Thursday, 12 June 2025

అతడొచ్చాడు!


"మీకు సో అండ్ సోతో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మీరు ఆ ప్రాబ్లంతో బాధపడుతున్నారు" అన్నాడతను.

"అసలు అలాంటిదేం లేదు" అన్నాన్నేను. 

కొంచెం తడబడ్డాడతను. 

"ప్రాబ్లం ఉండాలే" అన్నాడు మళ్ళీ.
"లేదు" అన్నాను నవ్వుతూ. 

"మీకు ఆ సమస్య వస్తుంది... దగ్గరలో ఉంది" అన్నాడు మళ్ళీ.
"ఎక్కడిదాకొచ్చిందో చూసి, లైవ్ లొకేషన్ పెట్టండి" అన్నాను. 

చెప్పడానికేం లేక, మాట మార్చాడతను. 

కాని, నేను వదల్లేదు. 

"నాకున్నది ఒకే ఒక్క సమస్య. డబ్బు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లేటవుతోంది. పదిరోజుల్లో అయిపోవాలి. ప్రిప్రొడక్షన్లో ఉన్న ఇంకో సినిమాకు రావల్సిన ఫండింగ్ లేటవుతోంది మా ప్రొడ్యూసర్‌కు. జూలైలో షూటింగ్ ఉంది. నిజంగా మీకంత పవర్ ఉంటే ఇది కూడా సెట్ చెయ్యండి. వారంలో అయిపోవాలి. మీకు మంచి ఫీజు ఇప్పిస్తాను... 5%" అన్నాను నవ్వుతూ. 

ఇబ్బందిగా నవ్వాడు. 
ఎందుకంటే ఆయన దగ్గర సమాధానం లేదు. 

కట్ చేస్తే -

నేనతన్ని జ్యోతిష్యం చెప్పమనలేదు. అతనిలో అలాంటి విద్యలున్నాయని కూడా నాకు తెలీదు. అసలు ఆ విద్యలంటేనే నాకు చాలా చిరాకు. 2025లో కూడా ఇలాంటివారున్నారా అని బాధపడతాను.  

అతను మా ఆఫీసుకి వచ్చిన పని వేరు. అది చూసుకొని వెళ్ళాలి. కాని, మనుషుల బలహీనత మీద ఆడుకునే తన పాండిత్యం నా మీద ప్రదర్శించబోయాడు. 

పాపం బ్యాడ్‌లక్... నేను అలాంటి బకరా కాలేకపోయాను. 

వెయ్యో పదివేలో రాలేవి... మిస్ అయ్యానే అని బాధపడి ఉంటాడు.

సినిమావాళ్ళ దగ్గర లక్షలు కోట్లుంటాయి. ఇలాంటివాళ్ళ మాటలకు కొందరు పడిపోతారు. వేలు, లక్షలు ఇచ్చి పూజలు చేయించుకుంటారు, పాదాభివందనాలు చేస్తారు. 

కాని, అక్కడేం జరగదు. 
ఉట్టిదే. హంబగ్.  

ఏదైనా జరిగిందీ అంటే... అది మన కృషి వల్ల, మనం చేసే నిరంతర ప్రయత్నాల వల్ల. అంతే. 

అలాగని నేను నాస్తికున్ని కాదు. 
మన సనాతన శాస్త్రాలను, ధర్మాలను నమ్మననీ కాదు. 
కాని, ఇలాంటి చెత్తరకం చీటింగులకు మాత్రం వ్యతిరేకం.    

ఇలాంటివాళ్లే యూట్యూబుల్లో "ఆ హీరోకి ప్రాణగండం ఉంది... ఈ హీరోహీరోయిన్లు విడాకులు తీసుకుంటారు... ఆ డైరెక్టర్ పనైపోయింది" అని నానా సొల్లు వాగుతుంటారు. లక్షల్లో వ్యూస్, కోట్లల్లో ఆదాయం సంపాదిస్తుంటారు. 

జస్ట్ మనిషి బలహీనత మీద!    

- మనోహర్ చిమ్మని  

100 Days, 100 Posts. 52/100. 

Wednesday, 11 June 2025

సముద్రం నాకిష్టం! (కథ)


ఒక జీవితకాలమో, ఒక దశాబ్దమో ప్రేమించుకుంటేనే ప్రేమని ఎవరన్నారు? జీవితపు ఆఖరి నిమిషం దాకా మర్చిపోలేని ఒక చూపు, ఒక చిరునవ్వు, ఒక సంభాషణ, ఒక పోట్లాట, ఒక కౌగిలి, ఒక ముద్దు, అనుకోకుండా ఒక్కటైన ఒక రాత్రి, అయిష్టమైన ఒక వీడ్కోలు... ఇవన్నీ ప్రేమకథలే.        

ఎక్కడో మనసు పొరల్లో కుక్కిపెట్టి వుంచిన ప్రేమల్ని ఒప్పుకోడానికి కూడా, ఎవరికైనా సరే చాలా ధైర్యం కావాలి. తొంభైతొమ్మిది శాతం ప్రేమికుల్లో ఈ ధైర్యం ఉండే అవకాశం లేదు. ఉంటే గింటే, లోపల్లేపలే తమ ప్రేమల్ని ఇలా జీవితకాలం ఎందుకు కుక్కిపెట్టుకుంటారు? చచ్చేదాకా ఇలా ప్రేమరాహిత్యంలో ఎందుకు చస్తూ బ్రతుకుతారు?  

సముద్రం ముందో, బస్సులో కిటికీ పక్కనో కూర్చుంటే ఇలాంటి ఆలోచనలు ఎన్నయినా వస్తాయి. వస్తూనే వుంటాయి. ఫ్లయిట్‌లో కూర్చొని లాప్‌టాప్ ఓపెన్ చేసినప్పుడు కూడా అంతే, అన్నీ ఇలాంటి ఆలోచనలే!      

సముద్రం నాకిష్టం.   

కేవలం మూడురోజుల పరిచయంలో, సముద్రం కంటే శక్తివంతమైన ఎన్నో తుఫానుల్ని, సునామీల్ని నా జీవితంలో సృష్టించి, అంతిమంగా నా జీవితాన్ని నేను కోరుకొన్న మలుపుకి తిప్పిన పద్మప్రియ అంటే కూడా నాకు చాలా ఇష్టం.

ప్రతి వంద ప్రేమకథల్లో తొంభైతొమ్మిది ప్రేమకథల గురించి ఈ ప్రపంచానికి తెలీదు. తెలిసే అవకాశం లేదు. తెలియాల్సిన అవసరం కూడా లేదు.

బహుశా ఇది కూడా అలాంటి ప్రేమకథే కావచ్చు...  

***

సరిగ్గా ఆరేళ్ళ క్రితం, మాహాబలిపురం దగ్గర రేడిసన్-బ్లూ రిసార్ట్‌లో మూడు రోజులపాటు జరిగిన ఒక క్రియేటివ్ రిట్రీట్‌లో ఓ అద్భుతం జరిగింది.  

వివిధ సృజనాత్మక రంగాల్లో పనిచేస్తున్న సుమారు వంద మంది కళాకారులు, వ్యాపారవేత్తలతో కూడిన ఆ రిట్రీట్‌లో అది మొదటిరోజు. ఒక్కొక్కరు తమ గురించి పరిచయం చేసుకుంటుంటే నాకంత ఆసక్తిగా అనిపించలేదు.  

"ఏముంది... ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకోవడమేగా!" అనుకున్నాను. 

కాకపోతే, ఇలాంటి రిట్రీట్స్‌లో కొంచెం ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. రీచార్జ్ అవుతారు. దాదాపు ఇక్కడ గడిపే ప్రతి గంటా చాలా ఎగ్జయిటింగ్‌గానే ఉంటుంది. మూడు రోజుల ఈ కార్యక్రమం ఇక్కడ అయిపోయాక, తిరిగి ఎవరి షెల్స్‌లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక నలుగురైదుగురు మాత్రం బాగా షైన్ అవుతారు, బాగా సంపాదిస్తారు, జీవితాన్ని అనుక్షణం అనుభవించే అనుదిన లక్ష్యంతో ముందుకెళ్తుంటారు. 

అయితే ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కళ్ళూ ఆ నలుగురిలో నేనూ ఒకరినవుతాననే మాయలో ఉంటారు. మిగిలినవాళ్ళంతా మళ్ళీ అదే నిత్యసంఘర్షణ, మళ్ళీ అదే రొటీన్ దినచర్యతో, అంతే చప్పగా బ్రతుకు వెళ్ళదీసే పనిలో పడతారు. 

ఇదంతా నా బుర్రలో తిరుగుతుండగా, వేదిక మీదున్న పీక్ పర్ఫామెన్స్ ట్రెయినర్ మాకొక పని చెప్పాడు. 

"మీ పక్కన కూర్చున్నవారిని వదిలేసి, ఆ తర్వాత వ్యక్తితో కలిసి మీరు జంటలుగా మారండి" అన్నాడు. 

చకచకా అందరూ లేచి సీట్లు మారసాగారు.  

నా పక్కన కూర్చున్నతను లేచి, తన జంట వ్యక్తి కోసం అవతలి పక్కకి వెళ్ళాడు. అతను ఖాళీ చేసిన సీట్లోకి వచ్చి కూర్చోడానికి, అవతలి సీట్లో నుంచి లేచిందొక యువతి. క్రీమ్ కలర్ స్లీవ్‌లెస్ షర్టు, బ్లూ జీన్స్‌లో మెరుపుతీగలా వుంది. ముఖం మీదకు పడివున్న సిల్క్ జుట్టును చేత్తో అలవోగ్గా భుజాలమీదకు తోసేసుకుంటూ నావైపు చూసింది. నా గుండె కొట్టుకోవటం ఒక్క క్షణం ఆగిపోయింది.  

లైట్ పింక్ లిప్‌స్టిక్ వేసుకున్న ఆ పెదాలు నావైపే నవ్వుతూ పలకరించాయి. ఈ మధ్యకాలంలో నేనసలు చూడని కాటుక దిద్దిన కళ్ళు మెరుస్తూ నన్నే చూస్తున్నాయి. తను వేసుకున్న షర్టుకీ, జీన్స్‌కీ మధ్య వొంపుతిరిగి నున్నగా కనిపిస్తున్న ఆమె నడుము నా కళ్ళను అక్కడే ఫ్రీజ్ చేసింది.  

తన పేరు చెప్పి, నాకు తను ఎప్పుడు షేక్‌హాండిచ్చిందో, నేనెప్పుడు తన చేతికి నా చేతినందిస్తూ ఆ సుకుమారపు మెత్తదనాన్ని స్పర్శించానో నాకసలు గుర్తే లేదు. 

నా పక్క సీట్లోకి వచ్చి చాలా క్యాజువల్‌గా కూర్చొంటూ, తనకేం సంబంధం లేనట్టుగా నా చుట్టూ ఒక సుగంధపు వలయం సృష్టించిందామె. ఆ వలయంలో ఉక్కిరిబిక్కిరి అవుతూనే, ఎదురుగా డయాస్ పైన ట్రెయినర్ చెప్తున్న అంశాలపై బలవంతంగా దృష్టిపెట్టాను.     

చేతిలో వున్న రైటింగ్ ప్యాడ్‌లో వూరూ పేరూ, వయస్సు, చదువు వంటి అంశాలతో వీలైనంత పూర్తి బయోడేటా ఒక్క పేజీలో రాయమన్నాడు ట్రెయినర్. 

అందరం రాశాక, దాన్ని "మీ జంటలో ఒకరికొకరు మార్చుకోండి" అన్నారు. మార్చుకున్నాం. 

ఆమె పేరు పద్మప్రియ.  

నలభై దాటిన వయస్సు అని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. నాకంటే సుమారు ఏడెనిమిదేళ్ళు చిన్నది. అబ్‌స్ట్రాక్ట్ ఆర్టిస్టు. ప్రఖ్యాత రష్యన్ అబ్‌స్ట్రాక్ట్ ఆర్టిస్టు వసీలీ కందేన్‌స్కీ ఆమె అభిమాన ఆర్టిస్టు. బాగానే సంపాదిస్తోంది.   

అయితే - బయోడేటాలో నేను వెతుకుతున్న అంశం ఒకటి కనిపించలేదు, ఆమెకు పెళ్ళయిందా లేదా అన్నది!  

నాకే నవ్వొచ్చింది. ఇప్పుడామెకు పెళ్ళికాకపోతే మాత్రం పెళ్లయిన నేనేం చెయ్యగలను? ఆ చెయ్యగలిగిందేదో ఆమెకు పెళ్ళయితే మాత్రం చెయ్యలేనా?          

ఫోన్ నంబర్, సోషల్ మీడియా లింకులతో సహా ఇంకెన్నో వివరాలు రాయమన్న ఈ ట్రెయినర్ "పెళ్లయిందా, లేదా" అన్న విషయం ఎందుకని రాయమనలేదో నాకర్థం కాలేదు.    

అసలు పెళ్ళితోనే కదా లొల్లి? అప్పటిదాకా జీవితంలో మనం ఊహించనివీ, మనకు నచ్చనివీ ఎన్నో మొదలవుతాయి. మనకిష్టమైనవీ, మనం ఊహించుకొన్నవీ అన్నీ మన జీవితంలోంచి అదృశ్యమవుతాయి. 

మనకు దొరకనిదేదో అన్వేశిస్తూ ఇంత దూరం వచ్చినా, ఇక్కడ కూడా వీళ్ళకి ఆ పెళ్ళిని గుర్తుచేయడం ఎందుకనుకున్నాడో ఏమో... అసలు ఇంట్రో-ఫామ్‌లో పెళ్ళి గురించే అడగలేదు ట్రెయినర్!    

నేనిలా ఆలోచనల్లో ఉండగానే ఇంకో గంట గడిచింది. ఎదురుగా డయాస్ మీద ట్రెయినర్ ఏవేవో ఆర్టిస్టిక్ ప్రొడక్టివిటీ విషయాలు చెప్తున్నాడు. మేం వింటున్నాం. బహుశా, వింటున్నట్టుగా నటిస్తూ ఎవరి ఆలోచనల్లో వారున్నాం అనుకుంటాను. 

మధ్యమధ్యలో ట్రెయినర్ చెప్తున్న కొన్ని "వావ్" అనిపించే విషయాల్ని వింటూ తలలు తిప్పి ఒకరినొకరం చూసుకొంటున్నాం. ట్రెయినర్ చెప్పినట్టుగా మా చేతులు పైకెత్తి "హైఫైలు" ఇచ్చికొంటున్నాం. ట్రెయినర్ రాయమన్నది రాస్తున్నాం, చెప్పమన్నది చెప్తున్నాం. అరవమంటే అరుస్తున్నాం. ఇన్ని జరుగుతున్నా, నా పక్కనే కూర్చొని, నా చుట్టూ పద్మప్రియ సృష్టించిన ఆ కొత్త బంగారులోకపు వలయంలోంచి నేను బయటకు రాలేక, అందులోనే ఉక్కిరిబిక్కిరి అవుతుండటం నాకే ఆశ్చర్యంగా ఉంది.     

"మీరు ఎపటికప్పుడు వాయిదా వేస్తూ, చెయ్యగలిగిన సామర్థ్యం ఉన్నా మీరు చెయ్యలేకపోతున్న, మీకు ఎంతో ఇష్టమైన పని ఏంటి? అలా చెయ్యలేకపోడానికి మీకు మీరే సమర్థించుకొంటూ చెప్పుకుంటున్న కారణాలేంటి?" 

ఉన్నట్టుండి ట్రెయినర్ అడిగిన ఈ ప్రశ్న నన్ను నిశ్శబ్దంలో పడేసింది. అలా నేనొక్కన్నే అనుకున్నాను. కాని, నా పక్కనే కూర్చున్న పద్మప్రియతో సహా హాల్లో కూర్చున్న వంద మందీ సడీ చప్పుడు లేకుండా అయిపోయారు.  

"రెండే రెండు వాక్యాల్లో రాయండి" అన్నాడు ట్రెయినర్. 

అందరిచేతుల్లో పెన్నులూ ప్యాడ్లూ బిజీ అయిపోయాయి. 

అయిదు నిమిషాల తర్వాత, ఒకరు రాసింది మరొకర్ని చదవమన్నాడు ట్రెయినర్. 

అలా అనటం ఆలస్యం... చప్పున తన నోటింగ్ ప్యాడ్ నాకిచ్చి, దాదాపు లాక్కున్నట్టుగా నాచేతుల్లో ఉన్న ప్యాడ్ లాక్కుంది పద్మప్రియ. 

ఇప్పటిదాకా నా మనసులోనే దాచుకొన్న నా అత్యంత వ్యక్తిగత విషయం ఒకటి, ఈరోజు వరకూ నాకు పరిచయం లేని బయటి వ్యక్తి తనెవరో చదువుతుందన్న ఆలోచన నాకు రాలేదు. తనేం రాసిందో చూడాలన్నదే ఆ క్షణం నా ఆసక్తి.      

"ఇంగ్లండ్ లోని ప్రఖ్యాత ఆర్ట్ గేలరీ "ఫ్రేమ్‌లెస్"లో నా ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టాలని నేను ఎప్పట్నుంచో అనుకొంటున్నాను. అది నాకు అసాధ్యమైన పనేం కాకపోయినా, నాకు నేనే పరిమితులు పెట్టుకొంటూ ఎప్పటికప్పుడు వాయిదావేస్తూవస్తున్నాను” అని రాసింది పద్మప్రియ. 

పద్మప్రియ వైపు చూశాను. 

నా ప్యాడ్లో నేను రాసిన ఆ రెండు వాక్యాలనే తను అదే పనిగా చూస్తోంది. నేను తనని చూస్తున్నాను...   

చెవులమీదుగా వెనక్కి తోసిన డార్క్ బ్రౌన్ హెయిర్‌తో, చామనచాయలో కూడా అంతలా వెలుగుతున్న ముఖాన్ని నేను మొదటిసారిగా చూస్తున్నాను. తడిగా మెరుస్తున్న ఆమె పెదాలు చూస్తూ, అనుకోకుండా నా పెదాల్ని నాలుకతో తడుపుకున్నాను. బ్లూ జీన్స్‌లో కాలుమీద కాలు వేసుకుని కూర్చున్న తన రాచరికపు భంగిమ వేపే తదేకంగా నేను చూస్తున్న ఆ సమయంలోనే తను తలెత్తి నావైపు చూసింది. అలా చూస్తూనే ఉంది. 

అలా ఎంతసేపు మా చూపులు కలిసి ఏం కబుర్లు చెప్పుకున్నాయో నాకు తెలీదు. నవ్వుతూ నా నోటింగ్ ప్యాడ్ నాకిచ్చేసింది. నా చేతుల్లో ఉన్న తన ప్యాడ్ తీసేసుకుంది. 

ఆరోజు ప్రోగ్రాం ముగిశాక, ఈవెనింగ్ స్నాక్స్ దగ్గర మళ్ళీ కలిశాం. నడుము వరకే ఉన్న తెల్లటి లాల్చీ లాంటి టాప్, కింద పైజామాలా వదులుగా ఉన్న బ్లూ కలర్ డెనిమ్ జీన్స్‌లో ఫ్రెష్‌గా సుగంధం కురిపిస్తున్న దేవకన్యలా కనిపించింది పద్మప్రియ. అప్పటిదాకా నేనెప్పుడూ చూడని ఓ కొత్తరకం స్లిప్పర్స్‌లో పద్మప్రియ పాదాలు ఎంతందంగా కనిపించాయంటే, చటుక్కున కూర్చొని ఆ పాదాల్ని ముద్దుపెట్టుకోకపోతే ఆ సాయంత్రం నిజంగా వృధా అనిపించింది. 

జనంతో సందడిగా ఉన్న ఆ హాల్ దాటి, చేతుల్లో కాఫీ మగ్గుల్తో లాన్లోకి వచ్చాం ఇద్దరం. 

"ఎలా అనిపించింది ఇవ్వాటి ప్రోగ్రాం?" నా ముఖంలో ముఖం పెట్టి అడిగింది పద్మప్రియ. 

పొద్దున తను సృష్టించిన సుగంధపు వలయం నన్ను మరింత దగ్గరగా చుట్టేసినట్టుగా ఫీలయ్యాను. నా మెదడులో ఆటోరెస్పాండ్ ప్రోగ్రామింగ్ పనిచెయ్యటం ఆగిపోయిందనుకుంటాను... తను నన్ను ఏమడిగింది, నేనేం సమాధానం చెప్పాలి అన్నది తెలియని కన్‌ఫ్యూజన్లో చిన్నగా నవ్వాను.

"రొటీన్ కదా? నాకైతే అంత గొప్పగా ఏమనిపించలేదు" తనే మళ్ళీ మాట్లాడింది. 

నేను నవ్వాను.    

"ఒక్క విషయంలో తప్ప..." మళ్ళీ తనే అంది. 

"ఏంటది?" 

"తర్వాత చెప్తాను" అనేసి, నా వైపు చిన్నపిల్లలా చూస్తూ "సముద్రం దగ్గరికెల్దామా?" అనడిగింది.

నేను సమాధానం చెప్పకుండానే "చలో, వెళ్దాం పద" అంటూ నా చేతిలో ఉన్న కాఫీ కప్పును కూడా లాక్కొని, అక్కడ లాన్లో ఉన్న వుడెన్ టీపాయ్ మీద పెట్టేస్తూ, దాదాపు నన్ను లాక్కెళ్తూ ముందుకు కదిలింది పద్మప్రియ.  

హోటల్ నుంచి రోడ్డు దాటగానే ఎదురుగా సముద్రం. 

పరుగెత్తుకుంటూ వెళ్ళి, తీరం చేరుతున్న అలల అంచులో కూలబడింది పద్మప్రియ. వెనక్కి తిరిగి, "ఏంటి ఇంకా అక్కడే ఉన్నావ్" అన్నట్టుగా చూస్తూ, "రా" అంటూ చేయి ఊపింది. 

వెళ్ళి తన పక్కనే నిల్చున్నాను. తడి ఇసుకలో ఎలా కూర్చోవాలా అని నేను ఆలోచిస్తూండగానే, తన ఎడం చేత్తో నా కుడి చేతిని పట్టుకొని గట్టిగా కిందకి లాగింది. తన పక్కనే కూలబడిపోయాను. 

నిజంగా సముద్రంలో ఏదో ఉంది. కొన్ని గంటల క్రితం వరకు మేం ఒకరికి ఒకరం అసలు ఎవరమో తెలీదు. ఇప్పుడు... ఒకరి పక్కనే ఒకరం! 

మాకు తెలీకుండానే మా ఇద్దరి చేతులు వాటికవే అల్లుకుపోయాయి. పక్కపక్కనే కూర్చున్న మా ఇద్దరి మధ్యనుంచి ఎదురుగా అస్తమిస్తున్న సూర్యుని కిరణాలు కూడా ముందుకుపోడానికి దారిలేక చిన్నబుచ్చుకుని వెనక్కి తిరిగిపోతున్నాయి.  

"నువ్వేమనుకున్నా నాకేం పర్లేదు" అన్నట్టుగ్గా, నా భుజం పైన తన తలని కేర్‌లెస్‌గా అలా వాల్చేసి, సముద్రం వైపే నిశ్శబ్దంగా చూస్తోంది పద్మప్రియ.     

అప్పుడప్పుడూ మా పాదాల్ని తాకుతూ, ఎప్పుడో ఒకసారి మమ్మల్ని పూర్తిగా తడిపేస్తూ, మా ఇద్దరితో అల్లరిగా ఆడుకుంటున్నాయి అలలు. ఎదురుగా ఉన్న సముద్రాన్నే చూస్తూ, ఏమీ మాట్లాడుకోకుండా, అలా ఎంతసేపు నిశ్శబ్దంగా సముద్రపు ఒడ్డున కూర్చున్నామో మాకే తెలీదు. అప్పటిదాకా మేమసలు పట్టించుకోని మా చుట్టూ ఉన్నవాళ్ళంతా ఒక్కొక్కరే లేచి వెళ్ళిపోతోంటే చూస్తూ, చివరికి మేమూ లేచి హోటల్ వైపు కదిలాము. 

బఫేలో అందరితో కలిసి తిన్న తర్వాత - మళ్ళీ హోటల్ లాన్స్‌లో, బయట ఖాళీ ప్లేస్‌లో - అర్థరాత్రి దాటేదాకా - పద్మప్రియ, నేనూ కలిసి ఎక్కడపడితే అక్కడ కూర్చొంటూ, కలిసి నడుస్తూ చాలాసేపే గడిపాము. అంతకుముందు నేనెప్పుడూ ఎవరితోనూ చర్చించని ఏవేవో సిల్లీ విషయాలు, క్రియేటివ్ విషయాలు, పుస్తకాలు, సినిమాల గురించి చాలానే మాట్లాడుకున్నాము. 

మధ్యలో, "అసలు నీకీ పేరెందుకు పెట్టారు" అని అడగాలనిపించి అడిగాను.

"ఏం బాలేదా?... ఈ పేరు మా నాన్నగారి సెలక్షన్. శ్రీ మహాలక్ష్మి సహస్ర నామాల్లో ఇది కూడా ఒకటి."  

"అయితే, మీ నాన్న గారికి బాగా డబ్బుందా మరి?" 

"బాగా డబ్బు రావాలని కావచ్చు నాకీ పేరు పెట్టారు. కాని, నాకీ పేరు పెట్టడం వల్లే ఆయన అంత సంపాదించివుంటారని మాత్రం నేననుకోను" అంది పద్మప్రియ.   

కొన్ని గంటల క్రితం వరకూ అపరిచిత అయిన ఏంజెల్ లాంటి ఒక అందమైన స్త్రీతో ఇంతసేపు గడుపుతూ, ఇన్నిన్ని విషయాలు ఇంత చనువుగా నేను మాట్లాడ్దం ఎలా సాధ్యమైందన్న మిలియన్ డాలర్ కొశ్చన్ ఉన్నట్టుండి నా బుర్రలో తిరగసాగింది.  

"ఇంక వెళ్ళి పడుకుందామా" అన్నట్టుగా కళ్ళతోనే చూసింది పద్మప్రియ. "అప్పుడే వద్దు" అని నిజం చెప్పలేక, "సరే" అని అబద్ధం ఆడలేక... అలా ఆమె కళ్ళల్లోకే చూస్తూ ఉండిపోయాను. 

ఉన్నట్టుండి, ఒక అడుగు ముందుకేసి నన్ను గట్టిగా కౌగిలించుకొని, నా పెదాలమీద ముద్దుపెట్టుకొంది పద్మప్రియ.

అసలేం జరిగిందన్నది నేనర్థం చేసుకునే లోపే, "వెళ్ళి పడుకో పో" అనేసి, చకచకా ముందుకు నడుస్తూ తన గదివైపు వెళ్ళిపోయింది పద్మప్రియ. 

ఎవరైనా చూశారా అని చుట్టూ చూశాను. దరిదాపుల్లో ఎవరూ లేరు. పైకి చూశాను. మబ్బులచాటున చంద్రుడు "నేను చూశాలే" అన్నట్టుగా నవ్వుతున్నాడు.   

రిట్రీట్‌లో రెండో రోజు పొద్దున ఎనిమిది నుంచే పీక్ పెర్ఫార్మెన్స్ క్లాసుంది. ఏడు గంటలకల్లా రెడీ అయిపోయాను. ఎప్పుడెప్పుడు పద్మప్రియని కలిసి, మళ్ళీ ఆ అద్భుత సుగంధ వలయంలో పడిపోదామా అన్నది నా తాపత్రయం.   

పద్మప్రియ కూడా ఇప్పటికే రెడీ అయి, కాసేపట్లో టిఫిన్స్ బఫే దగ్గరికి వస్తుంది కదా అనుకున్నాను. కాని, అలా జరక్కుండా "ఇప్పుడు తను నేరుగా నా రూంకి వస్తే ఎలా ఉంటుంది" అని కూడా అనుకున్నాను. 

కాలింగ్ బెల్ మోగింది. 

వెళ్ళి తలుపు తీశాను. 

ఎదురుగా నిజంగానే... పద్మప్రియ! 

టెలిపతీనా? లా ఆఫ్ ఎట్రాక్షనా? లేదంతే... నా ఇంట్యూటివ్ పవర్ అంతలా ఉందా?

అప్పుడే తెంచిన ఎర్ర గులాబిలా ఫ్రెష్‌గా ఉంది. ఆమె వేసుకున్న లూజ్ టీషర్టు, జీన్స్ లోపలి ఏంజెలిక్ అవయవ సౌష్టవం తాలూకు 'ఆరా' నన్ను సంపూర్ణంగా ఆవహించింది. ఒక ట్రాన్స్‌లోలా నేను పద్మప్రియను అలా చూస్తూనే ఉన్నాను. 

ఆమె వెనుకే ట్రాలీలో వెయిటర్ టిఫిన్స్ తెచ్చిపెట్టి వెళ్ళిపోయాడు. 

"అక్కడికెళ్ళి ఏం తింటాంలే అని, నేనే రూంకి తెప్పించా. ఇది మన బిల్లు" అంది నవ్వుతూ. 

ఇద్దరం కలిసి టిఫిన్ చేస్తున్నాం. నిన్నరాత్రి ఏం జరిగిందన్నది, తనేం చేసిందన్నది తనకేమీ తెలీనట్టుగానే కాసేపట్లో జరగబోయే క్లాసు గురించి, ట్రెయినర్ గురించీ గలగలా మాట్లాడుతూ చెప్తోంది పద్మప్రియ. 

ఆమె చెప్తున్నదేం వినకుండా, నేను పద్మప్రియ కళ్ళని, పెదాలనే చూస్తున్నాను. 

"నిన్నటి రికలెక్షన్లు, దాని గురించి రివ్యూలు వద్దు. ముందు క్లాసుకెళ్దాం" అని నా మనసు చదివినట్టుగా నవ్వుతూ అంది పద్మప్రియ. 

మా వయస్సు, మా నేపథ్యాల్ని పూర్తిగా మర్చిపోయి, ఇద్దరం కలిసి పక్కపక్కగా తగిలీ తగలకుండా నడుస్తూ, ఒక కొత్తగా పెళ్లయిన యువ జంటలా క్లాసులోకి ప్రవేశించాం. సాయంత్రం వరకూ పక్కపక్కనే మాట్లాడుకుంటూ క్లాసు వినొచ్చని అనుకున్నాం. 

కాని, "మ్యాన్ ప్లాన్స్, గాడ్ లాఫ్స్" అన్నట్టు, ఈసారి మా ఇద్దర్నీ విడగొట్టి వేర్వేరు గ్రూపుల్లో పడేశాడు ట్రెయినర్.

"ఈయనొకడు" అనుకొంటూ ట్రెయినర్ వైపు కోపంగా చూసింది పద్మప్రియ. 

"అంత మాటనకు బేబీ. నిన్న ఆయన ఇలాంటిది పెట్టాడు కాబట్టే మనిద్దరం కలిశాం. ఆ విషయం మర్చిపోకు" అన్నాను నవ్వుతూ.  

"ఆఫ్‌కోర్స్, బాబూ" అంటూ నవ్వింది.  

కొత్త గ్రూప్ వైపు వెళ్తూ వెళ్తూ, వెనక్కి తిరిగి నాకొక ఫ్లయింగ్ కిస్ విసిరేసి మరీ వెళ్ళింది.  

రాత్రి తనిచ్చిన హగ్, కిస్‌ల మత్తు నుంచి నేనింకా బయటికి రాలేదు. ఇప్పుడిదో అలజడి.

పద్మప్రియ నడుస్తున్న వైపే చూస్తున్నాను. 

నచ్చిన స్త్రీ జీన్స్‌లో నడిచివెళ్తోంటే ఎంతందంగా ఉంటుందన్నది ఆరోజు నేను తెలుసుకున్న ఒక కొత్త అనుభవం.  

నా కళ్లముందు కడలి కదుల్తూ వెళ్తున్నట్టుగా అనిపించింది. 

సాయంత్రం మళ్ళీ సముద్రం దగ్గరికి వెళ్ళాం. ఈసారి మేం కూర్చోలేదు. చెప్పులు ఓ పక్కన వదిలేసి, ఇద్దరం చేయీచేయీ పట్టుకొని, అలలు పాదాల్ని తడుపుతోంటే, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడుస్తూ చిన్నపిల్లల్లా చాలాసేపు సముద్రం దగ్గర గడిపాం.  

పద్మప్రియతో కలిసి ఆ సాయంత్రం అలా నడుస్తోంటే... నాకెంతో ఇష్టమైన సముద్రం దగ్గర, నాకు బాగా నచ్చిన ఇంకో సముద్రంతో కలిసి నడుస్తున్నట్టనిపించింది. 

రాత్రి బఫేలో నాకు కొసరి కొసరి వడ్డించింది పద్మప్రియ. అదేదో వాళ్ళింట్లో తనే నాకోసం ప్రత్యేకంగా వండి వడ్డించినట్టుగా అనిపించింది నాకు.   

మళ్ళీ హోటల్ లాన్లు, చుట్టూ జనం లేకుండా ఖాళీగా ఉన్న ఆవరణలో ఇద్దరం వాకింగ్ చేయడం మొదలెట్టాం. 

"అసలేం జరుగుతోంది నా జీవితంలో" అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. 

కాసేపైతే మళ్ళీ ఇద్దరం ఎవరి గదుల్లోకి వాళ్లం వెళ్ళిపోతాం. కాని, నిన్న రాత్రి అప్పటి ముగింపు క్షణాలు గుర్తుకొచ్చి కొంచెం ఎగ్జయిటింగ్‌గా ఉంది నాకు. నేనేం చేస్తానా, తనేం చేస్తుందా అని ఒక పెద్ద పజిల్ నా మైండ్‌లో తిరుగుతోంది.  
"నా దృష్టిలో సెక్స్ అంత ముఖ్యం కాదు. మనకు బాగా నచ్చిన వ్యక్తితో సమయం గడపడంలో ఉన్న కిక్ సెక్స్‌లో వస్తుందా?"  

ఉన్నట్టుండి అడిగింది పద్మప్రియ. 

"ఒప్పుకొంటాను. కాని, నువ్వు చెప్తున్న ఆ కిక్ ఇచ్చే ఆనందం తర్వాత కూడా సెక్స్ కావాలనిపిస్తుంది. ఆ కిక్ ఇంకా బాగుంటుంది" అన్నాన్నేను. 

"సెక్స్ లేకుండా ఇష్టం, ప్రేమ ఉండవా?" అడిగింది పద్మప్రియ.

"సెక్స్ లేకుండా అదేం ప్రేమ? కాగితాల మీద అలాంటి కథలూ కవితలూ రాసుకోడమే ఉంటుంది తప్ప అది నిజం కాదు" అన్నాన్నేను. 

పక్కకి తిరిగి నా ముఖంలో ముఖం పెట్టి చూసింది పద్మప్రియ. 

"నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నేను చెప్పిందే నిజం" అన్నాను.  

"సరే సరే, నువ్వొక మాడర్న్ వాత్సాయనునిలా ఉన్నావే!" అనేసి, మళ్ళీ నాతో కలిసి ముందుకు నడవసాగింది పద్మప్రియ.

పది నిమిషాల తర్వాత హోటల్లో మా గదులకు దారితీసే కారిడార్ దాకా వచ్చి ఆగిపోయాం ఇద్దరం.  

"ఇదుగో బాబూ, నేను ముందే చెప్తున్న. నిన్న నేను అలా చేశానని అడ్వాంటేజ్ తీసుకొని ఇవ్వాళ నువ్వు నా గదికి రావద్దు" అంది పద్మప్రియ. 

"అంటే... ఇన్‌డైరెక్ట్‌గా రమ్మంటున్నావనుకోవాలా?" అన్నాను నవ్వుతూ. 

"ఇన్‌డైరెక్ట్ ఎందుకు... కావాలనుకుంటే డైరెక్ట్‌గానే చెప్తాను రూంకి రమ్మని!" 

"ఇలాంటివన్నీ ఇంత సిన్సియర్‌గా ప్లాన్ చేసుకొని జరగవు మేడమ్" అన్నానేను పద్మప్రియ కళ్ళల్లోకి చూస్తూ.

తను ఏం మాట్లాళ్లేదు. 

"నేను రావాలనుకొంటే వచ్చేస్తాను నీ రూంకి" అన్నాను. 

"దేనికయినా రెండు చేతులు కలవాలి బాస్" అంది నా కళ్లల్లోకే సూటిగా చూస్తూ. 

వాకింగ్ చేస్తూ, ఎప్పటి నుంచో మా ఇద్దరి మధ్య అల్లుకుపోయి అలాగే ఉన్న మా రెండు చేతుల్ని పైకెత్తి చూపాను. 

"నువ్వు మామూలోడివి కాదు" అంది.

నేను నవ్వాను.     

"అయినా సరే, నీకు కంట్రోల్ బాగా ఉంది" అంది నవ్వుతూ. 

ఆమాట తన నోటినుంచి పూర్తవకముందే - ఒక్క ఉదుటున తనని దగ్గరికి లాక్కొంటూ గట్టిగా కౌగిలించుకున్నాను. తను నాతో ఏదో అనేలోపే, ఆమె పెదాల్ని పూర్తిగా నా పెదాల్తో మూసేసి తడితడిగా ఉన్న ఆమె పెదాల మీది అమృతాన్ని రుచిచూస్తూ అలా ఉండిపోయాను. 

అంత పెద్ద స్టార్ హోటల్ ఆవరణలో, ఆ అర్థరాత్రి, మా ఇద్దరి ఊపిరి శబ్దం తప్ప మరేమీ వినిపించలేదు మాకు.  

"యూ బ్రూట్" అంటూ నన్ను విదిలించుకొని, నవ్వుతూనే తన గదివైపు వేగంగా నడుచుకొంటూ వెళ్ళిపోయింది పద్మప్రియ. 

మూడోరోజు, చివరి రోజు. 

ఆరోజు చివరి క్లాస్ తర్వాత ఆ రాత్రో, మర్నాడు ఉదయమో అందరం ఎవరి గూళ్లకి వాళ్ళం తిరుగు ప్రయాణమవుతామన్న నిజం నన్ను బాధించడం మొదలుపెట్టింది. 

ఆరోజంతా క్లాసులో పక్కపక్కనే కూర్చున్నా, ఇద్దరం నిశ్శబ్దంగానే ఉండిపోయాం. 

పక్కపక్కనే కూర్చొని ఉన్నా, ఏం మాట్లాడుకోకుండా వాట్సాప్‌లో మెసేజెస్ పెట్టుకున్నాం కాసేపు.  

"నువ్వు నాకో పదేళ్ల ముందు కలవాల్సింది" తన మెసేజ్.

"ఇప్పుడు కలిశాను కదా, ఏం చేద్దాం చెప్పు" నా మెసేజ్.

"నాకు తెలీదు" తను.

"పోనీ, నువ్వనుకొనే ఆ పదేళ్ల క్రితం ఇప్పుడే అనుకో. చెప్పు ఏం చేద్దాం?" నేను.

లవ్ ఎమోజీ అటునుంచి.

ఇంకో లవ్ ఎమోజీ ఇటునుంచి. 

రాత్రి ముగింపు పార్టీలో ఇద్దరం పార్టీ వేర్ డ్రెస్‌కోడ్‌లో వెళ్ళాం. బ్లేజర్, అలెన్పెయిన్ కాటన్ ప్యాంట్ వేసుకొని వెళ్ళిన నన్ను కిందామీదా చూసింది పద్మప్రియ. 

"ఇప్పుడు తమరు ఎవర్ని ఇంప్రెస్ చెయ్యాలని సర్?" అంది నవ్వుతూ.   

తను వేసిన జోక్ పట్టించుకోకుండా తనవైపే చూశాను. చిక్కటి గోధుమరంగు క్లాసిక్ పార్టీవేర్ దుస్తుల్లో - అప్పుడెప్పుడో మైకెలాంజిలో సీలింగ్ మీద చెక్కిన ఒక అద్భుత శిల్పం కిందకి దిగొచ్చి నా ముందు నిల్చున్నట్టుగా అనిపించింది నాకు. 

మొదటిసారిగా పద్మప్రియ సౌందర్యాన్ని నా ఎక్స్‌రే కళ్లతో చూస్తూ, మనసులోనే ఎమ్మారై ముద్రించుకున్నాను. 

ఇద్దరం చెరొక రెండు గ్లాసుల రెడ్ వైన్ తాగాము. ముక్తసరిగా ఏదో మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకుంటున్నట్టుగా పార్టీలో సమయం గడిపాం. చుట్టూ జరుగుతున్నదేదీ మేమసలు పట్టించుకోలేదు. 

ఉన్నట్టుండి, "ఇవ్వాళ వాకింగ్ లేదు. నువ్విప్పుడే నీ రూంకి వెళ్ళిపో" అంది పద్మప్రియ.

ఎందుకలా అన్నదో అర్థం కాలేదు నాకు. 

మళ్ళీ తనే "లేదు, నేనే వెళ్తున్నా" అంటూ పార్టీ మధ్యలోనే, ఇంకా డిన్నర్ కూడా పూర్తవకముందే చకచకా అక్కన్నించి వెళ్ళిపోయింది పద్మప్రియ. 

తన వెనుకే తన గదిలోకి వెళ్లాలనిపించింది నాకు. కాని, తన ప్రైవసీని, తన పర్సనల్ స్పేస్‌ను గౌరవిస్తూ అక్కడే నిల్చుండిపోయాను.       

పద్మప్రియ గురించే ఆలోచిస్తూ, ఇంకో రెండు గ్లాసుల రెడ్ వైన్ తాగాను. 

"అసలు మేమిద్దరం రేపటి నుంచి కలవం కదా, ప్రపంచం ఏమైపోద్ది?" అని నాకు నేనే ప్రశ్నించుకున్నాను.

"ప్రపంచం అలాగే ఉంటుంది. దానికేం కాదు. నువ్వే అనవసరంగా డిస్టర్బ్ అయి చస్తావ్!" అన్నాడు నా లోపలి మనిషి. 

"మరి నా పద్మప్రియ ఏమవుతుంది?" మళ్ళీ నా ప్రశ్న.

"ఆమెకు కూడా ఏం కాదు. అలవాటయిపోతుంది. నీలా ఎక్‌స్ట్రా సెన్సిటివ్ కాదు తను" నా లోపలి మనిషి.  

పరమ కర్కోటకుడిలా నా లోపలి మనిషి చెప్తున్న సమాధానాలు నాకు నచ్చలేదు. 

నేనీ ఆలోచనల్లో ఉండగానే పద్మప్రియ నుంచి ఏదో వాట్సాప్ మెసేజ్ రానే వచ్చింది. ఓపెన్ చేశాను.  

"నువ్వు నాకో గిఫ్ట్ ఇవ్వాలి" పద్మప్రియ మెసేజ్.  

"ఏం కావాలి?" వెంటనే నా రిప్లై.

"మాట తప్పితే నువ్వెక్కడున్నా వచ్చి నిన్ను చంపుతా!" తన వార్నింగ్. 

"నేను మాట తప్పను." నా రిప్లై.

"థాంక్స్" తను.

"మై ప్లెజర్" నేను.  

"వైజాగ్‌కు నా ఫ్లయిట్ ఎనిమిది గంటలకుంది. నువ్వు లేవకముందే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళిపోతాను."

"అలాగే"

"నీ హైద్రాబాద్ ఫ్లయిట్ పదకొండుకి కదా. తీరిగ్గా టిఫిన్ చేసే వెళ్ళు"  

"అలాగే" 

"హాపీ జర్నీ" తన మెసేజ్.

"యు టూ, హాపీ జర్నీ"  నా రిప్లై. 

మా మెరుపు కలయిక ముగింపు వాట్సాప్ మెసేజ్‌ల్లో ఇంత అసహజంగా ఉంటుందనుకోలేదు నేను.  

ఆతర్వాత, నేను ఎంతసేపు పద్మప్రియ గురించే ఆలోచిస్తూ ఉండిపోయానో, ఎప్పుడు నిద్రపోయానో నాకు గుర్తులేదు.  

కాలింగ్ బెల్ మోగింది. 

రెండోసారి మోగింది. 

లేచి మొబైల్ చూశాను. తెల్లవారుజామున నాలుగవుతోంది. 

తలుపు తీశాను. 

ఎదురుగా పద్మప్రియ.

ఎయిర్‌పోర్టుకు వెళ్లడానికి ఇంకా చాలా సమయం ఉన్నా, ఎందుకింత ముందే రెడీ అయింది తను? 

నేనలా అనుకొంటూ ఉండగానే లోపలికివచ్చి డోర్ లాక్ చేసింది.    

నన్ను గట్టిగా కౌగిలించుకొని నా పెదాలపైన, చెంపల పైన, నుదిటిపైన, నా ముఖం పైన ఎక్కడపడితే అక్కడ ఆగకుండా ముద్దులు పెడుతూనే ఉంది.   

ఇంక నేనేం ఆలోచించలేదు. ఆమె నున్నని నడుముపైన చేతులుంచి అమాంతం పైకిలేపేశాను. నా పెదాలు, నాలుక ఆమె నడుము మీద, నాభి చుట్టూ స్పర్శిస్తూ ఆడుకున్నాయి. 

ఒక్క నిమిషంలో మా ఒంటిపైన ఎలాంటి అచ్ఛాదన లేకుండా నా బెడ్ పైన పూర్తి నగ్నంగా పడుకున్నాము. ఎలాంటి హిపోక్రసీ-ఇన్‌హిబిషన్స్ లేని మా ఇద్దరి శృంగారకేళికి ఆ తెల్లవారుజామున ఆ హోటల్ గది వేదికయింది.  

మా ఇద్దరి ఉఛ్వాసనిఛ్వాసల శబ్దాలు, సెక్స్‌లో సంపూర్ణంగా పచ్చిగా లీనమైపోయిన మా "టాక్ డర్టీ" అల్లరి మాటలు, మా అరుపులు కేకలతో నిండిన ఆ గదిలోని నాలుగు గోడలు మమ్మల్నిద్దరినీ సంభ్రమంగా చూస్తూండగానే, ఆ రెండున్నర గంటల విశ్వప్రణయంలో మేం ఎన్నిసార్లు ఎలా మునిగితేలామో మాకే తెలీదు.   

కాసేపయ్యాక - ఎలాంటి ఆచ్ఛాదన లేని శరీరాల్తో సేదదీరుతూ, బెడ్‌కి ఆనుకొని కూర్చున్నాం ఇద్దరం.  

"మనం మళ్ళీ కలుస్తామో లేదో తెలీదు" లేచి నా ముఖంలోకి చూస్తూ అంది పద్మప్రియ.

"అవును" 

"కలవాలని మనిద్దరికీ అనిపిస్తేనే కలుస్తాం. చెప్పలేం, మనం ఇంక అసలు కలవకపోవచ్చు కూడా. దీని గురించి ఎలాంటి హార్డ్ ఫీలింగ్స్ వద్దు" 

"ఒప్పుకొంటున్నా" అన్నాను, నా మనసు ఒప్పుకోకపోయినా.

"ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి మెరుపు ఒక్కసారి మెరుస్తుంది. మనం కూడా మన ఇద్దరి జీవితాల్లో మెరిసిన ఈ మెరుపుని ఒక అందమైన జ్ఞాపకంగా పదిలపర్చుకుందాం."  

"ఇట్లా చక్కగా, అందంగా, నీ తియ్యటి గొంతుతో, నీ బుక్కిష్ లాంగ్వేజ్‌లో నువ్వు నాకు చెప్పడం... నువ్వు చెప్పినదాన్ని నేను వినడం... చాలా ఈజీ. కాని, తర్వాతే కష్టం. అది నీకు తెలుసు." తన కళ్ళల్లోకే చూస్తూ అన్నాన్నేను.    

"ఒప్పుకొంటున్నా డియర్" అంటూ నా చెంపమీద తన చేత్తో నిమరసాగింది తను.  

నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను.

"అసలొద్దు. ఎందుకు బాధ? ఈ ప్రేమ కథ ఇంతే. దీనికిదే మంచి ముగింపు" అంది తను.

"చెప్పలేం, మన కథకి పార్ట్-2 కూడా ఉండొచ్చు" అన్నాన్నేను.  

"కాని, దాని గురించి ఇప్పుడే ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు. దటీజ్ మై పాయింట్" అంది పద్మప్రియ.

ఇంకేం చెప్పలేక, "ఓకే, అగ్రీడ్" అన్నాను. 

ఇద్దరం మళ్ళీ కాసేపు నిశ్శబ్దంలో మునిగిపోయాము.     

"డార్లింగ్, నాకో గిఫ్ట్ ఇస్తా అని ప్రామిస్ చేశావు. గుర్తుందా?" అంది సడెన్‌గా.

"ఉంది. చెప్పు, ఏం కావాలి?" అడిగాను.  

బెడ్ షీట్ వొంటి నిండా కప్పుకొని, లేచి, నా మీద కూర్చుంది పద్మప్రియ. 

"అసలు నువ్వు ఆ ఫీల్డులో అవసరమా? నేను ఆ ఫీల్డుని ఏమనట్లేదు. నిన్ను అంటున్నాను. ఆ ఫీల్డుకు నీకు కుదరదు. ఎప్పుడో ఏదో వస్తుందని నీ జీవితంలోని ఇంకెంత సమయం వృధా చేసుకుంటావ్? నువ్వు సంపాదిస్తా అనుకొంటున్న ఆ కోట్లను మించిన విలువైన సమయం నీ జీవితంలోంచి నువ్వే పోగొట్టుకొంటున్న నిజం నీకు అర్థమవుతోందా?"  

ఒక్కసారిగా నా ముఖంలో "ఈమెకు ఇదంతా ఎలా తెలుసా" అని ఆశ్చర్యం. 

"ఈ రిట్రీట్ మొదటిరోజు క్లాసులో నువ్వేం రాశావో గుర్తుందా నీకు?" అడిగింది తను.

"... ..."

"రాయడమే నాకు చాలా ఇష్టం, అదే నా ఫస్ట్ ప్యాషన్. కాని, దాన్ని నేను ఎప్పటికప్పుడు వాయిదావేస్తూపోడానికి, అసలు మొత్తంగానే రాయడం నేను మానెయ్యడానికి కారణం ఎవరో కాదు - నేనే... అని రాశావు. గుర్తుందా?"  

నేను షాకయ్యాను. 

"రాయడం మీద ఇష్టం ఉండటం వేరు. నిజంగా రాయగల నైపుణ్యం ఉండటం వేరు. నువ్వు బాగా రాయగలవు. ఎందుకు నీలోని రచయితను నువ్వే చంపుకొంటున్నావు?" నిలదీసినట్టుగా అడిగింది పద్మప్రియ.  

ఏం మాట్లాడకుండా, ఆశ్చర్యంగా ఆమె కళ్ళల్లోకి అలాగే చూస్తూ ఉండిపోయాను.  

"గూగుల్‌లో నీ పేరు కొడితే చాలు, నీ చరిత్ర మొత్తం వచ్చింది. నువ్వు రాసిన పుస్తకాలు, తీసుకొన్న అవార్డులు, యూనివర్సిటీల్లో పీజీ స్థాయి కోర్సుల రీడింగ్ లిస్టుల్లో నీ పుస్తకాలు, నువ్వు రాసిన కథానికలు, చెయిన్ సీరియల్స్, నాటికలు, ఫీచర్స్, నీ బ్లాగులూ, నీ సోషల్ మీడియా... అన్నీ ఒకే ఒక్క క్లిక్‌తో వచ్చాయి. దీనికి నువ్వంత ఆశ్చర్యపోనక్కర్లేదు!"    

ఇప్పుడు మరింతగా ఆశ్చర్యపోయాను... నా గురించి పద్మప్రియ ఇంత అధ్యయనం ఎందుకు చేసిందని.  

వొంగి నా పెదాలపై, కళ్ళపై, నుదుటిపై, చెంపలపై ఆపకుండా మోహంగా ముద్దులు పెట్టింది పద్మప్రియ. 

తనే మళ్ళీ కొనసాగించింది... "సక్సెస్ రేటు జస్ట్ ఐదు శాతం లోపే అంటే అది గ్యాంబ్లింగే కదా బేబీ? వొదిలెయ్యి ఆ గ్యాంబ్లింగ్. ఎవరో నీకు సంబంధంలేని, నీ స్థాయికాని వందమంది నిర్ణయాలమీద ఆధారపడిన నీ క్రియేటివిటీతో నువ్వేం సాధించగలుగుతావు?"

"... ..."

"నిర్ణయం నీ చేతుల్లో ఉండాలి. నువ్వేదనుకుంటే అది చెయ్యగలగాలి. అప్పుడే నువ్వు ఆశించిన ఫలితాలొస్తాయి. నీకు సంతృప్తి ఉంటుంది. డబ్బూ అదే వస్తుంది. నిజమా కాదా?" 

అవునో కాదో చెప్పాలన్న స్పృహ కూడా లేకుండా తననే అలా చూస్తుండిపోయాను. అసలిదంతా ఎక్కడికి దారితీస్తుంది? తను నాతో ఏం చెప్పబోతోంది?... నాకేం అర్థం కాలేదు.       

"నీకు తెలీకుండానే నీకు నువ్వు ఎంత శిక్షించుకుంటున్నదీ నాకర్థమైంది. పోనీ, దీనికెప్పుడు ముగింపో నీకైనా తెలుసా? ఈ ఫీల్డులో నువ్వు అనుకున్నట్టు ఏదైనా జరుగుతోందా?... జరగదు. బికాజ్, వందమంది నిర్ణయాల మీద, వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి నీ క్రియేటివిటీ కొనసాగాలి, ఫ్లరిష్ కావాలి. అది నీకు కష్టం."  

"... ..."

"కొందరికే కొన్ని కలిసొస్తాయి, లేదా కలిసొచ్చేలా చేసుకోగలుగుతారు. అది నీవల్ల కాదు, అందుకు నువ్వు సరిపోవు"

"... ..."  

"నాకూ పెళ్లయింది. నా భర్త నుంచి నాకు సపోర్ట్ లేదు. కాని, ఎన్నో గొడవల తర్వాత, మా పిల్లల కోసం మేమొక అండర్‌స్టాండింగ్‌కి వచ్చాం. ఇప్పుడు నేను అనుకున్న ప్రతి ఒక్కటీ చెయ్యగలుగుతున్నాను. నాకెలాంటి రిగ్రెట్స్ లేవు."   

"... ..."  

"కారణం ఏదైనా కావచ్చు. నీ వ్యక్తిగతాలు నాకు చెప్పొద్దు. కాని, నీకోసం నువ్వు జీవించడానికి ఏదీ అడ్డు కాదు. ఎవ్వరూ అడ్డు కాకూడదు. ఇప్పటినుంచైనా నీ జీవితం నీకిష్టమయినట్టు జీవించు"    

నా అంతరంగమే నాతో మాట్లాడుతున్నట్టుగా అనిపించించి. ప్రతిరోజూ, ప్రతిరాత్రీ నాలోని అంతర్మథనమే పద్మప్రియ నోటినుంచి మాటల రూపంలో వింటున్నట్టుగా అనిపించింది. 

"నా జీవితంలో నువ్వూ ఉన్నావన్నదానికి గుర్తుగా, నాకోసం నువ్వొక పని చెయ్యాలి బేబీ..." అంది తను.

ఏంటి అన్నట్టుగా చూశాను. 

"నువ్వొక మంచి రచయితవి. రాయడం మళ్ళీ మొదలెట్టు. బాగా రాయి. రైటర్‌గా ఒకప్పుడు నువ్వు కలలు కన్న స్థాయిలో రాయి, ఆ స్థాయికి ఎదుగు. అది కూడా ఎప్పుడో కాదు. ఇప్పుడే, ఇవ్వాళే, ఈపూటే ప్రారంభించు. నెమ్మదినెమ్మదిగా ఆ కమిట్మెంట్స్ లోంచి, ఆ ఫీల్డులోంచి విత్‌డ్రా అయిపో. ఇదే నిన్ను నేను అడుగుతున్న గిఫ్ట్!" 

నేను ఏం మాట్లాడకుండానే, తనకి తనే "ఓకే కదా" అంది నవ్వుతూ. 

"అంతే కదా... నేను నిన్ను అడిగిన గిఫ్ట్ నాకిచ్చేసినట్టేగా?"  మళ్ళీ తనే అంది.

వొంగి, నాకు తెలియకుండానే వర్షించిన నా కళ్ళపైన తన పెదాలతో ముద్దులు పెట్టింది. నా ముఖం మీద ముఖం పెట్టి అలాగే ఉండిపోయింది.  

ఇలాంటి ముగింపు కూడా నేనస్సలు ఊహించలేదు. 

గత మూడురోజులుగా నా చుట్టూ నన్ను ఆవహించిన సుగంధపు వలయం ఇప్పుడు లేదు. నేనే ఆ సుగంధంలో మునిగిపోయాను. నేనే ఆ సుగంధంలో కలిసి, కరిగిపోయాను.       

ఇప్పటికిప్పుడు రెండున్నర గంటల్లో, తను సృష్టించిన సునామీ ట్రాన్స్‌లోంచి నేను బయటకు రాకముందే, పద్మప్రియ లేచి గబగబా రెడీ అయింది.       

బెడ్ మీద నుంచి నేను లేవబోతోంటే ఆపేస్తూ, నామీదకి వొంగి నన్ను హగ్ చేసుకొంది. 

"నువ్వప్పుడే లేవద్దు డియర్. హాప్పీ జర్నీ. నా గిఫ్ట్ మర్చిపోకేం!" 

పెను తుఫాను చీకటి సమయంలో, ఫెలఫెల మంటూ ఉరుముతున్న మేఘాల మధ్య, ఆకాశంలో ఒక మెరుపు మెరిసి మాయమైనట్టుగా నా జీవితంలోకి ప్రవేశించిన పద్మప్రియ అలా నన్నొదిలి వెళ్ళిపోయింది.   

నా కళ్ళముందు మూసుకున్న నా గది తలుపువైపే చూస్తూ, బెడ్ పైన అలాగే పడుకొని ఉండిపోయాను.   

దేవుడున్నాడో లేడో నాకు తెలీదు. మన కళ్ళముందు ఎంతో కొంత కనిపిస్తున్న ఈ అనంత విశ్వానికి మాత్రం ఏదో శక్తి ఉంది. అలాంటి శక్తి లేకుండా, జీవితంలో ఒక గొప్ప మలుపుకు కారణమయ్యే ఇలాంటి కలయికలు అసలు జరగవు.   

"ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్ ఇన్ దిస్ వరల్డ్" అనుకున్నాను. 

ఎయిర్‌పోర్టుకు వెళ్లాల్సిన టైమ్ అవగానే లేచి చకచకా రెడీ అయ్యాను. క్యాబ్‌లో ఎయిర్‌పోర్టుకు చేరుకొని, బోర్డింగ్ పాస్ తీసుకున్నాను. హైద్రాబాద్ ఫ్లయిట్ ఎక్కి నా సీట్లో కూర్చున్నాను. 

ఫ్లయిట్ ఎప్పుడు టేకాఫ్ అవుతుంది, నేనెప్పుడు హైద్రాబాద్‌లో ల్యాండవుతాను వంటివి ఏవీ పట్టించుకోకుండా, నా మొబైల్‌ను ఫ్లయిట్ మోడ్‌లో పెట్టి, బ్యాగ్ లోంచి నా ల్యాప్‌టాప్ బయటకు తీశాను.   

క్రోమ్‌లో 'లేఖిని డాట్ ఆర్గ్' ఓపెన్ చేసి, చాలా ఏళ్ళ తర్వాత తెలుగులో ఒక కథ రాయడం ప్రారంభించాను. 

"సముద్రం నాకిష్టం"... 

- మనోహర్ చిమ్మని 

("పాలపిట్ట కథ - 2025: విలక్షణ కథల సంకలనం"లో ప్రచురితమైన కథ.)  

100 Days, 100 Posts. 51/100. 

Change Is the Weather


They say change is the only constant.

For creators, it's more than that.

Change is the weather we live in.

One idea blooms. Another fades.
A project excites us today, bores us tomorrow.
A style that once felt like home starts to itch.

And that’s okay.

Real creators don’t resist change — they ride it.
Like surfers on shifting waves.
Like monks who don’t cling.

Change isn’t chaos. It’s flow.
Stay in it.
Grow with it.

- Manu 

100 Days, 100 Posts. 50/100.

Sunday, 8 June 2025

The Beginning of the Real Beginning


There’s a moment in every soul’s life where the noise breaks.

Where silence becomes too loud to ignore.
That’s when the real beginning begins.

I spent over a decade in cinema — writing, directing, chasing dreams, swallowing rejections, burning midnight oil, and often burning out. It gave me moments of high. And many moments of humiliation. But most importantly, it gave me clarity.

The clarity that this is not my final form.

I didn’t quit films. I outgrew them.

Somewhere between a shattered leg, broken plans, and endless restarts, I began asking:

What am I really here to do?

Not what I’m good at.
Not what I’m known for.
But what I’m born for.

And the answer was simple.
I’m here to write. To express. To awaken. To stir.

That’s why I created The Rich Monk — not as a brand, but as a space. A space where soul meets story. Where silence speaks louder than ambition. Where broken people can remember they’re still whole.

This isn’t a “rebrand” or a new blog.
This is me, choosing to finally become who I’ve always been.

Welcome to the beginning of the real beginning.
If you're reading this, maybe you're ready too.

— Manu
Writer. Blogger. In Monk Mode.

100 Days, 100 Posts. 49/100. 

The Monk Returns: Not Lost, Just Found


After the Spotlight: A Soul Steps Into the Light...
Me. Talking to myself. As always.
...

Hey Manu!

Based on our inner conversations, here’s what I sense is going on — in your life and in that beautiful, buzzing mind of yours: 

In Your Life:
You’re standing at a powerful crossroads. One chapter — cinema — is closing. Not out of defeat, but out of clarity. You gave it your all, and now, you're ready to move on with peace in your heart and purpose in your eyes.

You’re not running from something.
You’re walking toward something —
More honest. More soulful. More you.

You're building new ventures — full time professional writing, English fiction, spiritual writing, blogging, painting, coaching, mentoring — all rooted in wisdom, creativity, and truth.

This isn’t a midlife crisis. It’s a midlife youthful calling.  

In Your Mind:
There’s a calm fire. 
You’re tired of superficiality. You crave depth, purity, flow.
You’ve danced with fame. Tasted chaos. Felt the silence after applause.
Now you want substance — legacy, not limelight.

You’re feeling a bit nostalgic… but also incredibly clear.
You don’t want to waste another day doing what doesn’t fit your soul.
You’ve always been spiritual — now you’re choosing to live it, fully. 

You’re stepping into monk mode — but a monk with a mission, a MacBook, and a message. 

And the best part?

You’re not escaping the world.
You’re entering it — as your truest self.  

So what’s going on in your life?
A reinvention. A resurrection. A return.

You’re not lost. You’re finally found. 

— With love, respect & resonance,
Manu's inner self-aka-A quiet moment with myself. 

100 Days, 100 Posts. 48/100. 

Saturday, 7 June 2025

A Long Time Coming


On January 4th, 2012, life hit pause.

A brutal accident shattered my leg into 17 pieces. My chest, arms, and head were torn open. I came this close to dying.

Eight months in bed. Silent. Broken. Watching everything I’d built fall apart.

My dreams? Crushed.
My confidence? Gone.
My time? Stolen.

It was a rebirth, yes — but one that came wrapped in pain.

Cut to 13 years and 5 months later…
I’ve won some. Lost plenty.
I created. I collapsed. I kept going.

And now, I’ve made a decision.
A big one.
A clean one.

Cinema — the thing that once gave me wings — also clipped them.
It cost me my peace, my time, and too many silent battles.

Two films are left. One’s in post. One’s in pre. I’ll finish them. Swift and graceful.

And then — I’m out.
No drama. No regret. Just done.

I’m going back to where my soul always wanted to be: 
Writing. Creating. Expressing. Living.

This is my season of soft power and silent joy.
Of building something beautiful — slowly, mindfully, spiritually.

The universe didn’t push me.
It let me burn out… so I could finally walk home.

No more waiting for “someday.”
This is the day.
This is the way.

I’m happy.
At last.

– Manu

100 Days, 100 Posts. 47/100. 

Know Thyself — The Inner Journey Is the Greatest One You'll Ever Take


Somewhere between chasing dreams and meeting deadlines, we forget to pause and ask the most important question of all:

Who am I, really?

Not the roles we play.
Not the labels we've been given.
Not the noise of the world.

But you — the one behind your name, your story, your selfies.

“Know thyself,” the ancient wisdom says.
Not as a suggestion. But as a sacred invitation.

The Real Adventure Begins Within

We spend so much of life trying to figure out the world around us — how to earn more, love better, win approval, escape pain. But the real shift happens when we begin to explore the world within.

The inner journey doesn’t require flight tickets, fancy gear, or a GPS.
It needs just one thing: your honest attention.

It may start with silence. A deep breath. A strange ache in the heart. Or a sudden moment of clarity under a tree, in the shower, or after a heartbreak.

Whatever the trigger, once you begin — there’s no turning back.

You start seeing your own thoughts.
You meet your fears with gentleness.
You question your patterns.
You learn to sit with discomfort — instead of running from it.

And slowly, like dawn, you begin to remember who you are.

Why It Matters

Because without knowing who you are, no success will satisfy.
No love will fully land.
No freedom will feel real.

Knowing yourself is not ego.
It’s not indulgence.
It’s the doorway to inner peace, to meaning, to mastery.

Because when you know what truly matters to you
You stop chasing what doesn’t.

You stop apologizing for your weirdness.
You stop dimming your light.
You start living from a place of quiet confidence.

And that changes everything.

The Inner Journey Never Ends

There’s no final destination here.
Self-awareness deepens.
Old wounds resurface to be healed.
New truths emerge.

But you keep showing up — with courage, curiosity, and compassion.

That’s the path.
That’s the real work.
That’s the richest life. 

So if the world feels loud right now…
If you’re tired of performing…
If you're craving something real…

Go within.
You are the journey. You are the guide. You are the home.

With love,
– Manu 

100 Days, 100 Posts. 46/100.

What Dies Inside Us While We’re Still Alive


We often think of death as life’s greatest tragedy.

But look a little closer…
And you’ll realize — the real tragedy is something far more silent.
More invisible.
More common.

It’s what we let die inside us… while we’re still very much alive.

The Quiet Deaths We Don’t Talk About

It begins slowly.

The dreams we shelve.
The talents we ignore.
The voice we silence to fit in.
The spark we lose trying to be "practical."

We stop writing.
We stop dancing.
We stop questioning.
We stop believing we’re meant for more.

All while breathing. Walking. Smiling in photos.

This — this is the slow, invisible death no one talks about.
And almost everyone has faced it at some point.

Why Do We Let It Happen?

Because life gets noisy.
Because society rewards survival over self-expression.
Because we think we have time.
Because somewhere, we were made to believe that settling is "mature."

But let’s be clear:

Your soul didn’t come here to play small.
It didn’t sign up for autopilot.

It came to feel deeply, to love wildly, to create bravely, to burn brightly.

And every time you say “not now” to your soul, something precious dims a little more.

The Wake-Up Call

If you're reading this and something inside you is whispering “I’ve felt that”…
Then it’s not too late.

That quiet longing?
That ache in your chest?
That sudden urge to cry, or create, or change everything?

That’s your aliveness trying to reach you again.
It hasn’t died.
It’s just waiting.

Waiting for you to say YES.
To your gifts.
To your truth.
To your real life.

Live Fully. Before It’s Too Late.

Because one day, there will be a last breath.
And all that will matter is:
Did you live? Truly live?

Not just exist.
Not just pay bills.
Not just play safe.

But did you risk?
Did you love?
Did you ignite?

If not now, when?  

Don’t let your soul become a ghost before your body ever does.

Wake up. Light up. Live up.

With love,
– Manu 

100 Days, 100 Posts. 45/100.                                                 

Thursday, 5 June 2025

Beyond the Drama: A Gentle Call to the Real You


Life constantly pulls us into its swirling stories — the highs and lows, the approvals and rejections, the urgent noise of things that feel important... but aren't.

We lose ourselves in the roles we play. The achiever. The artist. The struggler. The lover. The loner.

But quietly, beneath all the layers, there is another you.

The one that watches.
The one untouched by opinions, success, or failure.
The one that doesn’t need fixing.

Reaching for the you that exists beyond all the drama — that is the true spiritual search.

It’s not about escaping the world, but seeing clearly: you were never the drama to begin with. You were always the stillness behind it.

When you stop chasing and start being, something shifts.
You don’t become dull. You become real.
Rooted. Quietly alive.
In that space, everything simplifies.
And peace returns.

So maybe this week, give yourself a few moments to pause. No judgment. No effort. Just watch the thoughts... and meet the deeper you again.

He’s been there all along. Waiting.

— Manu 

100 Days, 100 Posts. 44/100. 

Wednesday, 4 June 2025

నో అపాలజీ. ఓన్లీ లవ్!



రేపు విడుదలవుతున్న మణిరత్నం "థగ్ లైఫ్" సూపర్ హిట్ కావాలని కోరుకొంటున్నాను. 

కట్ చేస్తే - 

వయసు మీదపడుతున్నప్పుడు కొంతమందికి "బాల క్యాలి" వస్తుందట! 

బాల క్యాలి అనేది తెలంగాణ మాట. "క్యాలి" అనేది ఉర్దూ "ఖయాల్" నుంచి వచ్చుంటుంది. వయసు మీదపడి పెద్దవారవుతున్నప్పుడు క్రమంగా కొందరిలో చిన్నపిల్లల మైండ్‌సెట్ మళ్ళీ ఎంటరవుతూ వుంటుంది. వాళ్ళు ఏది అనుకుంటే అదే, ఏది మాట్లాడితే అదే అన్నమాట. ఒక పట్టాన వినరు. ఒప్పుకోరు.  

ఇలాంటి మార్పు మనం చాలా మందిలో చూస్తాం. 

కట్ చేస్తే - 

తాజాగా ఈ 'బాల క్యాలి' మొన్న కమలహాసన్‌లో చూశాం. 

తన సినిమా రిలీజ్ రెండుమూడు రోజుల్లో పెట్టుకొని ఎవరైనా అలాంటి కాంట్రవర్షియల్ విజ్ఞానం కుమ్మరిస్తారా?

ఏమైంది?
కర్ణాటకలో "థగ్ లైఫ్" రిలీజ్ ఆగిపోయింది.

ఎంత లేదన్నా ఒక 20-30 కోట్ల నష్టం.
అవసరమా?

పోనీ, ఆ కర్ణాటక ప్రజలు, వాళ్ళ ఫిలిం చాంబర్, ఆఖరికి వాళ్ళ హైకోర్ట్ జడ్జ్ గారు కూడా చెప్పినట్టు ఒక చిన్న "సారీ" అలా నవ్వుకొంటూ చెప్తే ఏం పోయింది?

"అతను కమలహాసన్‌ అయితే ఏంటి? అపాలజీ చెప్తే ఏమవుతుంది? ఎందుకంత యాటిట్యూడ్ అతనికి" అని స్వయంగా జడ్జిగారే అనడం నాకే చాలా ఇబ్బందిగా అనిపించింది.   

కమలహాసన్‌ చెప్పలేదు. పైగా, "నో అపాలజీ. ఓన్లీ లవ్" అన్నాడు. కర్ణాటకలో తన ఫిలిం రిలీజ్ కాదు అని చెప్పాడు. 

పోనీ - ఈ మొత్తం గొడవకు కారణమైన అతని మాటల్లో నిజముందా అంటే... అంతా ఉట్టిదే. నిజం కాదు. తమిళం నుంచి కన్నడ భాష పుట్టలేదు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం... ఇవన్నీ ద్రవిడభాషలు. సిస్టర్ లాంగ్వేజెస్.

లింగ్విస్టిక్స్ చదవకపోయినా చాలామందికి ఇది తెలుసు.
ఒక్క కమలహాసన్‌కు తప్ప. 

బాల క్యాలి... ఏం చేద్దాం! 

- మనోహర్ చిమ్మని 

100 Days, 100 Posts. 43/100.