Sunday, 4 October 2026

మనోహర్ చిమ్మని "కోపరేటివ్ ఫిలిం మేకింగ్ హబ్"


1992 లోనే, హాలీవుడ్‌లో రాబర్ట్ రోడ్రిగ్జ్ ఇదే పద్ధతిలో "ఎల్ మరియాచి" తీశాడు. సోషల్ మీడియా అంతగా లేని కాలంలోనే, 2007లో, నా రెండో సినిమా "అలా" ఈ పద్ధతిలోనే తీశాను. 2011లో ఆర్జీవీ "దొంగల ముఠా" కూడా ఇదే పద్ధతిలో తీశాడు.

ప్రపంచవ్యాప్తంగా ఇంకెందరో ఇండిపెండెంట్ ఫిలిమ్మేకర్స్ ఇప్పటికీ ఇదే పద్ధతిలో చాలా సినిమాలు చేస్తున్నారు.   

కట్ చేస్తే - 

అసలేంటీ కోపరేటివ్ ఫిలిం మేకింగ్?

కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పద్ధతిలో - పాతవాళ్లయినా, కొత్తవాళ్లయినా - ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు రెమ్యూనరేషన్ ముందు ఇవ్వటం అనేది అసలు ఉండదు. సినిమా పూర్తయ్యి, రిలీజయ్యి, లాభాలు వచ్చాకే ఆ లెక్కలు. దీనికి ఒప్పుకున్నవాళ్లే సినిమాలో పనిచేస్తారు.

సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరి ఇన్వెస్ట్‌మెంట్ కంట్రిబ్యూషన్ (మనీ/పని) ఏదో ఒక రూపంలో ఎంతో కొంత ఉంటుంది.   

ఇలా ఎందుకంటే - ఇలాంటి సినిమాలకు రెగ్యులర్ ప్రొడ్యూసర్ ఉండడు కాబట్టి.

ఇండిపెండెంట్ ఫిలిం అన్నమాట. 

అనుకున్న బడ్జెట్‌ను నలుగురయిదుగురు - లేదా - ఒక పదిమంది లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్ ఒక్కొక్కరికి వీలైనంత షేర్ చేసుకుని బడ్జెట్ కలెక్ట్ చేస్తారు. సినిమా బడ్జెట్ కోటి కావచ్చు, రెండు కోట్లు కావొచ్చు. ఐదు కోట్లు కావచ్చు. మేం పూల్ చేసుకున్న ఆ బడ్జెట్‌ను మేకింగ్‌కు, ప్రమోషన్‌కు మాత్రమే వాడతాం.    

నో కాల్ షీట్స్.
నో టైమింగ్స్.
అంతా... రెనగేడ్ ఫిల్మ్ మేకింగ్.
గెరిల్లా ఫిల్మ్ మేకింగ్.   

ప్రొడ్యూసర్స్, స్టార్స్ లేని ఇండిపెండెంట్ సినిమాల విషయంలో, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఈ ఒక్క పద్ధతే ఎక్కువగా విజయవంతంగా నడుస్తోంది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా, ఈ పద్ధతిలో తీసిన ఎన్నో సినిమాలు ఎప్పటికప్పుడు ఫిలిం ఫెస్టివల్స్‌లోనూ, కమర్షియల్‌గానూ అద్భుత విజయాల్ని రికార్డు చేస్తున్నాయి.  

ఇలా కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పద్ధతిలో ప్లాన్ చేసి తీసే సినిమాలు మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. మంచి బిజినెస్ చేస్తాయి... ప్రొవైడెడ్, సరైన స్ట్రాటజీతో చేస్తే!  

కట్ చేస్తే -   

పూర్తిగా న్యూ టాలెంట్‌తో, లేటెస్టుగా నేను షూటింగ్ పూర్తిచేసిన రోడ్-క్రైమ్ సినిమా "ఎర్ర గులాబి" ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఇప్పుడు తాజాగా నేను చేస్తున్న ఇంకో రెండు ఫీచర్ ఫిలిమ్స్ ఈ పద్ధతిలో చేస్తున్నవే. ఈ రెండు సినిమాల ప్రిప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పుడు ఏక కాలంలో జరుగుతోంది.   

అందరిలోనూ టాలెంట్ తప్పకుండా ఉంటుంది. అయితే... మా స్క్రిప్టుకి, మా కోపరేటివ్ ఫిలిం మేకింగ్ సెటప్‌కు సూటయ్యే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ను మాత్రమే మేం మా ప్రాజెక్టుల్లోకి తీసుకుంటాం. 

ఫిలిం ప్రొడక్షన్లో మాతో అసోసియేట్ కావాలనుకొనే చిన్న ఇన్వెస్టర్స్ కూడా మా హబ్‌లో చేరొచ్చు. మీ ఇన్వెస్ట్‌మెంటుకి లీగల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది.  

Interested? 
DM me.   

ఈ దసరాకు మా కొత్త సినిమా ఎనౌన్స్ చేస్తున్నాం.  

"It's a kind of fun to do the impossible!"
- Walt Disney 

- మనోహర్ చిమ్మని  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani