే ముంబై నుంచి ట్రెయిన్‌లో ఇంటికి బయలుదేరాల్సి వచ్చింది. రుద్రాక్ష్ జీవితంలో అదే ఒక పెద్ద ట్విస్ట్‌కి కారణమయింది.

ఆ రోజు టికెట్ లేని ప్రయాణం సందర్భంగా కలిసిన ఓ మిత్రుడు, హైద్రాబాద్‌లో ఉన్న అనిల్ అనే ఓ పబ్లిసిటీ డిజైనర్‌కు రుద్రాక్ష్‌ను కనెక్ట్ చేశాడు.

అంతే. చేతిలో అల్ఫా సూట్‌కేస్‌తో హైద్రాబాద్‌లో దిగిపోయాడు రుద్రాక్ష్.

కట్ చేస్తే -

ఫ్రెండ్ రూంలో షెల్టర్. పబ్లిసిటీ డిజైనర్ ఆఫీస్‌లో పరిచయాలు. రామానంద్ గారి దగ్గర నటనలో శిక్షణ ..

తనతోపాటు నటనలో శిక్షణ పొందుతున్న ఓ కుర్రాడి ఫోటో షూట్ కోసం బంజారాహిల్స్‌లో ఉన్న ఓ ఫోటోస్టూడియోకు వెళినప్పుడు, అక్కడ  రుద్రాక్ష్‌కు ఓ ఫోటోగ్రాఫర్ పరిచయమయ్యాడు. అప్పటి ఆ ఫోటోగ్రాఫర్ మరెవరోకాదు. ఇప్పటి హీరో కృష్ణుడు!

ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. తనకు సంబంధించిన మంచిచెడులన్నింటినీ నిస్సంకోచంగా "గురూజీ" అంటూ కృష్ణుడి దగ్గర షేర్ చేసుకుంటాడు రుద్రాక్ష్. అదీ వారిద్దరి స్నేహం.

కట్ చేస్తే -

నెట్ వర్క్ .. పరిచయాలు .. వేట ..

అన్నీ ఒక్క ఛాన్స్ కోసం. ఒకే ఒక్క ఛాన్స్ కోసం.

చివరికెలాగో ఆర్టిస్ట్‌గా ఫస్ట్ ఛాన్స్ కొట్టేశాడు రుద్రాక్ష్. ఆ సినిమా పేరు "రిలాక్స్". తర్వాత హైద్రాబాద్ నవాబ్స్, ఎఫ్ ఎమ్, బొమ్మరిల్లు, పరుగు వంటి సినిమాల్లో యాక్ట్ చేశాడు. పరిచయాలు పెరిగాయి.

తను పరుగు చిత్రంలో యాక్ట్ చేస్తున్నపుడు, ఆ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన బుజ్జి (పరశురామ్) తన డెబ్యూ సినిమా "యువత" లో రుద్రాక్ష్‌కు అద్భుతమైన రోల్ ఇచ్చాడు. తర్వాత మధుర శ్రీధర్ బ్యాక్ బెంచ్ స్టుడెంట్, ఆర్ జి వి రక్తచరిత్ర సినిమాల్లో కూడా మంచి రోల్స్‌లో నటించాడు రుద్రాక్ష్.

"నీలో ఓ 30 శాతం రఘువరన్ ఉన్నాడు" అని మధుర శ్రీధర్ మెచ్చుకోవడం; రక్తచరిత్రలోని ఒక సీన్లో తన నటనను చూసి, షాట్ అయిపోగానే ఆర్ జి వి తనని హగ్ చేసుకోవడం ఒక ఆర్టిస్టుగా రుద్రాక్ష్ మర్చిపోలేని అనుభూతులు.

"మళ్లీ మళ్లీ ఇది రాని రోజు" దర్శకుడు క్రాంతిమాధవ్ కూడా రుద్రాక్ష్‌కు మంచి మిత్రుడు. "నీ అసలు లక్ష్యం మర్చిపోతున్నావేమో చూడు!" అని ఒకసారి క్రాంతిమాధవ్ రిమైండ్ చేయడంతో మళ్లీ ఆలోచనలో పడిపోయాడు రుద్రాక్ష్.

కట్ చేస్తే - 

వెంకట్ గోపు డైరెక్షన్‌లో ఇప్పుడు హీరోగా తన తొలి చిత్రం "మనీప్లాంట్" లో నటిస్తున్నాడు రుద్రాక్ష్. ఒక షెడ్యూల్ పూర్తయింది కూడా.

హీరోగా తన షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కావడానికి కేవలం కొద్దిరోజుల ముందు - ది సేమ్ రుద్రాక్ష్, "స్విమ్మింగ్‌పూల్"లో ఓ ప్రత్యేకమైన రోల్‌లో నటించడం విశేషం!  

Wednesday, 10 June 2015

స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ ఎప్పుడు?

ఒక ప్యాషనేట్ టీమ్‌గా - ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో నుంచి ఆఫీస్ బాయ్ వరకు - ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి రూపొందించిన స్విమ్మింగ్‌పూల్ సినిమా రిలీజ్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. నో డౌట్.

వచ్చే ఒకటి రెండు వారాల్లో, ప్రతివారం, వరసపెట్టి ఒక అరడజన్ చొప్పున సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్క సినిమాకు కూడా తగినన్ని థియేటర్లు దొరకవు. మంచి థియేటర్లు దొరికే అవకాశం అసలు లేదు.

మరో విషయం ఏంటంటే - థియేటర్ల విషయంలో కొంత కాంప్రమైజ్ అయి రిలీజ్ చేద్దామనుకున్నా, ఇలా ఒకే వారం అయిదారు చిత్రాల మందలో రిలీజ్ చేయడం వల్ల, అసలు సినిమా వచ్చిందీ పోయిందీ తెలియకుండాపోయే ప్రమాదం చాలా ఉంది.

అంత హడావిడి, అంత రిస్క్ మాకు అవసరం లేదనిపించింది.

మరోవైపు .. యు ఎస్, యు కె, యూరోప్‌ల్లో కూడా వర్‌ల్డ్‌వైడ్ ఏకకాలంలో రిలీజ్ అయ్యేలా ఈ సినిమాను ప్లాన్ చేశాం. ఎబ్రాడ్‌లో ఒక డేట్‌కి రిలీజ్ కోసం అగ్రిమెంట్స్ అయిపోయాయంటే అంతే. ఇక్కడిలా మన ఇష్టం వచ్చినట్టు డేట్లు మార్చుకొనే అవకాశం అక్కడ ఏ మాత్రం ఉండదు.

సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాము.

ఇప్పటివరకూ సినిమాను ఎంత ప్లాన్‌డ్‌గా మేం అనుకున్నట్టు రూపొందించి సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేశామో .. అదే   విధంగా, స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ కూడా మేం అనుకున్న పధ్ధతిలోనే, అనుకున్న రేంజ్‌లోనే జరుగుతుంది.

అదీ త్వరలోనే!

ఇప్పుడు ఒకసారి రిలీజ్ డేట్ నిర్ణయం అయిందీ అంటే ఇంక అది మారదు.

రిలీజ్ డేట్ విషయాన్ని నేను ముందుగా షేర్ చేసుకునేది ఫేస్‌బుక్ లోనే. ఫేస్‌బుక్ మిత్రులయిన మీతోనే. థాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ మై డియర్ ఫ్రెండ్స్!