Thursday, 8 October 2026

మినిమలిజమ్ మూఢనమ్మకం కాదు


"ఏదైనా సాధించే ముందు చెయ్యాల్సిన మొట్టమొదటి పని గొప్ప లక్ష్యం సెట్ చేసుకోవడం, దాన్ని సాధించే యాక్షన్ ప్లాన్ తయారుచేసుకోవడం కాదు. ఒక మూడు గంటల సమయం తీసుకొని, ముందు మీ ఇల్లు చక్కపెట్టుకోండి" అంటాడు ఈలన్ మస్క్. 

ఎందుకు? 
మన సక్సెస్‌కు, దీనికి సంబంధం ఏంటి?

సంబంధం చాలా ఉంది.

ఇంట్లో ప్రతి గదిలో, ప్రతి మూలలో, అటకల్లో, అల్మారాల్లో, షెల్ఫుల్లో ఏళ్ళుగా పేరుకుపోయి ఉన్న చెత్తా చెదారం ముందు క్లియర్ చెయ్యాలి. 

ఇంట్లోని ఒక వస్తువో, ఒక డ్రెస్సో, ఒక పుస్తకమో టచ్ చెయ్యక ఒక 6 నెలలు అయ్యిందంటే మాత్రం ఆ వస్తువు మనకింక అవసరం లేదని అర్థం. వెంటనే పడెయ్యాలి. లేదంటే, దాని అవసరం ఉన్నవాళ్ళకు ఇచ్చెయ్యాలి. 

మనం ఇంక రిఫర్ చెయ్యము, చదవము అనుకున్న పుస్తకాల్ని వెంటనే ఏదైనా లైబ్రరీకి డొనేట్ చెయ్యాలి. 

ఇలా చెయ్యటం వల్ల ఇంట్లో కొత్తగా చాలా స్పేస్ క్రియేట్ అవుతుంది. ఎక్కడెక్కడ ఏమేమేముంది, ఏ వస్తువులు అనవసరంగా ఉన్నాయి, కొత్తగా ఎక్కడ ఏది అవసరం... ఇదంతా క్రిస్టల్ క్లియర్‌గా మనకు తెలిసిపోతుంది. 

అసలు ఇంట్లో వస్తువులు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. వంటింట్లో గిన్నెలూ వస్తువులూ, సామాను, బట్టలు, ఫర్నిచర్ వంటివి ఎంత తక్కువగా ఉంటే అంత బాగుంటుంది. ఇవి ఎంత ఎక్కువైతే అంత చికాకు మనకు తెలీకుండానే మనం ఫీలవుతుంటాము.    

ఏదైనా సరే, ఎప్పుడూ తక్కువలోనే ఎక్కువ ఆనందం ఉంటుంది.

మినిమలిజమ్.

మనసు తేలికవుతుంది. ఉన్నట్టుండి, ఇంట్లో కొత్తగా పాజిటివ్ వైబ్స్ ఫీలవుతుంటాం. కొత్తగా ఆలోచిస్తుంటాం. కొత్తగా అంతకుముందెన్నడు లేనివిధంగా, ఆగిపోయిన పనులు కదులుతుంటాయి. 

ఇదంతా ఒక రెండుమూడురోజుల పాటు మీరు ఇంట్లో చేసిన "క్లట్టర్-ఫ్రీ" యాక్టివిటీ ప్రభావం, మినిమలిజమ్ ప్రభావం అంటే నమ్మగలరా?  

నమ్మాలి. 
ఎందుకంటే, ఇది సైన్స్.  

కట్ చేస్తే - 

ఇదే మినిమలిజమ్ మనం రోజూ చేసే ఉపయోగం లేని పనుల విషయంలో పాటించాలి.

మన అలవాట్లు.
మనం మొబైల్ వాడే టైమ్.
మన సోషల్ మీడియా. 
మన ఫ్రెండ్స్.
మన కోరికలు. 
మన బకెట్ లిస్టులో ఐటమ్స్.

అన్నీ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. 

ఉదాహరణకు - సోషల్ మీడియాలో అన్నీ ఫ్రీనే కదా అని - ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్... ప్రతి ఒక్కటీ మీరు వాడాల్సిన అవసరం లేదు. మీ ప్రొఫెషన్‌కు, మీకు పనికొచ్చే ఏదైనా ఒక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ చాలు. 

అందరూ అన్నిట్లో ఉన్నారని, మీరూ అన్నిటిలో ఉండాలని రూలేం లేదు.    

మన లక్ష్యాలు కూడా అంతే. 
ముందు ఏదైనా ఒకటి. 
ఒకదాని తర్వాత ఒకటి.

ఇలాంటి మినిమలిస్టిక్ క్లారిటీ ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. అన్నీ ఒక్కసారే అనుకుంటే మాత్రం ఏదీ కాదు. ఏదీ సాధించలేం.   

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani