Tuesday, 8 September 2026

సైన్స్ కాదనిపించే సైన్స్


"కొందరికి కొన్ని కలిసివస్తాయి, కొందరికి కలిసిరావు." 

ఇది కొంతవరకు నిజం. ఇక్కడ లక్ ఫాక్టర్ ఉండొచ్చు. మనకు కనిపించని అదృష్టం పనిచేయవచ్చు. 

కట్ చేస్తే - 

"కొందరు కొన్నిటిని కలిసివచ్చేలా చేసుకోగలుగుతారు, కొందరు అలా చేసుకోలేరు." 

ఇది పూర్తిగా నిజం. 

నైపుణ్యం, సామర్థ్యం కంటే ఎక్కువగా ఇక్కడ పనిచేసేది... ఏమైనా సరే, నేనిది సాధించితీరాలి అన్న సంకల్పం. సాధించగలను అన్న నమ్మకం. సాధించే కిల్లర్ ఇన్‌స్టింక్ట్, మైండ్‌సెట్. ఇవన్నీ ఎలైన్ అవుతూ ఒకే దిశలో పనిచేయాలి. పనిచేసేలా చేసుకోగలగాలి.  

క్లుప్తంగా, స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలంటే... ఒక వేటగాడి మనస్తత్వం. విల్లు ఎక్కుపెట్టాడంటే అవతల దిగాల్సిందే. 

విన్నర్స్, వేటగాళ్ళు వేర్వేరు కాదు. 
వాళ్ళకు ప్లాన్-బి ఉండదు.          

- మనోహర్ చిమ్మని   

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani