ఎలా, ఎందుకు అని పెద్ద చర్చ అవసరం లేదు.
తల బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు.
మీకిష్టమైన ఏ పొలిటీషియన్నయినా తీసుకోండి. పాలిటిక్స్ లోకి ప్రవేశించిన ప్రారంభపు రోజుల్లో వారి ఆర్థిక స్థితిగతులేంటి, ఆస్తులెన్ని... ఇప్పటి వారి ఆర్థిక స్థితి ఏంటి, ఆస్తులెన్ని... అప్పటి వారి మెయింటెనెన్స్ స్థాయి ఏంటి, ఇప్పటి మెయింటెనెన్స్ ఏంటి?
ఒక్క క్షణం ఆలోచించండి. పిచ్చి క్లారిటీ వస్తుంది.
ఒక్క క్షణం ఆలోచించండి. పిచ్చి క్లారిటీ వస్తుంది.
రాజకీయాలంటే అంత పెద్ద బిజినెస్.
ఇంక పవర్ సంగతి చెప్పాల్సిన పన్లేదు.
కట్ చేస్తే -
ఈ పాపులర్ పొలిటీషియన్స్ అందరికీ వారి దగ్గరి అనుయాయులతో, చిన్నా పెద్దా వలయాలు కొన్నుంటాయి. వాళ్లంతా కూడా చూస్తుండగా కోట్లకెదుగుతారు. పవర్ ఉంటుంది. వాళ్ళ సోషల్ ఇమేజ్ పెరుగుతుంది. వాళ్ల పనులన్నీ చకచకా అవుతుంటాయి.
ఏ మార్పుకు నోచుకోని గుడ్డి మాలోకం ఒక్కటే.
అది ఎవరన్నది నేను వివరంగా చెప్పాల్సిన పన్లేదు.
- మనోహర్ చిమ్మని
