నేను పుట్టిపెరిగిన వరంగల్లో నా చిన్నప్పటి దసరా వేరు. అప్పటి పండగల వాతావరణమే వేరు. ఆ రోజులు నిజంగా మళ్లీ రావు.
హైద్రాబాద్ వచ్చి నేను సాధించినవేవీ అప్పటి నా జ్ఞాపకాలను బీట్ చేయలేవు.
కట్ చేస్తే -
బతుకమ్మ పండుగ, దసరా అంటే టక్కున గుర్తొచ్చేది... మా ఉర్సు గుట్ట.
సద్దుల బతుకమ్మ నాడు - లక్షలాది మంది ఉర్సుగుట్ట దగ్గరికి వచ్చి బతుకమ్మ ఆడి, నీళ్ళల్లో కలిపి, సద్దులు తిని ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు. ఇదంతా జరుగుతున్న సమయంలో - గుట్ట దగ్గర అమ్మే లాయిలప్పలు, రంగురంగుల కాగితం పంకాలు, కుయ్ కుయ్ మని అరిచే పీకలు, ఐస్‌క్రేట్లు... అసలా ఫీలింగే వేరు.
దసరా నాడు కూడా అంతే. ఉర్సుగుట్ట దగ్గర జరిగే రావణ వధను మస్త్ ఎగ్జయిట్‌మెంట్‌తో చూసేవాళ్లం.
దసరా అంటే కొత్త బట్టలు, కోడి కూర, పూరీలు, చుట్టాలు, మందు బాటిళ్ళు... ఎవ్వర్ని పలకరించినా ఒక "హై"లో ఉండేవాళ్ళు. అలాంటి "హై" హైద్రాబాద్‌లో ఏ పండగప్పుడూ, ఏ సందర్భంలోనూ నేనెప్పుడూ ఫీలవ్వలేదు.
- మనోహర్ చిమ్మని
ఇప్పుడెలా ఉందో అక్కడ?
నా చిన్నప్పట్లాగే అంత బాగా జరుపుకుంటున్నారా?
ఆధునిక జీవితం మనవాళ్ళ జీవనశైలిలో తెచ్చిన ఎన్నెన్నో మార్పులు అప్పటి దసరా పండుగ ఆనందాన్ని అలాగే ఉంచాయా?
లేదంటే, నెమ్మదిగా అక్కడ కూడా ఫేడవుట్ అయిపోతూ ఇక్కడిలాగే పండగను నాలుగు గోడలకే పరిమితం చేశాయా?

ఈసారి కుదరకపోవచ్చు... వచ్చే దసరాకి మాత్రం మా ఉర్సు గుట్ట దగ్గరికి తప్పకుండా వెళ్ళాలనుకొంటున్నాను.
ఇంటిదగ్గరనుంచి ఉర్సు గుట్ట దాకా సైకిల్ టైర్‌లను తిప్పుకొంటూ పరుగెత్తిన రోజులు... గుట్ట చుట్టూ చెరువు... గుట్ట పైకి ఎక్కి మేం కోసుకొచ్చిన చింతపలక పండ్లు... పైనే రంగనాయకుల గుడి... దూరంగా కనిపించే దామెర గుట్టలు... హోలీ పండగ రంగు కోసం దామెర గుట్టల మీదకెక్కి కోసుకొచ్చిన మోదుగపూలు...

చిన్నప్పటి జ్ఞాపకాలు కదా... ఎలా మర్చిపోతాం?

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani