Saturday, 26 September 2026

ఏషనాగుల కట్టమీద... ఇంత ఏడుపా?


తెలంగాణ గడీల చారిత్రక నేపథ్యం, సమ్మక్క సారక్క కథ స్పూర్తిగా తీసుకొని, సింబాలిక్‌గా తీసిన ఒక అద్భుతమైన సర్రియలిస్టిక్ సినిమా "ది ప్యారడైజ్".  

ఈ నేపథ్యం తెలియనివారికి ఈ సినిమా నచ్చకపోవడంలో ఆశ్చర్యం లేదు.

సినిమా బాగాలేదంటారు... ఓకే. 
ఎగతాళి చేస్తారు కొందరు... అది వాళ్ళ సంస్కారం.  

కాని, పనిగట్టుకొని ఏదో మూడో ప్రపంచ యుద్ధం వచ్చినట్టు ఈ సినిమా గురించి అదే పనిగా నెగెటివ్ రివ్యూలు, బ్రేకింగ్ న్యూస్‌లు, ఇంటర్వ్యూలు గట్రాలతో ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. కాని, చేస్తున్నారు. 

బహుశా, వారంతా ఇలా చేయడానికి కారణాలు వేరే ఉండి ఉంటాయి. 

ఈమధ్య వచ్చిన భారీ ఫెయిల్యూర్ సినిమాల్లో ఏ ఒక్క సినిమా గురించి కూడా ఇలాంటి నెగెటివ్ దాడి ఎందుకని చేయలేదు వీళ్లంతా?    

దీని మీద ఇంకా డీటెయిల్డ్‌గా వెళ్ళదల్చుకోలేదు. మినిమమ్ రెండు పేజీల కంటెంట్ అవుతుంది. 

ఒకటి మాత్రం నిజం... కొందరు జర్నలిస్టులను చూసి, అసలు జర్నలిజం ఎలా ఉండకూడదో తెలుసుకోవాలి! 

కట్ చేస్తే -      

హీరో నాని, నిర్మాత సుధాకర్, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల & టీమ్ కన్విక్షన్‌కు, గట్స్‌కు హాట్సాఫ్. 

హీరో నాని విశ్వరూపం... ప్యారడైజ్. ఇంకేం చెప్పనవసరం లేదు. మాటల్లేవ్. 

కాయదు లోహార్‌కు అరుదుగా వచ్చిన ఒక విభిన్నమైన రోల్‌లో బాగా నటించింది.  

కాసర్ల శ్యామ్ పాటలు, అనిరుధ్ మ్యూజిక్ సూపర్బ్.

అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హాలీవుడ్ సినిమాల లెవెల్లో ఉంది.   

వెళ్ళి తప్పకుండా "ది ప్యారడైజ్" సినిమా చూడండి. మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో ఇంకోసారి చూడండి. ఈ వీకెండ్ ప్యారడైజ్‌తో ఎంజాయ్ చేయండి.

- మనోహర్ చిమ్మని  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani