Showing posts with label Money. Show all posts
Showing posts with label Money. Show all posts

Sunday, 16 August 2026

ఇప్పుడు హీరోయిన్స్‌గా మనవాళ్ళూ బాగానే ముందుకు వస్తున్నారు!


ఇందాక ఒక చిన్న ఇంటర్వ్యూ బైట్ చూశాను. అది కలెక్షన్ కింగ్ ఇంటర్వ్యూ బైట్, ఓ నాలుగైదేళ్ళ కిందిది అనుకుంటాను. అందులో ఆయన చెప్పిన ఒకట్రెండు మాటలకు చాలా విలువుంది.  

విషయం ముంబై నుంచి, ఇతర నార్త్ ఇండియా ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే హీరోయిన్స్‌కు సంబంధించింది.

సన్నగా, తెల్లగా ఉంటారని మనం ఎక్కడినుంచో ఎవరినో తెచ్చుకుంటున్నాం. బిజినెస్ క్లాస్ టికెట్స్ వేసి రప్పిస్తున్నాం. ఇక్కడ స్టార్ హోటల్స్‌లో ఉంచుతున్నాం. ఇదంతా ప్రొడ్యూసర్స్, కొంతమంది డైరెక్టర్స్ వల్ల జరుగుతున్న కాస్ట్‌లీ పొరపాటు.

ఆర్ట్‌కు భాష, ప్రాంత భేదాల్లేవు. కాని, వాళ్ళకి కోట్లల్లో రెమ్యూనరేషన్, ఇతర సౌకర్యాలు అలవాటుచెయ్యాల్సిన అవసరం లేదు. మన ప్రొడ్యూసర్స్ పుణ్యమా అని వీళ్ళంతా సంవత్సరం తిరిగే సరికి కోట్లు డిమాండ్ చేసే హీరోయిన్స్ అవుతున్నారు.     

ఎవరికైనా రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే. కాని, ఇక్కడి మన తెలుగు/దక్షిణాది హీరోయిన్స్‌తో సమానంగా ట్రీట్ చెయ్యాలి తప్ప, అంత స్పెషల్ ట్రీట్మెంట్ అవసరం లేదు.   

ఇప్పుడు హీరోయిన్స్‌గా మనవాళ్ళూ బాగానే ముందుకు వస్తున్నారు. అన్ని విషయాల్లో ప్రొఫెషనల్‌గా ముంబై అమ్మాయిలతో పోటీపడుతున్నారు. నిజంగా ఇలా ఉన్నప్పుడు, డైరెక్టర్స్‌కు తెలుగు హీరోయిన్స్‌ను తీసుకోవడం అనేది భాష, ఎక్స్‌ప్రెషన్ విషయంలో ఒక మంచి అడ్వాంటేజే అవుతుంది. 

What do you say?

- మనోహర్ చిమ్మని  

Saturday, 15 August 2026

కొత్తగా ఫీల్డులోకి రావాలనుకొనేవాళ్లు తీసుకోవల్సిన జాగ్రత్త ఒకే ఒక్కటి...


సినీఫీల్డులోకి ప్రవేశించాలనుకొనే ఆర్టిస్టులయినా, టెక్నీషియన్లయినా, ఇంకెవరయినా... ముందుగా తెల్సుకోవల్సిన విషయాలు ప్రధానంగా రెండు:

1. సినీఫీల్డులో "ఇది ఇలా జరుగుతుంది" అని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఫీల్డులో ఎంట్రీ దొరకడమే చాలా కష్టం. దొరికాక దాన్ని సరైన విధంగా వినియోగించుకొని నిలదొక్కుకోవడం మరీ కష్టం. ఒక్క ముక్కలో చెప్పాలంటే - ఇక్కడ దేనికీ గ్యారంటీ లేదు.

2.  ఇక్కడ అవకాశం దొరికి, పేరు తెచ్చుకొనేవరకూ దాదాపు ఎవ్వరూ ఒక్క రూపాయి పారితోషికం ఇవ్వరు. అలా ఇస్తారనుకోవడం, అలా అని ఎవరైనా చెప్తే వినడం... ఉఠ్ఠి భ్రమ. మన జేబులోంచే వేలకి వేలు, లక్షలకి లక్షలు ఖర్చుపెట్టుకుంటూ బ్రతకాల్సి ఉంటుంది. అవకాశాల కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫీల్డులో ఉన్నవాళ్ళంతా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నవాళ్ళే. 

ఈ విషయంలో కేవలం ఒక్క కేటగిరీకి మాత్రమే మినహాయింపు ఉంటుంది. అది - హీరోయిన్లు, ఇతర ఫిమేల్ సపోర్టింగ్ ఆర్టిస్టులు. వీళ్లు దొరకడమే కష్టం కాబట్టి ఈ వెసులుబాటు. అదే హీరోలయితే ఎదురు పెట్టుబడి పెట్టాల్సి కూడా రావొచ్చు. అది వేరే విషయం.  

పైన చెప్పిన రెండు అంశాల్ని దృష్టిలో పెట్టుకొని, కొత్తగా ఫీల్డులోకి రావాలనుకొనేవాళ్లు తీసుకోవల్సిన జాగ్రత్త ఒకే ఒక్కటి.

ఇక్కడ ఫీల్డులో అవకాశం దొరికి, నిలదొక్కుకొనేవరకూ - ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరొక ఆదాయమార్గాన్ని లేదా జాబ్‌ని ముందుగానే చూసుకోవాలి. లేదంటే మీరు బాగా డబ్బున్నవాళ్లయి ఉండాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి.   

శిలాశాసనం లాంటి ఈ జాగ్రత్త తీసుకోకుండా ఫీల్డులోకి ఎవరు ఎంటరయినా... తర్వాత సినిమా కష్టాలు తప్పవు. అన్నీ అవుతున్నట్టే ఉంటుంది. కానీ, ఏదీ ఇంచ్ కదలదు. సాంఘికంగా, ఆర్థికంగా ఎన్నో ఛాలెంజ్‌లు ఎదుర్కోవాల్సి వస్తుంది.  

సో, బి కేర్‌ఫుల్!

No guts, no glory.  

- మనోహర్ చిమ్మని  

Friday, 14 August 2026

ఇండిపెండెంట్ సినిమాలకు అంత రిస్క్ లేదు!


సినిమాలు తీయడం కష్టం కాదు. 
హిట్ సినిమాలు తీయడం కష్టం. 

హిట్ సినిమాలకు, బడ్జెట్‌కు తప్పక సంబంధం ఉంటుంది. అయితే, భారీ బడ్జెట్ ఉన్న సినిమాలు కూడా ఫెయిలవుతాయి కదా అన్నది లాజిక్. కాని, ఒక మంచి కమర్షియల్ సినిమా తీయడానికి బేసిగ్గా ఒక మినిమమ్ బడ్జెట్ అనేది తప్పనిసరి అన్నది ఎవరైనా ఒప్పుకొనితీరాల్సిందే. 

ఇండిపెండెంట్ సినిమాలన్నింటికీ ప్రధాన సమస్య ఇదే...
మినిమమ్ బడ్జెట్. 

కట్ చేస్తే -

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా, సినిమాల సక్సెస్ రేట్ కేవలం 5-7 శాతమే. 

ఈ నంబర్ మన బుర్రలో ఉంటే చాలు. వొళ్ళు దగ్గరపెట్టుకొని సినిమాలు చేస్తాం. రిస్క్-ఫ్రీ బడ్జెట్‌లో సినిమాలు చేస్తాం. ఒకవేళ థియేటర్లో సినిమా కిందా మీదా అయినా, ఓటీటీలు కొంతవరకు ఆదుకుంటాయి. 

మ్యాటర్ ఏంటంటే... భారీ బడ్జెట్ ప్యానిండియా సినిమాల గ్యాంబ్లింగ్‌ను తట్టుకొనే శక్తి భారీ ప్రొడక్షన్ హౌజ్ బ్యానర్లకు, ప్రొడ్యూసర్స్‌కు ఉంటుంది. 

చిన్న బడ్జెట్లో చేసే ఇండిపెండెంట్ సినిమాలకు అంత రిస్క్ లేదు. కంటెంట్ విషయంలో కూడా, మన క్రియేటివిటీకి ఆకాశమే హద్దు. 

- మనోహర్ చిమ్మని        

Sunday, 2 August 2026

ప్రమోషన్ ప్లాన్ లేకుండా సినిమా తీయడం వృధా!


చాలా మందికి కొత్తవాళ్లతో తీసే చిన్న సినిమాలు మధ్యలోనే ఆగిపోతాయి... అసలు రిలీజ్ కావు... ఒకవేళ రిలీజ్ ఐనా హిట్టు కావు... హిట్ అయినా డబ్బులు రావు... అని ఇలా రకరకాల అభిప్రాయాలుంటాయి. 

సినిమా నిర్మాణం మీద, బిజినెస్ పైన ఖచ్చితమైన అవగాహన ఉండి, సినిమా తీయడం వేరు. ఏదో ఊపులో సినిమా తీయాలని తీయడం వేరు.

ఒకవేళ తెలియనప్పుడు, తెలిసిన సీనియర్స్ చెప్పేది వినడం చాలా అవసరం. అలా జరగనప్పుడే పై అపోహలు నిజమవుతాయి. నిర్మాతతోపాటు - ఆ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కూడా ఎంతో నష్టపోతారు.

ఇవన్నీ ఒకెత్తు కాగా, సినిమా ప్రమోషన్ మొత్తం ఒకెత్తు.
 
ప్రమోషన్ ప్రాముఖ్యం తెలియనివాళ్లు అసలు సినిమా తీయకుండా ఉండటం బెటర్. ఈ వాస్తవం గుర్తించినవారెవ్వరికీ ఏ సమస్యా ఉండదు. చిన్న బడ్జెట్‌లోనే మంచి హిట్ ఇస్తారు. మరిన్ని మంచి సినిమాలు తీస్తారు. కోట్లల్లో డబ్బు సంపాదించుకుంటారు.

అలాంటి లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్, కో ప్రొడ్యూసర్స్, ప్రొడ్యూసర్స్ పాతవాళ్లలో చాలా తక్కువగా ఉంటారు. కొత్తవారు దొరకడం అంత ఈజీ కాదు.

ఒక సినిమా ప్రారంభించే ముందు ఇలాంటివి ఎన్నో, ఎన్నెన్నో బాగా చూసుకోవాలి. సరైన అంచనాలు వేసుకోవాలి. 

ఎటొచ్చీ, సగం తెలిసి సగం తెలీనివాళ్ళతోనే సమస్యలన్నీ.   

అందుకే చిన్న సినిమాల ప్రారంభంలో పదే పదే ఆలోచనలూ, ఆలస్యాలూ.

నిజంగా ఒక బిజినెస్‌గా తీసుకుంటే, సినిమాను మించిన బిగ్ బిజినెస్ లేదన్న విషయం ఇక్కడ సక్సెస్ సాధించినవాళ్ళందరికీ బాగా తెలుసు. వీళ్ళే తమకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు. ప్రమోషన్ లేకుండా బ్రాండ్ లేదన్న నిజం వీళ్ళకు మాత్రమే తెలుసు.     

దటీజ్ సినిమా. 

- మనోహర్ చిమ్మని   

Saturday, 1 August 2026

దటీజ్ సినిమా!


సినిమా నిర్మాణంలో ఆధునికంగా వచ్చిన డిజిటల్ టెక్నాలజీ వల్ల బడ్జెట్‌లు చాలా తగ్గాయి. చిన్న స్థాయిలో, కొత్తవాళ్లతో సినిమాలు చేయాలనుకొనేవాళ్లకు బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో ఇదొక మంచి ప్రాఫిటబుల్ అండ్ పాజిటివ్ మలుపు. 

అయితే - దీన్ని ఎంతవరకు పాజిటివ్‌గా ఉపయోగించుకొని, ఏ రేంజ్‌లో సక్సెస్ సాధించగలమనేదే మిలియన్ డాలర్ కొశ్చన్. 

ఎన్ని ఆడ్డంకులు వచ్చినా, అన్నీ మనకు అనుకూలం చేసుకొని ముందుకు సాగిపోగల సత్తా కూడా మనలో ఉండాలి. 

ఎందుకంటే...
సినిమా ఒక స్పెక్యులేషన్.
ఒక జూదం.

అయినా - భారీ స్థాయిలో డబ్బు రొటేషన్, ఊహించని రేంజ్ వ్యక్తులతో పరిచయాలూ, సంబంధాలూ, ఓవర్‌నైట్‌లో ఫేమ్... ఇవన్నీ ఇక్కడే సాధ్యం. 

వీటన్నిటినీ మించి, సినిమా ప్లాట్‌ఫామ్ నేపథ్యంలో వేరే భారీ బిజినెస్‌లకు ఫండ్స్ రెయిజ్ చేసుకోవడం, బ్లాక్/వైట్ అడ్జస్ట్‌మెంట్స్ వంటివన్నీ కూడా ఇక్కడే సాధ్యం.    

దటీజ్ సినిమా. 

Interested? DM me. 

- మనోహర్ చిమ్మని 

Wednesday, 22 July 2026

క్రౌడ్ ఫండింగ్ అంటే?


అమెరికాతో పాటు, ఇతర పాశ్చాత్య దేశాల్లో ఈమధ్య బాగా ప్రాచుర్యం పొందిన పదం - క్రౌడ్ ఫండింగ్.

ఎవరైనా ఏదయినా ప్రాజెక్ట్ ప్రారంభించడానికో, లేదంటే - ఆల్రెడీ ప్రారంభించిన ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికో అవసరమయిన డబ్బు లేనప్పుడు, చిన్నచిన్న మొత్తాల్లో ఎక్కువమంది నుంచి ఆ డబ్బు సేకరించడమే క్రౌడ్ ఫండింగ్. 

ఉదాహరణకు, సినిమా విషయమేతీసుకుందాం. 

ఒక ఇండిపెండెంట్ సినిమా తీయడానికి ఓ కోటిరూపాయలు కావాలనుకుంటే - ఆ మొత్తాన్ని ఒక నలుగురో, పది మందో ఇన్వెస్టర్స్ నుంచి వివిధ డినామినేషన్లలో సులభంగా సేకరించవచ్చు. ప్రతి డినామినేషన్లో, ఇన్వెస్టర్లకు తాయిలాలుంటాయి. అవికాకుండా, ప్రపోర్షనేట్‌గా లాభాల్లో వారికి షేర్ కూడా ఉంటుంది. ఎవరికీ పెద్దగా రిస్క్ ఉండదు.       

అంతర్జాతీయంగా బాగా ప్రాచుర్యం పొందిన ఈ ఫండ్ రైజింగ్ ప్రాసెస్ ని అమలు చేయటం కోసం కిక్ స్టార్టర్, ఇండీగోగో వంటి ఎన్నోవెబ్ సైట్లున్నాయి. వాటి కమిషన్ అవి తీసుకుంటాయి. ఒకసారి ఆ సైట్స్‌కు వెళితే ఎవరికయినా విషయం పూర్తిగా అర్థమైపోతుంది. 

కట్ చేస్తే -

ఒకప్పుడు 'ఇండీ సినిమా' (ఇండిపెండెంట్ సినిమా) అంటే ఒక యజ్ఞంలా జరిగేది. డబ్బే ప్రధాన సమస్య కాబట్టి, సినిమా పూర్తిచేయడానికి సంవత్సరాలు కూడా పట్టేది. గెరిల్లా ఫిలిం మేకింగ్, రెనగేడ్ ఫిలిం మేకింగ్, నో బడ్జెట్ ఫిలిం మేకింగ్ లాంటి ధోరణులన్నింటికీ నేపథ్యం ఇదే. సరిపోయేంత డబ్బు లేకపోయినా సినిమా తీయడం! 

అయితే ఇప్పుడా సమస్య లేదు, రెండు కారణాలవల్ల: 

ఒకటి - ఫిలిం మేకింగ్‌లో ఆధునికంగా వచ్చిన సాంకేతిక అభివృధ్ధి. 
రెండవది - క్రౌడ్ ఫండింగ్.    

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చాలా ఇండీ సినిమాలు ఈ క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్స్ ద్వారా, లేదా ఆ వెబ్‌సైట్స్‌కి బయట ప్రత్యేకంగా ఇలాంటి పధ్ధతిని పాటించటం ద్వారా అనుకున్నంత బడ్జెట్‌ను సులభంగా సేకరించుకోగలుగుతున్నాయి. 

ఇదే పద్ధతిని రెగ్యులర్ కమర్షియల్ సినిమాల నిర్మాణం కోసం కూడా ఈజీగా అనుసరించవచ్చు. 

సినిమా నిర్మాణం పట్ల, సినిమా బిజినెస్ పట్ల అత్యంత ఆసక్తి ఉండి కూడా, ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడాన్ని రిస్కుగా భావించి తమ కోరికని అలా తొక్కిపెట్టి ఉంచేవారికి ఇది మంచి అవకాశం. ఎందుకంటే - ఎంత చిన్న పెట్టుబడితోనయినా వారు ఫిలిం ప్రొడక్షన్‌లోకి ప్రవేశించవచ్చు!  

మీలో గాని, మీకు తెలిసిన వారిలో గాని... తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఫిలిం ప్రొడక్షన్లోకి ఎంటర్ అవ్వాలన్న ఆసక్తి ఉన్న మైక్రో ఇన్వెస్టర్లు గాని, మీడియేటర్స్ గాని ఎవరైనా ఉన్నారా? 

Interested? DM me for more details.

- మనోహర్ చిమ్మని 

Tuesday, 21 July 2026

Time Is the Real Budget


I'm a movie director. My job isn't just to make films—it's to convince people to invest in a vision, and then ensure that every rupee of that investment is spent wisely.

As a director, one of my biggest responsibilities is deciding where time is invested, because in filmmaking, time is money.

People sometimes mistake that for being a control freak. It isn't. It's about accountability.

When you're responsible for keeping fifty-five people employed for six to ten months, every hour matters, every decision has a cost, and every delay affects the entire production.

A film isn't built only with creativity.

It's built with discipline, responsibility, and respect for time.

- Manohar Chimmani 

Saturday, 18 July 2026

A Father's Quiet Pain


Many children don't fully understand their father until much later in life.

A father quietly spends years sacrificing his time, dreams, comfort, and often his own happiness so that his children can build a better future. He rarely speaks about those sacrifices. He simply keeps giving.

Yet, somewhere along the way, he may suddenly become the misunderstood one—the strict parent, the obstacle, or even the villain in the eyes of those he loves most.

Perhaps that's one of life's quiet ironies.

Many fathers carry this silent pain, hoping that one day their children will look back and understand that almost every difficult decision was made out of love, not control.

Sometimes, the greatest tragedy isn't that a father's sacrifices go unrewarded.

It's that they go unrecognized.

Sometimes, the greatest tragedy isn't that a father's sacrifices go unrewarded. It's that they go unrecognized.

- Manohar Chimmani 

Friday, 17 July 2026

Beyond the Arithmetic of Relationships


As we grow older, one uncomfortable truth slowly reveals itself: many relationships are more fragile than we once believed. Some are built on love. Others quietly depend on expectations, convenience, or circumstances.

A father spends his life giving without keeping score.

He doesn't calculate the cost of education, the sleepless nights, the postponed dreams, or the countless sacrifices made for his children's future. He gives his time, his youth, his health, and often his own ambitions—simply because love doesn't know arithmetic.

Years later, however, some fathers discover a painful irony.

Every expense is questioned.
Every rupee sent is remembered.
Every act of support is measured.

Suddenly, the relationship that was built on unconditional giving begins to be viewed through the lens of calculation.

No parent expects repayment for raising a child.

But every parent hopes that the love they gave will return one day as respect, gratitude, kindness, and presence.

Perhaps that is why some people begin to feel that relationships themselves are an illusion—not because love isn't real, but because genuine love is far rarer than we imagine.

In the end, life teaches us a quiet lesson:

Never expect your sacrifices to be repaid.

Give because you choose to give.
Love because you choose to love.

And if gratitude comes back to you, receive it as a blessing—not as a debt that was owed.

Because love that keeps accounts is a transaction.

Love that gives freely is a gift.

- Manohar Chimmani 

Thursday, 16 July 2026

20/20 ఫిలిం మేకింగ్ !!


ఒక్క క్రికెట్ లోనే కాదు...
ఈ 20/20 వేగం దాదాపు ప్రతి ఫీల్డు లోనూ వచ్చింది.
మనిషి జీవితంలోనూ వచ్చింది.

టైం లేదు.
వేగంగా పరుగెత్తాలి.
కొత్త అనుభూతులు కనుక్కోవాలి.

కట్ టూ 20/20 సినిమా - 

సంవత్సరానికి ఒకటో రెండో వచ్చే వందల కోట్ల భారీ బడ్జెట్ ప్యానిండియా సినిమాలను వదిలేయండి. ఈ సినిమాల సంఖ్య చాల తక్కువ. అది వేరే విషయం.

ఇప్పుడు ఫిలిం మేకింగ్ టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. ఫిలిం మేకింగ్ శైలి, పద్ధతులు పూర్తిగా మారిపోయాయి. 

ఇప్పుడు సినిమాలు వేరు. ఇంతకుముందు సినిమాలు వేరు. 

Content is king. 
Commercial success is the ultimate goal.

ప్రతినెలా ఏదో ఓ కొత్త సినిమా సంచలనం ప్రపంచంలో ఏదో ఓ మూల ఆవిష్కరింపబడుతున్నది మనం చూస్తున్నాం. 

స్క్రిప్ట్, డబ్బు రెడీ గా ఉంటే చాలు. కేవలం 90 రోజుల్లో ఒక మార్కెటేబుల్ సినిమాని పూర్తిచేసి, రిలీజ్ చేయగల సౌకర్యాలు వచ్చాయి. అలా చేస్తున్నారు కూడా. 

జస్ట్... ఒక సినిమా టైటిల్, పోస్టర్, టీజర్‌తోనే ప్రమోషన్, మార్కెటింగ్, బిజినెస్... అన్నీ చేసెయ్యగల మార్కెటింగ్ ట్రెండ్స్ వచ్చాయి.

Ideas are the currency of the 21st century. 

ఇప్పుడు ఎవరైనా సరే, చిన్న బడ్జెట్లో, ఒక ఇండిపెండెంట్ సినిమా చేయొచ్చు. మనం క్రియేట్ చేసే మార్కెట్‌ను బట్టి థియేటర్స్‌లో, ఓటీటీల్లో రిలీజ్ చేయొచ్చు.  

సినిమా అనేది ఇప్పుడు ఒక క్రియేటివ్ బిజినెస్ మాత్రమే కాదు. పక్కా కార్పొరేట్ బిజినెస్.  

ఫిలిం ఆర్ట్ పైన, మార్కెట్ పైన, బిజినెస్ పైన కనీస అవగాహన ముఖ్యం. ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూవుండటం, కొత్త గ్యాప్స్ ఫిలప్ చేసుకుంటూవెళ్ళటం ముఖ్యం. 

ఇంకా చెప్పాలంటే... ఇప్పుడు హిట్టా, ఫట్టా అన్నది కూడా కాదు ముఖ్యం. హిట్ రేంజ్‌లో బజ్ క్రియేట్ చెయ్యటం ముఖ్యం. 

ఆట ముఖ్యం. 
ఆటలో ఉండటం ముఖ్యం. 
ఆటలో మజా ముఖ్యం. 

సినిమా జరుగుతున్న ప్రాసెస్‌లో, దీని చుట్టూ మన పనులు ఇంకెన్నో సులభంగా అవుతాయి. కొత్త కాంటాక్ట్స్, లీడ్స్ మనకు కనెక్ట్ అవుతాయి. రకరకాల రూపాల్లో మనీ మనల్ని ఫాలో అవుతుంది.          

ఇదే ఇప్పటి ట్వంటీ ట్వంటీ ఫిలింమేకింగ్! 

Make Movies That Make Money. 

Interested? DM me. 

- మనోహర్ చిమ్మని   

Friday, 3 July 2026

అసలేంటీ "కోపరేటివ్ ఫిలిం మేకింగ్"?


1992 లోనే, హాలీవుడ్‌లో రాబర్ట్ రోడ్రిగ్జ్ ఇదే పద్ధతిలో "ఎల్ మరియాచి" సినిమా తీశాడు. 

సోషల్ మీడియా లేని కాలంలోనే, 2007లో, నా రెండో సినిమా "అలా" ఈ పద్ధతిలోనే తీశాను. 2011లో ఆర్జీవీ "దొంగల ముఠా" కూడా ఇదే పద్ధతిలో తీశాడు. ప్రపంచవ్యాప్తంగా ఇంకెందరో ఇండిపెండెంట్ ఫిలిమ్మేకర్స్ ఇప్పటికీ ఇదే పద్ధతిలో ఎన్నెన్నో అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు. 

ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో మనం చూసే సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు ఈ కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పద్ధతిలో తీసినవే.     

కట్ చేస్తే - 

కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పద్ధతిలో - పాతవాళ్లయినా, కొత్తవాళ్లయినా - ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు రెమ్యూనరేషన్ ముందు ఇవ్వటం అనేది అసలు ఉండదు.  

సినిమా పూర్తయ్యి, రిలీజయ్యి, లాభాలు వచ్చాకే ఆ లెక్కలు. దీనికి ఒప్పుకున్నవాళ్లే సినిమాలో పనిచేస్తారు.

సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరి ఇన్వెస్ట్‌మెంట్ కంట్రిబ్యూషన్... మనీ/పని ఏదయినా... ఏదో ఒక రూపంలో ఎంతో కొంత ఉంటుంది.   

ఎందుకంటే - 
ఇండిపెండెంట్ కోపరేటివ్ సినిమాలకు అసలు ప్రొడ్యూసర్ ఉండడు! 

సినిమా కోసం అనుకున్న బడ్జెట్‌ను ఓ నలుగురయిదుగురు -లేదా- అంతకంటే ఎక్కువ మంది లైక్‌మైండెడ్ ఫిలిం ప్యాషనేట్స్ తలా కొంత షేర్ చేసుకుంటారు.   

సినిమా బడ్జెట్ కోటి కావచ్చు, రెండు కోట్లు కావొచ్చు. అలా మేం పూల్ చేసుకున్న బడ్జెట్‌ను ఫిలిం మేకింగ్‌కు, ఫిలిం ప్రమోషన్‌కు మాత్రమే వాడతాం.   

నో కాల్ షీట్స్.
నో టైమింగ్స్.
నో ట్రెడిషనల్ ఫిల్మ్ మేకింగ్ రూల్స్.

అంతా రెనగేడ్ ఫిల్మ్ మేకింగ్.  

ప్రొడ్యూసర్స్, స్టార్స్ లేని ఇండిపెండెంట్ సినిమాల విషయంలో, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఈ ఒక్క పద్ధతే ఎక్కువగా విజయవంతంగా నడుస్తోంది.  

ఈ కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పద్ధతిలో ప్లాన్ చేసి తీసే సినిమాలు మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. మంచి బిజినెస్ చేస్తాయి. ప్రొవైడెడ్, సరైన స్ట్రాటజీతో చేయగలిగితే. 

కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పద్ధతిలో ఇప్పుడు మేం రెండు సినిమాలు చేయబోతున్నాం: 

ఒకటి, కామెడీ థ్రిల్లర్. 
రెండోది, హారర్.

మేం చేయబోతున్న ఈ రెండు పక్కా కమర్షియల్ సినిమాల్లో, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్లో పనిచేయాలన్న ఆసక్తి, ప్యాషన్ ఉన్న కొత్త అసిస్టెంట్ డైరెక్టర్స్ నాకు DM చేయటం ద్వారా అప్లైచేసుకోవచ్చు. ఈమెయిల్ చేస్తే ఇంకా మంచిది. 

email: richmonkmail@gmail.com 

ఇది అవకాశం మాత్రమే. 
ఉద్యోగం కాదు. 
ఇంటర్వ్యూ ఉంటుంది.

సెలక్టు అయినవాళ్ళు "6 నెలలపాటు/ఒక సినిమా పూర్తయ్యే దాకా టీమ్‌లో పనిచేస్తా" అని అగ్రిమెంట్ సైన్ చెయ్యాల్సి ఉంటుంది.  

ఆర్టిస్టులకోసం ప్రత్యేకంగా యాడ్ పోస్ట్ చేస్తాం. ఆడిషన్స్ ఉంటాయి. వయస్సు 18 నుంచి 28 లోపు ఉండాలి.

ప్రొడక్షన్/ఇన్వెస్ట్‌మెంట్ ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా నాకు DM చేయొచ్చు. 

కలిసి పనిచేద్దాం.
కలిసి ఎదుగుదాం. 

- మనోహర్ చిమ్మని

Thursday, 2 July 2026

A Lifestyle of Limitless Possibilities


Filmmaking is one of the rare professions where art, ambition, and adventure collide.

It embodies the perfect trifecta: relentless passion, big money, and the inspiration of fascinating women.

Every new project introduces fresh stories, extraordinary people, unexpected journeys, and opportunities that can completely transform your life.

One day you're writing in solitude. The next, you're leading a team of hundreds, chasing a dream that exists only in your imagination—until it appears on the screen.

Of course, there's a catch.

Cinema is also one of the most unpredictable careers on Earth. Plans change. Budgets collapse. Scripts evolve. Success is never guaranteed. Sometimes, reality rewrites the script long before the audience ever sees it.

Yet that's exactly what makes filmmaking so addictive.

Every film is a leap of faith. Every setback teaches resilience. Every success reminds you why you fell in love with cinema in the first place.

For those who truly belong to this world, filmmaking isn't just a profession.

It's a lifestyle of limitless possibilities.

- Manohar Chimmani 

నానక్‌రామ్‌గూడా నాస్తాల్జియా


నానక్‌రామ్‌గూడాలోని రామానాయుడు స్టూడియో ఇప్పుడొక జ్ఞాపకం. నాస్తాల్జియా. 

నా మొదటి సినిమాలో ఏవీయస్‌తో కోర్ట్ సీన్ ఇక్కడ చేశాము. ఆ సీన్లో చిత్రం శ్రీను, జూనియర్ నాగార్జున, శివారెడ్డి వంటి ఆర్టిస్టులు కూడా ఉన్నారు. వేణుమాధవ్, షకీలా, అల్లరి సుభాషిణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం లతో ఒక మంచి నైట్ సీన్ కూడా షూట్ చేశాము.  

అంతకు ముందు గురువుగారు దాసరి గారి సినిమాకు నేను పనిచేసినప్పుడు కొన్ని రోజులు నానక్‌రామ్‌గూడాలో షూట్ చేశాము. 

నవనీత్ కౌర్ రాజకీయాల్లోకి వెళ్ళి ఎం పి కాకముందు, హీరోయిన్‌గా షూటింగ్‌లో ఉన్న ఆమెతో కలిసి ఇక్కడే ఒక సినిమా ప్రపోజల్ గురించి రెండుసార్లు మాట్లాడాను. ఇలాంటి జ్ఞాపకాలు చాలా వున్నాయి. 

కట్ చేస్తే -   

స్టూడియోలో లాస్ట్ షూటింగ్ అయిపోయింది. ఇంక స్టూడియో ఉండదు. దాన్ని ప్రాపర్టీ చేస్తున్నామని సురేష్ బాబు చెప్పటం ఇప్పుడే ఒక వీడియోలో చూశాను.

అంత విశాలమైన ఆ స్టూడియో స్థలం విలువ... ఇప్పుడు వేల కోట్లు. 

- మనోహర్ చిమ్మని 

Wednesday, 1 July 2026

20/20 ఫిలిం మేకింగ్!


ఎన్నిరోజులు షూట్ చేశాము, ఎంత బడ్జెట్ పెట్టాము అన్నది కాదు పాయింట్. కంటెంట్ బాగుందా, ప్రేక్షకులు మెచ్చారా లేదా అన్నది పాయింట్.  

20/20 వేగం క్రికెట్‌లోనే కాదు, ఇప్పుడు అన్నిట్లోనూ వచ్చేసింది.  

ఫిలిం మేకింగ్‌లో కూడా ఈ వేగం ఎప్పుడో వచ్చేసింది. కాని ఇప్పుడు గుర్తిస్తున్నారు.

గుర్తించే పరిస్థితి తాజాగా వచ్చింది.  

కట్ చేస్తే -

1999 లో వచ్చిన బ్లెయిర్‌విచ్ ప్రాజెక్ట్, 2007 లో వచ్చిన పారానార్మల్ యాక్టివిటీ సినిమాల తర్వాత, మళ్ళీ అలాంటి సంచలనం సృష్టించిన సూపర్ నాచురల్ హారర్ సినిమా "అబ్సెషన్." 

ఈమధ్యే రిలీజైన ఈ సినిమా బడ్జెట్ మిలియన్ డాలర్ల లోపే.

కాగా, అది సాధించిన కలెక్షన్లు 373 మిలియన్లు!

అతి తక్కువ లొకేషన్స్‌లో, కేవలం 20 రోజుల్లో షూట్ చేసిన ఈ సినిమా డైరెక్టర్ కర్రీ బేకర్ వయస్సు 26 ఏళ్ళు. 

ఇలాంటి మిరకిల్స్ అన్నీ కేవలం ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ ద్వారానే సాధ్యమవుతాయని మరోసారి రుజువైంది. 

- మనోహర్ చిమ్మని 

రాజకీయాలు పెద్ద బిజినెస్


అవును.
రాజకీయాలు పెద్ద బిజినెస్. 
ఒక డిఫరెంట్ గేమ్.

ఎలా, ఎందుకు అని పెద్ద చర్చ అవసరం లేదు. 
తల బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. 

మీకిష్టమైన ఏ పొలిటీషియన్నయినా తీసుకోండి. పాలిటిక్స్ లోకి ప్రవేశించిన ప్రారంభపు రోజుల్లో వారి ఆర్థిక స్థితిగతులేంటి, ఆస్తులెన్ని... ఇప్పటి వారి ఆర్థిక స్థితి ఏంటి, ఆస్తులెన్ని... అప్పటి వారి మెయింటెనెన్స్ స్థాయి ఏంటి, ఇప్పటి మెయింటెనెన్స్ ఏంటి?

ఒక్క క్షణం ఆలోచించండి. పిచ్చి క్లారిటీ వస్తుంది. 

రాజకీయాలంటే అంత పెద్ద బిజినెస్. 

ఇంక పవర్ సంగతి చెప్పాల్సిన పన్లేదు. 

కట్ చేస్తే -

ఈ పాపులర్ పొలిటీషియన్స్‌ అందరికీ వారి దగ్గరి అనుయాయులతో, చిన్నా పెద్దా వలయాలు కొన్నుంటాయి. వాళ్లంతా కూడా చూస్తుండగా కోట్లకెదుగుతారు. పవర్ ఉంటుంది. వాళ్ళ సోషల్ ఇమేజ్ పెరుగుతుంది. వాళ్ల పనులన్నీ చకచకా  అవుతుంటాయి.

ఏ మార్పుకు నోచుకోని గుడ్డి మాలోకం ఒక్కటే. 

అది ఎవరన్నది నేను వివరంగా చెప్పాల్సిన పన్లేదు. 

- మనోహర్ చిమ్మని  

Tuesday, 30 June 2026

మంచి కంటెంట్ ఇవ్వగలిగితే చాలు...


బలమైన ప్రొడ్యూసర్ లేకుండా, కోపరేటివ్ ఫిలిమ్మేకింగ్ పద్ధతిలో తీసే ఇండిపెండెంట్ సినిమాలకు... చాలా కాంప్రమైజ్‌లు, ఎన్నో ఇబ్బందులూ ఉంటాయి. అయినా సరే, ఉన్నంతలో మంచి కంటెంట్‌ను ఇవ్వగలిగేది ఇండిపెండెంట్ ఫిలిమ్మేకర్స్ మాత్రమే.   

బడ్జెట్ లేని దగ్గరే అసలు క్రియేటివిటీ బయటికొస్తుంది. 

మంచి కంటెంట్ ఇవ్వగలిగితే చాలు.
పెద్ద బడ్జెట్ అవసరం లేదు. 
రిస్క్ ఫాక్టర్ చాలా తక్కువ.

కోపరేటివ్ ఫిలిమ్మేకింగ్ పద్ధతిలో, నా టీమ్‌తో కలిసి త్వరలో నేనొక కొత్త సినిమా ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నాను. ఈవైపు నిజంగా ఆసక్తి వున్న ఇన్వెస్టర్స్ నాకు DM చెయ్యొచ్చు. అలాగే, సమర్థులైన ఇన్వెస్ట్‌మెంట్ మీడియేటర్స్ కూడా ఈవైపు ఆసక్తి వుంటే నాకు DM చేయండి.    

Independent filmmakers don't wait for doors to open. They build a screen where there was only a wall.

- మనోహర్ చిమ్మని     

Thursday, 25 June 2026

Why Rich Monk?


Many people think being rich and being a monk are opposites.

They are not.

A rich person is often imagined as someone who accumulates wealth, possessions, influence, and status. A monk, on the other hand, is seen as someone who seeks inner peace, wisdom, simplicity, and detachment.

But why should we choose one and reject the other?

Why can't we build wealth without losing our values?

Why can't we pursue success without sacrificing peace of mind?

Why can't we dream big, create boldly, earn abundantly, and still remain grounded?

That is the idea behind Rich Monk.

To me, a Rich Monk is someone who is wealthy not just in money, but also in ideas, relationships, experiences, character, and contribution. Someone who can sit quietly with themselves and still dream of building something meaningful in the world.

The world does not need more wealthy people who are empty inside.

Nor does it need more wise people who are afraid to create, build, and prosper.

It needs people who can combine both.

Rich Monk is a reminder that success and spirituality can walk together. That ambition and inner peace are not enemies. That we can strive for extraordinary achievements while remaining deeply human.

This blog is my journey, my experiments, my lessons, and my conversations around that idea. 

The Philosophy Behind Rich Monk.

To build.
To create.
To prosper.
To evolve.

And to remain a monk at heart.

— Manohar Chimmani 

క్లీన్ సినిమాకు "ఏ" సర్టిఫికేట్ ఇవ్వటం ఎలా?


"దీవానా" చూడండి. అర్థమైపోతుంది. 

"దీవానా" సినిమాకు సెన్సార్ బోర్డ్ "ఏ" సర్టిఫికేట్ ఇవ్వటం మీద సీనియర్ ఫిలిం జర్నలిస్టు నాగేంద్ర కుమార్ ఎంతో ఆక్రోశం వెళ్ళగక్కుతున్న వీడియో ఒకటి నిన్న చూసి నిజంగా నాకు కొంత ఆశ్చర్యమేసింది. ఏంటీయన ఇలా చెప్తున్నారు అని.   

కాని, ఇవ్వాళ ఆ సినిమా చూశాక నాగేంద్ర కుమార్ గారి ప్రతి మాటకు అర్థం ఉంది అనిపించింది. ఆయన చెప్పాలనుకున్నది వెరైటీగా బాగా చెప్పారు. 

అంత క్లీన్ సినిమాకు "ఏ" సర్టిఫికేట్ ఇచ్చారంటేనే విషయం అర్థమవుతుంది. ఎక్కడో ఏదో మిస్ అయ్యుంటుంది.

ఫార్మాలిటీనో, కమ్యూనికేషనో, ఈగోనో...  

సినిమా నిజంగా బాగుంది. 
నాన్‌స్టాప్ ప్యానిండియా హింసాకాండల మధ్య 
ఒక ప్రేమసుగంధపు తాజా పరిమళం. 

డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో హర్షిత్ రెడ్డి, హీరోయిన్ స్మేహ మణిమేఘలై & టీమ్ అందరికి హార్టీ కంగ్రాట్స్! 

- మనోహర్ చిమ్మని  

Tuesday, 23 June 2026

బడ్జెట్ లేని దగ్గరే అసలు క్రియేటివిటీ


నా లేటెస్ట్ సినిమా "ఎర్ర గులాబి" పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. 

రోడ్ క్రైమ్ థ్రిల్లర్.

"మనోహర్ చిమ్మని 2.0" అనొచ్చు అనుకుంటాను.

ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా "శ్రేయసి షా"ను పరిచయం చేస్తున్నాను. 

కట్ చేస్తే -

ఇప్పుడు నాకు ఉద్యోగాలు సద్యోగాలు ఏం లేవు. ఇంకే బాధ్యతల్లేవు. 

టోటల్ సినిమా.
పక్కా కమర్షియల్.

త్వరలో ఇంకో సినిమా ప్రారంభించబోతున్నాను. 

బలమైన ప్రొడ్యూసర్ లేని ఇండిపెండెంట్ సినిమాలకు, కోపరేటివ్ ఫిలిమ్మేకింగ్ పద్ధతిలో తీసే సినిమాలకు... చాలా కాంప్రమైజ్‌లు, ఎన్నో ఇబ్బందులూ ఉంటాయన్నది మామూలు విషయం.

అయినా సరే, ఉన్నంతలో మంచి కంటెంట్‌ను ఇవ్వగలిగేది ఇండిపెండెంట్ ఫిలిమ్మేకర్స్ మాత్రమే.   

బడ్జెట్ లేని దగ్గరే అసలు క్రియేటివిటీ బయటికొస్తుంది. 

Independent filmmakers don't wait for doors to open; they build a screen where there was only a wall.

- మనోహర్ చిమ్మని       

Thursday, 18 June 2026

This Is the "Choose Yourself" Era


For most of history, people waited for permission.

A publisher had to choose you.
A producer had to choose you.
A TV channel had to choose you.
A newspaper had to choose you.

Today, things are totally different.

Thanks to James Altucher -
We are living in the "Choose Yourself" era. 

With a smartphone, an internet connection, and a clear voice, anyone can become a One-Person Media Company.

Writers can publish. Filmmakers can distribute. Artists can showcase their work. Entrepreneurs can build audiences. All without waiting for someone's approval.

Social media is not just a place for entertainment.

It is a publishing platform.
A marketing platform.
A networking platform.
A personal branding platform.

The people who understand this are creating opportunities for themselves every single day.

The question is not whether social media works.

The question is... are you really using it to its fullest potential?

Tell your story.
Share your journey.
Build your audience.
Create your own platform.

Because in this era, the most important person who has to choose you is you.

— Manohar Chimmani