ఒక బుక్ కోసం ఆర్డర్ పెట్టిన 25 రోజుల తర్వాత... ఇదీ అమెజాన్ నిర్వాకం!
జెఫ్ బెజోస్ బ్రాండ్ నేమ్‌ను చెడగొట్టడానికి కంకణం కట్టుకున్నారనుకుంటాను ఇప్పటి అమెజాన్ ఉద్యోగులు కొందరు.
అమెజాన్‌తో నా తాజా అతి చెత్త-ఫస్ట్రేటివ్ అనుభవం అలాగే ఉంది చూస్తుంటే.
కట్ చేస్తే -
మొన్న సెప్తెంబర్ 1 నాడు అమెజాన్.ఇన్‌లో నేనొక పుస్తకం ఆర్డర్ చేశాను. ట్రాకింగ్‌లో ఇచ్చిన డేట్ ప్రకారం నాకు బుక్ రాలేదు. నేను ఆర్డర్ చేసిన బుక్‌కి బదులు ఒక 10 పేజీల "సిండరెల్లా" బొమ్మల బుక్ పంపించారు.
అదేరోజు కంప్లెయింట్ చేశాను. నాకు పొరపాటున వచ్చిన బుక్‌ను ఫోటో తీసి అప్‌లోడ్ చెయ్యమన్నారు. చేశాను.
మళ్ళీ ఇంకొక డెలివరీ డేట్ చెప్పారు. వెయిట్ చేశాను. రాలేదు. ట్రాకింగ్ దగ్గర నాకో నోటిఫికేషన్ కనిపించింది: "24 సెప్టెబర్ వరకు మీ బుక్ వస్తుంది" అని.
ఇవ్వాటివరకు చూశాను. ఇవ్వాళ 25 సెప్టెంబర్. మళ్ళీ ఒక కంప్లెయింట్ పెట్టాను... ఎక్స్‌లో. 10 నిమిషాల్లో దానికో కామెంట్ వచ్చింది అమెజాన్ నుంచి. ఒక లింక్ పంపాము, దాంట్లో మీ కంప్లెయింట్ డీటెయిల్స్ చెప్పమని!
ఒక బాధ్యతలేని గవర్నమెంట్ ఆఫీసు కంటే ఎక్కువ అయింది వీళ్ళ బాధ్యతలేనితనం, నాన్-కోఆర్డినేషన్.
ఇంక నా ఒక్కో కంప్లెయింట్‌కు ఒక్కో కొత్త కస్టమర్ సర్వీస్ స్టాఫ్ నన్ను కాంటాక్ట్ చేసినప్పుడల్లా నేను నా ప్రాబ్లం కొత్తగా మళ్ళీ మొదటి నుంచి చెప్పాలి!
కస్టమర్‌కు, అతని సమయానికి వాల్యూ లేదు. కంపెనీలోని డిపార్ట్‌మెంట్శ్ & కస్టమర్ సర్వీస్ మధ్య కోఆర్డినేషన్ లేదు. నా బుక్ నాకు ఎప్పుడు చేరుతుందో వారికే తెలీదు. "కావాలంటే రిఫండ్ కోసం రిక్వెస్ట్ చెయ్యి" అని ఇంకో సిగ్గులేని నోటిఫికేషన్!
ఇదీ ఇప్పటి అమెజాన్.
ఈ పోస్టు జెఫ్ బెజోస్‌కు ఎవరైనా చేరవేస్తే బాగుండు. ఈమెయిల్ దొరికితే నేనే పంపిస్తాను... దీన్నే ఇంగ్లిష్‌లో.
ఈ పోస్టు జెఫ్ బెజోస్‌కు ఎవరైనా చేరవేస్తే బాగుండు. ఈమెయిల్ దొరికితే నేనే పంపిస్తాను... దీన్నే ఇంగ్లిష్‌లో.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani