ప్రయాణం చెయ్యి.
సెలబ్రేట్ చేసుకో.
ఏదైనా చెడు జరిగిందా?
ప్రయాణం చెయ్యి.
మామూలు మనిషి అయిపో.
అసలేమీ జరగలేదా?
ప్రయాణం చెయ్యి.
కొత్త ఆలోచనలొస్తాయి.
కొత్తగా మొదలెట్టు... సాధించు.
కట్ చేస్తే -
ఒక్కసారి గుర్తుకుతెచ్చుకోండి. వేల ఏళ్ళ కింద గాని, ఇటీవలి చరిత్రలో కాని, ఇప్పుడు నడుస్తున్న చరిత్రలో కాని... గొప్ప గొప్ప విజయాలు సాధించినవాళ్ళలో దాదాపు 80 శాతం మంది ప్రయాణాలు చేస్తూ సాధించినవాళ్ళే.
దేశాలను కనుక్కొన్నవాళ్ళు, శాస్త్రాలను రాసినవాళ్ళు, వివిధ రంగాల్లో కొత్త కొత్త ఆవిష్కరణలను సాధించినవాళ్ళంతా కూడా నిరంతరం ప్రయాణాలు చేసినవారే.
మీకు తెలుసా... బిల్ గేట్స్ కూడా తరచుగా "థింక్ వీక్" పేరుతో ఒక వారం రోజులు పసిఫిక్ నార్త్-వెస్ట్‌లో ఎక్కడో ఎవ్వరికీ తెలియనంత లోపలికి వెళ్తాడు.
ఆయన వెంట రెండు మూడు బ్యాగుల్లో బుక్స్, ప్రింటెడ్ నోట్స్, తెల్లకాగితాలు, పెన్నులు తీసుకెళ్తాడు. ఫోన్లు, కంప్యూటర్స్, టాబ్లెట్స్, టీవీలు, మొబైల్స్ లాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఒక్కటి కూడా ఉండదు. వైఫై అసలుండదు.
రోజూ కొన్ని గంటలు చదువుతాడు.
కొత్త ఐడియాల మీద కొన్ని గంటలు వర్క్ చేస్తాడు.
కొన్ని గంటలు తెల్లకాగితాల మీద పెన్‌తో నోట్స్ రాసుకుంటాడు.
ఒక గంట వాకింగ్ చేస్తాడు.
అసలేమీ చెయ్యకుండా కొన్ని గంటలు గడుపుతారు.
సంవత్సరాలు గడిచినా దొరకని పరిష్కారాలు, ఇలాంటి థింక్ వీక్స్‌లో దొరుకుతాయి.
ఎన్నడూ రాని ఆలోచనలు ఇలాంటి ప్రయాణాల్లో అనుకోకుండా వస్తాయి.
ఉన్నచోట ఎంతకూ కదలని పనులు, బయటకెళ్ళినప్పుడు చాలావేగంగా పూర్తవుతాయి.
ఉదాహరణకు, సినిమాఫీల్డులో కొందరు డైరెక్టర్స్ స్క్రిప్టు రాసుకోడానికి గోవా, బ్యాంకాక్, బాలి లాంటి ప్రదేశాలకెళ్తారు. మొబైల్ ఆఫ్ చేసేస్తారు. రూంలో టీవీ ప్లగ్ పీకేస్తారు. అంతే.
ఇక్కడ లోకల్‌గా ఆరునెలలయినా కదలని స్క్రిప్టు, అక్కడ అయిదారు రోజుల్లో అయిపోతుంది.
డీప్ వర్క్ అన్నమాట.
ఎప్పుడూ నాలుగు గోడలమధ్యే కాకుండా, అప్పుడప్పుడూ ప్రయాణం కూడా చేస్తుండాలి. ఇలాంటి ఒంటరి ప్రయాణాల్లోనే కొత్త ఆలోచనలొస్తాయి. కొత్త పరిష్కారాలు దొరుకుతాయి. కొత్త అధ్యాయాలు ప్రారంభిస్తాం. కొత్త విజయాలు సాధిస్తాం.
- మనోహర్ చిమ్మని
పి యస్: అలా ప్రయాణం చేసినప్పుడు వచ్చిన ఒక కొత్త ఆలోచనతోనే, మొన్న వైజాగ్ నుంచి రాగానే ఒక కొత్త పుస్తకం రాశాను. అది ఈ నెల్లోనే పబ్లిష్ అవుతోంది. వివరాలు త్వరలో.
- మనోహర్ చిమ్మని
పి యస్: అలా ప్రయాణం చేసినప్పుడు వచ్చిన ఒక కొత్త ఆలోచనతోనే, మొన్న వైజాగ్ నుంచి రాగానే ఒక కొత్త పుస్తకం రాశాను. అది ఈ నెల్లోనే పబ్లిష్ అవుతోంది. వివరాలు త్వరలో.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani