Monday, 17 November 2025

ఫాస్ట్ ట్రాక్‌లో సినిమాల్లోకి ప్రవేశించడం ఎలా?


ఫాస్ట్ ట్రాక్‌లో సినీఫీల్డులోకి ప్రవేశించాలని అనుకుంటున్నారా?

మీ కోసమే ఈ పోస్టు.

దాదాపు ఒక పదేళ్ళ క్రితం, ఒక ఫిలిం ఇన్‌స్టిట్యూట్లో "ఫిలిం డైరెక్షన్" కోర్సు 27 లక్షలు. ఇప్పుడది 40 లక్షల దాకా వెళ్ళుంటుంది. ముంబైలో అయితే 1 కోటి, 2 కోట్ల ఫీజుతో యాక్టింగ్, డైరెక్షన్ నేర్పించే ఫిలిం ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయని మీకు తెలుసా? 

ఏదో ఉత్సాహంతో నేర్చుకుంటారు, సర్టిఫికేట్ వచ్చేస్తుంది. కాని, ఆ సర్టిఫికేట్‌తో ఫిలిం ఛాన్స్ వస్తుందా? 

మళ్ళీ రొటీన్‌గా ఒక 5 నుంచి 10 ఏళ్ళు పడుతుంది. మీ కృషి ఫలించి మీకు ఛాన్స్ దొరకొచ్చు, దొరక్కపోవచ్చు. 

ఎన్నో లక్షలు, ఎంతో సమయం వృధా. 

నేను ఫిలిం కోచింగ్‌కు, ఫిలిం ఇన్‌స్టిట్యూట్స్‌కు వ్యతిరేకం కాదు. కాని, మారిన కండిషన్స్‌లో ఇప్పుడు మనం ఏదైనా ఫ్రీగా ఆన్‌లైన్లో నేర్చుకోవచ్చు. కాని, సినిమాల్లో అవకాశం సంపాదించుకోవడం మాత్రం అంత ఈజీ కాదు అని చెప్పడమే నా ఉద్దేశ్యం.

ఇప్పుడు రియాలిటీ కూడా అదే.

కట్ చేస్తే -    

ఇది AI యుగం. డిజిటల్ యుగం. Gen-Z యుగం.  

రొటీన్ అన్న పదమే ఇప్పుడు అవుట్ డేటెడ్. 

ఫిలిం కోచింగ్స్, సర్టిఫికేట్స్, ట్రెడిషనల్ కాస్టింగ్ కాల్స్, ఆడిషన్స్... వీటితో పనులు కావు. 

ఇవన్నీ చీకట్లో బాణం వేయటం లాంటిది. తగిలితే అదృష్టం. తగలకపోయే చాన్సే ఎక్కువ. 

ఈ నేపథ్యంలో - మీరు ఫాస్ట్ ట్రాక్‌లో సినిమాల్లోకి ప్రవేశించాలంటే ఇప్పుడు మీకు కావల్సింది కోచింగ్ కాదు... కన్సల్టింగ్. 

దేశంలోనే మొట్టమొదటిసారిగా నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్న "స్కిప్ ద లైన్ - ఫిలిం లాంచ్ కన్సల్టింగ్" ఈ విషయంలో మీకు బాగా తోడ్పడుతుంది.   

ఆర్టిస్టు, టెక్నీషియన్,
హీరో, హీరోయిన్,
రైటర్, డైరెక్టర్,
లిరిసిస్ట్, సింగర్, 
మ్యూజిక్ కంపోజర్,
ప్రొడ్యూసర్, ఇన్వెస్టర్... 

మీ లక్ష్యం ఏదైనా కావచ్చు. స్కిప్ ద లైన్ కన్సల్టింగ్ ద్వారా ఫాస్ట్ ట్రాక్‌లో మీరు ఫిలిం ఫీల్డులోకి ప్రవేశిస్తారు. 
 
నిజంగా మీ ఫిలిం కెరీర్ విషయంలో మీరు సీరియస్‌గా ఉన్నట్టయితే మాత్రం కింద ఇస్తున్న లింక్స్ పైన క్లిక్ చేసి చదవండి. 

ఆలోచించండి. అధ్యయనం చేయండి. పాజిటివ్ యాక్షన్ తీసుకోండి. 

మీరనుకున్నది సాధిస్తారు... ఫాస్ట్ ట్రాక్‌లో!

ఎంత కాలం... ఎంత కాలం?


జ్ఞానోదయం అనేది జీవితంలో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వచ్చేది. కాని, నాకు మాత్రం జీవితానికి సంబంధించిన అనేక విషయాల్లో, అనేక సందర్భాల్లో అనేకసార్లు అయ్యింది - జ్ఞానోదయం. 

అందుకే, "జ్ఞానోదయం అంటే నీకు కుక్కతోక వంకర లాంటిది" అని వెక్కిరిస్తారు నా ఫ్రెండ్స్ కొందరు.  

కట్ చేస్తే - 

క్రియేటివిటీకి సంబంధించిన నేపథ్యంలో, బయటివారికి అంత సులభంగా అర్థంకాని స్టకప్‌లతోనే సంవత్సరాలకి సంవత్సరాలు గడిచిపోతుంటాయి. అందరూ ఏదేదో వారికి తోచింది అంటుంటారు, ఇంటా బయటా. 

అన్నీ నవ్వుతూ భరిస్తూ, ఎదుర్కొంటూ, ఏం జరగనట్టే ఉండాలి.           

ఇలాంటి నేపథ్యంలో సాధ్యమైనంత మానసిక వత్తిడి తగ్గించుకోడం చాలా అవసరం. తప్పనిసరి కూడా.

చెప్పలేం, గాలిబుడగ ఏ క్షణమైనా టప్ మనొచ్చు. 

జీవితం చాలా చిన్నది. బరువులూ, బాధ్యతలూ, కమిట్మెంట్సూ... అన్నీ త్వరత్వరగా పూర్తిచేసుకోవడమొక్కటే లేజర్ ఫోకస్‌ కావాలి. 

బ్రతికున్న నాలుగురోజులూ జీవితాన్నీ, మనుషుల్నీ ప్రేమిద్దాం. ప్రేమగా ఉందాం. 

Life’s short, but it’s beautiful as hell. Get your fitness in place, drop the dead weight, and hold tight to the few things that give you real freedom and real peace.

- మనోహర్ చిమ్మని   

Sunday, 16 November 2025

Fast-Track Your Entry Into Films!


Skip the Line.
FilmLaunch Consulting.

Fast-Track Your Entry Into Films.

Breaking into the film industry has nothing to do with film institutes or years of blind struggle.

Sending random auditions every day…
Roaming around production offices for months…
Wasting 5–10 years in outdated methods…

That era is over.
This is the AI age. The Gen-Z age.

Today, you need one thing:
A strategy that bypasses the routine hurdles and gets you into the industry — fast.

Not coaching.
Real consulting.

Guided by someone who actually works in cinema, knows the game from the inside, and builds a strategic plan for you — and gets you to execute it the right way.


Once you’re inside, it’s your talent, your discipline, your ambition that takes you forward.

Hero? Heroine?
Actor? Actress? 
Writer? Director? 
Musician? Lyricist? Singer?
Producer? Investor?...
Whatever your goal is — Skip the Line helps you turn it real and fast. 

Apply Now — Limited Slots

For fees & personalized consulting details:
WhatsApp (message only): +91 9989578125
Email: okafilmmaker@gmail.com

No calls. Messages only.

Nandi Award–Winning Writer & Film Director

Thursday, 13 November 2025

కొత్త తెలుగు హీరోయిన్స్‌కు ఇప్పుడు మంచి డిమాండ్!


ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు తెలుగు సినిమాల్లో కొత్త తెలుగు హీరోయిన్స్‌కు పిచ్చి డిమాండ్ ఉంది. 

ముంబై హీరోయిన్స్‌లా జీరో సైజ్, లుక్, హై ప్రొఫైల్ కల్చర్, కలర్ వంటివి ఇప్పుడెవరూ పెద్దగా పట్టించుకోవటం లేదు.

చలాకీగా, డైనమిక్‌గా ఉన్నారా, తెలుగు డైలాగ్ డెలివరీ బాగుందా, ఎక్స్‌ప్రెషన్ బాగుందా... అవకాశం వచ్చినట్టే. 

వీటికి తోడు - సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా అయితే మాత్రం వందకి వంద శాతం వారికి అవకాశం దొరికినట్టే. 

మీరు గమనించే ఉంటారు... ఈమధ్యకాలంలో వచ్చిన ఎన్నో చిన్న బడ్జెట్ తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలే ఎక్కువగా హీరోయిన్స్‌గా పరిచయమవుతున్నారు.  

కట్ చేస్తే - 

ఇదంతా కరోనా తర్వాత వచ్చిన మార్పు. 

ముంబై హీరోయినా, తెలుగు హీరోయినా అన్నది కాదు పాయింట్ ఇప్పుడు. కంటెంట్ బాగుందా లేదా అన్నదే పాయింట్. 

అయితే - భారీ బడ్జెట్ సినిమాలకు, టాప్ స్టార్స్ సినిమాలకు మాత్రం ఇప్పుడు చెప్పిందంతా వర్కవుట్ కాదు. అక్కడ ముంబై హీరోయిన్సే కావాలి. 


కాని, అవి సంవత్సరానికి ఒక 10 సినిమాలే ఉంటాయి. మిగిలిన 190 చిన్న బడ్జెట్ సినిమాల్లో కొత్త తెలుగు హీరోయిన్స్‌కు ఇప్పుడు నిజంగా ఫుల్ డిమాండ్ ఉంది. 

డిసెంబర్లో మేం ప్రారంభిస్తున్న రెండు కొత్త సినిమాల్లో, మాకూ కావాలి... కొత్త తెలుగు హీరోయిన్స్. డిస్క్రిప్షన్లో మా యాడ్ ఉంది. ఆసక్తి ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు.   

- మనోహర్ చిమ్మని  

Wednesday, 12 November 2025

ముంబై హీరోయిన్సే ఎందుకు?


కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టి, నిత్య మీనన్, పూజ హెగ్డే, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, తమన్నా, రాశి ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్, రష్మిక మందన్నా... ఒక ఉదాహరణగా నేను చెప్తున్న వీళ్ళంతా తెలుగు హీరోయిన్స్ కారు.

ముంబై నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవాళ్ళు. 

కాని, ప్రొఫెషనల్‌గా సినిమా మీద వీళ్ళకి ఎంత అభిమానం అంటే, సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందే తెలుగు ట్యూటర్స్‌ను పెట్టుకొని తెలుగు నేర్చుకున్నారు. తెలుగు బాగా మాట్లాడుతారు. 

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, హీరోయిన్స్‌కు శరీర సౌష్టవం ప్రధానం. తర్వాతే టాలెంట్ ఎట్సెట్రా. జిమ్ కోసం, గ్రూమింగ్ కోసం, లుక్ కోసం వీళ్ళు లక్షల్లో ఖర్చుపెడతారు. మొత్తం ఫోకస్ వాళ్ళ పనిమీదే ఉంటుంది. పనే దైవం వాళ్లకి. వ్యక్తిగత జీవితం కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటారు. 

ఫిలిం ఇండస్ట్రీలో అవసరమైన ఒక రకమైన etiquette గురించి వీళ్లకు ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం ఉండదు. అది వారి జీవనశైలిలో భాగం. 

ప్యూర్ ప్రొఫెషనలిజమ్.        

అందుకే వీళ్ళంతా ఒక స్థాయికి ఎదిగారు. బాగా పేరు తెచ్చుకొన్నారు. అవార్డులు, రివార్డులు పొందారు.  

ఫిలిమ్మేకర్స్‌కు కావల్సింది ఇదే కాబట్టి... ఎక్కువగా మన ఫిలిం డైరెక్టర్స్ ముంబై హీరోయిన్స్, ఇతర రాష్ట్రాల హీరోయిన్స్ వైపే మొగ్గుతారు. 

In cinema, a heroine is not just the face of beauty — she’s the pulse that gives rhythm to the story and fire to the screen.

- మనోహర్ చిమ్మని 

Do What You Love — Life’s Too Short to Hate What You Do All Day


Most people don’t hate life — they just hate their daily routine.

The alarm clock, the traffic, the meetings… it’s not life that feels heavy — it’s the way they’re living it.

Doing what you love isn’t a luxury anymore; it’s survival for the soul. Because when you love what you do, work stops being a burden and becomes your playground.

The truth?
You’ll spend most of your waking hours working.

So why not build something that makes you feel alive instead of drained?

Find that one thing that lights your eyes up. Then double down. Obsess over it. Live it.

The world doesn’t need more tired professionals — it needs more people on fire.

Do what you love. Because life’s too short to hate what you do all day.

- Manohar Chimmani 

Tuesday, 11 November 2025

What is Blogging for a Creative?


For a creative, blogging isn’t just about posting content — it’s about building a voice.

It’s where thoughts turn into clarity, where scattered ideas find structure.

Blogging gives you a stage — not for applause, but for expression. It’s a space to test your thinking, sharpen your perspective, and tell the world what moves you.

Unlike social media, blogging isn’t about trends or algorithms. It’s about depth. It’s slow, reflective, and personal — just like any real creative process.

For filmmakers, writers, designers, musicians — a blog becomes a living portfolio of your evolution. Each post marks a phase of your journey — the experiments, the breakthroughs, the scars, and the magic.

When you blog, you’re not just sharing — you’re documenting your creative becoming.

That’s what blogging is for a creative.

Your own voice. Your own lab. Your own personal space. Your own legacy.

And if you’re someone with an appetite for finding faults — this isn’t the place for you.

- Manohar Chimmani 

జూబ్లీహిల్స్ బీఆర్‌యస్‌దే !!


ఫస్ట్రేషన్లో అరిచే అరుపులకు, తిట్టే తిట్లకు ప్రజలు ప్రభావితం కారు. ఓట్లు పడవు. 

ఇది డిజిటల్ యుగం. 

ఎవరైనా పొరపాటు ఒక్కసారే చేస్తారు. పొరపాటు జరిగింది అని తెలిశాక, దాన్ని సరిదిద్దుకొనే అవకాశం కోసం చూస్తారు. ఇప్పుడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అలాంటి అవకాశం వచ్చింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని నాలుగు లక్షల వోటర్లు ఈ అవకాశాన్ని ఈరోజు ఆయుధంగా వాడుకోబోతున్నారు.  

నవంబర్ 14 నాడు ప్రపంచానికి ఒక నిజాన్ని చాలా స్పష్టంగా తెలియజేయబోతున్నారు... 

అజ్ఞానం, అసమర్థతలతో నిండిన రాజకీయం వేరు, రాష్ట్రాభివృద్ధి కోసం అహరహం శ్రమించే సంకల్పం ఉన్న రాజకీయం వేరు అని.
  
తెలంగాణ ప్రజలకు ఇప్పుడు రాష్ట్రాభివృద్ధి కావాలి. ప్రస్తుత ప్రభుత్వం రాకముందు గత పదేళ్లలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో కళ్ళారా చూశారు తెలంగాణ ప్రజలు. అంతకు ముందు అరవయ్యేళ్లపాటు ఉమ్మడి రాష్ట్రం నేపథ్యంగా, తెలంగాణ ప్రాంతంలో జరిగిన విధ్వంసం చూశారు. అసలు ఈ ప్రాంత అభివృద్ధినే ఎగతాళి చేసిన అహంకారాన్ని చూశారు. 

ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఎవరు ఏంటి అన్నది వివరించి చెప్పాల్సిన అవసరం లేదు.   

తెలంగాణ సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఉద్యమశక్తిగా ఏం సాధించగలడో చూశాం. ఒక కొత్త రాష్ట్ర సారథిగా రాష్ట్రాన్ని అనేక రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎలా తీర్చిదిద్దగలిగాడో చూశాం. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో, పదేళ్ళ తర్వాత మళ్ళీ శత్రుగణం అంతా అంతర్గతంగా ఒక్కటయి, "మార్పు" అనే మాయతో, వందల అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చగలిగారు.  

రాజకీయాల్లో మార్పు సహజం. కాని, ఆ మార్పు మంచి కోసం జరగాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. కాని, గత రెండేళ్ళలో అలా జరగలేదు. మిగిలిన మూడేళ్లలో కూడా ఏదో జరుగుతుందన్న 'గ్యారంటీ' లేదు. జరిగేది ఒక్కటే - ఎప్పటికప్పుడుప్రజల్ని పక్కదారి పట్టించేలా - తెల్లారిలేస్తే కేసీఆర్‌ను, కేటీఆర్‌ను, బీఆర్‌యస్‌ను ఆడిపోసుకోవడం, జుగుప్సాకరమైన భాషలో తిట్టడం. 

కాని, ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ బై-ఎలక్షన్ ఫలితాలు దీనికి ఫుల్‌స్టాప్ పెట్టబోతున్నాయి. ఇంకో మూడేళ్ళ తర్వాతయినా తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి తిరిగి పట్టాలెక్కడం కోసం, ఈ ఫలితాలు బీఆర్‌యస్‌కు అనుకూలంగా రావడం అత్యవసరం.            

కట్ చేస్తే - 

రాజకీయాలు రాజకీయాలే. తెలిసో తెలియకో అంతకుముందు జరిగిన చిన్న చిన్న పొరపాట్లను ఒక్కొక్కటిగా సరిదిద్దుకొంటూ, పక్కా స్ట్రాటెజిక్ ప్రణాళికతో, కేసీఆర్ మార్గదర్శకత్వంలో బీఆర్‌యస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ చేస్తున్న నిర్విరామ కృషి కళ్ళముందు స్పష్టంగా కనిపిస్తోంది. 

ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేటీఆర్ పరిచయం చేసిన ఆధునిక ఆడియో-విజువల్ ఎన్నికల ప్రచార సరళి నిజంగా రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఒక గొప్ప ప్రారంభానికి సూచన.  

తెలగాణ రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఎవరు ఏం చేశారు అన్నది అంకెల్లో, గ్రాఫిక్స్ రూపంలో ఖచ్చితమైన ఆధారాలు, రిపోర్టులతో చూపించడం ద్వారా ప్రజలే అన్నీ తెలుసుకుంటారు. పచ్చి అబద్ధాలతో, వినడానికే సిగ్గనిపించే అపభ్రంశ భాషతో ఎవరు ఎంత ఊదరగొట్టినా, ఎంత గోబెల్స్ ప్రచారం చేసినా గుడ్డిగా నమ్మి మోసపోవటం అనేది ఇకమీదట జరగదు. 

ఈ విషయంలో ఎన్నికల్లో డిజిటల్ ప్రచారానికి తెరలేపిన కేటీఆర్‌ను అభినందించాల్సిందే. 

ఈ నేపథ్యంలో - తెలంగాణ రాష్ట్రాన్ని చాలా విషయాల్లో ఒక అగ్రశ్రేణి రాష్ట్రంగా అభివృద్ధిపథంలో నడిపిన కేసీఆర్ సారథ్యంలోని బీఆర్‌యస్ ఒక వైపు కాగా, అరవై ఏళ్ళపాటు తెలంగాణను ఒక వెనుకబడిన ప్రాంతంగానే నిలిపి, ఈ ప్రాంతానికి ఏమీ చేయకపోగా, మళ్ళీ గత రెండేళ్ళుగా అదే అసమర్థతను కొనసాగిస్తున్న కాంగ్రెస్ ఇంకోవైపు.  

జూబ్లీహిల్స్ లోని వోటర్లకు రావల్సినంత స్పష్టత వచ్చేసింది. రాజకీయంగా, సంక్షేమం పరంగా, అభివృద్ధిపరంగా బీఆర్‌యస్ ఏం చేయగలదు, కాంగ్రెస్ ఏం చేయగలదు అన్నది కూడా వారికి తెలుసు. 

గత ఎన్నికల్లో లాగా ఈసారి ఎలాంటి పొరపాటు జరగదు. 

జూబ్లీహిల్స్ ఇంతకుముందు కూడా బీఆర్‌యస్‌దే, ఇప్పుడు కూడా బీఆర్‌యస్‌దే అని జూబ్లీహిల్స్ వోటర్లు ఇప్పుడు తీర్పుచెప్పబోతున్నారు. 

- మనోహర్ చిమ్మని  

(ఈరోజు "నమస్తే తెలంగాణ" దినపత్రికలో వచ్చిన నా వ్యాసం.) 

Monday, 10 November 2025

ఫిలిం కోచింగ్ అనేది ఇప్పుడు అవుట్‌డేటెడ్!


ఫిలిం కోచింగ్ అనేది ఇప్పుడు నిజంగా అవుట్‌డేటెడ్.

క్లాస్‌రూముల్లో కూర్చుని నేర్చుకునే రోజులు కావివి. మీరు అలా నేర్చుకున్నది, అర్థం చేసుకొని, ఆచరణలో పెట్టే లోగా, మినిమమ్ ఇంకో డజన్ కొత్త ఆవిష్కరణలు ఫిలిమ్మేకింగ్‌లో వస్తున్నాయి.

మీరు డైరెక్టర్ కావాలనుకొన్నా,
ప్రొడ్యూసర్ కావాలనుకొన్నా,
హీరో కావాలనుకొన్నా,
ఆర్టిస్టు-టెక్నీషియన్...
రైటర్, లిరిక్-రైటర్, డాన్స్ మాస్టర్, 
మ్యూజిక్ కంపోజర్, స్టయిలిస్ట్...

ఇలా ఏది కావాలనుకున్నా - మీరు తెలుసుకోవాలనుకునేది, నేర్చుకోవాలనుకునేది అంతా ఆన్‌లైన్లో ఉంది. 

ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు అప్‌డేట్ చేసుకోవచ్చు. 

ఇంత మాత్రానికి - 10 లక్షలు, 30 లక్షలు ఫీజులు కట్టి ఫిలిం కోచింగ్స్ అవసరమా? ముంబైలో అయితే కోటి, రెండు కోట్ల ఫీజుతో కూడా ఫిలిం కోచింగ్ స్కూల్స్ ఉన్నాయి. 

వీటివల్ల వచ్చేది ఏంటంటే, ఒక ఏడాదో రెండేళ్ళ తర్వాతో ఒక సర్టిఫికేట్! 

ఈ సర్టిఫికేట్ చూసి ఎవ్వరూ ఇండస్ట్రీలో అవకాశం ఇవ్వరు. అది ఎందుకూ పనికిరాదు. 

సో, మళ్ళీ మీరు గ్రౌండ్ జీరో నుంచి మీ ప్రయత్నాలు ప్రారంభించాల్సిందే. 

ఇంకో విషయం ఏంటంటే - ఇంతకు ముందులా 5 నుంచి 10 ఏళ్ళ పాటు మీరు అవకాశాల కోసం తిరగాల్సిన అవసరం ఇప్పుడు లేదు. 

ఇప్పుడంతా 20/20 యుగం. ఒక ఖచ్చితమైన స్ట్రాటెజీతో ప్లాన్ చేసుకుంటే చాలు. మీరు ఫిలిం ఇండస్ట్రీలోకి ఈజీగా ప్రవేశిస్తారు. అనుకున్నది సాధిస్తారు. 

దీని కోసం మీకు కావాల్సింది కోచింగ్ కాదు. 

కన్సల్టింగ్. లేదా, మెంటార్‌షిప్. 

కట్ చేస్తే -

ఈ దృక్పథంతోనే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక కొత్త ఫిలిం లాంచ్ కన్సల్టింగ్ ఆలోచన చేశాను. 


నిజంగా మీ ఫిలిం కెరీర్ విషయంలో మీరు సీరియస్‌గా ఉన్నట్టయితే కింద లింక్ ఇస్తున్నాను. చదవండి. ఫీజు, పూర్తివివరాల కోసం మెసేజ్ చేయండి. 

- మనోహర్ చిమ్మని 

***

"Skip the Line" FilmLaunch Consulting link: 
https://www.richmonk.me/p/skip-line-filmlaunch-consulting.html

My YouTube Video on Skip the Line: 
https://youtu.be/9uGeqnMGzTw

Film Coaching Is Now an Outdated Concept


There was a time when film coaching sounded cool — when people believed they could learn cinema in a classroom, memorize a few formulas, and “make it big.”

That time is gone.

Today, the industry moves too fast. The technology changes overnight. Audiences evolve every Friday. What you need now is not a coach — you need a creative ally, a mentor who’s in the game, not someone who just talks about it.

Film coaching focuses on theory.
Film consulting focuses on practicality — on reality.

A coach gives you steps.
A mentor gives you shortcuts.

If you want to survive — and truly stand out — you need clarity, strategy, and insider perspective. You need someone who helps you skip the line, not stand in it waiting for luck.

Because cinema isn’t taught anymore.
It’s lived, breathed, and built.

— Manohar Chimmani
🎥 Founder, Skip the Line: FilmLaunch Consulting 

***

"Skip the Line" FilmLaunch Consulting link: 
https://www.richmonk.me/p/skip-line-filmlaunch-consulting.html

My YouTube Video on Skip the Line: 
https://youtu.be/9uGeqnMGzTw