ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు. నా మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు కూడా ఎందరో ఏపీలో ఉన్నారు... వారందరికి కూడా నా ప్రత్యేక శుభాకాంక్షలు.
పాలిటిక్స్ ఒక డిఫరెంట్ గేమ్. బయటికి కనిపించే పాలిటిక్స్ వేరు. ఇంటర్నల్ పాలిటిక్స్ వేరు. ఈ గేమ్‌లో అతిరథమహారథులతో ఒక ఆట ఆడుకున్న అనుభవం సి బి యన్ కు ఉంది. అలాగే, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న అనుభవం కూడా.
కాని, 74 ఏళ్ళ వయస్సులో కూడా సంపూర్ణమైన ఫిట్‌నెస్ మెయింటేన్ చేస్తూ, ఒక అత్యంత కఠినతరమైన లక్ష్యం పెట్టుకొని, ఆ లక్ష్యాన్ని బాహాటంగా బయటికి చెప్పి మరీ సాధించటం గొప్ప విషయం. 'Age is just number' అని సి బి యన్ తాజాగా ప్రూవ్ చేశారు. పార్టీలకతీతంగా ఇలాంటి సక్సెస్ సైన్స్‌కు సంబంధించిన అంశాలు నన్ను బాగా ఆకట్టుకుంటాయి.
కట్ చేస్తే -
5 సంవత్సరాల తర్వాత, సి ఎం గా మళ్ళీ అధికారం చేపట్టబోతున్న సందర్భంగా సి బి యన్ గారికి హార్దిక శుభాకాంక్షలు.
ఎన్నో సవాళ్లున్నాయ్. సి బి యన్ ఈ సారి రెచ్చిపోతారనటంలో సందేహం లేదు. ఆ అవసరం ఉంది కూడా. ఫోకస్ అటువైపే పెడితే మంచిది. బిల్ గేట్స్ ఏం ఖర్మ, ఆయన బాబుని కూడా రప్పిస్తారాయన. ఆ విజన్, ఆ మెకానిజం ఆయనకుంది.
రాష్ట్రంలోనే కాదు, ఖండాంతరాల్లో కూడా ఆయనకోసం ఏదైనా సరే చెయ్యడానికి, ఎప్పుడూ సిద్ధంగా ఉండే వేలాదిమంది అత్యున్నతస్థాయి డైహార్డ్ అభిమానగణాన్ని కలిగి ఉన్నారాయన. అదంత మామూలు విషయం కాదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వారంతా కూడా సి బి యన్ విజయంలో ప్రధాన పాత్ర వహించినవారే. వారి కంట్రిబ్యూషన్ కూడా చాలా విలువైంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు సి బి యన్ నుంచి ఏం ఆశించి ఇంత ఘనమైన విజయం ఆయనకి అందించారో అది పూర్తిచేయగల సత్తా ఆయనకుంది. చేస్తారని ఆశిస్తూ... రేపు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి హార్దిక శుభాకాంక్షలతో -
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani