ఇందులో ఎలాంటి మాయ లేదు. మర్మం లేదు.
రైట్ టైమ్‌లో రైట్ డెసిషన్స్ తీసుకోవడం. "ఎవడేమనుకున్నా సరే, ఏదేమైనా సరే... నేను సాధిస్తున్నాను, సాధించి తీరతాను" అనే కిల్లర్ ఇన్‌స్టింక్ట్.
అతనిలోని సహజసిద్ధమైన ఇంకొన్ని క్వాలిటీస్ కూడా వీటికి బాగా తోడయ్యాయి.
మా సినిమా ప్రపంచం నుంచి రాజకీయాల్లో ఇటీవల ఇదే అతిపెద్ద రికార్డు. రేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోను తన రేంజ్ సత్తా చూపించడానికి ఇది చాలు.
ఇంతకు ముందు ఎన్నికల్లో తాను పోటీచేసిన రెండుచోట్లా ఓడిపోవడం ఆయన్ను డిజప్పాయింట్ చెయ్యలేదు. ఇంచ్ కూడా వెనక్కి తగ్గనీయలేదు.
మొన్న అక్టోబర్‌లో చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టినప్పుడు, వెళ్ళి కలిశాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడు. "బాబుతో నేనున్నాను, మేం కలిసి పోటీచేస్తాం" అని బయటికొచ్చి రెండు మాటలు చెప్పాడు.
నా ఉద్దేశ్యంలో - అతని ఈ ఒక్క నిర్ణయం ఒక సెన్సేషనల్ బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌లా పనిచేసింది.
కట్ చేస్తే -
"పార్టీ పెట్టింది పోటీ చెయ్యడానికి కాదు, ప్యాకేజీల కోసం" అని ఎన్నోరకాల మాటలతో ఎగతాళి చేసినవాళ్లందరికీ మొహం మీద గుద్దినట్టుగా స్ట్రెయిట్ సింగిల్ పంచ్ ఆన్సర్.
"పార్టీ పెట్టింది పోటీ చెయ్యడానికి కాదు, ప్యాకేజీల కోసం" అని ఎన్నోరకాల మాటలతో ఎగతాళి చేసినవాళ్లందరికీ మొహం మీద గుద్దినట్టుగా స్ట్రెయిట్ సింగిల్ పంచ్ ఆన్సర్.
21/21, 2/2... 100% మాండేట్!
దటీజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
Heartfelt congratulations to Power Star Pawan Kalyan on this special occasion! Wishing you a powerful tenure ahead as an even more powerful politician!!
- Manohar Chimmani
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani