Thursday, 23 October 2025

ఫిలిం డైరెక్టర్‌కు ఇప్పుడు కొత్తగా ఇంకొక ఛాలెంజ్


సినిమా తీయడానికి డబ్బొక్కటే కాదు, మంచి టీమ్ కూడా చాలా ముఖ్యం. 

కట్ చేస్తే -

డబ్బు తక్కువై సినిమా ఆగిపోయినా, టీమ్ బాగుంటే అదసలు పెద్ద సమస్యే కాదు. కాని, ఇప్పుడలాంటి ఫైర్, ప్యాషన్ ఉన్న టీమ్ చాలా అరుదు. 

ముఖ్యంగా అసిస్టెంట్ డైరెక్టర్స్.  

ఇప్పుడొస్తున్న ఏడీల్లో (అసిస్టెంట్ డైరెక్టర్స్) చాలా మందికి ఫిలిం మేకింగ్ బేసిక్స్ తెలియదు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కాని, నిజం. 

చాలామంది ఇలాంటి కొత్త ఏడీలకు సినిమా అంటే షూటింగ్ ఒక్కటే. 

కనీసం ఆ షూటింగ్ సమయంలో కూడా కుదురుగా డైరెక్టర్ దగ్గర గాని, కెమెరా దగ్గర గాని, డైరెక్టర్ చెప్పిన దగ్గర గాని... 2 నిమిషాలు నిల్చోలేరు. 

షూటింగ్ అయిపోయిందా, ఇంక మళ్ళీ కంటికి కనిపించరు. 

ఒక్క వాక్యం తెలుగులో తప్పులేకుండా రాయలేరు. 

మరి ఏం చేద్దామని, ఏం నేర్చుకుంటామని టీంలోకి వస్తారో వాళ్ళకే తెలీదు. 

కొత్త ఏడీల్లో అందరూ ఈస్థాయిలోనే ఉన్నారని చెప్పడం లేదు. 80 శాతం మంది మాత్రం ఇలానే ఉంటున్నారు. 

దీనికి పూర్తి వ్యతిరేకంగా - ఒక 20 శాతం మంది కొత్త ఏడీలు ఇంటలెక్చువల్‌గా, ఫిజికల్‌గా, మెంటల్‌గా, రిసౌర్స్ అసోసియేట్స్‌గా 24/7 ఫైర్ మీదుంటారు. 

డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కు, సినిమా టీమ్‌కు కావల్సింది అలాంటివాళ్లే.   

డైరెక్షన్ డిపార్ట్‌మెంట్లో పనిచేసే అసిస్టెంట్స్‌కు ఉండాల్సిన మినిమమ్ డిసిప్లిన్, మినిమమ్ నాలెడ్జి గురించి ఇప్పుడు ఫీల్డులో పనిచేస్తున్న ఏ ఒక్క సీనియర్ అసోసియేట్ డైరెక్టర్‌ను/కోడైరెక్టర్‌ను అడిగినా బాగా చెప్తారు.     

సో, ఫిలిం డైరెక్టర్‌కు ఉండే 101 ఛాలెంజెస్‌లో ఇప్పుడు కొత్తగా ఇంకొక ఛాలెంజ్ వచ్చి చేరింది. 

అది... నిజంగా సినిమాలంటే ప్యాషన్ ఉండి, ఇష్టంగా పనిచేసే  కరెక్ట్ టీమ్‌ను తీసుకోవడం! 

ఇలాంటి పరిస్థితికి కారణం ఏంటంటే - 

ఇప్పుడొస్తున్న న్యూ టాలెంట్ చాలామందికి సినిమాల్లో తమ కెరీర్ పట్ల నిజంగా ప్యాషన్ లేదు. వీళ్ళకి కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొని షో చేసుకోడానికి ఫోటోలు కావాలి, సెలెబ్రటీ స్టేటస్ కావాలి, ఫేమ్ కావాలి, డబ్బు కావాలి... కాని, ఇవ్వన్నీ రావటం కోసం చెయ్యాల్సిన కృషి మాత్రం చెయ్యరు.  

అదీ పాయింట్.   

- మనోహర్ చిమ్మని        

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani