ఓ రెండువారాల క్రితం ఇప్పుడు నేను చేస్తున్న ఒక సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌ను జూబ్లీహిల్స్ దస్పల్లా హోటెల్లో ప్లాన్ చేశాం.
'అంత అవసరమా' అని అడక్కండి. అది వేరే ఇంటర్నల్ విషయం.
ఒక టాప్ రేంజ్ చీఫ్ గెస్టుని, ఇంకో టాప్ రేంజ్ వీఐపీతో చెప్పించుకొని ఓకే చేయించుకున్నాం. ఈవెంట్ ఇంకో రెండున్నర రోజులుందనగా మా చీఫ్ గెస్ట్ ఆఫీసు నుంచి రావట్లేదని కాల్ వచ్చింది. ఈయన వస్తున్నాడు కదా అని ఇంకెవరూ అవసరం లేదనుకున్నాను. ఎవరూ లేని పరిస్థితి.
ఏం చెయ్యాలి?
ఏం ఆలోచించకుండా ప్రోగ్రాం కాన్సిల్ చేసేశాను. మళ్ళీ ఇంకో పది రోజుల తర్వాత పెట్టుకున్నాం.

ఈసారి సెలబ్రిటీ గెస్టుల కోసం మా టీమ్, నేను, మా సీఈవో ప్రదీప్ చంద్ర చాలా ట్రై చేశాం. స్టార్ హోటెల్లో చేస్తున్నాం... అంతో ఇంతో పరిచయాలున్నాయి... ఒకరిద్దరు ఇప్పుడూ లైమ్‌లైట్‌లో వున్న గెస్టులు రాకపోతారా అనుకున్నాం.
జస్ట్ రెండు రోజుల్లోనే "రారు" అని అర్థమైంది. వెంటనే నేను మా TDFA (తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్) ప్రెసిడెంట్ వీరశంకర్ గారికి కాల్ చేశాను. ఆరోజు షూటింగ్ బిజీ ఉన్నప్పటికీ, ఇండస్ట్రీ రియాలిటీస్ తెలిసిన ఒక సీనియర్ డైరెక్టర్‌గా "వస్తాను" అని నాకు మాటిచ్చారు.
వెంటనే డైరెక్టర్స్ చంద్ర మహేశ్, గాంధీ, బాబ్జీ, ప్రియదర్శిని గార్లను కూడా ఆహ్వానించాను.
ఇది నేను తీసుకొన్న సరైన నిర్ణయం.
మన డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్, మన దర్శక మిత్రులుండగా ఇంకెవరో రాని సెలబ్రిటీల కోసం ఎందుకు అనవసరంగా తంటాలు పడ్డం?
మన ప్రోగ్రాం సందర్భంగా మనవాళ్ళను కలుసుకోవడం, మనవాళ్ళను గౌరవించుకోవడం, ఆహ్లాదంగా మాట్లాడుకోవడం, ఆత్మీయంగా ఫోటోలు తీసుకోవడం కన్నా ఆనందం ఏముంటుంది?
ప్రోగ్రాం బాగా జరిగింది. ఆల్ ఓకేస్.

కట్ చేస్తే -
మొన్న ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు...
"ఎవ్వరూ రారు, ఎవ్వరూ మీకు సపోర్ట్ ఇవ్వరు. మీకు మీరు సొంతంగా ప్రూవ్ చేసుకోండి, సక్సెస్ సాధించండి. అప్పుడు... ఇదిగో ఇలా మేం వస్తాం, అభినందిస్తాం" అన్నారాయన.
ఇంకేం కావాలి? చాలా క్లియర్‌గా చెప్పాల్సింది చెప్పారు. గతంలో ఆయన కూడా అలా ఎదిగినవాడే కదా?
అసలు సెలబ్రిటీలు గెస్టులుగా రావట్లేదు అని బాధపడే కొత్త హీరోలు ఒక చిన్న లాజిక్ గురించి ఒక్క క్షణం ఆలోచించాలి...

సెలబ్రిటీలు గెస్టులుగా రావటం ద్వారా మీ సినిమా హిట్ అవుతుందా? మీ సినిమాలో కంటెంట్ బాగుంటే హిట్ అవుతుందా?
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani