కొన్ని ఫెయిల్ అవుతాయి,
కొన్ని నచ్చవు.
కొన్ని సక్సెస్ అవుతాయి,
కొనసాగిస్తాం.
సక్సెస్ అయినా,
బోర్ కొడితే కొన్ని వదిలేస్తాం.
సక్సెస్ అయినా,
బోర్ కొడితే కొన్ని వదిలేస్తాం.
అదంతే.
ఇదొక సైకిల్.
కట్ చేస్తే -
ఈమధ్య కొందరిని చాలా దగ్గరగా అధ్యయనం చేశాక నాకో విషయం అర్థమయింది...
రచయిత మల్లాది అయినా, యండమూరి వీరేంద్రనాథ అయినా, అమితాబ్ బచ్చన్ అయినా... నిరంతరం ఏదో ఒక పనిలో వాళ్ళని వాళ్ళు బిజీగా ఉంచుకోవడం ద్వారా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆరోగ్యంగా ఉంటున్నారు.
55+ దాటాక ఇది చాలా ముఖ్యం.
యాక్టివ్‌గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మనచుట్టూ ఎంత నెగెటివిటీ ఉన్నా, మనం సాధ్యమయినంత పాజిటివ్‌గా ఉండగలగాలి. మనం ఖాళీగా ఉంటే, మన మనసు ఖాళీగా ఉండదు. ఏవేవో ఆలోచిస్తుంటాం. అవన్నీ మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు.

అందుకే - అవసరం ఉన్నన్ని రోజులు, లేదా, బోర్ కొట్టేదాకా కొన్ని సినిమాలు చేస్తాను. ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాను. నో టెన్షన్. నో స్ట్రెస్. నా మిగిలిన సమయం అంతా రాయడానికే కెటాయిస్తాను. ఇప్పుడు ప్రారంభించబోతున్న ఒక కొత్త ప్రయోగానికి కూడా.
జీవితంలో ఒక దశ దాటాక, మనం ఏం చేసినా, నిర్ణయాలు తీసుకునేది మనమే అయ్యుండాలి. అలా కానప్పుడు, ఆ పని చెయ్యకపోవడమే బెటర్.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani