Wednesday, 1 October 2025

2025 పూర్తి కావడానికి... జస్ట్ ఇంకో 92 రోజులే!


ఏం సాధించాం అన్నది ఒకసారి సమీక్షించుకోవాలి. 

సాధించడం అంటే డబ్బు ఒక్కటే కాదు. జీవితంలో ఆనందానికి, ఆరోగ్యానికి తప్పనిసరిగా అవసరమైనవి ఇంకెన్నో ఉన్నాయి. వాటితో పాటు డబ్బు కూడా ఖచ్చితంగా అవసరమే.

నేనెప్పుడూ పూర్తిస్థాయిలో దిగకపోయినా, నన్ను చాలాసార్లు బ్రతికించి, మభ్యపెట్టి, నష్టపరచి, అంతిమంగా నా అమూల్యమైన ఎంతో సమయం దారుణంగా కోల్పోడానికి కారణమైన ఒక ఫీల్డుకు అంతిమంగా దస్విదానియా చెప్పగలిగాను. 

ఇప్పుడు అదొక 'ఒడిశిన ముచ్చట.' 

నో రిగ్రెట్స్. 

నాకెంతో ఇష్టమైన రైటింగ్‌తో పాటు, కోచింగ్ & కన్‌సల్టింగ్, యూట్యూబ్ చానెల్ (ది మనోహర్ చిమ్మని షో - పాడ్‌కాస్ట్) మీద దృష్టిపెట్టాను. ఆ దిశలో పనిచేయడం ప్రారంభించాను. 

2025లో నిజంగా ఇదొక అతి పెద్ద మార్పు. 

మన చుట్టూ ఎన్నెన్నో శబ్దాలు వినిపిస్తుంటాయి. చిన్నచూపు, విమర్శలు, హేళన... ఇవన్నీ చాలా సహజం.   

మన గురించి పట్టించుకొన్న వ్యక్తుల్నీ, మన బాధ్యతల్నీ మర్చిపోకుండా... అన్నీ తట్టుకొంటూ ముందుకు సాగాల్సిందే.  

ఎక్కువగా స్పిరిచువాలిటీ వైపు నా ఆలోచనలు వెళ్తుండటం అనేది ఈ సంవత్సరం నాలో నేను గమనించిన ఇంకో పెద్ద మార్పు. 

Maybe, just maybe — this is your time to float, not fight.

Let life lead.
You just show up — present, open, and real. 

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani