Thursday, 22 October 2026

సక్సెస్ అంటే డబ్బు సంపాదించటం ఒక్కటే కాదు...


మీకిష్టమైన పనిచేయటం.
మీకిష్టమైనప్పుడు పనిచేయటం.
ఒకరి మీద ఆధారపడకుండా బ్రతకడం.
మీ సమయం మీ చేతుల్లో ఉండటం.
మీకు నచ్చిన స్నేహితుల్ని కలుసుకోవటం.
మీ మనస్సుని తాకే ప్రేమను పొందటం.
రిలాక్స్ కోసం ఒక కొత్త హాబీని మొదలెట్టడం.
కొత్తగా పాటలు రాయటం, సంగీతం నేర్చుకోడం. 
60 దాటాక ఠాగూర్‌లా పెయింటింగ్స్ వెయ్యటం.
మీకు నచ్చిన ఒక కొత్త వ్యాపార భాగస్వామిని కలుసుకోవడం.
ఇప్పటివరకూ లేని ఒక కొత్త బిజినెస్ ప్రారంభించటం.
మీ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చెయ్యకుండా డబ్బు సంపాదించడం.
మీరు ఎప్పటినుంచో అనుకుంటున్న ఒక బుక్ రాయటం.
మీరు వాయిదా వేస్తున్న మీ పిహెచ్‌డి పూర్తిచెయ్యటం. 
మీరు తిరగాలనుకున్న మీ కలల ప్రదేశాలు తిరగటం.
మీ పిల్లల్ని బాగా పెంచటం.
మీరు ఆరోగ్యంగా ఉండటం. 
  
... ఇవన్నీ విజయాలే.  

మీకిష్టమైన ఇలాంటివి ఎన్నో సాధించే అసలైన సక్సెస్‌కు ఎడిక్ట్ కండి.  

మందు, సిగరెట్, డ్రగ్స్, గ్యాంబ్లింగ్, బెట్టింగుల్లాంటి ఎడిక్షన్స్ కంటే ఇది చాలా సులభం.

జీవితానికి మంచిది.

మీరు బాగుంటారు. మీ కుటుంబం బాగుంటుంది. 

పరోక్షంగా, మీ చుట్టూ ఉన్న సమాజం బాగుండటానికి కూడా మీరూ ఎంతో కొంత తోడ్పడినవారవుతారు.  

కట్ చేస్తే - 

నవంబర్‌లో రాబోతున్న నా కొత్త పుస్తకం లోని కొన్ని వాక్యాలివి. పూర్తి వివరాలు త్వరలోనే.

- మనోహర్ చిమ్మని  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani