మీ అందరితో చాలా చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత, మళ్ళీ జనజీవనస్రవంతిలోకి వస్తూ, నేను చేసిన మొట్టమొదటి పని... మీ అందరితో టచ్‌లో ఉండాలనుకోవడం. వెంటనే ఈ గ్రూప్ క్రియేట్ చేశాను.
It's wonderful to reconnect with all of you on this platform after such a long time. Thank you all for being here.
కట్ చేస్తే -
మనం అందరం కలవటం అనేది ఎప్పుడో కాని జరగదు. ఓయూలో మన ఎమ్మే జ్ఞాపకాలు, ఫోటోలు షేర్ చేసుకుంటూ, కనీసం ఇలా వాట్సాప్ గ్రూపులోనైనా వీలైనంత రెగ్యులర్‌గా పలకరించుకుంటూ టచ్‌లో ఉందాం అన్న ఉద్దేశ్యంతో నేను ఈ గ్రూప్ ప్రారంభించాను.
చాలామంది రిటైర్ అయ్యారు. ఉద్యోగం బిజీ ఉండకపోవచ్చు, కాని రిటైర్ అనంతర బాధ్యతలు కూడా కొన్ని ఉంటాయనుకుంటాను. మొత్తానికి చాలా మంది బాగానే బిజీగానే ఉన్నారని అర్థమవుతోంది.
ఇది మన ప్రి-క్లైమాక్స్ స్టేజ్. టైమ్ మనచేతుల్లో ఉండదు. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. ఉన్నన్నాళ్ళూ వీలైనంత హాప్పీగా-సరదాగా-స్ట్రెస్ లేకుండా ఉంటే మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. ఈ కోణంలో అయినా మిత్రులంతా యాక్టివ్‌గా గ్రూపులో పాల్గొంటే బాగుంటుంది కదా!
ఒక లైక్, ఒక స్మైల్, ఒక కామెంట్, చెత్త పోస్టు ఎవరైనా పెడితే తిట్టొచ్చు, నవ్వుకోవచ్చు, మేం మర్చిపోయిన జ్ఞాపకాల్ని మీరూ గుర్తుచేయొచ్చు. మీ దగ్గరున్న ఫోటోలు షేర్ చెయ్యొచ్చు. మీ ఇంట్లో శుభవారతలు, మీరు సాధించిన విజయాలు, మీరు మాతో షేర్ చేసుకోవాలనుకొనే విషయాలు, మీ రచనలు, మీ కవితలు, మీ విమర్శలు... వాట్ నాట్... డీసెంట్‌గా డిగ్నిఫైడ్‌గా మనం దాదాపు ఇంకా మన ఎమ్మే క్లాస్‌లోనే ఉనంట్టుగా ఈ గ్రూపులో ఉండొచ్చు.
కాని, ఎందుకో కొంతమంది మిత్రులు అసలు సైలెంట్‌గా ఉంటున్నారు. నా వైపు నుంచి ఏదైనా పొరపాటు జరిగితే చెప్పండి. కరెక్ట్ చేసుకుంటాను. సజెషన్స్ ఇవ్వండి. అమలు చేద్దాం. కాని, యాక్టివ్‌గా ఉండండి... అని సవినయ మనవి!
If participating in this group is causing any issues for you, I won’t force anyone to stay. I'll make a decision based on my intuition tomorrow.
Best wishes, always!😎💐🙏💖🤝🤞🥁🥁🥁🥁
కట్ చేస్తే -
My post next day... 👇
Hi Friends!
గ్రూప్ క్రియేట్ చేశాను.
ఎందుకు చేశానో చెప్పాను.
ఇక మీ ఇష్టం,
తాంబూలాలిచ్చాను...
ఒక వారం పదిరోజులు నా ప్రాజెక్టు పనుల్లో కొంచెం బిజీ నేను.
అప్పటిదాకా గ్రూపును ఉండనిస్తారనే నమ్మకం! ;-)
You rock... 💐😎🤞
- Manohar Chimmani
- Manohar Chimmani
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani