రెండూ డబ్బింగ్ సినిమాలే.
రెండిట్లో హీరోయిన్ ఒక్కరే.
రెండిట్లోనూ ఎలాంటి రక్తప్రవాహాలు లేవు. భారీ సైజు కత్తులు, తుపాకులు, గొడ్డళ్ళు లాంటివి లేవు. అడ్డంగా కాళ్ళూ, చేతులూ, తలలూ, మొండాలు నరుక్కుంటూవెళ్ళే సీన్లు అసల్లేవు.
థియేటర్లో కూర్చున్న ఆ రెండున్నర గంటలూ ప్రశాంతంగా హాయిగా ఫీలయ్యాం, నవ్వుకున్నాం, రిలాక్స్‌డ్‌గా ఫీలయ్యాం.
అయితే, ఇవే స్టోరీలైన్స్‌ను తెలుగులో చెప్తే ఎవరైనా అసలు వింటారా అన్నది బిగ్ కొశ్చన్.
అదలా పక్కనపెడితే - అంతకుముందు ప్రేమలు సినిమాలో మమిత బైజును చూసినప్పుడు అనిపించింది. ఈ అమ్మాయి ఎంత సహజంగా చేస్తుందీ అని. అంతే సహజంగా, అద్భుతంగా నటించింది మమిత బైజుఈ రెండు సినిమాల్లో కూడా.

మమిత బైజు కాకుండా, ఈ రెండు సినిమాల్లో వేరే ఇంకెవరో హీరోయిన్ ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ సినిమాలు అంత సక్సెస్ అయ్యేవి కాదు అని నాకనిపిస్తోంది.
కట్ చేస్తే -
అన్ని సినిమాలు అందరికి నచ్చాలని రూలేం లేదు. ఎవరి ఇష్టం వారిది. ఎవరు అభిరుచి వారిది.
"బెత్లెహామ్ కుటుంబ యూనిట్ పెద్ద సోది సినిమా. అందులో రొమాన్స్ ఎక్కడుంది, ప్రేమ ఎక్కడుంది? యాక్షన్ ఏది?... పెద్ద బోర్ సినిమా!" అని ఫేస్‌బుక్‌లో ఒక మహిళా ప్రేక్షకురాలు పోస్టు చూశాను నిన్న రాత్రి.
నాకేం ఆశ్చర్యం అనిపించలేదు.
నరుక్కోడాలు, రక్తప్రవాహాలు ప్రేక్షకుల బుర్రల్లోకి అంతగా ఎక్కించారు, అంత అలవాటు చేశారు మనవాళ్ళు.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani