Sunday, 4 October 2026

టీమ్ అంటే టైమ్ పాస్ కాదు!


మీరు చేసే పనికి టీమ్ అవసరం ఉన్నట్లయితే ఒక మంచి "పవర్ టీమ్"ను సృష్టించుకోండి. పనిచెయ్యనివారిని, చెయ్యలేనివారిని, ఉట్టి ‘మాటల పిట్ట’లను తీసుకొని మీ సమయం వృధా చేసుకోవద్దు. మీ స్థాయిని తగ్గించుకోవద్దు. 

మీ టీమ్‌లోని ఎవరో ఒక్కరి కోతల వల్లనో, బాధ్యతారాహిత్యం కారణంగానో జరిగే ఒకే ఒక్క చిన్న తప్పు వల్ల మీ మొత్తం ప్రాజెక్టే కొలాప్స్ కావచ్చు. 

అందుకే, టీమ్ విషయంలో తప్పు నిర్ణయాలు తీసుకోవడమంత తెలివితక్కువ పని ఇంకోటి ఉండదు. 

మీకు తెలుసా... 90 శాతం మంది ఫెయిలయ్యేది ఈ ఒక్క విషయంలో కాంప్రమైజ్ కావడం వల్లనే! 

కట్ చేస్తే -

మొట్టమొదటిసారిగా ఇప్పుడు నేను పూర్తిస్థాయిలో కొన్ని సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నాను.

అలాగని, ఇప్పుడేదో తీరిగ్గా ఉన్నాను కదా అని తీసుకున్న నిర్ణయం కాదిది. 

ఫిలిం మేకింగ్ ప్రాసెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తూ, సినిమాలు చెయ్యాలని తీసుకున్న నిర్ణయం ఇది. 

ప్రొడ్యూసర్లు, ఇన్వెస్టర్స్, ఇన్వెస్ట్‌మెంట్స్... అవన్నీ ఎలాగూ సెట్ అవుతాయి. ఇంతకుముందులా "ఎవరో ఒకరులే... పాపం వాళ్ళకూ అవకాశం ఇద్దాం" అని అనుకున్నట్టు కాకుండా, సరైన టీమ్‌ను నిర్మించుకోవాలి. 

దీనికి బడ్జెట్‌కు అసలు సంబంధం లేదు.    

టీమ్ బాగుండాలి. బాధ్యత తెలిసి ఉండాలి. "ఇది మన సినిమా" అన్న అన్న భావన వారి మనసులో ఉండాలి. మన పని అయిపోయిందా, దులుపుకున్నామా, వెళ్ళామా టైపు వాళ్ళను ఎంత దూరం పెడితే అంత మంచిది. నాకు, వాళ్ళకు కూడా. 

Choose people who will fight for your film even when you’re not in the room. When they feel, “This is my film,” you have a truly powerful team.   

- మనోహర్ చిమ్మని    

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani