Saturday, 24 October 2026

పెద్ద కథలు రాయటం చిన్న విషయం కాదు


బుచ్చిబాబు, చలం, జెఫ్రీ ఆర్చర్, చెహోవ్, పుష్కిన్ వంటి రచయితలు పెద్ద కథలు ఎందుకు రాశారో నాకిప్పుడు అర్థమవుతోంది. 

కొన్ని భావాలను, ఆలోచనలను అలా రాస్తూపోవాల్సిందే. ఇంక చాలు అని ఆపలేం.  

ముఖ్యంగా స్త్రీని, సముద్రాన్ని గురించి రాసేటప్పుడు ఇన్ని పదాల్లోనే, ఇన్ని పేజీల్లోనే రాయాలి అని ముందే అనుకోలేం. అలా కుదించలేం. 

కుదించి రాసింది కథ కాదు. అందులో జీవం ఉండదు.  

కట్ చేస్తే - 

నేను రాయాలకున్న కథ ఒకటి మొన్ననే ప్రారంభించాను కాని, పూర్తిచెయ్యలేకపోయాను. 

మామూలుగా సింగిల్ సిట్టింగ్‌లో కథరాయటం పూర్తిచేసేవాణ్ణి. ఈ కథ విషయంలో అలా కుదరటం లేదు. కుదిరేలా కథను కుదించాలనుకోవటం లేదు. 

థాంక్స్ టు గుడిపాటి... నువ్వు చెప్పకపోతే మళ్ళీ నేను కథలు రాయటం మొదలెట్టేవాన్నే కాదు. 

- మనోహర్ చిమ్మని   

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani