Wednesday, 30 September 2026

విషయం బడ్జెట్ కాదు... సబ్జెక్టు!


ఒక సినిమా ప్రాజెక్ట్ గురించి వారం రోజులుగా చాలా సీరియస్‌గా ఆలోచిస్తున్నాను. అంతా అనుకున్నట్టు జరిగితే, అదే నేను చేసే మొట్టమొదటి అత్యంత భారీ బడ్జెట్ సినిమా అవుతుంది.  

అయితే ఇక్కడ విషయం బడ్జెట్ కాదు... సబ్జెక్టు. 

అనుకోకుండా ఇప్పుడే ఒక మిత్రుని నుంచి చాలారోజుల తర్వాత కాల్ వచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే... అతను కూడా అలాంటి ఆలోచనతోనే ఉన్నాడు. 

"చేద్దాం మనం. స్క్రిప్ట్ రెడీ చెయ్యి... నువ్వే డైరెక్టర్" అన్నాడు నా మిత్రుడు. 

కట్ చేస్తే -

పూర్తిస్థాయిలో ఒక్కటే అంశం పైన దృష్టిపెట్టగలిగినప్పుడు, అవకాశాలకి ద్వారాలు వాటంతట అవే తెర్చుకుంటాయనుకుంటాను. 

- మనోహర్ చిమ్మని   

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani