Monday, 10 November 2025

ఫిలిం కోచింగ్ అనేది ఇప్పుడు అవుట్‌డేటెడ్!


ఫిలిం కోచింగ్ అనేది ఇప్పుడు నిజంగా అవుట్‌డేటెడ్.

క్లాస్‌రూముల్లో కూర్చుని నేర్చుకునే రోజులు కావివి. మీరు అలా నేర్చుకున్నది, అర్థం చేసుకొని, ఆచరణలో పెట్టే లోగా, మినిమమ్ ఇంకో డజన్ కొత్త ఆవిష్కరణలు ఫిలిమ్మేకింగ్‌లో వస్తున్నాయి.

మీరు డైరెక్టర్ కావాలనుకొన్నా,
ప్రొడ్యూసర్ కావాలనుకొన్నా,
హీరో కావాలనుకొన్నా,
ఆర్టిస్టు-టెక్నీషియన్...
రైటర్, లిరిక్-రైటర్, డాన్స్ మాస్టర్, 
మ్యూజిక్ కంపోజర్, స్టయిలిస్ట్...

ఇలా ఏది కావాలనుకున్నా - మీరు తెలుసుకోవాలనుకునేది, నేర్చుకోవాలనుకునేది అంతా ఆన్‌లైన్లో ఉంది. 

ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు అప్‌డేట్ చేసుకోవచ్చు. 

ఇంత మాత్రానికి - 10 లక్షలు, 30 లక్షలు ఫీజులు కట్టి ఫిలిం కోచింగ్స్ అవసరమా? ముంబైలో అయితే కోటి, రెండు కోట్ల ఫీజుతో కూడా ఫిలిం కోచింగ్ స్కూల్స్ ఉన్నాయి. 

వీటివల్ల వచ్చేది ఏంటంటే, ఒక ఏడాదో రెండేళ్ళ తర్వాతో ఒక సర్టిఫికేట్! 

ఈ సర్టిఫికేట్ చూసి ఎవ్వరూ ఇండస్ట్రీలో అవకాశం ఇవ్వరు. అది ఎందుకూ పనికిరాదు. 

సో, మళ్ళీ మీరు గ్రౌండ్ జీరో నుంచి మీ ప్రయత్నాలు ప్రారంభించాల్సిందే. 

ఇంకో విషయం ఏంటంటే - ఇంతకు ముందులా 5 నుంచి 10 ఏళ్ళ పాటు మీరు అవకాశాల కోసం తిరగాల్సిన అవసరం ఇప్పుడు లేదు. 

ఇప్పుడంతా 20/20 యుగం. ఒక ఖచ్చితమైన స్ట్రాటెజీతో ప్లాన్ చేసుకుంటే చాలు. మీరు ఫిలిం ఇండస్ట్రీలోకి ఈజీగా ప్రవేశిస్తారు. అనుకున్నది సాధిస్తారు. 

దీని కోసం మీకు కావాల్సింది కోచింగ్ కాదు. 

కన్సల్టింగ్. లేదా, మెంటార్‌షిప్. 

కట్ చేస్తే -

ఈ దృక్పథంతోనే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక కొత్త ఫిలిం లాంచ్ కన్సల్టింగ్ ఆలోచన చేశాను. 


నిజంగా మీ ఫిలిం కెరీర్ విషయంలో మీరు సీరియస్‌గా ఉన్నట్టయితే కింద లింక్ ఇస్తున్నాను. చదవండి. ఫీజు, పూర్తివివరాల కోసం మెసేజ్ చేయండి. 

- మనోహర్ చిమ్మని 

***

"Skip the Line" FilmLaunch Consulting link: 
https://www.richmonk.me/p/skip-line-filmlaunch-consulting.html

My YouTube Video on Skip the Line: 
https://youtu.be/9uGeqnMGzTw

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani