Sunday, 30 August 2026

నా కొత్త పుస్తకం ఎడిక్షన్లో...


ఇప్పుడే నా కొత్త పుస్తకం బుక్ కవర్, బ్యాక్ కవర్ కంటెంట్ వర్క్ పూర్తిచేశాను. 

పుస్తకం కంటెంట్ ఫైన్ ట్యూనింగ్ మొదలుపెట్టాను. ఇంకో పదిరోజుల్లో మొత్తం పీడీయఫ్ ఫైల్ మా పబ్లిషర్ మిత్రుడు గుడిపాటికి  అందివ్వబోతున్నాను. 

సెప్టెంబర్‌లోనే విడుదల. 
పుస్తక ఆవిష్కరణ ఉండవచ్చు. 

ఒకవేళ ఉంటే, అదే నా మొట్టమొదటి బుక్ లాంచ్ ఈవెంట్ అవుతుంది.

బుక్ ఫస్ట్ లుక్, టీజర్ ఉంటాయి. 
పూర్తి వివరాలు త్వరలో. 

కట్ చేస్తే -  

బోర్ కొట్టేదాకా కొన్ని సినిమాలు చేయడం.
రెగ్యులర్‌గా కథలూ, ఫిక్షన్, నాన్-ఫిక్షన్ రాయడం. 
అంతే. 
ఇప్పుడింక వేరే పనుల్లేవ్.                

Doing one creative thing a day makes you feel good. Irrespective of all chaos.

- మనోహర్ చిమ్మని  

నిత్య జీవితంలో పనికొచ్చే పుస్తకాలు కూడా పుస్తకాలే!


ఒక్క అమెజాన్‌లోనే, 2025లో, ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 మిలియన్ల ప్రింటెడ్ బుక్స్ సేలయ్యాయి. 

ఈ 300 మిలియన్ల పుస్తకాల్లో 50% పుస్తకాలు కొని చదివింది అమెరికన్ పాఠకులే కావడం మనం గమనించాల్సిన ముఖ్యమైన అంశం. 

'కిండిల్ బుక్స్' లాంటి డిజిటల్ బుక్స్, ఆడియో బుక్స్ అంకెలు వేరే. 

కట్ చేస్తే -

ప్రపంచపటంలోని అభివృద్ధి చెందిన ఏ దేశాన్నయినా తీసుకోండి. ఆ దేశ ప్రజలు, పాలకులు, కంపెనీల సీఈవోలు... ఖచ్చితంగా మంచి పాఠకులైవుంటారు. పుస్తకప్రియులైవుంటారు. వీళ్ళల్లో చాలామంది రైటర్స్ కూడా ఉంటారు. 'న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్' స్థాయిలో మంచి మంచి పుస్తకాలు రాసివుంటారు. 

అంతెందుకు, అమెరికా ప్రసిడెంట్ ట్రంప్ కూడా రచయితగా, సహరచయితగా ఒక డజన్ బుక్స్ రాశాడన్న విషయం మీకు తెలుసా? 2004-2017 వరకు, "ది అప్రెంటిస్" పేరుతో ట్రంప్ ఒక రియాలిటీ షో కూడా హోస్ట్ చేశాడు. అది వేరే విషయం. 

ట్రంప్ కూడా మంచి పాఠకుడే.  

పుస్తకాలు చదవటం అనే అలవాటు మనిషిలోని ఆలోచనా శక్తిని, విజువలైజేషన్ పవర్‌ను ఎప్పటికప్పుడు పెంపొందిస్తుంది. పాఠకుల్లో ఒక స్థాయి క్రమశిక్షణకు మూల కారణమవుతుంది. ఈ రెండూ ఉన్నప్పుడే ఎవరైనా ఏ ఫీల్డులోనైనా ఎదగగలుగుతారు. 

వ్యక్తుల ఉన్నతస్థాయి ఎదుగుదల, పరోక్షంగా వారి దేశ ఉన్నతికి ఉపయోగపడుతుంది.     

మనమెక్కడున్నాం మరి? 

యూట్యూబ్ కనిపెట్టిన దేశపౌరుల కంటే కంటే ఎక్కువగా మనదేశంలోని వ్యూయర్సే ఆ వీడియోల్ని పనీపాటా పక్కనపెట్టి ఎగబడి చూస్తున్నారు. యూట్యూబ్ ద్వారా వారికి భారీ ఆదాయం రావడానికి కారణమవుతున్నారు. 

యూట్యూబ్ వీడియోలు చూడటం తప్పు కాదు. ఎలాంటి వీడియోలు చూస్తున్నామన్నది పాయింట్. పనికిరాని టైం పాస్ వీడియోలు చూస్తూ, ఎంత టైం వృధా చేసుకుంటున్నామన్నది పాయింట్. 

యూట్యూబ్‌లోని వీడియోలు చూడ్దానికి అలవాటుపడటం ద్వారా... పరోక్షంగా మనలోని ఆలోచనా శక్తిని, ఊహాశక్తిని, విశ్లేషణాశక్తిని, విజువలైజేషన్ పవర్‌ను ఊహించని స్థాయిలో కోల్పోతున్నాం. 

పుస్తకాలే కాదు, అసలు చదివే అలవాటునే పూర్తిగా మర్చిపోతున్నాం.  
 
ఇది నిజం కాదా?

మనలో ఎంతమంది పెన్ను, పేపర్ పట్టుకొని గత 24 గంటల్లో ఏదైనా రాశారు? అసలు మనలో ఎంతమంది ఏదైనా ఒక పుస్తకం పట్టుకొని ఎన్నిరోజులైంది?

"ఇప్పుడంతా డిజిటల్ యుగం, పుస్తకాలు అవుట్‌డేటెడ్" అనే ముందు, ఈ పోస్టు ప్రారంభంలో నేను రాసిన అమెరికా ఉదాహరణ ఇంకోసారి చదవండి. 

మన దేశంలో పబ్లిషింగ్ వ్యవస్థ ప్రపంచస్థాయి ప్రమాణాల్లో ఎందుకు లేదు?... మన దేశంలో 99.99% రచయితలు ఎందుకు రాయటం ద్వారా కనీసం బ్రతికే అంత డబ్బు కూడా ఎందుకు సంపాదించుకోలేరు?... ప్రొఫెషనల్ రైటర్స్‌గా ఎందుకు బ్రతకలేరు?... 

ఇలాంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం కూడా ఒక్కటే. 

మనం పుస్తకాలు చదవటం లేదు.     

పుస్తకాలంటే కేవలం కథలు, కవిత్వం, సాహిత్యం మాత్రమే కాదు. నిత్య జీవితంలో పనికొచ్చే పుస్తకాలు కూడా పుస్తకాలే. అవి కూడా ఎక్కువగా రావాలి. పాఠకులకు నిత్యజీవితంలో ఉపయోగపడాలి.  

ఫిక్షన్ కావచ్చు, నాన్-ఫిక్షన్ కావచ్చు... చదివించే గుణం ఉన్న పుస్తకాల్ని మాత్రం మన రచయితలు కూడా ఎక్కువగా రాయటం లేదు.  

బహుశా, అందుకే మనవాళ్ళు పుస్తకాలు కొనటం లేదు. 
తెలుగులో అయితే ఇది మరీ ఎక్కువగా ఉంది. 
ప్రచురణ కర్తలు మాత్రం ఏం చేస్తారు?  

Great nations are built by great minds.
And great minds are awakened by great books.

Every great nation has leaders who write, readers who think, and publishers who put ideas into people’s hands.

Because a nation is first built in silence—
not in noise, but in the turning of a page.

- మనోహర్ చిమ్మని   

Choose Yourself


The moment you choose yourself, life starts meeting you magnificently.

Not because life changed.

You did.

You stop chasing approval.
Stop negotiating your worth.
Stop waiting to be chosen.

You choose your road.
Your work.
Your people.
Your peace.

And something strange happens.

You start noticing opportunities you were too distracted to see.

The right people come closer.
The wrong people matter less.
Your decisions become simpler.

Choosing yourself isn't selfish.

It's a signal.

To yourself.
To others.
To life.

I know who I am.
I know what I want.
And I'm ready.

- Manohar Chimmani 

Thursday, 27 August 2026

రిస్క్ లేని సినిమా!


ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ డైరెక్టర్ అయినా సినిమా హిట్ కావాలనే చేస్తారు. ఫ్లాప్ కోసం చెయ్యరు. డబ్బులు పోగొట్టుకోవాలనుకోరు. 

కాని, హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా, ఎప్పుడైనా ఎక్కడైనా... ఎక్కువలో ఎక్కువ ఒక 5% సినిమాలు మాత్రమే మంచి బిజినెస్ చేస్తాయి. హిట్ అవుతాయి.    

ప్రపంచంలో ఎక్కడైనా ఇదే లెక్క. 

ఆ 5% హిట్స్‌లో మనం ఉండాలి. 
అదీ అసలు లెక్క. 
హెవీ గ్యాంబ్లింగ్.

అయితే...
సుమారు 5 కోట్ల లోపు పరిమిత బడ్జెట్లో, న్యూ టాలెంట్‌తో తీసే చిన్న బడ్జెట్ సినిమాల విషయంలో మాత్రం ఈ రిస్క్ దాదాపు లేదు. దీనికి సినిమా జయాపజయాలతో సంబంధం లేదు. 

సరైన మార్కెట్ అవగాహనతో, అన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోగలగటం మాత్రం చాలా ముఖ్యం.   

చెప్పాలంటే, 
ఈ కేటగిరీలో సినిమా అంటే 
నిజంగా ఒక బిగ్ బిజినెస్. 
ఒక జాక్‌పాట్.

కొడితే 30 నుంచి 100. 
మామూలుగా పోయినా 10 నుంచి 15.

మొత్తానికే పోయినా నష్టం ఉండదు. ఓటీటీలు, డబ్బింగ్, రీమేక్ రైట్స్ లాంటివి కాపాడతాయి.  

ఇంకా చెప్పాలంటే ఈ చిన్న బడ్జెట్ సినిమాల మొత్తం బడ్జెట్ అంతా కలిపి... పెద్ద బడ్జెట్ సినిమాల చాయ్-పానీ ఖర్చు అంత కాదు! 

వందల కోట్లతో గ్యాంబ్లింగ్ ఆడే భారీ బడ్జెట్ సినిమాల కంటే ఇవి బెటర్ కదా? 

Interested? DM me. 

- మనోహర్ చిమ్మని             

ఇదేం పెద్ద కాంపిటీషన్ కాదు!


ఈ భూమ్మీదున్న జనాభాలోని ప్రతి 140 మందిలో ఒక మిలియనేర్ ఉన్నారట! ఇక్కడ మిలియనేర్ అంటే, అమెరికన్ డాలర్స్‌లో మిలియనేర్.

మిలియనేర్ అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 10 కోట్లు సంపాదించినవాడన్నమాట. 

అంటే, ఈ భూమ్మీదున్న ప్రతి 140 మందిలో ఒకరికి 10 కోట్లున్నాయి!

గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ ఆధారంగా, నోమాడ్ కాపిటలిస్ట్ వంటి సోర్సులు చెప్తున్న ఈ న్యూస్ ఐటమ్ చదివాక, నాకు నిజంగా సిగ్గేసింది.    

వాస్తవానికి ఏ రంగంలోనైనా, భారీ కాంపిటీషన్ అనేది అట్టడుగు భాగంలోనే ఉంటుంది. పైకి వెళ్ళినా కొద్దీ కాంపిటీషన్ తగ్గిపోతుంటుంది. చెప్పాలంటే, అసలుండదు.  

ఇదీ అంతే. 

ఇదేం లక్షల్లో కాంపిటీషన్ కాదు... జస్ట్ ఒక 140 మందిలో నేనూ ఒక మిలియనేర్ కావాలని ఇప్పటిదాకా ఎందుకు అనుకోలేదు? అలాంటి హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఎందుకని చెయ్యలేకపోయాను? కనీసం ఇప్పుడైనా అవ్వాలనుకుంటున్నానా? 

కట్ చేస్తే - 

"నీ దగ్గర ఎంత డబ్బున్నా, నీకు ఎన్ని ఆస్తులున్నా, నువ్వు చచ్చిపోయేలోపు అందులో నువ్వు ఎంత ఖర్చుపెట్టగలిగావన్నది నీ అసలు వాల్యూ. అలా చేయలేనప్పుడు నీకూ, డబ్బులేనివాడికీ పెద్ద తేడా ఏం లేదు" అంటాడు రామ్‌గోపాల్ వర్మ. 

ఈ లాజిక్ అందరికీ నచ్చకపోవచ్చు. కాని, ఇదే కరెక్ట్ లాజిక్.  

డబ్బు సంపాదించడం వెనుక ఎవరి ఉద్దేశ్యం ఏంటన్నది వారి వ్యక్తిగతం. కాని, సంపాదించడం అనేది మాత్రం ఎవరికైనా తప్పనిసరి. 

ఒక రెండు-మూడక్షరాలు వదిలేస్తే ఎవరైనా మిలియనేర్ కావడం పెద్ద కష్టం కాదు. కాని, ఆ రెండు-మూడు అక్షరాలు ఎప్పుడు వదిలేస్తారన్నదే ఎప్పటికప్పుడు మనల్ని ఆడిస్తూవస్తున్న చిక్కు ప్రశ్న.

కాని, వదిలెయ్యాలి.
ఎందుకంటే... 

డబ్బు మనకు అవసరం కాబట్టి.
మన జీవితాన్ని మనం అనుకున్నట్టు బ్రతకాలి కాబట్టి. 
మనకు ఆ ఫ్రీడమ్ కావాలి కాబట్టి.   

Money isn’t everything — but let’s be real, money is a must. It gives you freedom, and freedom gives you life. Then come health and relationships — the true luxuries.

- మనోహర్ చిమ్మని  

Monday, 24 August 2026

Back to Cinema


Because something wonderful is happening in Telugu cinema.

Six successful films. Six different directors. Six different stories.

From June 19th to August 21st.
Just 62 days.

It started with Nandini Reddy’s Maa Inti Bangaram.
Murali Krishna Abburu - Lenin. 
Ravi Namburi - Chennai Love Story.
Merlapaka Gandhi - Korean Kankaraju.
Venky Atluri - Vishwanathan & Sons.
And finally, Shiva Nirvana’s Irumudi, now shaking the box office!

Six directors.
Six different films.
Six different voices.

One industry.
One exciting wave.

This is what cinema needs.

Not just big stars.
Not just big budgets.
Not just familiar formulas.

New voices.
New ideas.
New victories.

When different kinds of filmmakers succeed, the entire industry becomes bigger.

Maybe this is more than six successful films in 62 days.

Maybe Telugu cinema is entering a new phase.

And that's something worth celebrating.

Of course, behind these six successes are hundreds of sleepless nights, countless doubts, struggles, sacrifices and relentless efforts by the directors and their teams.

Because every successful film we celebrate on Friday has already been fought for long before the audience sees it.

Here's to the filmmakers who keep dreaming, fighting and making cinema happen.

- Manohar Chimmani 

Saturday, 22 August 2026

Three Hobbies. Three Kinds of Wealth.


Find three hobbies.

One that can make you money.
It keeps you productive and builds financial independence.

One that keeps you in shape.
It keeps your body strong and your energy alive.

One that keeps you creative.
It keeps your mind curious, playful, and young.

We often think of hobbies as something we do when we have free time.

Maybe they are much more important than that.

The right hobbies can build three kinds of wealth:

Financial wealth.
Physical wealth.
Creative wealth.

And when these three grow together, life becomes richer in every sense.

Don't just spend your free time. Invest it.

- Manohar Chimmani  

Thursday, 20 August 2026

In Cinema, Life Changes Every Friday


Yes. In cinema, life changes every Friday.

A new film arrives.
A new dream begins.
Someone gets a breakthrough.
Someone faces disappointment.
Someone gets noticed.
Someone disappears.

For filmmakers, every Friday is a reminder that cinema is never static.

You may have worked for years for one film, but once it reaches the audience, the game changes.

That's the beauty—and the brutality—of cinema.

So don't get too carried away by success.

And don't get destroyed by failure.

Friday will come again.

A new film.
A new opportunity.
A new beginning.

Stay in the game.

Because in cinema, life changes every Friday.

- Manohar Chimmani 

Tuesday, 18 August 2026

Stay Connected. Stay Alive.


Every new person you meet is more than a new connection in the outside world.

It can become a new connection inside your brain.

A new conversation.
A new perspective.
A new story.
A new question.

They make you think differently—and thinking keeps the mind active, curious, and alert.

That's why staying socially connected matters, especially as we grow older. Meaningful relationships and social engagement are associated with better cognitive and overall health, while persistent loneliness and isolation are linked with poorer health outcomes.

So don't stop meeting people.

Don't stop talking.

Don't stop being curious about someone else's world.

New connections can keep the world outside you—and the world inside you—alive.

Stay curious.

Stay connected.

Stay young at heart.

-Manohar Chimmani 

The Courage to Say No


A life you truly want is not built only by saying YES.

Sometimes, it is built by having the courage to say NO.

No to things that no longer excite you.
No to relationships that drain you.
No to expectations that aren't yours.
No to opportunities that look good but feel wrong.
No to the person you have outgrown.

Every yes adds something to your life.

But every meaningful no creates space for something that belongs there.

As we grow, our dreams change.
Our priorities change.
We change.

So don't feel guilty for walking away from what no longer sparks your soul.

You are not rejecting life.
You are choosing your life.

And sometimes, the most powerful step toward your future is simply saying:

No more. 

- Manohar Chimmani 

అవ్వా బువ్వా రెండూ కావాలంటే కుదరదు!


ఒకటి సాధించాలనుకొంటే, ఒకటేదో వొదులుకోవాలి... ఏ విషయంలోనయినా సరే, ఏ వృత్తిలోనయినా సరే. ఇది తప్పదు.

సినిమాల్లో అయితే, ఇది నూటికి నూరు శాతం అస్సలు తప్పదు.  

కట్ చేస్తే -

రెండే రెండు విషయాలు...

ఒకటి: మీకిష్టమైన ఫీల్డులో ఎలాంటి అడ్డంకులూ, పరిమితులూ లేకుండా పనిచేసుకోగలగడం.

రెండు: పై విషయంలో ఇంట్లో భార్య/భర్త, కుటుంబం మనస్పూర్తిగా మిమ్మల్ని ప్రోత్సహించి, సహకరించడం. 
  
90 శాతం మంది విషయంలో ఈ రెండింటి బ్యాలెన్స్ అసలు కుదరదు. రెండోది ఉన్నప్పుడే  మొదటి విషయంలో ఏదైనా సాధించే అవకాశముంటుంది. అలా లేదంటే మాత్రం, రెండిట్లోనూ ఫెయిలవక తప్పదు. 
  
అలా ఇలా కూడా కాదు, అట్టర్ ఫ్లాప్ అవుతారు. 

మరి మనకు సక్సెస్ కావాలా, ఫ్లాప్ కావాలా? 

ఇది మీ పాయింట్ నంబర్ 2 మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ ఆ కోపరేషన్ లేదంటే సింపుల్‌గా పాయింట్ నంబర్ 1 పూర్తిగా మర్చిపోవాలి. హాప్పీగా ఉంటారు. 

లేదంటే ఒక్కటే మార్గం.

ఏక్ నిరంజన్!

- మనోహర్ చిమ్మని  

అప్పుడప్పుడూ కొన్ని భరించాలి, తప్పదు!


మన తిప్పలేదో మనం పడుతుంటాం. అయితే, మనం అడక్కపోయినా సరే, కల్పించుకొని మరీ చాలా మంది పరిచయస్తులు, మిత్రులు, ఉచితసలహాదారులు ఒక మాట అంటుంటారు: 

"ముందు నువ్వు ఇది కానివ్వు. మంచి హిట్ కొట్టు. హిట్ కొట్టిన తర్వాత నీకు ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు మేం పెడతాం, పెట్టిస్తాం" అని.  

హిట్ కొట్టిన తర్వాత మార్కెట్లో ఉన్న లీడింగ్ ప్రొడ్యూసర్సే పిలుస్తారు, మంచి ఆఫర్స్ ఇస్తారు. ఏ చిన్న సపోర్ట్ అయినా నిజంగా నువ్వు చెయ్యాలనుకుంటే అది ఇప్పుడు కదా అన్నది నా హంబుల్ పాయింట్. 

ఇలాంటి బుర్రలేని మాటలు ఒక్క సినిఫీల్డులోనే కాదు. ఏ ఫీల్డులో అయినా వింటుంటాం. ఆఖరికి మన ఇళ్ళల్లో కూడా వింటుంటాం. అయితే - ఇలాంటివన్నీ చిరునవ్వుతో వింటూ, సాధ్యమైనంతవరకు ఇలాంటి 'టైమ్ వాంపైర్స్‌'ను తప్పించుకొంటూ ముందుకెళ్ళగలిగినవారే ఏదైనా సాధిస్తారు. 

- మనోహర్ చిమ్మని  

Monday, 17 August 2026

ఈమధ్య ఇంత అందమైన ఫీల్‌గుడ్ సినిమా చూళ్లేదు!


విశ్వనాథ్ & సన్స్ చూశాను. చాలా బాగుంది సినిమా. వెంకీ అట్లూరి & టీమ్‌కు హార్టీ కంగ్రాట్స్. 

ముందుగా మెచ్చుకోవాల్సింది హీరో సూర్యను... ఇలాంటి కొత్త కథను, డైరెక్టర్‌ను నమ్మి ఒప్పుకొన్నందుకు. సూర్య లుక్ & యాక్టింగ్ ఎప్పట్లాగే సింప్లీ సుపర్బ్. 

వెంకీ అట్లూరి బహుశా ఈ కథను తెలుగు హీరోలకు చెప్పివుండకపోవచ్చు. చాలా సీన్లు, కథనం కొత్తగా, సింపుల్‌గా, అద్భుతంగా ఉన్నాయి. 

రాధిక, మమిత బైజుల ఎన్నిక సూపర్బ్. 

మమిత కాకుండా ఈ పాత్రలో ఇంకొకర్ని ఊహించలేం అన్నంత బాగా న్యాచురల్‌గా, విట్టీగా, క్యూట్‌గా యాక్ట్ చేసింది మమిత బైజు. 

ఈమధ్య ఇంత మంచి ఫీల్‌గుడ్ సినిమా చూళ్లేదు. నరకడాలు, రక్తప్రవాహాల ప్యానిండియా సినిమాల రొద మధ్య అనుకోకుండా వచ్చిన చల్లటి ఫ్రెష్ బ్రీజ్... విశ్వనాథ్ & సన్స్. 

- మనోహర్ చిమ్మని         

Sunday, 16 August 2026

A Monk at Heart


We are often taught to choose.

Success or peace.
Ambition or contentment.
Wealth or spirituality.
Achievement or inner freedom.

I don't believe we have to.

Rich Monk is built on a simple idea:
You can pursue extraordinary success without losing your soul.

You can build.
You can create.
You can prosper.
You can dream bigger.
You can keep reinventing yourself.

And yet, remain grounded, grateful, and deeply human.

Because being a monk is not necessarily about walking away from the world.

Sometimes, it is about mastering your relationship with the world while remaining free within.

That is the journey.

To become richer in what we create—
and poorer in what we need.

To achieve more.

And still remain a monk at heart.

- Manohar Chimmani 

ఇప్పుడు హీరోయిన్స్‌గా మనవాళ్ళూ బాగానే ముందుకు వస్తున్నారు!


ఇందాక ఒక చిన్న ఇంటర్వ్యూ బైట్ చూశాను. అది కలెక్షన్ కింగ్ ఇంటర్వ్యూ బైట్, ఓ నాలుగైదేళ్ళ కిందిది అనుకుంటాను. అందులో ఆయన చెప్పిన ఒకట్రెండు మాటలకు చాలా విలువుంది.  

విషయం ముంబై నుంచి, ఇతర నార్త్ ఇండియా ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే హీరోయిన్స్‌కు సంబంధించింది.

సన్నగా, తెల్లగా ఉంటారని మనం ఎక్కడినుంచో ఎవరినో తెచ్చుకుంటున్నాం. బిజినెస్ క్లాస్ టికెట్స్ వేసి రప్పిస్తున్నాం. ఇక్కడ స్టార్ హోటల్స్‌లో ఉంచుతున్నాం. ఇదంతా ప్రొడ్యూసర్స్, కొంతమంది డైరెక్టర్స్ వల్ల జరుగుతున్న కాస్ట్‌లీ పొరపాటు.

ఆర్ట్‌కు భాష, ప్రాంత భేదాల్లేవు. కాని, వాళ్ళకి కోట్లల్లో రెమ్యూనరేషన్, ఇతర సౌకర్యాలు అలవాటుచెయ్యాల్సిన అవసరం లేదు. మన ప్రొడ్యూసర్స్ పుణ్యమా అని వీళ్ళంతా సంవత్సరం తిరిగే సరికి కోట్లు డిమాండ్ చేసే హీరోయిన్స్ అవుతున్నారు.     

ఎవరికైనా రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే. కాని, ఇక్కడి మన తెలుగు/దక్షిణాది హీరోయిన్స్‌తో సమానంగా ట్రీట్ చెయ్యాలి తప్ప, అంత స్పెషల్ ట్రీట్మెంట్ అవసరం లేదు.   

ఇప్పుడు హీరోయిన్స్‌గా మనవాళ్ళూ బాగానే ముందుకు వస్తున్నారు. అన్ని విషయాల్లో ప్రొఫెషనల్‌గా ముంబై అమ్మాయిలతో పోటీపడుతున్నారు. నిజంగా ఇలా ఉన్నప్పుడు, డైరెక్టర్స్‌కు తెలుగు హీరోయిన్స్‌ను తీసుకోవడం అనేది భాష, ఎక్స్‌ప్రెషన్ విషయంలో ఒక మంచి అడ్వాంటేజే అవుతుంది. 

What do you say?

- మనోహర్ చిమ్మని  

Saturday, 15 August 2026

కొత్తగా ఫీల్డులోకి రావాలనుకొనేవాళ్లు తీసుకోవల్సిన జాగ్రత్త ఒకే ఒక్కటి...


సినీఫీల్డులోకి ప్రవేశించాలనుకొనే ఆర్టిస్టులయినా, టెక్నీషియన్లయినా, ఇంకెవరయినా... ముందుగా తెల్సుకోవల్సిన విషయాలు ప్రధానంగా రెండు:

1. సినీఫీల్డులో "ఇది ఇలా జరుగుతుంది" అని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఫీల్డులో ఎంట్రీ దొరకడమే చాలా కష్టం. దొరికాక దాన్ని సరైన విధంగా వినియోగించుకొని నిలదొక్కుకోవడం మరీ కష్టం. ఒక్క ముక్కలో చెప్పాలంటే - ఇక్కడ దేనికీ గ్యారంటీ లేదు.

2.  ఇక్కడ అవకాశం దొరికి, పేరు తెచ్చుకొనేవరకూ దాదాపు ఎవ్వరూ ఒక్క రూపాయి పారితోషికం ఇవ్వరు. అలా ఇస్తారనుకోవడం, అలా అని ఎవరైనా చెప్తే వినడం... ఉఠ్ఠి భ్రమ. మన జేబులోంచే వేలకి వేలు, లక్షలకి లక్షలు ఖర్చుపెట్టుకుంటూ బ్రతకాల్సి ఉంటుంది. అవకాశాల కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫీల్డులో ఉన్నవాళ్ళంతా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నవాళ్ళే. 

ఈ విషయంలో కేవలం ఒక్క కేటగిరీకి మాత్రమే మినహాయింపు ఉంటుంది. అది - హీరోయిన్లు, ఇతర ఫిమేల్ సపోర్టింగ్ ఆర్టిస్టులు. వీళ్లు దొరకడమే కష్టం కాబట్టి ఈ వెసులుబాటు. అదే హీరోలయితే ఎదురు పెట్టుబడి పెట్టాల్సి కూడా రావొచ్చు. అది వేరే విషయం.  

పైన చెప్పిన రెండు అంశాల్ని దృష్టిలో పెట్టుకొని, కొత్తగా ఫీల్డులోకి రావాలనుకొనేవాళ్లు తీసుకోవల్సిన జాగ్రత్త ఒకే ఒక్కటి.

ఇక్కడ ఫీల్డులో అవకాశం దొరికి, నిలదొక్కుకొనేవరకూ - ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరొక ఆదాయమార్గాన్ని లేదా జాబ్‌ని ముందుగానే చూసుకోవాలి. లేదంటే మీరు బాగా డబ్బున్నవాళ్లయి ఉండాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి.   

శిలాశాసనం లాంటి ఈ జాగ్రత్త తీసుకోకుండా ఫీల్డులోకి ఎవరు ఎంటరయినా... తర్వాత సినిమా కష్టాలు తప్పవు. అన్నీ అవుతున్నట్టే ఉంటుంది. కానీ, ఏదీ ఇంచ్ కదలదు. సాంఘికంగా, ఆర్థికంగా ఎన్నో ఛాలెంజ్‌లు ఎదుర్కోవాల్సి వస్తుంది.  

సో, బి కేర్‌ఫుల్!

No guts, no glory.  

- మనోహర్ చిమ్మని  

Friday, 14 August 2026

తెర మీది సినిమా నథింగ్!


మనుషుల మీద 
ఇంట్రెస్ట్ పోయింది నాకు.
వందకి వంద శాతం. 

చెప్పేదొకటి.
చేసేదొకటి.

మాటలకు, చేతలకు మధ్య
భూమ్యాకాశాల అంతరం.
అస్సలు ఏమాత్రం సింక్ అవ్వదు. 
ఏదీ సింక్ అవ్వదు. 

కట్ చేస్తే - 

తప్పయినా ఒప్పయినా,
ఆ మేవరిక్ డైరెక్టర్ లాగా
జీరో-హిపోక్రసీ లైఫే బెటర్. 
చాలా విషయాల్లో. 

- మనోహర్ చిమ్మని 

ఇండిపెండెంట్ సినిమాలకు అంత రిస్క్ లేదు!


సినిమాలు తీయడం కష్టం కాదు. 
హిట్ సినిమాలు తీయడం కష్టం. 

హిట్ సినిమాలకు, బడ్జెట్‌కు తప్పక సంబంధం ఉంటుంది. అయితే, భారీ బడ్జెట్ ఉన్న సినిమాలు కూడా ఫెయిలవుతాయి కదా అన్నది లాజిక్. కాని, ఒక మంచి కమర్షియల్ సినిమా తీయడానికి బేసిగ్గా ఒక మినిమమ్ బడ్జెట్ అనేది తప్పనిసరి అన్నది ఎవరైనా ఒప్పుకొనితీరాల్సిందే. 

ఇండిపెండెంట్ సినిమాలన్నింటికీ ప్రధాన సమస్య ఇదే...
మినిమమ్ బడ్జెట్. 

కట్ చేస్తే -

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా, సినిమాల సక్సెస్ రేట్ కేవలం 5-7 శాతమే. 

ఈ నంబర్ మన బుర్రలో ఉంటే చాలు. వొళ్ళు దగ్గరపెట్టుకొని సినిమాలు చేస్తాం. రిస్క్-ఫ్రీ బడ్జెట్‌లో సినిమాలు చేస్తాం. ఒకవేళ థియేటర్లో సినిమా కిందా మీదా అయినా, ఓటీటీలు కొంతవరకు ఆదుకుంటాయి. 

మ్యాటర్ ఏంటంటే... భారీ బడ్జెట్ ప్యానిండియా సినిమాల గ్యాంబ్లింగ్‌ను తట్టుకొనే శక్తి భారీ ప్రొడక్షన్ హౌజ్ బ్యానర్లకు, ప్రొడ్యూసర్స్‌కు ఉంటుంది. 

చిన్న బడ్జెట్లో చేసే ఇండిపెండెంట్ సినిమాలకు అంత రిస్క్ లేదు. కంటెంట్ విషయంలో కూడా, మన క్రియేటివిటీకి ఆకాశమే హద్దు. 

- మనోహర్ చిమ్మని        

Thursday, 13 August 2026

How Much Humiliation Can You Take?


Two legendary filmmakers.
Two different languages.
One brutally honest truth about cinema.

Mani Ratnam:
నువ్వు సినిమాల్లోకి రావాలని డిసైడ్ అయినప్పుడే బాధ, అవమానం అనే మాటలు విడిచి పెట్టాలి. ఎందుకంటే, ఇక్కడ నీకు అవి అడుగడుగున ఎదురవుతాయి.”

Shekhar Kapur:
“When people ask me how to become a director, I ask: ‘How much humiliation can you take?’”

These are not motivational quotes.

They are survival instructions.

Cinema looks glamorous from the outside.

Awards.
Red carpets.
Success.
Fame.
Money.

But behind every successful filmmaker is a long list of rejections, disappointments, ignored ideas, broken promises, failed projects, unanswered calls, criticism, compromises—and moments when you seriously wonder whether you belong here at all.

That is the real entrance examination.

Talent matters.
Hard work matters.
Luck matters.

But the ability to absorb rejection without losing your self-belief matters enormously.

If one “no” breaks you, cinema will break you.

If one humiliation makes you quit, this industry is probably not for you.

Because filmmaking is not only about creating something beautiful.

It is also about repeatedly putting your dreams in front of people and hearing:

“No.”

And then waking up the next morning and trying again.

Perhaps that is why these two quotes stay with me.

They don't tell you how to become a director.

They tell you what you must become before you can survive as one.

Thick-skinned.
Patient.
Persistent.
Emotionally independent.

And above all—
still willing to create after the world has told you, many times, that you can't.

Cinema may test your talent.

But before that,
it will test your capacity to take humiliation.

— Manohar Chimmani 

The Universe Likes Speed


The Universe likes speed.

When an opportunity appears, don’t spend forever analyzing it.

Don’t delay.
Don’t second-guess.
Don’t let doubt talk you out of action.

Sometimes, that sudden impulse inside you is not random.

It may be your intuition telling you, “Go.”

You can always adjust your direction after you start moving.

But you cannot change anything by standing still.

When the opportunity is there,
when the impulse is there—
ACT.

Speed creates momentum.
Momentum creates possibilities.

And sometimes, the first step is all the Universe is waiting for.

— Manohar Chimmani 

Wednesday, 12 August 2026

అన్నీ బాగున్నపుడు అందరూ వస్తారు!


ప్రొఫెషనల్స్‌తో పనిచేయడం వేరు, పనిమీద ఆసక్తిలేనివారితో పనిచెయ్యడం వేరు. ఈ ఇద్దరి పనితీరులో, యాటిట్యూడ్‌లో భూమ్యాకాశాల తేడా ఉంటుంది.

కట్ చేస్తే -

నా కొత్త సినిమా కథాచర్చలు అనుకోకుండా ఇవాళ వై-జంక్షన్ దగ్గరున్న ఒక 'మాల్'లో జరిగాయి. 

నా మొదటి సినిమా కోడైరెక్టర్, రచయిత, డైరెక్టర్ వేణు గారు, నేను సుమారు మూడున్నర గంటలపాటు కూర్చున్నాం. 

ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఫుల్ 'ఏసీ'లో ఎక్కడ సౌకర్యంగా ఫీలైతే అక్కడ కూర్చోవచ్చు. ఆకలైతే 'కేయఫ్సీ'లో చికెన్-పెప్సీ తీసుకొని తినొచ్చు. కావాలనుకున్నప్పుడు మంచి కాఫీ త్రాగొచ్చు. బోర్ కొడితే, చుట్టూ ఉన్న కలర్‌ఫుల్ యాంబియెన్స్‌లో కాసేపు అలా వాకింగ్ చేసిరావచ్చు. 

క్రియేటివ్ మీటింగ్స్‌కు ఇప్పుడు ది బెస్ట్ ప్లేస్... మాల్స్. నిజానికి, మాల్స్‌ను మించిన ఎకానమీ మీటింగ్ ప్లేసులు నా దృష్టిలో అసల్లేవు. 

ఇక్కడ ఎవరూ ఎవర్ని పట్టించుకోరు. మన పని మనం హాయిగా చేసుకోవచ్చు. 

ఇంకేం కావాలి?

ఎప్పుడూ నాకు అది కావాలి, ఇది కావాలి అనేవాళ్ళూ... ఇదుంటేనే చేస్తా, అదుంటేనే చేస్తా అనేవాళ్ళూ... అసలు క్రియేటివిటీకి పనికిరారు. 

ఇంకేం లేకపోయినా ఫరవాలేదు కాని, వీళ్ళు మాత్రం వద్దు. 

అసలు ఇండిపెండెంట్ సినిమాలకు ఫండ్స్ కొరత అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇంకెన్నో ఇబ్బందులుంటాయి. హోటల్ రూమ్స్, గెస్ట్ హౌజ్‌లు, బాయ్స్, మేనేజర్స్... ఇవ్వన్నీ ప్రిప్రొడక్షన్ దశలో వృధా ఖర్చు. ఆ బడ్జెట్ అంతా మేకింగ్ దశలోనో, పోస్ట్ ప్రొడక్షన్ కోసమో, ప్రమోషన్ కోసమో ఉపయోగించుకోవచ్చు.   

ఇండిపెండెంట్ సినిమాలు చేస్తూ... అన్నీ బాగుండాలి, అన్నీ మనం అనుకున్నట్టు ఉండాలి అనుకోవడం కంటే అమాయకత్వం లేదు.    

అన్నీ బాగున్నపుడు అందరూ వస్తారు. క్యూ కడతారు. ఏం లేనప్పుడు మనక్కావల్సింది క్రియేట్ చేసుకోవడమే సిసలైన క్రియేటివిటీ. 

- మనోహర్ చిమ్మని                             

Tuesday, 11 August 2026

No, You’re Not Alone


OTHER PEOPLE are your greatest resource.

They give birth to you.
They feed you, dress you, and provide you with money.
They make you laugh and cry.
They comfort you, heal you, invest your money,
service your car, and bury you.

We can’t live without them.
We can’t even die without them. 

- Manohar Chimmani 

From Machinist to Filmmaker


Waldrich Coburg milling machine — German make. 

I worked on this machine at HMT from 1982 to 1985 as a Machinist (Apprentice).

Then came another chapter.

I completed my degree externally from Kakatiya University and joined Osmania University as a regular MA student. I went on to complete my MA and MLISc at OU, winning two gold medals in the two postgraduate programs.

Then came the transition from 'worker to white-collar professional'—with jobs at Jawahar Navodaya Vidyalaya, Guntur, and later at AIR FM, Kurnool.

And then came the final chapter—
Writer. Blogger. Filmmaker. 

Looking back, it feels less like a career and more like a series of lives lived.

From operating a German milling machine to creating stories on paper and screen.

A cherished series of memories. 

— Manohar Chimmani 

Spirituality Makes Us Creative


The deeper we go within, the more creative we become.

Because spirituality slowly removes the noise.

The fear.
The comparison.
The need for approval.
The constant desire to become someone else.

And when the noise becomes quiet, something beautiful happens.

We begin to hear ourselves.

A thought becomes an idea.
An emotion becomes a story.
Silence becomes music.
Life itself becomes art.

Perhaps spirituality and creativity are not two different journeys.

Maybe they are the same journey— 
One takes us deeper within, and the other brings what we find there into the world.

— Manohar Chimmani 

The Beauty of a Writer’s Life


Forget the book sales.
Forget the millions.

Forget, for a moment, what Paulo Coelho, Robin Sharma, Dan Brown, Jeffrey Archer, or J.K. Rowling actually write.

Look at the freedom they have created through writing.

The creative independence.
The ability to choose what to think, what to create, and when to create it.
The freedom to live life on their own terms.

Just imagine that lifestyle.

Compared to that freedom, what are the manipulations, power games, and mafia mentalities of cinema, politics, and social media really worth?

Maybe that’s why, these days, my heart seems to be quietly returning to my first love—writing. 

Perhaps some loves never really leave us.

They simply wait for us to come back.

— Manohar Chimmani 

PS: The photograph is of renowned author Paulo Coelho’s writing space.

ఒక అద్భుత జీవనశైలి


పుస్తకాల సేల్స్, మిలియన్లలో ఆదాయం పక్కన పెడితే - పావ్లో కోయిల్యూ, రాబిన్ శర్మ, డాన్ బ్రౌన్, జెఫ్రీ ఆర్చర్, జె కె రౌలింగ్ వంటి అంతర్జాతీయస్థాయి బెస్ట్ సెల్లర్ రచయితలు ఏం రాస్తున్నారన్నది కూడా కాసేపు పక్కనపెడితే - 

ఈ రచయితలందరికీ ఉన్న సృజనాత్మక స్వతంత్రం, వీరు అనుసరిస్తున్న జీవనశైలి ఎంత అందమైంది! 

ఒక్క సారి ఊహించండి. 

ఆ ఫ్రీడమ్, ఆ లైఫ్ స్టయిల్ ముందు ఈ సినిమాలు, ఈ రాజకీయాలు, ఈ సోషల్ మీడియాలు... వీటిల్లోని మేనిప్యులేషన్స్, మాఫియా మెంటాలిటీలు అసలెందుకు పనికొస్తాయి?  

ఎందుకో తెలీదుగాని, ఈమధ్య నా తొలి ప్రేయసి 'రైటింగ్' వైపే నా మనసు కూడా బాగా లాగుతోంది.  

- మనోహర్ చిమ్మని 

PS: ఫోటోలో ఉన్నది ప్రఖ్యాత రచయిత పావ్లో కోయిల్యూ రైటింగ్ స్పేస్. 

Friday, 7 August 2026

Stop Pointing Fingers


It's easy to blame people.

Friends.
Parents.
Spouse.
Partners.
Bosses.
The government.
Luck.
The economy.

Blame may explain your past, but it will never build your future.

The moment you stop pointing fingers, something powerful happens.

You take responsibility.

And responsibility is not a burden.
It's freedom.

Because once you accept that your next chapter is yours to write, you stop waiting for someone else to change your life.

You ask a better question:
"What can I do next?" 

That's where transformation begins.

It's never too late to change direction.

It's never too late to start again.

And it's never too late to build the life you truly want.

One decision.
One step.
One day at a time.

- Manohar Chimmani 

Wednesday, 5 August 2026

దాశరథి అవార్డుకు ముందు, దాశరథి అవార్డు తర్వాత...


మా గుడిపాటికి దాశరథి అవార్డు వచ్చినప్పుడు నేను సిటీలోలేను. తర్వాత అయినా కలిసి విష్ చేద్దామనుకున్నాను. కుదరలేదు. అనుకోకుండా నిన్న సుందరయ్య పార్కు దగ్గరున్న 'పాలపిట్ట' ఆఫీసుకి వెళ్ళాను.

లోపలి దృశ్యంలో ఎలాంటి మార్పు లేదు.  

ఒక్కడే కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసుకుంటున్నాడు గుడిపాటి. బహుశా అది పాలపిట్ట తాజా సంచిక అనుకుంటాను. ఎడిట్ చేస్తున్నాడు. 

అదే సింపుల్ గెటప్. అవే కళ్ళద్దాలు. డై వేయని అదే ఒత్తైన జుట్టు. నన్ను చూడగానే అదే చిరునవ్వుతో కూడిన పలకరింపు, "హాయ్, యార్" అంటూ!

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రతిష్టాత్మక దాశరథి అవార్డు గ్రహీత అయిన నా మిత్రుడు గుడిపాటిలో ఎలాంటి మార్పు లేదు.  కొంచెం కూడా.   

ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మే, బి సి జె, బి ఎడ్ చదివిన గుడిపాటి, పీజీలో స్వాని రామానంద తీర్థ బంగారుపతక విజేత. ఇప్పటివరకు గుడిపాటి రాసిన పుస్తకాలు సుమారు 13 వరకు అచ్చయ్యాయి. ఇవి కాకుండా, వివిధ కలం పేర్లతో రాసిన పుస్తకాలు కూడా గుడిపాటి అచ్చయిన పుస్తకాల లిస్టులో ఉన్నాయి. 

లెక్చరర్ కావాలనుకున్నాడు. కొన్నాళ్ళు ఆ ఉద్యోగం కూడా చేశాడు. కాని, జర్నలిజం పైన ఆసక్తి, సాహిత్యం పైన మమకారం గుడిపాటి దిశను మార్చేశాయి. ఎన్నో చిన్నా పెద్దా పత్రికల్లో పనిచేసి, చివరకు "వార్త"లో సండే బులెటిన్ ఎడిటర్‌గా ఆ జర్నీకి గుడ్‌బై చెప్పాడు.     

2010 ఫిబ్రవరిలో తను ప్రారంభించిన 'పాలపిట్ట' సాహిత్య మాసపత్రికను గత పదహారేళ్ళుగా "వన్ మాన్ ఆర్మీ"లా గుడిపాటి విజయవంతంగా నిర్వహిస్తున్నాడంటే అంత చిన్నవిషయమేం కాదు. ఒక ప్రచురణ కర్తగా కూడా నాకు తెలిసి ఇప్పటికి ఒక 400 పుస్తకాలను తన 'పాలపిట్ట బుక్స్' నుంచి ప్రచురించాడు గుడిపాటి.  

‘పాలపిట్ట’ మాసపత్రిక సంపాదకునిగా సాహిత్య జర్నలిజంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చిన గుడిపాటి... ఒక రచయితగా... సాహిత్యం, సాహిత్యేతర రచనలు అనేకం చేశాడు. నాకు తెలిసి, గుడిపాటి సొంతంగా రాసిన వాటి కన్నా వివిధ కలం పేర్లతో చేసిన రచనలే చాలా ఉంటాయనుకుంటున్నాను. రాసింది కొన్ని కథలే అయినా, గుడిపాటికి బాగా ఇష్టమైన వ్యాపకం కథారచన అని నాకు తెలుసు. 

తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పుడు తాను అందుకున్న దాశరథి అవార్డుకు ముందు... గుడిపాటి రాసిన ‘సంవిధానం’ కథా సాహిత్య వ్యాసాల సంపుటి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ విమర్శనా గ్రంథ పురస్కారం పొందింది. 2023లో తెలంగాణ సారస్వత పరిషత్ వారు వరిష్ట పురస్కారం ప్రదానం చేశారు. ఇంకా పలు సంస్థలు విభిన్న సందర్భాల్లో పురస్కారాలు అందించాయి.  

వ్యాపార కాక్ష లేకుండా తెలుగు భాష, సాహిత్యం కోసం ఇంతలా ఒంటరిపోరాటం చేస్తున్న గుడిపాటికి ప్రభుత్వం నుంచి, వివిధ సంస్థల నుంచి, సాహితీ ప్రేమికుల నుంచి, భాషాప్రేమికుల నుంచి తగినంత ఆర్థిక తోడ్పాటు కూడా అవసరం అని నాకనిపిస్తుంది.    

కట్ చేస్తే -

దాశరథి అవార్డుకు ముందు, దాశరథి అవార్డు తర్వాత... ఖచ్చితంగా కొంత మార్పు గుడిపాటిలో, ఆయన చేస్తున్న పనుల్లో ఉండాలన్నది నా అభిలాష. 

ఇదే అభిలాషను మా 'కవిసంగమం' యాకూబ్ కూడా వ్యక్తం చేశాడు. 

నిన్న పాలపిట్ట ఆఫీసులో గుడిపాటి, నేను మాట్లాడుకుంటుండగానే నా ఎమ్మే క్లాస్‌మేట్, మిత్రుడు యాకూబ్ కూడా అక్కడికి రావటం నాకు మరింత ఆనందాన్ని కలిగించిన విషయం. 

నిన్నటి మా క్యాంపస్ కబుర్లు, పర్సనల్ నాస్తాల్జియాలు, పలు ఇతర అంశాల మీద చర్చల అనంతరం నాకు అర్థమయ్యింది ఏంటంటే... త్వరలో గుడిపాటి నుంచి కొత్త వార్తల్ని మనం వింటాం.

అందులో మొదటిది "పాలపిట్ట లిటరరీ ఫెస్టివల్" కావచ్చు. 

- మనోహర్ చిమ్మని   

Sunday, 2 August 2026

ప్రమోషన్ ప్లాన్ లేకుండా సినిమా తీయడం వృధా!


చాలా మందికి కొత్తవాళ్లతో తీసే చిన్న సినిమాలు మధ్యలోనే ఆగిపోతాయి... అసలు రిలీజ్ కావు... ఒకవేళ రిలీజ్ ఐనా హిట్టు కావు... హిట్ అయినా డబ్బులు రావు... అని ఇలా రకరకాల అభిప్రాయాలుంటాయి. 

సినిమా నిర్మాణం మీద, బిజినెస్ పైన ఖచ్చితమైన అవగాహన ఉండి, సినిమా తీయడం వేరు. ఏదో ఊపులో సినిమా తీయాలని తీయడం వేరు.

ఒకవేళ తెలియనప్పుడు, తెలిసిన సీనియర్స్ చెప్పేది వినడం చాలా అవసరం. అలా జరగనప్పుడే పై అపోహలు నిజమవుతాయి. నిర్మాతతోపాటు - ఆ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కూడా ఎంతో నష్టపోతారు.

ఇవన్నీ ఒకెత్తు కాగా, సినిమా ప్రమోషన్ మొత్తం ఒకెత్తు.
 
ప్రమోషన్ ప్రాముఖ్యం తెలియనివాళ్లు అసలు సినిమా తీయకుండా ఉండటం బెటర్. ఈ వాస్తవం గుర్తించినవారెవ్వరికీ ఏ సమస్యా ఉండదు. చిన్న బడ్జెట్‌లోనే మంచి హిట్ ఇస్తారు. మరిన్ని మంచి సినిమాలు తీస్తారు. కోట్లల్లో డబ్బు సంపాదించుకుంటారు.

అలాంటి లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్, కో ప్రొడ్యూసర్స్, ప్రొడ్యూసర్స్ పాతవాళ్లలో చాలా తక్కువగా ఉంటారు. కొత్తవారు దొరకడం అంత ఈజీ కాదు.

ఒక సినిమా ప్రారంభించే ముందు ఇలాంటివి ఎన్నో, ఎన్నెన్నో బాగా చూసుకోవాలి. సరైన అంచనాలు వేసుకోవాలి. 

ఎటొచ్చీ, సగం తెలిసి సగం తెలీనివాళ్ళతోనే సమస్యలన్నీ.   

అందుకే చిన్న సినిమాల ప్రారంభంలో పదే పదే ఆలోచనలూ, ఆలస్యాలూ.

నిజంగా ఒక బిజినెస్‌గా తీసుకుంటే, సినిమాను మించిన బిగ్ బిజినెస్ లేదన్న విషయం ఇక్కడ సక్సెస్ సాధించినవాళ్ళందరికీ బాగా తెలుసు. వీళ్ళే తమకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు. ప్రమోషన్ లేకుండా బ్రాండ్ లేదన్న నిజం వీళ్ళకు మాత్రమే తెలుసు.     

దటీజ్ సినిమా. 

- మనోహర్ చిమ్మని   

స్నేహం బాగున్నప్పుడే ఈ రెండు విషయాల్లో జాగ్రత్త పడాలి!


కొటేషన్స్ వేరు, జీవితం వేరు. 

ముఖ్యంగా స్నేహం విషయంలో.

రకరకాల నేపథ్యాల్లో... ఎప్పటికప్పుడు... అప్పటి పరిస్థితులను బట్టి, మన అవసరాలను బట్టి, మన ఆనందాన్ని బట్టి, మన జీవితాల్లో వచ్చే అనేక కష్టనష్టాలను బట్టి...  మనం తీసుకునే నిర్ణయాలన్నింటికీ మనం కట్టుబడి ఉండలేం. ఇది సహజం. 

ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక నిజమైన ఫ్రెండ్ అవసరం తెలుస్తుంది. 

ఎలాంటి హిపోక్రసీ లేకుండా, భయం లేకుండా - మనసు విప్పి మాట్లాడుకోడానికి ప్రతి ఒక్కరికీ జీవితంలో కనీసం ఒక ఫ్రెండ్ అయినా ఉండాలి. ఉండితీరాలి. 

కట్ చేస్తే -

ఎంత అద్భుతమైన స్నేహాలయినా, ఎన్ని దశాబ్దాల స్నేహాలయినా... ఏదో ఒక సమయంలో... రెండే రెండు కారణాల వల్ల బ్రేకప్ అవుతాయి. 

ఒకటి ఈగో.
రెండోది డబ్బు.   

స్నేహంలో డబ్బు ప్రసక్తి ఎంటరయిందంటే చాలు. అప్పటివరకూ ఉన్న పాజిటివ్ ఫీలింగ్స్ అన్నీ క్రమంగా నెగెటివ్‌గా మారిపోతాయి. నమ్మకం అనేది ఫేడ్ అవుట్ అయిపోతుంది. మునుపెన్నడూ లేనివిధంగా - ప్రతి కదలికా, ప్రతి మాటా తప్పుగానే కనిపిస్తాయి, వినిపిస్తాయి. 

అప్పటివే కాదు... గతంలో వారి స్నేహం తొలిరోజులనుంచీ కలిసి మాట్లాడుకున్న ప్రతిమాటలోను, వేసిన ప్రతి అడుగులోనూ ఇప్పుడు వంద తప్పులు కనిపిస్తాయి.  

డబ్బుకు అంత శక్తి ఉంది.  

ఈగో కూడా అంతే. ఎక్కువగా ఇది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వస్తుంది. మరీ ఎక్కువగా ఇది ఆడ-మగ స్నేహాల్లో వస్తుంది. 

ఒకసారి ఈగో హర్ట్ అయ్యిందా... ప్రపంచంలో ఏ ఫెవికాల్, ఏ కెమికల్, ఏ టెక్నాలజీ కూడా విరిగిన ఆ మనసు ముక్కల్ని మళ్ళీ అతికించలేదు. 

స్నేహం బాగున్నప్పుడే ఈ రెండు విషయాల్లో జాగ్రత్త పడాలి. కాని, అలా జరగదు. అలా సాధ్యం కాదు. మానవమాత్రులం. వెంటనే అవతలి మనిషి మీద జడ్జ్‌మెంట్‌లు ఇచ్చేస్తాం. 

ఈ ఆవేశాన్ని, తొందరను కంట్రోల్ చేసుకోగలిగే సామర్థ్యం అందరిలో ఉండదు.        

కట్ చేస్తే - 

ఒక  ప్రోగ్రామ్ వేదిక పైనుంచి - వందలాదిమంది ఆహూతుల సమక్షంలో - యస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు స్నేహం గురించి ఒక అద్భుతమైన విషయం చెప్పారు.

'సక్సెస్ సైన్స్' నేపథ్యంలో - ఒక "రాగ్స్ టు రిచెస్ స్టోరీ"గా - రామోజీరావు గారు ఒక ఐకాన్. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఒకసారి స్నేహం విషయంలో బాలు గారితో ఒక మాట చెప్పారట:

"మీరు ఎవరైతోనైనా స్నేహం చేసేముందే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఒకసారి స్నేహం చేశాక, ఆ వ్యక్తిలో మీకు చాలా తప్పులు కనిపించొచ్చు, కొన్ని అంశాలు మీకు నచ్చకపోవచ్చు. వీలైతే సరిదిద్దండి. మీకు అనుకూలంగా మార్చుకోండి. కుదర్లేదా... జన్మాంతం భరించండి" అని! 

ఇట్లా నేను కొందరిని భరిస్తున్నాను. నన్ను కూడా కొందరు భరిస్తూ ఉండొచ్చు. అయినా సరే, మేం చాలా మంచి మిత్రులం. అందులో ఎలాంటి సందేహం లేదు.    

హాపీ ఫ్రెండ్‌షిప్ డే!💐  

- మనోహర్ చిమ్మని   

Saturday, 1 August 2026

Before Time Runs Out


One day, all of us will leave this world.

Knowing that should not frighten us.

It should free us.

Stop waiting for the perfect time. It doesn't exist. Stop obsessing over everything that could go wrong. Most of your fears will never happen, and most of your mistakes will soon be forgotten.

Life isn't asking you to be perfect.
It's asking you to be fully alive.

Take the risk. Build the dream. Write the book. Make the film. Start the business. Tell people you love them. Become the person you know you're capable of becoming.

In the end, very few people will remember every success or failure.

But you'll remember whether you had the courage to truly live.

Don't leave this world with your best work still inside you.

- Manohar Chimmani 

దటీజ్ సినిమా!


సినిమా నిర్మాణంలో ఆధునికంగా వచ్చిన డిజిటల్ టెక్నాలజీ వల్ల బడ్జెట్‌లు చాలా తగ్గాయి. చిన్న స్థాయిలో, కొత్తవాళ్లతో సినిమాలు చేయాలనుకొనేవాళ్లకు బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో ఇదొక మంచి ప్రాఫిటబుల్ అండ్ పాజిటివ్ మలుపు. 

అయితే - దీన్ని ఎంతవరకు పాజిటివ్‌గా ఉపయోగించుకొని, ఏ రేంజ్‌లో సక్సెస్ సాధించగలమనేదే మిలియన్ డాలర్ కొశ్చన్. 

ఎన్ని ఆడ్డంకులు వచ్చినా, అన్నీ మనకు అనుకూలం చేసుకొని ముందుకు సాగిపోగల సత్తా కూడా మనలో ఉండాలి. 

ఎందుకంటే...
సినిమా ఒక స్పెక్యులేషన్.
ఒక జూదం.

అయినా - భారీ స్థాయిలో డబ్బు రొటేషన్, ఊహించని రేంజ్ వ్యక్తులతో పరిచయాలూ, సంబంధాలూ, ఓవర్‌నైట్‌లో ఫేమ్... ఇవన్నీ ఇక్కడే సాధ్యం. 

వీటన్నిటినీ మించి, సినిమా ప్లాట్‌ఫామ్ నేపథ్యంలో వేరే భారీ బిజినెస్‌లకు ఫండ్స్ రెయిజ్ చేసుకోవడం, బ్లాక్/వైట్ అడ్జస్ట్‌మెంట్స్ వంటివన్నీ కూడా ఇక్కడే సాధ్యం.    

దటీజ్ సినిమా. 

Interested? DM me. 

- మనోహర్ చిమ్మని