Saturday, 6 December 2025

మనోహర్ చిమ్మని "రెనెగేడ్ ఫిల్మ్ క్లబ్"


మీకు తెలుసా? 
మొన్న ఒక్క నవంబర్ నెలలోనే తెలుగులో దాదాపు ఒక 40 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒకే ఒక్క సినిమా హిట్ అయింది. అది, "రాజు వెడ్స్ రాంబాయి". ఇంకో సినిమా, "ఆంధ్రా కింగ్ తాలూకా"కు బాగుంది అన్న టాక్ వచ్చింది కాని, రావల్సిన కలెక్షన్ రాలేదు.   

సినిమాల హిట్-ఫ్లాప్‌ల విషయంలో పెద్దా చిన్నా ఏం ఉండదు. పోస్ట్ కోవిడ్ రోజుల నుంచి ప్రేక్షకులు కూడా క్రమంగా ఓటీటీలకే పరిమితం అవుతున్నారు. థియేటర్స్‌కు వెళ్ళి సినిమా చూసే ప్రేక్షకులు ఇంకా ఇంకా తగ్గిపోతారు.      

ఈ నేపథ్యంలో -
ఎంత చిన్న బడ్జెట్‌లో సినిమా తీయగలం?
ఎంత మంచి కంటెంట్ ఇవ్వగలం?
ఏ స్థాయి హిట్ ఇవ్వగలం?...
అన్నదే ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ విషయంలో కొత్త చాలెంజ్ అయింది.  

కట్ చేస్తే -  

1992 లోనే, హాలీవుడ్‌లో రాబర్ట్ రోడ్రిగ్జ్ ఇదే పద్ధతిలో "ఎల్ మరియాచి" తీశాడు. 

సోషల్ మీడియా లేని కాలంలోనే, 2007లో, నా రెండో సినిమా "అలా" ఈ పద్ధతిలోనే తీశాను. 2011లో ఆర్జీవీ "దొంగల ముఠా" కూడా ఇదే పద్ధతిలో తీశాడు. ప్రపంచవ్యాప్తంగా ఇంకెందరో ఇండిపెండెంట్ ఫిలిమ్మేకర్స్ ఇప్పటికీ ఇదే పద్ధతిలో ఎన్నెన్నో అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు.  

కట్ చేస్తే -  

కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పద్ధతిలో - పాతవాళ్లయినా, కొత్తవాళ్లయినా - ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు రెమ్యూనరేషన్ ముందు ఇవ్వటం అనేది అసలు ఉండదు. 

సినిమా పూర్తయ్యి, రిలీజయ్యి, లాభాలు వచ్చాకే ఆ లెక్కలు. దీనికి ఒప్పుకున్నవాళ్లే సినిమాలో పనిచేస్తారు.

సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరి ఇన్వెస్ట్‌మెంట్ కంట్రిబ్యూషన్ (మనీ/పని) ఏదో ఒక రూపంలో ఎంతో కొంత ఉంటుంది.   

ఎందుకంటే - 
ఇండిపెండెంట్ కోపరేటివ్ సినిమాలకు ప్రొడ్యూసర్ ఉండడు. 

సినిమా కోసం అనుకున్న బడ్జెట్‌ను నలుగురయిదుగురు -లేదా- ఒక పదిమంది లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్ తలా కొంత షేర్ చేసుకుంటారు.  

సినిమా బడ్జెట్ కోటి కావచ్చు, రెండు కోట్లు కావొచ్చు. మేం పూల్ చేసుకున్న ఆ బడ్జెట్‌ను మేకింగ్‌కు, ప్రమోషన్‌కు మాత్రమే వాడతాం.   

నో కాల్ షీట్స్.
నో టైమింగ్స్.
నో ట్రెడిషనల్ ఫిల్మ్ మేకింగ్ రూల్స్.
అంతా... రెనగేడ్ ఫిల్మ్ మేకింగ్. 

ప్రొడ్యూసర్స్, స్టార్స్ లేని ఇండిపెండెంట్ సినిమాల విషయంలో, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఈ ఒక్క పద్ధతే ఎక్కువగా విజయవంతంగా నడుస్తోంది. 

ఈ కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పద్ధతిలో ప్లాన్ చేసి తీసే సినిమాలు మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. మంచి బిజినెస్ చేస్తాయి. ప్రొవైడెడ్, సరైన స్ట్రాటజీతో చేయగలిగితే. 

కట్ చేస్తే -  

పూర్తిగా న్యూ టాలెంట్‌తో, మొన్నీ మధ్యే నేను షూటింగ్ పూర్తిచేసిన రోడ్-క్రైమ్-డ్రామా "ఎర్ర గులాబి" ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. 

ఇప్పుడు తాజాగా నేను చేస్తున్న రెండు ఫీచర్ ఫిలిమ్స్ ఈ పద్ధతిలో చేస్తున్నవే. ఈ రెండు సినిమాల ప్రి-ప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పుడు ఏక కాలంలో జరుగుతోంది. 

ఈ సిస్టమ్‌లో నాతో కలిసి మా టీమ్‌లో పనిచేయాలనుకొనే కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఇన్వెస్టర్లు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు.  

Email: okafilmmaker@gmail.com
WhatsApp (text message only): +91 9989578125

అలాగే - సినిమాల పట్ల ఆసక్తి, ప్యాషన్, సీరియస్‌నెస్ ఉన్న న్యూ టాలెంట్ నా వాట్సాప్ చానల్ "MC Renegade Film Club" లో జాయిన్ కావచ్చు.   

నా కొత్త సినిమాల ప్రకటన, ప్రారంభం, షూటింగ్, ప్రోగ్రెస్ లాంటి వివరాల అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఈ చానెల్లో పోస్ట్ చేస్తుంటాము. ముఖ్యంగా కొత్తవారికి అవకాశాలు, ఆడిషన్స్ వివరాలు ఈ చానెల్లోనే ముందుగా పోస్ట్ చేస్తాము. 

"It's a kind of fun to do the impossible!"
- Walt Disney 

Friday, 5 December 2025

అంతులేని హిపోక్రసీ


ఫిలిం ఇండస్ట్రీలో ఆర్టిస్టులైనా, టెక్నీషియన్స్ అయినా, హీరోలైనా, డైరెక్టర్స్ అయినా, గాయకులయినా, రచయితలైనా... వారి వారి రంగాల్లో వాళ్ళ ప్యాషన్ కోసం పనిచేస్తారు. డబ్బు కోసం పనిచేస్తారు. పేరు కోసం పనిచేస్తారు.  

అంతే తప్ప - ప్రజల కోసమో, ప్రజాసేవకోసమో ఉచితంగా ఎవ్వరూ పనిచేయరు. 

ఇది నిజం. 
అలాగని, ఇది తప్పు కాదు. 

మన అభిరుచిని బట్టి వీళ్ళల్లో కొందరు మనకు బాగా నచ్చుతారు.       

ఒక్క ఫిలిం ఇండస్ట్రీ అనే కాదు... ఇతర క్రియేటివ్ రంగాల్లోనివారికి కూడా దాదాపు ఇదే వర్తిస్తుంది.  

కట్ చేస్తే -

ఇలాంటి వ్యక్తిగత కళాత్మక జర్నీకి అంతులేని హిపోక్రసీతో మనలో కొందరు ఇంకేదో భారీ రేంజ్ కవరింగ్ ఇస్తారు. 

అదంతా ఒక పెద్ద మాస్ హిస్టీరియా. 

అదొక తృప్తి.
అదొక ఆనందం. 
అంతకంటే ఏం లేదు. 

- మనోహర్ చిమ్మని  

2026 కి... 26 రోజులు!


2025లో అసలు ఏం చేశాం? ఏం సాధించాం?

అసలేమన్నా చేశామా?
పనికొచ్చే పనులేం చేశాం? 
పనికిరాని పనులేం చేశాం? 

శేఖర్ కపూర్, మణిరత్నం చెప్పినట్టు - ఈ ఫీల్డులో పనిచేస్తున్నందుకు - ప్రత్యక్షంగా, పరోక్షంగా - ఎవరెవరితో ఎన్ని మాటలు పడ్డాం, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాం? 

ఎంతమంది నానా కథలు చెప్పి మనకు హ్యాండిచ్చారు? మనం ఎన్నిసార్లు మాట తప్పాం? 

చేసిన తప్పులే చేస్తున్నామా? కొత్త తప్పులు కూడా చేశామా? ఏం నేర్చుకున్నాం?      

తీసుకున్న నిర్ణయాలేంటి? ఎన్నిటికి నిలబడ్డాం? ఎన్ని మార్చుకున్నాం?  

... ఒక అరగంటో, గంటో అంతర్విశ్లేషణ చాలా అవసరం. 

ఆర్థికం.
సాంఘికం.
వ్యక్తిగతం. 

అంతర్విశ్లేషణ చాలా అవసరం. 

కనీసం ఇలాంటి ఒక సందర్భం వచ్చినప్పుడైనా, మన కోసం మనం ఇలా కొన్ని నిమిషాలైనా కెటాయించుకోవాలి. మనతో మనం "మన సమయం" గడపాలి. 

ఇది అవసరం. 
ఇదే అవసరం.

ఈ విషయంలో క్లారిటీ లేకుండా ఇంకేం చెయ్యలేం. 

- మనోహర్ చిమ్మని 

Thursday, 4 December 2025

Is Writing About Spirituality a Crime?


Sometimes people ask, “Why do you write so much about spirituality? Isn’t it too personal? Too serious? Too much?”

But here’s the truth...

Writing about spirituality is not a crime.
For many of us, it is survival. 

We write about it because the world is noisy.
Because life pulls us in a hundred directions.

Because the mind gets tired, the heart gets confused, and the soul needs a reminder that it still exists.

Spirituality is not preaching.
It is remembering.

Remembering who we are behind the stress, behind the ambition, behind the daily chaos.

Sometimes we write for entertainment.
Sometimes we write for fame.
Sometimes we write for money.

And some of us write to stay awake — to breathe deeper, live slower, and touch that quiet place inside that still feels alive.

Writing about spirituality is not a crime.
It is an offering. 
A mirror.

A hand reaching out in the dark, saying...
“You’re not alone. There is still light in you.” 

And if a few lines can bring peace to even one person — then it’s not just writing.

It’s service.
It’s healing.
It’s truth in words. 

- Manohar Chimmani 

Wednesday, 3 December 2025

విగ్రహాలు పెట్టడం ఒక అవుట్‌డేటెడ్ కాన్సెప్ట్


ఈ పోస్టుకి, రవీంద్రభారతిలో విగ్రహం గొడవకి సంబంధం లేదు.

కట్ చేస్తే -

అసలు విగ్రహాలు పెట్టడం అన్నది పూర్తిగా ఒక అవుట్‌డేటెడ్ కాన్సెప్ట్ అని నా అభిప్రాయం. 

పెట్టిన విగ్రహాలన్నీ రోడ్లమీద దుమ్ముకొట్టుకొనిపోయుంటాయి. ఎవ్వడూ అటువైపు చూడడు. పుట్టినరోజో, పోయినరోజో వచ్చినప్పుడు తప్ప. 

అప్పుడు కూడా, విగ్రహం పక్కనే ఫిక్స్‌డ్‌గా పాతేసిన ఇనుప నిచ్చెనల మీదకెక్కి దండలేసి, పూలు గుమ్మరించే పొలిటీషియన్స్ ఫోటోల కోసమే తప్ప, ఇంకెప్పుడూ ఎవ్వరూ అటువైపు చూడరు. 

మనవాళ్ళ ఇంకో పెద్ద మతిలేని పని ఏంటంటే - విగ్రహాల ప్రాముఖ్యతను, అందాన్ని మింగేసే సైజులో ఒక నల్లటి ఇనుప నిచ్చెనను అక్కడ పక్కనే పాతెయ్యడం! 

ఇలాంటి గొప్ప అద్భుతం ఒక్క మన దేశంలోనే అనుకుంటాను మనం చూసేది. 

కట్ చేస్తే -      

విగ్రహం చూస్తే తప్ప గుర్తుకురారు అని ఎలా అనుకుంటాం? విగ్రహం పెట్టుకుంటే తప్ప స్మరించుకున్నట్టు కాదు అని ఎలా అనుకుంటాం?  

ఆయా వ్యక్తులు చేసిన పనులు, సాధించిన గొప్ప లక్ష్యాలే వారిని ప్రజల మనస్సుల్లో చిరస్మరణీయంగా నిలబెడతాయి.       

ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్రాల అభివృద్ధి కోసం, దేశాన్ని ఒక అగ్ర రాజ్యం చేయడం కోసం అందరి ఆలోచన, అందరి తపన, అందరి కృషి టాప్ ప్రయారిటీలో ఉండాలి. ఒక జపాన్ లాగా, ఒక చైనా లాగా, ఒక రష్యా లాగా. మిగిలినవన్నీ ఉట్టుట్టి రాజకీయాలే. ఇప్పుడైనా ఎప్పుడైనా.   

ప్రాక్టికల్‌గా పనికొచ్చే పనులు తప్ప, 99% మంది మనవాళ్ళు మిగిలిన అన్ని పనులు చెయ్యడానికి పోటీపడుతుంటారు. 

ఏదీ సాఫీగా ఉండొద్దు. ఏదో ఒకటి గెలకాలి. దారి మళ్ళించాలి. నేపథ్యంలో సొంత ప్రయోజనాలు కూల్‌గా నెరవేర్చుకొంటూవుండాలి. 

మన ఆలోచనావిధానంలో, మన సమాజంలో, మన రాజకీయాల్లో ఒక లేయర్ లేయరే కొట్టుకుపోతే తప్ప... ఇంకో వందేళ్ళయినా... మనం ఇలా ఒక "అభివృద్ధిచెందుతున్న దేశం" చందంగానే వుంటాం.   

- మనోహర్ చిమ్మని        

Tuesday, 2 December 2025

The Renegade Wave Begins


This month, I’m starting something wild, raw, and absolutely uncompromised — a series of no-budget / micro-budget cooperative renegade feature films.

Not theory. Not discussion. Actual films. Back-to-back. 

No call sheets.
No timings.
No outdated rules.

Just pure passion, grit, and the magic of filmmaking.

I’m building this with likeminded, film-passionate people in my team — the kind who don’t wait for permission, funding, or validation. The kind who want to create and keep creating.

The cast and crew will be total newcomers.

Fresh energy. Fresh faces. Fresh madness.

Music will matter.
Beauty will matter.

The vibe, the tone, the raw aesthetic — everything will be crafted to make the screen feel alive.

And let me be honest — 
I make movies to make money…
so I can make more movies. 

That’s the cycle. That’s the mission.

This is renegade.
This is cooperative cinema.
This is a movement.

Updates will follow next week. 
Stay tuned — because this wave is about to hit hard. 

- Manohar Chimmani