సినీఫీల్డు ఒక మెకన్నాస్ గోల్డ్ సినిమాలాంటిది.
ఒక పెద్ద గోల్డ్ మైన్ ఉందిక్కడ.
అన్ని ఫీల్డుల్లాగే ఇక్కడా మంచీచెడూ అన్నీ ఉంటాయి. ఎవ్వరికీ రెడ్ కార్పెట్ ఉండదు. ఖచ్చితంగా ఇది ఇలా జరుగుతుంది అన్న గ్యారంటీ అస్సలు ఉండదు.
కష్టపడాలి, సాధించుకోవాలి.
ఇలాంటి నేపథ్యంలో... ఎన్నో రిజెక్షన్స్, అవమానాలు, కష్టాలు ఎదుర్కొంటూ... పడుతూ లేస్తూ... ఆ గోల్డ్ మైన్ నుంచి ఎవరికి చేతనైనంత షేర్ వాళ్ళు తవ్వుకోవచ్చు.
అలా టన్నులకొద్దీ తవ్వుకున్నవాళ్ళే కింగ్స్, క్వీన్స్.
ఎంతో కొంత సాధించి, ఫీల్డుతో కాస్తంతయినా టచ్‌లో ఉన్నవాళ్ళు నిజంగా లక్కీ ఫెలోస్.
సినీఫీల్డులో పనిచేస్తున్నాను అని చెప్పుకొనే ఆ కిక్కే వేరు.
సినిమా తీయడమే ఒక పెద్ద సక్సెస్.
హిట్ ఇచ్చామా... అది బోనస్. కట్ చేస్తే -
హాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా ఇంతే... అదొక సిస్టమ్.
మనం సాధించలేనిదానికి ఫీల్డుని అనాల్సిన పనిలేదు. అలా అనటం మనకి మనం చెప్పుకొనే సాకు తప్ప మరొకటి కాదు.
నెగెటివ్ థింకింగ్.
విక్టిమ్ మెంటాలిటీ.
ఈ రెండిటినీ ఒక్క తన్ను తన్నాలి.
సిస్టమ్‌ను ఉన్నదున్నట్టుగా స్వీకరిస్తూ, ఒక్కటే ఒక్క గోల్‌తో స్ట్రాటెజిక్‌గా ముందుకుపోవటమే మనం నిరంతరం చేయాల్సింది.
మనకు రావాల్సింది గన్‌షాట్‌గా అదే వస్తుంది.
మనకు రావాల్సింది గన్‌షాట్‌గా అదే వస్తుంది.
ఇంకోసారి చెప్తున్నాను... సినీఫీల్డులో పనిచేస్తున్నాను అని చెప్పుకొనే ఆ కిక్కే వేరు.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani