Friday, 17 April 2026

ప్రపంచంలో ఎక్కడైనా ఇదే లెక్క


"ఏమైనా సరే, మీరు ఇప్పుడు ఒక మంచి సినిమా చెయ్యాలి. హిట్ ఇవ్వాలి. అందరూ ఏదేదో అంటున్నారు" అని ఆ మధ్య ఒక మిత్రుడు అన్నాడు నాతో. 

అలా ఏదేదో అనేవాడెవ్వడూ మన సినిమాకు ఒక లక్ష రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేయలేడు. "లైట్ తీసుకో" అన్నాను. 

కట్ చేస్తే - 
                
నాకు కూడా నిజంగా ఒక హిట్ ఇవ్వాలనే ఉంది. కాని, మంచి బడ్జెట్‌తో దానికి సపోర్ట్ చేసే డైనమిక్ ప్రొడ్యూసర్ ఒకరు దొరకాలి. మధ్యలో చేతులెత్తేయకూడదు. ప్రమోషన్ వాల్యూ తెలిసి ఉండాలి. అడుగడుక్కి క్రియేటివిటీలో వేలు పెట్టకూడదు. అన్నిటికంటే ముఖ్యమైంది... అనుమానాలతో, నెగెటివిటీతో సినిమా మొదలెట్టొద్దు. అసలు సినిమా ఎందుకు చేస్తున్నామో ఒక ఖచ్చితమైన క్లారిటీ ఉండాలి.       

అంత ఈజీ కాదు.
నిజంగా దొరకరు.
మనమే క్రియేట్ చేసుకోవాలి.
లేదా, మనమే చెయ్యాలి. 

కట్ చేస్తే - 

ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ డైరెక్టర్ అయినా సినిమా హిట్ కావాలనే చేస్తారు. ఫ్లాప్ కోసం చెయ్యరు. డబ్బులు పోగొట్టుకోవాలనుకోరు. 

కాని, హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా, ఎప్పుడైనా ఎక్కడైనా... ఎక్కువలో ఎక్కువ ఒక 5% సినిమాలు మాత్రమే మంచి బిజినెస్ చేస్తాయి. హిట్ అవుతాయి.    

ప్రపంచంలో ఎక్కడైనా ఇదే లెక్క. 

ఆ 5% హిట్స్‌లో మనం ఉండాలి. 
అదీ అసలు లెక్క. 
హెవీ గ్యాంబ్లింగ్.

అయితే...
సుమారు 5 కోట్ల పరిమిత బడ్జెట్లో, న్యూ టాలెంట్‌తో తీసే చిన్న బడ్జెట్ సినిమాల విషయంలో మాత్రం ఈ రిస్క్ దాదాపు లేదు. దీనికి సినిమా జయాపజయాలతో సంబంధం లేదు. 

చెప్పాలంటే, 
ఈ కేటగిరీలో సినిమా అంటే 
నిజంగా ఒక బిగ్ బిజినెస్. 
ఒక జాక్‌పాట్.           

- మనోహర్ చిమ్మని       

Thursday, 16 April 2026

ఈ క్షణం నా అవసరమేంటి? ఈ క్షణం నాకు ఎవరితో పని?


"ది మేకింగ్ ఆఫ్ ఎక్స్-వై-జెడ్"... అని తప్పక ఒక బుక్ రాసి, బుక్‌తో పాటు, ఫ్రీ పీడీయఫ్ కూడా రిలీజ్ చేస్తాను. 

ఇంతకుముందు నేను చేసిన ఏ సినిమాకు కూడా ఇలాంటి అనుభవాల్లేవు. ఇన్ని అవమానాల్లేవ్, కష్టాల్లేవ్. 

ఇలాంటి పుస్తకాలే నిజంగా ఫ్యూచర్ ఫిలిం మేకర్స్‌కు బాగా ఉపయోగపడతాయి... సినిమా తీయడం ఎలా, స్క్రిప్టు రాయడం ఎలా వంటి పుస్తకాలు కాదు.    

కట్ చేస్తే -

ఇది వ్యక్తిగతం కాదు. 
ట్రెండ్స్ ఎలా ఉన్నాయి చెప్పడం.
ఇలా ఉన్నాయేంటా అని బాధపడ్డం. 

ఒక్క సినీఫీల్డే కాదు, అంతటా ఇంతే. 

ఈ క్షణం నా అవసరమేంటి? ఈ క్షణం నాకు ఎవరితో పని? మన పని అయిపోయిందా... ఖేల్ ఖతమ్, దుకాణ్ బంద్. 

ఎవరూ ఎవరికి కనిపించరు,
ఎవరూ ఎవరిని పలకరించరు. 
మళ్ళీ ఏదైనా అవసరముంటే తప్ప.

సినిమాలు, అవకాశాలు, హిట్లు, డబ్బులు... ఇవి మాత్రమే కాదు. కలిసి ఒక పనిచెయ్యాలి అనుకున్నప్పుడు ఎంత ఫోకస్ ఉండాలి? ఎంత టీమ్ ఎఫార్ట్ ఉండాలి? ఎలాంటి కమ్యూనికేషన్ ఉండాలి? 

బేసిక్ కమ్యూనికేషన్ పాటించటమే ఒక తప్పుగా భావించేవాళ్ళు నిజంగా ఏదైనా సాధించగలరా? 

నాలుగయిదురోజులుగా నీ మెసేజెస్‌కు-కాల్స్‌కు రెస్పాన్స్ లేదు, నీతో అసలు కమ్యూనికేషన్ లేదు అంటే... నువ్వు ప్రయారిటీలో లేవన్నట్టే కదా?  

ప్రయారిటీలో లేనిచోట ఏదైనా పని అవుతుందని, ఇంకేదైనా సాధిస్తామని ఎలా భ్రమిస్తాం?    

అన్నీ బాగున్నప్పుడు కాదు... అసలేమీ బాగాలేనప్పుడే అద్భుతమైన టీమ్‌వర్క్ ఉండాలి, హాట్‌లైన్ కమ్యూనికేషన్ ఉండాలి.     

ఇది ఏ ఒక్కరి గురించో రాస్తున్నది కాదు. మనుషులు క్రమంగా ఎలాంటి మానసికస్థితికి చేరుకుంటున్నారు అన్న వ్యధ. 

Success begins with communication.
If you can’t express, you can’t achieve.  


- మనోహర్ చిమ్మని   

Wednesday, 15 April 2026

First Things First: Fitness. Freedom. Family.


We chase many things in life —
success, recognition, money, impact.
 
But beneath everything we build, there are three silent pillars that hold it all together... 

Fitness.
Freedom.
Family.

 
Fitness First
 
Without health, nothing sustains.
Not your ambition. Not your creativity. Not your drive. 
 
Energy is your real currency. 
And fitness is where it begins. 

 
Freedom Next
 
Freedom to think.
Freedom to choose.
Freedom to create without fear.
 
Because success without freedom feels like a cage.

 
Family Must
 
At the end of every win, every loss, every phase —
it’s family that remains.
 
They ground you.
They remind you who you are beyond your work.

 
Everything Else Comes After
 
Creativity. Cinema. Career. Social life.
All of it depends on these three.
 
Ignore them, and everything collapses silently.
Strengthen them, and everything grows naturally.
 

My Final Thought
 
Before chasing the world,
build your foundation.
Fitness. Freedom. Family.
Get these right —
and everything else becomes possible.
 
- Manohar Chimmani 

ఆరోగ్యమే మహాభాగ్యం


నిజంగా రెండే రెండు పదాల్లో ఎంత బాగా చెప్పారు మన పెద్దలు! 

మనం వింటామా? 

ఒక్క ఆరోగ్యం విషయమనే కాదు, ఇంకేదైనా అంతే. 

వ్యక్తిగత విషయాలు, వృత్తి విషయాలు, ఆర్థిక విషయాలు, సాంఘిక విషయాలు, మానవ సంబంధాలు... ఏదైనా సరే, ప్రతీదీ మనకు అనుభవమయ్యేదాకా, మన అనుభవంలోకి వచ్చేదాకా అసలు వినం. పట్టించుకోం.

ఇంకో పెద్ద ఈగోటిస్టిక్ "అతి" మనలో ఏంటంటే, మన పెద్దలు చెప్పింది అంతో ఇంతో నిజమే కదా అనిపించినా సరే, దాన్ని మనం స్వయంగా టెస్ట్ చెయ్యాలనుకుంటాం. రీ-ఇన్వెంట్ చెయ్యాలనుకుంటాం. 

చిక్కంతా అక్కడే. 

కట్ చేస్తే -

జరగాల్సిన నష్టం జరిగాక గాని, మనకు అర్థం కాదు. 

అప్పుడు గుర్తొస్తుంది... 
"పెద్దల మాట-సద్ది మూట" అన్న నిజం.

- మనోహర్ చిమ్మని  

Tuesday, 14 April 2026

Swim with Sharks: The Power of Choosing Your Circle


There comes a point in life where growth demands a difficult decision —
not about what to do… but who to be around.

Because energy is contagious.

Spend enough time with people who lack direction, urgency, or ambition…
and slowly, without realizing it, you begin to slow down too.

Not dramatically.
Not instantly.
But subtly — in your thinking, your pace, your standards.

And in fields like cinema and creativity, that’s dangerous.  

Cinema doesn’t reward comfort.
It rewards momentum, collaboration, and dynamism.

Ideas move fast.
Opportunities shift quickly.
People who act — win.

If your environment is dull, slow, or filled with excuses,
you’re not just standing still — you’re falling behind.

There’s nothing wrong with outgrowing spaces or people.

It’s not arrogance.
It’s alignment.

Start spending time with those who:

  • Think big and act fast
  • Value time and execution
  • Push boundaries instead of discussing limitations
  • Operate with clarity, not confusion

People who don’t just talk about goals —
but move toward them every single day.

A stagnant environment feels safe.
But nothing grows there.

Growth happens in motion.
In pressure.
In speed.

That’s why you don’t swim with dead fish.
You swim with sharks.

Not because they’re aggressive —
but because they are alive, aware, and always moving.

Final Thought...

Life is short.
Your time, your energy, your focus — all limited.

Don’t dilute them in spaces that don’t challenge you.
Don’t invest them in conversations that don’t elevate you.

Choose your circle like you choose your future.

Because in the end,
you don’t just create your work — you become your environment.

-Manohar Chimmani 

Sunday, 12 April 2026

ప్రతి ఒక్కరూ ఒక మీడియా హౌజ్ కిందే లెక్క!


ఇప్పుడు, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రతి ఒక్కరూ ఒక మీడియా హౌజ్ కిందే లెక్క! 

మనకిష్టమైన కంటెంట్ ఏదైనా రాసుకోవచ్చు. పబ్లిష్ చేసుకోవచ్చు. 

అయితే - ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒక ప్రయోజనం తప్పనిసరిగా ఉండాలి.  

ఏం రాస్తున్నాం?
ఎందుకు రాస్తున్నాం?
ఏదైనా లాభముందా?
డబ్బొస్తుందా?
మన లక్ష్యానికి పనికొచ్చే కొత్త లీడ్స్ దొరుకుతాయా? 
ఊరికే వ్యక్తిగత సంతృప్తి కోసమేనా?
రిలాక్స్ కోసమా? 
ఏదైనా స్ట్రెస్ నుంచి, సమస్య నుంచి డైవర్షన్ కోసమా?

ఈ క్లారిటీ చాలా అవసరం.

ఈ క్లారిటీ లేకుండా జుకెర్‌బర్గో, ఈలన్ మస్కో చెప్పినట్టు చేస్తున్నాం అంటే... మనం వాళ్ళకు ఉపయోగపడుతున్నట్టు లెక్క. కాని, మన మీద బిలియన్స్ సంపాదిస్తున్న మస్క్, బర్గ్‌లను మనం కూడా వాడుకోవాలన్నది నా పాయింట్!

- మనోహర్ చిమ్మని 

Cinema is Not Art Alone. It’s an Industry.


Cinema has always been celebrated as an art form — storytelling, emotion, creativity. But today, cinema is no longer just art. It is a serious business ecosystem.

Budgets are rising. Markets are expanding. Audiences are evolving.
And with that, one truth is becoming clearer... 

A film that doesn’t make money struggles to survive — no matter how creative it is.

This doesn’t mean creativity should die.
It means creativity must align with market awareness.

The audience is not wrong.
The market is not the enemy.
They are signals.

The real craft today is not just making a good film — but making a film that connects, engages, and sustains financially.

Because sustainability builds freedom.
And freedom builds better cinema.

- Manohar Chimmani 

Friday, 10 April 2026

Too Much Thinking, Too Little Living


This is not about the rare 1%—the ones who can balance learning and action effortlessly. They exist. But most of us aren’t them.

For the rest of us, there’s a trap.

Too much reading is like overeating.
At first, it feels productive. Even satisfying.
You feel like you’re growing, evolving, becoming smarter.

But slowly… it turns into overload.

You consume more than you can process.
You analyze more than you can act on.
And somewhere along the way, clarity disappears.

Over analysis doesn’t create better decisions.
It delays them.
It complicates them.
Sometimes, it kills them completely.

You keep thinking, refining, researching—
but you don’t move.

And movement is everything.

Because progress doesn’t come from knowing more.
It comes from doing more.
From messy action.
From imperfect starts.

In the end, it’s simple:
If you keep feeding your mind without using it,
you don’t become wiser—
you become stuck.

Think less.
Do more.

- Manohar Chimmani

ఫెయిలవ్వడానికి సులభమైన మార్గం


ఏ విషయంలో అయినా ఫెయిలవ్వడానికి సులభమైన మార్గం ఏంటంటే... అందరినీ సలహా అడగటం. 

కట్ చేస్తే -

ఆర్థికసంబంధమైన విషయాల్లో ఎవరినైనా సలహా అడిగే ముందు, నిజంగా అవతలివాళ్ళు ఆ విషయంలో ఏ కొంచెమైనా సాధించారా అన్నది చూడకుండా సలహా అడగటం అంత అజ్ఞానం ఇంకోటి ఉండదు. 

ఇతర విషయాల్లో కూడా, నువ్వు సలహా తీసుకోవాలనుకునే సబ్జెక్టులో అవతలివాళ్ళు నీకంటే కనీసం ఎంతో కొంత ఎక్కువ ముందే సాధించి ఉండాలి.   

దురదృష్టవశాత్తూ మనం అలాచేయం.

కంఫర్ట్ జోన్లో, మనకిష్టమైన వ్యక్తులతో మాత్రమే మన విషయాల్ని షేర్ చేసుకుంటాం. సలహాలను అడుగుతాం. 

ఎందుకంటే, అది మన కంఫర్ట్ జోన్ కాబట్టి.  

- మనోహర్ చిమ్మని 

Wednesday, 8 April 2026

పాకిస్తాన్ - ఒక అంతులేని కథ


పాకిస్తాన్ మన కశ్మీర్‌లో కొంత ఆక్రమించుకోవడం... మన దేశంలోకి టెర్రరిస్టులను అదేపనిగా పంపిస్తుండటం... మన జవాన్లను రకరకాలుగా చంపుతుండటం... సరిహద్దుల దగ్గర ఎప్పుడూ ఏదో ఒకటిచేస్తూ నిరంతరం మన ఆర్మీకి, ఇతర సేనలకు నిద్రలేకుండా పని కల్పిస్తుండటం... దేశంలో ఎక్కడో అక్కడ బాంబింగ్స్ చేయిస్తూవుండటం... ఇవన్నీ దశాబ్దాలుగా వింటున్నాం. చూస్తున్నాం.   

పాకిస్తాన్ ఒక చిన్న దేశం. 
మన దేశం కంటే వైశాల్యంలో నాలుగింతలు చిన్నది. 

నిజంగా అనుకుంటే, అమెరికాలాగా ఒకే ఒక్క ఎటాక్‌తో పాకిస్తాన్‌ను మళ్ళీ మన జోలికిరాకుండా దెబ్బతీయొచ్చు. అక్కడ మనకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటుచెయ్యొచ్చు. 

మన నాయకులు, గవర్నమెంట్స్ ఇవేవీ చెయ్యవు. 

ఇంకో వందేళ్లయినా ఇదే "పాకిస్తాన్ బూచి" కథ ఒక ముగింపు లేని సీరియల్‌లా నడిపిస్తూనేవుంటారు. ఆ బూచిని చూపిస్తూ, ఇక్కడ ఓట్లను ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూనేవుంటారు. చేస్తూ గెలుస్తూనేవుంటారు. 

కట్ చేస్తే - 

ఇదే పాకిస్తాన్ బూచిని చూపిస్తూ మనవాళ్ళు ఇప్పటికే ఓ 200 సినిమాలు తీశారు. ఇంకా తీస్తున్నారు. తీస్తూనే వుంటారు.  

పాకిస్తాన్ - ఒక అంతులేని కథ.   

- మనోహర్ చిమ్మని 

Power, Silence, and the Cost of Distraction


Why do powerful nations start wars?
Why can a head of another country be taken out with precision—yet global threats like terrorism continue to exist?
Why has the same pattern repeated across decades?

And where, in all of this, does global accountability truly stand?

These aren’t just political questions.
They are human questions.

History shows that actions by powerful countries often come wrapped in narratives—security, defence, justice. Sometimes those reasons are genuine. Sometimes they are strategic. Often, they are complicated.

Take leaders like Donald Trump—decisions made during such tenures are rarely isolated. They sit on top of decades of foreign policy patterns shaped by institutions like the United Nations, alliances, intelligence networks, and geopolitical interests.

But here’s the uncomfortable thought:
If precision exists to eliminate a single target across borders…
why does the world still struggle to eliminate broader threats?

Is it a lack of capability?
Or a question of priorities?

And then comes the silence.

Many countries choose restraint—not always out of agreement, but out of dependence, diplomacy, or fear of escalation. Global systems are deeply interconnected.

Speaking up has consequences. Staying silent does too.

But the real impact goes beyond politics.

Every such conflict sends ripples through the world:

  • economies shake
  • uncertainty rises
  • millions of lives are indirectly affected

And in a quieter, less visible way—
creativity suffers.

Because creativity needs space.
It needs mental clarity, emotional stability, and a steady flow of funds to sustain ideas and execution.


But when the world feels unstable, distracted, and tense…
people don’t create as freely. They react. They survive. They hesitate.

So, this isn’t just about one country versus another.
It’s about the collective attention of the world being pulled into cycles of conflict and reaction.

And maybe that’s the deeper question we should be asking:

Not just why these things happen—
but what they are costing us as a global society.

Because beyond politics, beyond power—
there’s a quieter loss happening.

The loss of focus.
The loss of peace.
The loss of creative potential.

Stay aware of the world—but don’t let it consume your mind. Protect your focus, your clarity, and your ability to create.

- Manohar Chimmani 

Tuesday, 7 April 2026

Upgrade Your Thinking, Not Just Your Tools


We’re holding cutting-edge technology in our hands…
yet many of us are still operating with outdated thinking.

Clinging to old mindsets, inherited patterns, and rigid ways of working might have made sense decades ago—but today, they’re silent barriers. You simply can’t create modern results with ancient approaches.

What’s surprising isn’t just that this exists—
it’s that even younger generations are stuck in the same trap.

We have 2026-level tools.
But too often, a stone-age mindset.

And that gap?
That’s where potential gets wasted.

Because progress today isn’t about access—it’s about adaptation.
It’s about how fast you can unlearn, relearn, and evolve.

A 10X mindset doesn’t mean doing 10 times more work.
It means thinking differently. Acting boldly. Letting go of what no longer serves you.

Question your habits.
Challenge your defaults.
Upgrade the way you think, not just the apps you use.

Because the future doesn’t reward those who hold on—
it rewards those who move forward.

Identify one outdated belief or habit you’re still holding onto—and replace it with a 10X action today.

- Manohar Chimmani 

Monday, 6 April 2026

Buy Your Freedom Back


Money isn’t just about comfort—it’s about choice.

The quiet power of earning well is this: you no longer have to stay where you don’t belong.
Not in draining conversations. Not in toxic environments. Not in situations that slowly steal your peace.

When you have money, you gain something far more valuable—time freedom.

Time to think.
Time to create.
Time to choose your energy, your people, your path.

And here’s the truth most people miss:
Money doesn’t change who you are. It reveals how you want to live.

So don’t chase money just to spend it.
Build it so you can protect your peace … and design a life that actually feels like yours.

Create value. Stay consistent. 
Let your discipline, and your creativity become your leverage.

Because the goal isn’t just to make a living—
It’s to make a life you don’t need to escape from.

Today, take one step toward financial independence—learn, build, or earn. Start small, but start now.

- Manohar Chimmani 

Vision Has No Budget


Even Christopher Nolan didn’t begin with endless time or money—but he never allowed that to shrink his vision.

That’s the real difference.

Most creatives wait.
For the “right” moment.
The “perfect” budget.
Better equipment. More support.

But the ones who actually make it?
They create anyway.

Because low budget doesn’t mean low vision.
It means you sharpen your instincts. You become intentional. You find smarter ways to tell your story.

Constraints aren’t your enemy.
They’re your training ground.

They force you to think deeper, push harder, and discover solutions you would’ve never found in comfort.

So stop focusing on what’s missing.
Start building with what’s in your hands.

Because your vision?
That’s the one thing you cannot afford to compromise.

Today, pick one idea you’ve been postponing—and take the first step. Shoot it, write it, start it. No excuses.

- Manohar Chimmani

Sunday, 5 April 2026

చేయాల్సినవాళ్ళు రిలీజ్ చేసినప్పుడే...


ఇందాక ఒక ఇండిపెండెంట్ ఫిలిమ్మేకర్ ఇంటర్వ్యూ బైట్ ఒకటి చూశాను. 

పాత విషయమే అయినా, తాజాగా ఇంకోసారి...

"ఇండిపెండెంట్ ఫిలిమ్మేకర్స్ కోట్లు పెట్టి మొత్తం సినిమా తీసి, పబ్లిసిటీ చేసి, క్యూబులు గీబులు కట్టుకొని థియేటర్స్ ఉన్నవాళ్ళ చేతుల్లోపెడితే, రిలీజ్ చేసి 50% తీసుకుంటున్నారని."

బిజినెస్ అలాగే ఉంటుంది. 

వాళ్ళు థియేటర్స్ ఇవ్వకపోతే వీళ్ళకి థియేటర్స్ దొరకవు. అంతే కాదు, థియేటర్స్ దొరికినా, రెంటు కట్టి రిలీజ్ చేసుకోడానికి ఇండిపెండెంట్ ఫిలిమ్మేకర్స్ దగ్గర అప్పటికే డబ్బులు అయిపోయుంటాయి. 

సో... రిలీజ్ చేసుకోలేరు.

రిలీజ్ చేసే మెకానిజం ఉన్నవాళ్ళు రిలీజ్ చేసినప్పుడే అది హిట్టా ఫట్టా తెలుస్తుంది. సినిమా కొంచెం అటుఇటుగా ఉన్నా, చేయాల్సినవాళ్ళు రిలీజ్ చేసినప్పుడే అది హిట్ అయ్యే చాన్స్ ఉంటుంది. హిట్ అవుతుంది. 

ఇప్పుడు 50% పోవచ్చు. కాని, వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ వాల్యూ ఇండిపెండెంట్ ఫిలిమ్మేకర్స్‌కు కొత్తగా ఒక ఇమేజ్ తెస్తుంది. ఎన్నో కొన్ని డబ్బులొస్తాయి. గట్స్ ఉంటే, మరిన్ని సినిమాలు ఈజీగా తీసుకోవచ్చు. మరిన్ని హిట్లు కొట్టొచ్చు. తర్వాత మీరూ ఆ స్థాయికి ఎదగొచ్చు. 

ఇదే లాజిక్. 

సో... ఏదీ ఊరికే రాదు! 

Cinema isn’t just art on screen—it’s a high-stakes business built on vision, risk, and massive scale.

- మనోహర్ చిమ్మని     

Saturday, 4 April 2026

No Mood. Just Work.


Amateurs wait for mood.
Professionals build regardless.

You won’t always feel like it.
That’s the point.

Discipline is doing the work
even when your mind resists it.

No drama.
No overthinking.

Just execution.

Don’t wait to feel it. Build it.

- Manohar Chimmani 

Friday, 3 April 2026

నీ సినిమా ఎప్పుడు?


ఓకే.
రాష్ట్రంలో ప్రభుత్వం మారింది.
ప్లాన్స్ అన్నీ ఉల్టాపుల్టా అయిపోయాయి.
మార్కెట్లో మనీ ఫ్లో లేదు. 

నేను చూస్తుండగానే నాకు తెలిసిన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, వాళ్ళ ఆరు ఆఫీసుల్ని మూసేసింది. చివరికి, మిగిలిన ఆ ఏడో ఆఫీసు కూడా 'ఇప్పుడా అప్పుడా' అన్నట్టుంది. చెప్పాలంటే, దాదాపుగా అది కూడా మూసేసినట్టే.

హైద్రాబాద్‌లోని అన్ని ప్రధాన బిజినెస్ సెంటర్స్‌లో ఖాళీ అయిన ఎన్నో ఆఫీసులు, వ్యాపార సంస్థల బిల్డింగులకు "టు లెట్"లు వేలాడుతున్నాయి. 

కట్ చేస్తే -

బార్లు నడుస్తున్నాయి.
హాస్పిటల్స్ నడుస్తున్నాయి. 
స్కూళ్ళు కాలేజీలు నడుస్తున్నాయి. 

సినిమాలు కూడా తీస్తున్నారు, వారం వారం రిలీజ్ అవుతున్నాయి. 
మరి, నీ సినిమా ఎప్పుడు? 

- మనోహర్ చిమ్మని  

ఈ లూప్ లోంచి బయటపడ్డవాడే కింగ్ !!


'నాగురించి ఎవరేమనుకుంటున్నారో' అని ఆలోచించేవాళ్ళు ఒక్క అడుగు ముందుకేయలేరు.

సినీఫీల్డులో ఉన్నవాళ్లకయితే ఇది మరీ ముఖ్యం. ఇక్కడ సిచువేషన్ అలా ఉంటుంది. 

ఇంకా చెప్పాలంటే - ఒక దట్టమైన అడవిలో ఉన్నామనుకోవాలి. ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలి. ఎటునుంచి ఏదైనా, ఎప్పుడైనా, ఏరూపంలోనైనా ఎటాక్ చేయొచ్చు. 

కొంచెం అటుఇటుగా ఇదే విషయం పూరి జగన్నాధ్ ఇంటర్వ్యూల్లో, పాడ్‌కాస్ట్‌లో పదేపదే చెప్పాడు.

"ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలి" అన్న ఈ బేసిక్ సూత్రం ఫీల్డులో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి, టాప్ రేంజ్‌లో ఉన్నవాళ్లనుంచి... ఇప్పుడే ఎంట్రీ ఇచ్చిన న్యూ టాలెంట్ దాకా .. అందరికీ వర్తిస్తుంది. దీనికి ఎలాంటి మినహాయింపులు లేవు. సవరణలు లేవు.

ఇలాంటి ఆటవిక వాతావరణంలో - ఏదైనా అనుకుంటే వెంటనే చేసెయ్యాలి. మిస్ ఫైర్ అయిందనుకోండి. ఇంకో ప్రయత్నం. బట్, ప్రయత్నం మానొద్దు. ఏదో ఒక పనిలో ఉండటం మానొద్దు.  

ఒకసారి బ్రేక్ తీసుకున్నామా, స్టకప్ అయ్యామా... చుక్కలు కనిపిస్తాయి.  

కట్ చేస్తే - 

ఒకసారి తప్పు చేస్తే అది తప్పు. రెండోసారి కూడా అదే తప్పుచేస్తే అది అలవాటు. ఆ అలవాటు ప్రకంపనలే మనం తీసుకునే నిర్ణయాలు. మన నిర్ణయాలే మన తప్పులు.

ఇదంతా ఒక లూప్. 

ఈ లూప్ లోంచి బయటపడ్డవాడే కింగ్. 

- మనోహర్ చిమ్మని

పి యస్:
నిన్న అనుకోకుండా "ఒక్కడు" డైరెక్టర్ గుణశేఖర్ వీడియో బైట్స్ రెండు యూట్యూబ్‌లో చూశాక, దీన్ని రీపోస్ట్ చెయ్యాలనిపించింది. 
     

Thursday, 2 April 2026

Luck Is Edited in Post


“Luck” makes for a nice story.
But it’s a terrible strategy.

In film, what looks like a lucky break is hours of unseen work—retakes, rewrites, relentless effort. The audience sees the final cut. They don’t see the grind behind it.

Life works the same way.

Luck doesn’t exist.
Massive action does.

The more you show up, the more you attempt, the more you put yourself in motion—the “luckier” you seem. Not because chance favours you, but because you’ve created more chances.

Opportunities don’t knock randomly.
They appear where action lives.

So, stop waiting for luck.
Start stacking action.

Because in the end, luck is just the byproduct of those who refuse to stay still.

What’s one bold action you can take today? Take it—no waiting.

-Manohar Chimmani  

Wednesday, 1 April 2026

The Gap Between Noise and Impact


Everyone talks. Few are heard.

Communication is easy—it’s just words moving from one mouth to another ear.
Connection is rare—it’s when something lands, when a thought becomes a feeling.

You don’t connect by saying more.
You connect by seeing more understanding the person in front of you.

People don’t remember your words.
They remember how you made them feel in the silence between them.

Speak to impress, and you’ll be forgotten.
Speak to connect, and you’ll be remembered.

Next time you speak, ask yourself—am I talking, or am I truly connecting?

-Manohar Chimmani