Wednesday, 12 November 2025

ముంబై హీరోయిన్సే ఎందుకు?


కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టి, నిత్య మీనన్, పూజ హెగ్డే, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, తమన్నా, రాశి ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్, రష్మిక మందన్నా... ఒక ఉదాహరణగా నేను చెప్తున్న వీళ్ళంతా తెలుగు హీరోయిన్స్ కారు.

ముంబై నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవాళ్ళు. 

కాని, ప్రొఫెషనల్‌గా సినిమా మీద వీళ్ళకి ఎంత అభిమానం అంటే, సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందే తెలుగు ట్యూటర్స్‌ను పెట్టుకొని తెలుగు నేర్చుకున్నారు. తెలుగు బాగా మాట్లాడుతారు. 

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, హీరోయిన్స్‌కు శరీర సౌష్టవం ప్రధానం. తర్వాతే టాలెంట్ ఎట్సెట్రా. జిమ్ కోసం, గ్రూమింగ్ కోసం, లుక్ కోసం వీళ్ళు లక్షల్లో ఖర్చుపెడతారు. మొత్తం ఫోకస్ వాళ్ళ పనిమీదే ఉంటుంది. పనే దైవం వాళ్లకి. వ్యక్తిగత జీవితం కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటారు. 

ఫిలిం ఇండస్ట్రీలో అవసరమైన ఒక రకమైన etiquette గురించి వీళ్లకు ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం ఉండదు. అది వారి జీవనశైలిలో భాగం. 

ప్యూర్ ప్రొఫెషనలిజమ్.        

అందుకే వీళ్ళంతా ఒక స్థాయికి ఎదిగారు. బాగా పేరు తెచ్చుకొన్నారు. అవార్డులు, రివార్డులు పొందారు.  

ఫిలిమ్మేకర్స్‌కు కావల్సింది ఇదే కాబట్టి... ఎక్కువగా మన ఫిలిం డైరెక్టర్స్ ముంబై హీరోయిన్స్, ఇతర రాష్ట్రాల హీరోయిన్స్ వైపే మొగ్గుతారు. 

In cinema, a heroine is not just the face of beauty — she’s the pulse that gives rhythm to the story and fire to the screen.

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani