Monday, 13 January 2025

కమ్యూనికేషన్ & కో-ఆర్డినేషన్ అంటే ఇలా ఉంటుందా?


అన్ని ప్రొఫెషన్స్ వేరు, సినిమా ప్రొఫెషన్ వేరు. 

ఇది 9-5 జాబ్ కాదు. ఎప్పుడు చేతిలో పని ఉంటుందో, ఎప్పుడు ఉండదో చెప్పలేం. ఉన్నప్పుడు మాత్రం దాని మీదే పూర్తి ఫోకస్ పెట్టి ఒక తపస్సులా పనిచేయాలి. 

ఎంత చేస్తున్నా మన మీద రాళ్ళు పడుతుంటాయి... అది వేరే విషయం. 

మనం తప్పు చేయనంతవరకు అలాంటి రాళ్లను పట్టించుకోనవసరం లేదు. ఆ రాళ్లతోనే ఒక దుర్గం కట్టుకోవాలి. 

ఇప్పుడు నేను చేస్తున్న ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది. ఒక రెనెగేడ్ పద్ధతిలో చేసుకుంటూపోతున్నాం. 

13, 14 సెలవులు. 15 నుంచి మళ్ళీ షూటింగ్ ఉంది. 

15 నుంచి షూటింగ్ చెయ్యాలంటే, దానికి సంబంధించిన 101 పనుల్ని 13, 14 తేదీల్లో రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం పండగల్ని త్యాగం చెయ్యాల్సిన పనిలేదు. కాని, పని అంటూ ఉంటుంది. చేసుకోవాలి. గంటో, రెండు గంటలో... మెంబర్స్ అంతా కో-ఆర్డినేట్ చేసుకోవాలి.   

పండగలు చేసుకోవద్దని ఎవరూ అనరు. కాని, పండగల్ని పండగలా చేసుకొనే దశకు చేరుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న త్యాగాలు చెయ్యాలి. ఇంకా కష్టపడాలి.  

అది ఎవరి కోసమో కాదు. మన కోసం. 

కట్ చేస్తే - 

మొన్న జనవరి 4 నాడు "మాకు కమ్యూనికేషన్ లేదు, కో-ఆర్డినేషన్ లేదు" అని మొత్తుకొని, ఇంక నానా మాటలతో మొత్తం టీమ్ స్పిరిట్‌ను చంపుకున్న పదిరోజుల్లోనే... ఇంకో అత్యంత బాధ్యతారాహిత్యమైన సంఘటన జరగటం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. 

మా టీంలోని 5 గురు ముఖ్యమైన మెంబర్స్, కనీసం "నేను ఊరెళ్తున్నాను" అని కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, కనీసం మెసేజ్ కూడా లేకుండా వెళ్ళడం ఏదైతే ఉందో... వారిలోని కేర్‌లెస్‌నెస్‌కు పరాకాష్ట.  

ఇంతకంటే అవమానకరం ఇంకోటి ఉండదు.   

అయితే ఈ అవమానం నాకు కాదు. 

వారికే. 

అసలు ఇలా జరగడానికి కారణం ఎవరు? పరోక్షంగా ఏ సంఘటన టీంలో మరీ ఇంత మినిమం స్టాండర్డ్స్‌ను కూడా పాటించలేని చిల్లర స్థాయి ప్రవర్తనకు దారి తీసింది?

దేన్నయినా బిల్డ్ చెయ్యడానికి చాలా సమయం పడుతుంది. కూలగొట్టడానికి ఒక్క నిమిషం చాలు.    

జస్ట్ ఇంకో వారం. అంతే.   

మ్యాటర్ ఓవర్.  

- మనోహర్ చిమ్మని  

1 comment:

  1. red rose team lo red flower behaviour !!!! not acceptable....

    ReplyDelete

Thanks for your time!
- Manohar Chimmani