Monday, 17 November 2025

ఎంత కాలం... ఎంత కాలం?


జ్ఞానోదయం అనేది జీవితంలో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వచ్చేది. కాని, నాకు మాత్రం జీవితానికి సంబంధించిన అనేక విషయాల్లో, అనేక సందర్భాల్లో అనేకసార్లు అయ్యింది - జ్ఞానోదయం. 

అందుకే, "జ్ఞానోదయం అంటే నీకు కుక్కతోక వంకర లాంటిది" అని వెక్కిరిస్తారు నా ఫ్రెండ్స్ కొందరు.  

కట్ చేస్తే - 

క్రియేటివిటీకి సంబంధించిన నేపథ్యంలో, బయటివారికి అంత సులభంగా అర్థంకాని స్టకప్‌లతోనే సంవత్సరాలకి సంవత్సరాలు గడిచిపోతుంటాయి. అందరూ ఏదేదో వారికి తోచింది అంటుంటారు, ఇంటా బయటా. 

అన్నీ నవ్వుతూ భరిస్తూ, ఎదుర్కొంటూ, ఏం జరగనట్టే ఉండాలి.           

ఇలాంటి నేపథ్యంలో సాధ్యమైనంత మానసిక వత్తిడి తగ్గించుకోడం చాలా అవసరం. తప్పనిసరి కూడా.

చెప్పలేం, గాలిబుడగ ఏ క్షణమైనా టప్ మనొచ్చు. 

జీవితం చాలా చిన్నది. బరువులూ, బాధ్యతలూ, కమిట్మెంట్సూ... అన్నీ త్వరత్వరగా పూర్తిచేసుకోవడమొక్కటే లేజర్ ఫోకస్‌ కావాలి. 

బ్రతికున్న నాలుగురోజులూ జీవితాన్నీ, మనుషుల్నీ ప్రేమిద్దాం. ప్రేమగా ఉందాం. 

Life’s short, but it’s beautiful as hell. Get your fitness in place, drop the dead weight, and hold tight to the few things that give you real freedom and real peace.

- మనోహర్ చిమ్మని   

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani