Sunday, 25 May 2025

2025 లో 5వ నెల కూడా పూర్తికావస్తోంది...


అవును. అప్పుడే 2025 లో 5వ నెల కూడా పూర్తికావస్తోంది... 

ఏం సాధించాం?
ఎంత సంపాదించాం?
ఎన్ని జ్ఞాపకాలు మూటగట్టుకున్నాం?

ఒకసారి రివ్యూ చేసుకుందాం.

కట్ చేస్తే -

మొన్నొక పుస్తకం గురించి చదివాను. వెంటనే తెప్పించాను...

Four Thousand Weeks, 
by Oliver Burkeman.

సగటున ప్రతి మనిషి ఒక 4000 వారాలు మాత్రమే బ్రతుకుతాడు. అంటే సుమారు 77 సంవత్సరాలు. 

ఈ లెక్కన మన ఎకౌంట్లో ఇంకెన్ని వారాలున్నాయి? 

అలాగని అందరూ 77 ఏళ్ళు బ్రతుకుతారన్న గ్యారంటీలేదు. మా తమ్ముడు 38 ఏళ్ళకే చనిపోయాడు. నా విద్యార్థి ఒకరు కూడా 34 ఏళ్ళప్పుడే చనిపోయాడు. నా ప్రైమరీ స్కూల్ క్లాస్‌మేట్స్‌లో ఇప్పటికే 13 మంది చనిపోయారు. 

సో, 77 అని గ్యారంటీ ఏం లేదు. అదొక యావరేజ్ అంకె మాత్రమే. 

మనకు అదృష్టం ఉంటే 80, 90 వరకు కూడా బ్రతకొచ్చు. అది వేరే విషయం. 

కాని, ఇంకొకరి మీద ఆధరపడకుండా, ఎంత ఆరోగ్యంగా, ఎంత ఆనందంగా ఎన్నాళ్ళు బ్రతికామన్నదే పాయింట్.  

ఈ నేపథ్యంలో మనం ఆలోచించాల్సిన ఇంకో అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే - 

జీవితం ఒక్కటే.
ఇంక ఎన్నాళ్ళుంటామో తెలీదు. 
ఉన్నన్నాళ్ళూ ఈ గొప్ప గిఫ్టును మనం సంపూర్ణంగా ఎంజాయ్ చెయ్యాలి. 

అంతే కాని, అన్నీ మనమే చెయ్యాలి, మనమే ఎన్నెన్నో సాధించాలి అని... డజన్ల కొద్దీ లక్ష్యాలు పెట్టుకోవడం మూర్ఖత్వం.

ఏ మనిషీ అనుకున్నవన్నీ జీవితకాలంలో సాధించలేడు.  

అందుకే 100 గోల్స్ పెట్టుకొని ఏదీ సాధించకుండా అసంతృప్తి, నిరాశలతో పోయే బదులు... వేళ్ళమీద లెక్కించగలిగిన కొన్ని సాధించుకొంటూనే... సంతృప్తిగా-సంపూర్ణంగా-సైమల్టేనియస్‌గా జీవితాన్ని అనిభవించడం తెలివైనపని.  

మీరేమంటారు? 

ఇలా అడుగుతున్నందుకు క్షమించాలి... ఇంతకూ - మీ జీవితంలో ఇంకెన్ని వారాలు మిగిలున్నాయో లెక్క చూసుకున్నారా? 

ఇంక లేవండి. 
ఉద్యమించండి. 
జీవితాన్ని అనుక్షణం అనుభవిస్తూ... 

- మనోహర్ చిమ్మని  

100 Days, 100 Posts. 33/100.      

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani