ఆ దశ కొందరికి కొంచెం ఎర్లీగా వస్తుంది. కొందరికి కొంచెం ఆలస్యంగా వెలుగుతుంది. నాలాగా.
కట్ చేస్తే -
సినిమా ప్యాషనేట్స్ అయిన కొంతమంది లైక్‌మైండెడ్ ఔత్సాహికుల నెట్‌వర్క్‌ను సృష్టించుకొనే ప్రయత్నంలో భాగంగానే ముందు నేనీ బ్లాగ్‌ను సృష్టించాను.
ఊరికే సినిమా టిడ్‌బిట్స్, రొటీన్ వార్తల్లాంటివి రాయకుండా... నా అనుభవంలో నాకు తెలిసిన ఫిలిం ఇండస్ట్రీ లోపలి విషయాలను లైటర్‌వీన్‌లో, హిపోక్రసీ లేకుండా రాస్తూ పంచుకోవాలన్నది నా ఆలోచన.
అందుకే, ఈ బ్లాగ్‌కు "నగ్నచిత్రం" అని పేరు పెట్టాను.
(ఈ మధ్యే "The Rich Monk" అని పేరు మార్చాను. అది వేరే విషయం. దాని గురించి మరోసారి చెప్తాను.)
(ఈ మధ్యే "The Rich Monk" అని పేరు మార్చాను. అది వేరే విషయం. దాని గురించి మరోసారి చెప్తాను.)
మొదట్లో దీన్ని కొంచెం సీరియస్‌గా, కొంచెం ఈజీగా, కొంచెం కేర్‌లెస్‌గా తీసుకొంటూ ఏదో ఒకటి రాస్తూపోయాను.
కాని, నెమ్మదిగా బ్లాగింగ్ ఎంత శక్తివంతమైందో నాకర్థమైంది. నా దినచర్యలో భాగమైంది.
తర్వాత్తర్వాత, నా ఫ్రీలాన్సింగ్ క్రియేటివ్ యాక్టివిటీ మొత్తానికి దీన్నే ఒక "హబ్"లా ఉపయోగించుకొంటూ, ఏ ఒక్కదానికీ పరిమితం చేయకుండా అన్నీ దీన్లోనే రాయడం ప్రారంభించాను.
ఈ బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ మీదే - అందరూ - అన్నీ - ఇక్కడే - నాకు కనెక్ట్ కావడం ప్రారంభమైంది.
21 ఆగస్టు 2012 నాడు, అనుకోకుండా సృష్టించిన ఈ "నగ్నచిత్రం" వయస్సు చూస్తుండగానే 14 ఏళ్ళు దాటింది.
కట్ చేస్తే -
మొన్నటి నా లేటెస్ట్ బెస్ట్ సెల్లర్ పుస్తకం "కేసీఆర్ - The Art of Politics" ఆలోచన నాలో రావడానికి కూడా నాకత్యంత ఇష్టమైన నా ఈ బ్లాగింగ్ అలవాటే కారణం అయ్యింది.
ఇప్పుడు కొద్దిరోజుల్లో ప్రచురిస్తున్న నా కొత్త పుస్తకం ఆలోచన కూడా నేను బ్లాగ్‌లో రాస్తున్నప్పుడే అనుకోకుండా వచ్చింది. పుస్తకం వివరాలు త్వరలో పోస్ట్ చేస్తాను.
Sometimes I think of blogging as finger exercises for a violinist. Sometimes I think of it as mulching a garden. And sometimes, I think of it as my fascinating girlfriend.
Whatever it is, I love it. It keeps me writing, thinking, experimenting—and it makes my “real” writing better.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani