"రాందాస్ అన్న చెప్పిండంటే ఇంక అంతే. మీరు నన్ను గారు-గీరు-సర్ అని కూడా అనొద్దు అన్నా. ఏం షూటింగ్ చేసుకుంటరో చేసుకోండి. మీ ఇష్టం. మీకు కావల్సినవన్ని మావోళ్ళు అరేంజ్ చేస్తరు!"
మా రాందాస్‌తో కాల్ చేయించుకొని షూటింగ్ లొకేషన్ కోసం వెళ్ళిన సందర్భంగా, షామీర్ పేట లోని ఒక పెద్ద కాలేజ్ చైర్మన్ నాతో అన్న మాట అది.
కట్ చేస్తే -
ఓయూలో నా ఎమ్మే సహాధ్యాయి, నా ఆత్మీయ మిత్రుడు రాందాస్‌ను మావాళ్ళంతా ఒక జోకర్‌లా ట్రీట్ చేసేవాళ్ళు. సందు దొరికితే చాలు, మాలో కొంతమంది ఇప్పటికీ రాందాస్ మీద చిల్లర జోకులేస్తూ, అప్పటి స్థాయిలోనే ట్రీట్ చేయడానికి ఇష్టపడతారు. వాడు కూడా పెద్దగా పట్టించుకోడు. కాని -
రెండు కాలేజీల యజమాని రాందాస్ ఇప్పుడు ఎక్కడున్నాడు, వీళ్లంతా ఎక్కడున్నారన్నది నా హంబుల్ కొశ్చన్.
రెండు కాలేజీల యజమాని రాందాస్ ఇప్పుడు ఎక్కడున్నాడు, వీళ్లంతా ఎక్కడున్నారన్నది నా హంబుల్ కొశ్చన్.
- Manohar Chimmani

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani