Tuesday, 6 October 2026

చివరికి మిగిలేది జ్ఞాపకాలే!


24 ఏళ్ళ తర్వాత... నేను గతంలో సుమారు 11 ఏళ్ళపాటు పనిచేసిన మా ఆలిండియా రేడియో ఎఫ్‌యమ్ స్టేషన్, కర్నూలుకు అప్పటి నా కొలీగ్స్-ఆత్మీయ మిత్రులు కామేశ్వరరావు, మోహన్‌రెడ్డిలతో కలిసి నిన్న ఉదయం వెళ్ళాము. 

ఒక 6 గంటలపాటు అప్పటి జ్ఞాపకాల్లో మునిగితేలాం. 

మాతోపాటు అప్పటి కొలీగ్-మిత్రులు కేవీ కృష్ణ, యస్వీఆర్ లక్ష్మీదేవి కూడా ఉన్నారు. 

మధుర"గాయ"కుడు కృష్ణ మా అందరికీ ఇచ్చిన ఎంటర్‌టైన్మెంటు, కంపెనీ... అద్భుతం. 

లక్ష్మీదేవి గారి ఆత్మీయ ఆతిథ్యం సూపర్బ్. 

వచ్చే జూన్ 30, 2027 నాడు లక్ష్మి గారి రిటైర్మెంటుకు మళ్ళీ మన కర్నూలు రేడియో స్టేషన్‌కు వెళదాం అనుకున్నాం. 

"వీలైతే అప్పుడు మనం సాధ్యమైనంత ఎక్కువ మంది కలుద్దాం" అని మా ఏఐఆర్ గ్రూప్‌లో ఒక మెసేజ్ పెట్టాను. 

మంగళూరు నుంచి మిత్రుడు డిసౌజా వెంటనే స్పందించాడు... "జూన్‌లో నేను వస్తున్నా" అని!  

కట్ చేస్తే - 

నిన్న మా ఆలిండియా రేడియో కర్నూల్లో... అడ్మినిస్ట్రేషన్ గది, లైబ్రరీ, ట్రెక్స్ రూం, ఎనౌన్సర్ రూం, రికార్డింగ్ స్టూడియో, కంట్రోల్ రూం... ఇవన్నీ తిరుగుతుంటే అప్పటి నా కొలీగ్స్ అంతా నా చుట్టూ అక్కడే ఉన్నట్టే ఫీలయ్యాను. 

అప్పటి నా కొలీగ్స్‌లో ప్రతి ఒక్కరూ పేరుపేరునా గుర్తుకొచ్చారు. 

నిన్న రాత్రి హోటల్లో నేనూ, కామేశ్, మోహన్ "కూర్చుని" మాట్లాడుకుంటున్నప్పుడు ఇదే సంతోషాన్ని మళ్ళీ మళ్ళీ నెమరేసుకున్నాం.

చాలా తక్కువ సమయంలో ప్రోగ్రాం అనుకొని కర్నూలుకు రావటం, ట్రిప్ సక్సెస్ చేసుకోవడం... నిజంగా చాలా సంతోషాన్నిచ్చింది మా ముగ్గురికీ.     

ఈ సందర్భంగా, నా ఆలిండియా రేడియో కొలీగ్ మిత్రులందరికీ నిజంగా... వందనం... అభివందనం!    

Live moment-to-moment,
live according to your own light of awareness,
according to your own consciousness.
Be responsive to each moment. 
~ Osho

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani