"మొరగని కుక్కలేదు. విమర్శించని నోరు లేదు. ఇవి రెండూ జరగని ఊరు లేదు. మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి!”
రజినీకాంత్ ఈ మాట ఊరికే అనలేదు. ఆయన అనుభవంలో ఇలాంటి సందర్భాలు ఎన్నో వందలు చూసుంటారు.
కట్ చేస్తే -
ఒక టెక్నీషియన్‌గా తన పని, పరిమితుల పట్ల కనీస అవగాహన లేని అనుభవానికి అర్థం లేదు.
డైరెక్టర్ విజువల్‌గా తనకు ఏం కావాలో, ఎలా కావాలో చెప్పి చేయించుకోడానికే కెమెరామన్.
ఈ కనీస అవగాహన లేనిచోట ఈగో ఉంటుంది. "డైరెక్టర్‌కు నాకంటే బాగా తెలుసా" అన్న చిన్నచూపు ఉంటుంది. ఇంక, నానా ఫీలింగ్స్ ఉంటాయి.
"అరుపులు కేకలు లేకుండా కూల్‌గా షూటింగ్ చేసుకుందాం" అని నవ్వుకుంటూ ఫ్రెండ్లీగా అన్నందుకు, "యూనియన్‌కు వెళ్తా" అని ఒక సీనియర్ కెమెరామన్ నా సినిమా షూటింగ్ ఒకరోజు దాదాపు ఆపేసినంత పనిచేయడం నాకింకా గుర్తుంది. తర్వాత మేమిద్దరం మంచి మిత్రులమయ్యాం. అది వేరే విషయం.
అద్భుతమైన స్కిల్ ఉండి కూడా, కేవలం ముక్కుమీద కోపం, ఇలాంటి చిన్న చిన్న ఈగోల వల్ల ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎందరో ఉంటారు. ఎన్ని అవలక్షణాలున్నా కొందరు మాత్రం అంత త్వరగా ఎగ్జిట్ కారు. ఆ కొందరికి కొన్ని ఎక్‌స్ట్రా టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అలా వదిలేద్దాం.
కట్ చేస్తే -
ఇప్పటికే నాలుగైదు బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ స్పీచ్‌లంటే నాకు చాలా ఇష్టం.
ఎక్కడా తడబడకుండా, స్పష్టమైన తెలుగులో ధారాళంగా మాట్లాడతారు. తను చెప్పాలనుకున్న పాయింట్ నుంచి అంత సులభంగా డీవియేట్ అవరు. స్వల్పంగా అలా కాస్త పక్కకెళ్ళినా, చివరకు ఒక మాంచి మేకు దిగ్గొట్టినట్టుగా తను చెప్పాలనుకున్నది చెప్పి స్పీచ్ ముగిస్తారు.
ఇవ్వాళ "ఎక్స్"లో ఆయన లెటర్ హెడ్ మీద రాసి పెట్టిన పోస్టు చూశాక ఈ బ్లాగ్ రాయాలనిపించింది...
ఎంతయినా తనతో కలిసి పనిచేసిన టెక్నీషియన్, తనకంటే సీనియర్ అయిన కెమెరామన్ మీద ఈ పోస్టు పెట్టడానికి ముందు ఆయన ఎంత మథనపడివుంటారు? ఎంత బాధపడివుంటారు?
టీవీచానెల్స్‌లోనో, యూట్యూబ్ చానెల్స్‌లోనో ఎన్నయినా ఇంటర్యూలిచ్చుకోవచ్చు. ఆయా చానెల్స్ కోరుకొనే ఏ బుల్‌షిట్ అయినా మాట్లాడుకోవచ్చు. కాని, ఇంకొకరిని బాధపెట్టేలా కాదు.
నీకు మరీ అంత కోరిక ఉంటే డైరెక్టర్ కావచ్చుగా?
కాలేకపోతే అక్కడితో మర్చిపో.
కాలేకపోతే అక్కడితో మర్చిపో.
అంతే కాని, ఇంకో శాఖలో పనిచేస్తూ, తనే డైరెక్టర్ అయినట్టుగా ఫీలవ్వటం, అలాంటి భ్రమలో ఉంటూ డైరెక్టర్స్‌ను ఇలా కెలకటం, బాధపెట్టడం నిజానికి అందరూ చేయరు.
చేసే కొందరితోనే సమస్య.
అప్పటికప్పుడు ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్‌ను కెమెరామన్‌ను చేసి, సక్సెస్‌ఫుల్‌గా సినిమా పూర్తిచేసి, హిట్ చెయ్యగలిగిన రాంగోపాల్‌వర్మ లాంటివాళ్లే ఇలాంటి వారికి బెస్ట్ ఆన్సర్స్.
అప్పటికప్పుడు ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్‌ను కెమెరామన్‌ను చేసి, సక్సెస్‌ఫుల్‌గా సినిమా పూర్తిచేసి, హిట్ చెయ్యగలిగిన రాంగోపాల్‌వర్మ లాంటివాళ్లే ఇలాంటి వారికి బెస్ట్ ఆన్సర్స్.
పి సి శ్రీరాం, రవి కె చంద్రన్, అనిల్ మెహతా, రాజీవ్ మీనన్, సంతోష్ శివన్ లాంటి గొప్ప కెమెరామెన్ల యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలు నేను చూసినట్టు గుర్తులేదు. ఒకవేళ వారి ఇంటర్వ్యూలు ఉన్నా, "అంతా నేనే" అన్న పనికిరాని ఈగోతో మాట్లాడివుండరు. వారు కలిసి పనిచేసిన డైరెక్టర్స్ గురించి తప్పుగా అసలు మాట్లాడివుండరు.
Because they know very well that the cinematographer is essentially translating the director's vision into imagery, not engaging in any politics.
- Manohar Chimmani
- Manohar Chimmani
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani