ఏ సినిమాలోనైనా కాస్టింగ్ అనేది డైరెక్టర్ ఇష్టం.
కల్కి2898ఏడీ సినిమాలో కూడా అంతే...
ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకోన్, మృణాల్ ఠాకూర్, మాళవికా నాయర్, రాజమౌళి, అనుదీప్ వంటివారిని ఎలా ఎంచుకున్నాడో, విజయ్ దేవరకొండను కూడా అలాగే ఎంచుకున్నాడు నాగ్ అశ్విన్.
ఒకవేళ అర్జునుడి పాత్రలో విజయ్ నటన బాగా లేదనుకుంటే, అతనొక్కడి కోసం డైరెక్టర్ తన 600 కోట్ల ప్రాజెక్టుని పాడుచేసుకోడు. కాంప్రమైజ్ అవడు. ఒకవేళ అతను కాంప్రమైజ్ అయినా, అశ్వినీదత్ లాంటి అగ్రశ్రేణి నిర్మాత కాంప్రమైజ్ అవ్వరు.
ఇది సింపుల్ లాజిక్.
ఇదంతా పక్కన పెట్టి, కొంతమంది విజయ్ దేవరకొండను ట్రోల్ చెయ్యడమనేది సోషల్ మీడియాలో నానా రచ్చకు దారి తీసింది. అదింకా కొనసాగుతోంది.
ఇందులో విజయ్ దేవరకొండ తప్పేమైనా ఉందా? ఇందుకిలాంటి సంస్కార రహితమైన దాడి?
ఇక, ఈ ట్రోలింగ్‌లో వాడిన భాష గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
ఇందులో విజయ్ దేవరకొండ తప్పేమైనా ఉందా? ఇందుకిలాంటి సంస్కార రహితమైన దాడి?
ఇక, ఈ ట్రోలింగ్‌లో వాడిన భాష గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
సహజంగానే విజయ్ అభిమానుల ఎదురుదాడి కూడా అదే స్థాయిలో తీవ్రమైంది. ఇంకా కొనసాగుతోంది.
ఫ్యాన్స్ వేరు, ఆ కేటగిరీ వేరు. వాళ్ళూ వాళ్ళూ తిట్టుకుంటారు, తిట్టించుకుంటారు. అది మామూలే.
ఈ సూడో-మేధావులకేమైంది?
మీకు ఆ హీరో నటన నచ్చకపోవచ్చు. తప్పులేదు. కాని, దానికి ఇంత దారుణమైన కామెంట్స్, ఎగతాళి అవసరమా?
ఒక హీరోపైన ఎందుకింత వ్యక్తిగత కక్ష?
కట్ చేస్తే -
సినీ ఫీల్డులో అయినా, రాజకీయాల్లో అయినా, ఇంకే ఫీల్డులో అయినా, ఎవరి ఎజెండాలు వారికుంటాయి. లోపలి విషయాలు వేరు, బయటికి కనిపించే విషయాలు వేరు.
అసలైనవాళ్లంతా బాగానే ఉంటారు. ఎటొచ్చీ మధ్యలో ఇలా కొట్లాటలు పెట్టుకొని ఫూల్ అయ్యేవాళ్ళు, కరివేపాకులా తీసివేయబడేవాళ్ళు ఎవరంటే - ఇదిగో, ఇలా వారి కోసం గొడవలు పెట్టుకొని అనవసరంగా శత్రువులుగా మారే ఈ మధ్యలోనివాళ్ళే.
సినిమారంగంలో ఉన్నవాళ్లకంటే ఇవన్నీ తప్పవు. కోట్లు పెడుతుంటారు, సంపాదిస్తుంటారు, పోగొట్టుకుంటుంటారు. కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా నానా సిచువేషన్స్ ఫేస్ చేస్తుంటారు. అది వారి ప్రొఫెషన్. అది వారి జీవితం.
మిగిలినవాళ్లేవరికైనా సినిమా అనేది జస్ట్ ఒక ఎంటర్‌టైన్మెంట్ మీడియా. చూడాలి, వదిలెయ్యాలి. అంతే. మిగిలిందంతా జస్ట్ బుల్ షిట్.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani