Tuesday, 1 September 2026

పుస్తకం విలువ సినిమా టికెట్ కంటే తక్కువా?


మల్టీప్లెక్స్‌లో ఒక సినిమా టికెట్ ధర 395/- ఉంది. కొన్ని సినిమాలకు ఇంకా ఎక్కువే. కొన్నిసార్లు ఇది 1000/- వరకు కూడా వెళ్తుంది. 

రెండున్నర గంటలో, మూడు గంటలో సినిమా చూస్తాం. అక్కడితో అయిపోతుంది దాని కథ. 

కాని, మనకు నచ్చిన పుస్తకం ధర 200/-, 300/- లకే "ఇంత ఎక్కువ ధరా?" అనటం వింటున్నాం.   

"అంత ధర పెట్టి పాఠకులు పుస్తకాల్ని కొనరు" అంటారు పబ్లిషర్స్, బుక్ సెల్లర్స్. 

నిజంగా చాలా విచిత్రం.

పుస్తకం మనకు నచ్చిందే కొంటాం. మనం చదవాలనుకున్నదే కొంటాం. ఫిక్షన్ కావచ్చు, నాన్-ఫిక్షన్ కావచ్చు. ఒక పుస్తకం విలువ తప్పకుండా సినిమా కంటే ఎక్కువే. 

సినిమా ఒకసారి చూడటంతో అయిపోతుంది. పుస్తకాన్ని మనం చదివిన తర్వాత కూడా మన బుక్ ర్యాక్స్‌లో ఎంతకాలమైనా ఉంటుంది. చదవాలనుకున్నప్పుడు మళ్ళీ చదవచ్చు. ఆసక్తి ఉన్న ఫ్రెండ్స్‌కు చదవమని ఇవ్వొచ్చు. చాలు అనుకుంటే ఏదైనా లైబ్రరీకి డొనేట్ చెయ్యచ్చు.

ఏ కోణంలో చూసినా, ఒక పుస్తకం విలువ సినిమా టికెట్ కంటే ఎక్కువే. 

అలాంటప్పుడు పుస్తకం రేటుని ఎందుకని సినిమా టికెట్ కంటే చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నారు? పబ్లిషర్‌కు, బుక్ సెల్లర్‌కు ఎలా మెయింటెనెన్స్ వస్తుంది? రైటర్‌కు అసలు రాయాల్టీ అంటూ ఏమన్నా వస్తుందా? వచ్చినా అదేమైనా పనికొస్తుందా? 

ఒక యండమూరి, ఒక మల్లాది వంటి పాపులర్ రచయితలకు తప్ప, ఏ రచయితలకూ పెద్దగా రాయాల్టీ రాదు. అది దేనికీ ఉపయోగపడదు.  

కట్ చేస్తే - 

బుక్ లాంచింగ్, బుక్ ప్రమోషన్, ఆన్‌లైన్ మార్కెటింగ్ వంటివి తెలుగు పబ్లిషింగ్ రంగంలో కూడా ఇంకా రావాలి, ఊపందుకోవాలి. పుస్తకాల రీడబిలిటీ కూడా చాలా ముఖ్యం. 

ఇవి లేకుండా, ఈ సమస్యకు పరిష్కారం అసాధ్యం అని నాకు అనిపిస్తోంది. 

A book is not an object you buy. It is an idea you carry—and an idea can change a life.

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani