ముంబై హీరోయిన్స్‌లా జీరో సైజ్, లుక్, హై ప్రొఫైల్ కల్చర్, కలర్ వంటివి ఇప్పుడెవరూ పెద్దగా పట్టించుకోవటం లేదు.
చలాకీగా, డైనమిక్‌గా ఉన్నారా, తెలుగు డైలాగ్ డెలివరీ బాగుందా, ఎక్స్‌ప్రెషన్ బాగుందా... అవకాశం వచ్చినట్టే.
వీటికి తోడు - సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా అయితే మాత్రం వందకి వంద శాతం వారికి అవకాశం దొరికినట్టే.
మీరు గమనించే ఉంటారు... ఈమధ్యకాలంలో వచ్చిన ఎన్నో చిన్న బడ్జెట్ తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలే ఎక్కువగా హీరోయిన్స్‌గా పరిచయమవుతున్నారు.
కట్ చేస్తే -
ఇదంతా కరోనా తర్వాత వచ్చిన మార్పు.
ముంబై హీరోయినా, తెలుగు హీరోయినా అన్నది కాదు పాయింట్ ఇప్పుడు. కంటెంట్ బాగుందా లేదా అన్నదే పాయింట్.
అయితే - భారీ బడ్జెట్ సినిమాలకు, టాప్ స్టార్స్ సినిమాలకు మాత్రం ఇప్పుడు చెప్పిందంతా వర్కవుట్ కాదు. అక్కడ ముంబై హీరోయిన్సే కావాలి.
కాని, అవి సంవత్సరానికి ఒక 10 సినిమాలే ఉంటాయి. మిగిలిన 190 చిన్న బడ్జెట్ సినిమాల్లో కొత్త తెలుగు హీరోయిన్స్‌కు ఇప్పుడు నిజంగా ఫుల్ డిమాండ్ ఉంది.
డిసెంబర్లో మేం ప్రారంభిస్తున్న రెండు కొత్త సినిమాల్లో, మాకూ కావాలి... కొత్త తెలుగు హీరోయిన్స్. డిస్క్రిప్షన్లో మా యాడ్ ఉంది. ఆసక్తి ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
- మనోహర్ చిమ్మని


No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani