కేన్ అండ్ ఏబెల్, ఫస్ట్ ఎమాంగ్ ఈక్వల్స్ వంటి అద్భుత నవలలతో నేనొక వొరేషియస్ ఇంగ్లిష్ పాఠకున్ని కావడానికి కారణమైన జెఫ్రీ ఆర్చర్ ఇక లేరు. ఆయనకు 86 ఏళ్ళు.
నిన్న లండన్లో మరణించిన ఆర్చర్ 41 పుస్తకాలు రాశారు. వాటిలో 27 నవలలు. ఆర్చర్ పుస్తకాలు వివిధ భాషల్లోకి కూడా అనువదింపబడి 300 మిలియన్ల కాపీలకుపైగా అమ్మటం జరిగింది.
జెఫ్రీ ఆర్చర్ పొలిటీషియన్ కూడా. యాక్టివ్ పొలిటీషియన్‌గా ఉంటూనే, ఒక బెస్ట్ సెల్లర్ రైటర్‌గా చాలా నవల్స్ రాశాడు.
జెఫ్రీ ఆర్చర్ పొలిటీషియన్ కూడా. యాక్టివ్ పొలిటీషియన్‌గా ఉంటూనే, ఒక బెస్ట్ సెల్లర్ రైటర్‌గా చాలా నవల్స్ రాశాడు.
కట్ చేస్తే -
నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు తార్నాకలో మూలమీదున్న ఇంగ్లిష్ నవల్స్ అద్దెకిచ్చే డబ్బాలో రెంటుకు తీసుకొని చదివేవాన్ని. అప్పుడు ఒక పుస్తకం అద్దె రోజుకి 20 పైసలు. ఇంకోరోజు పెరిగితే 20+20 నలభై పైసలు అద్దె అవుతుందని కొన్ని ఇంగ్లిష్ నవల్స్‌ను 24 గంటల్లో కూడా చదివాను.
ఆర్చర్ నవల్స్‌లో ఎక్కువ నవల్స్ తార్నాకలోని ఈ డబ్బాలోనే అద్దెకు తీసుకొని చదివాను. తర్వాత సీన్ ఆబిడ్స్ ఆదివారం మార్కెట్‌కు మారింది. ఆబిడ్స్ ఫుట్‌పాత్ మీద ఇంగ్లిష్ నవల్స్ కొనడం అలవాటైంది.
థాంక్యూ, సర్ జెఫ్రీ ఆర్చర్.
Rest in peace.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani