Monday, 28 September 2026

ఒక్క సినిమా... ఇంతమందిని భయపెడుతోందా?


సినిమాలు పుట్టినప్పటినుంచి చూస్తున్నాం... హిట్లు, ఫ్లాపులు మామూలే. కాని, వీళ్ళకు నచ్చని ఒక సినిమా గురించి నిద్రలు మానుకొని ఇలా వందలకొద్ది రివ్యూలు, ఇంటర్వ్యూలతో ఒక సినిమాను ఆడుకుంటున్నారంటే... ఈ బజ్ మామూలుది కాదు.  

ఇప్పుడే ఒక ఇంటర్వ్యూ చూశాను. "ప్యారడైజ్" చెత్త సినిమా అని ఒక డజన్ సార్లు ఆ యాంకర్ ఏడ్చాడు. "డైరెక్టర్ మీద ఏం యాక్షన్ తీసుకుంటారు?" అని ఇంకో అరడజన్ సార్లు అడిగాడు. ఒక్క హిట్ సినిమా తీయని గెస్ట్ ఆయనకు వీలయినంత విషం ఆయన కక్కాడు.    

ఆయనెవరు యాక్షన్ తీసుకోడానికి? నువ్వెవరు యాక్షన్ తీసుకొమ్మని అడగడానికి?  

వీళ్లకి ఎందుకంత ఏడుపు? 
మేము ఎవర్నీ ఏమనట్లేదు అంటూనే కావల్సినంత విషం కక్కారు.  

ఈమధ్యే అట్టర్ ఫ్లాప్ అయిన ఎన్నో భారీ బడ్జెట్ సినిమాల మీద వీళ్ళు ఇంత ఏడవలేదు ఎందుకు? 

ఇలాంటి చెత్త లాబీనంతా నిద్రలేకుండా చేస్తున్నది వేరే. వాళ్ళ లోపలి ఎజెండాలు వేరే.  

ఒక సినిమా మీద - దాని రిలీజ్ కంటే ముందు నుంచి - రిలీజ్ తర్వాత కూడా - ఇంత విషం కక్కటం నిజంగా అవసరమా?

తెలంగాణ నేపథ్యం, సమ్మక్క సారక్క కథా నేపథ్యం స్పూర్తితో సింబాలిక్‌గా తీసిన ఒక సర్రియలిస్టిక్ సినిమా "ప్యారడైజ్." ఇదంతా తెలీనివారికి... ఇక్కడి భాష-సంస్కృతులను గౌరవించలేనివారికి... ఇది ఎక్కే చాన్స్ లేదు, అసలు నచ్చదు. 

లోపల్లోపల ఇంకేవో ఇన్నర్ ఎజెండాలు, భయాలు ఉన్నవారికి అసలు నచ్చదు. నిద్రపట్టనీయదు.         

సినిమా హిట్టో ఫ్లాపో పక్కనపెడితే...   ఇంత మందికి నిద్రలేకుండా చేసిన నాని, శ్రీకాంత్ ఓదెల, సుధాకర్ చెరుకూరి & టీమ్ అంతా... ఒకరకంగా... భారీ సక్సెస్ సాధించినట్టే. 

- మనోహర్ చిమ్మని  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani