సినీఫీల్డు ఒక మెకన్నాస్ గోల్డ్ సినిమాలాంటిది. ఒక పెద్ద గోల్డ్ మైన్ ఉందిక్కడ. అన్ని ఫీల్డుల్లాగే ఇక్కడా మంచీచెడూ అన్నీ ఉంటాయి. ఎవ్వరికీ రెడ్ కార్పెట్ ఉండదు.
ఖచ్చితంగా ఇది ఇలా జరుగుతుంది అన్న గ్యారంటీ అస్సలు ఉండదు.
ఇలాంటి నేపథ్యంలో... ఎన్నో రిజెక్షన్స్, అవమానాలు, కష్టాలు ఎదుర్కొంటూ... పడుతూ లేస్తూ... ఆ గోల్డ్ మైన్ నుంచి ఎవరికి చేతనైనంత షేర్ వాళ్ళు తవ్వుకోవచ్చు.
అలా టన్నులకొద్దీ తవ్వుకున్నవాళ్ళే కింగ్స్, క్వీన్స్.
ఎంతో కొంత సాధించి, ఫీల్డుతో కాస్తంతయినా టచ్ ఉన్నవాళ్ళు నిజంగా లక్కీ ఫెలోస్.
సినీఫీల్డులో పనిచేస్తున్నాను అని చెప్పుకొనే ఆ కిక్కే వేరు.
కట్ చేస్తే -
హాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా ఇంతే. అదొక సిస్టమ్.
సినీఫీల్డులో పనిచేస్తున్నాను అని చెప్పుకొనే ఆ కిక్కే వేరు.
కట్ చేస్తే -
హాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా ఇంతే. అదొక సిస్టమ్.
ఫీల్డుని అనాల్సిన పనిలేదు. దాన్ని అలాగే స్వీకరిస్తూ, మనకు చేతనయింది మనం చేసుకుంటూ, పాజిటివ్‌గా ముందుకుపోవడమే మనం చేయగలిగింది.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani