Monday, 27 October 2025

సినిమా పార్ట్-టైమ్ ప్రొఫెషన్ కాదు


పార్ట్-టైమ్‌గా చేసే పనులు పార్ట్-టైమ్ ఫలితాలనే ఇస్తాయి. 

ఇందాకే రాబిన్ శర్మ వీడియో ఒకటి చూశాను. "ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారి", "5 ఏ యమ్ క్లబ్" పుస్తకాల రచయితగా, పీక్ పెర్ఫామెన్స్ ట్రెయినర్‌గా అతని గురించి నాకు తెలుసు. 

వీడియో ప్రారంభంలో రాబిన్ చెప్పిన ఈ మాట ఎంతో మందికి సూటిగా గుచ్చుకుంటుంది.  

నాకు కూడా. 

కట్ చేస్తే - 

నాకు తెలిసిన ఒక మిత్రుడు సినిమానే ఒక తపస్సులా తీసుకొని కష్టపడ్డాడు. అద్వితీయమైన అతని టాలెంట్ గుర్తింపుకు నోచుకొని, అతను రైటర్ కావడానికి 12 ఏళ్ళు పట్టింది. డైరెక్టర్ కావడానికి మొత్తం 16 ఏళ్ళు పట్టింది.  

ఈ మిత్రున్ని మించిన టాలెంట్ ఉన్నవారు కూడా ఎందరో ఉంటారు. వాళ్ళంతా ఇంకా ఆ "ఒక్క ఛాన్స్" కోసమే పోరాడుతుంటారు. 

అలా... సినిమా తప్ప మరొక ధ్యాస లేకుండా ఏళ్ళుగా కష్టపడుతున్నవారికే రావల్సిన ఫలితం రావట్లేదు.  అలాంటిది - ఒక వైపు ఉద్యోగాలో, బిజినెస్సో, ఇంకేదో ప్రొఫెషన్‌లోనో పనిచేస్తూనో - సినిమాను పార్ట్‌టైమ్‌గా తీసుకొని పనిచేసినప్పుడు ఫలితాలు నిజంగానే పార్ట్-టైమ్ ఫలితాల్లానే ఉంటాయి. 

అసలే 5% కంటే లోపే సక్సెస్ రేటున్న సినీఫీల్డుకి రావాలనుకుంటే హాయిగా రావచ్చు. కాని, ఆశించిన ఫలితం రావాలంటే మాత్రం, ఒక పార్ట్-టైమర్‌గా కాకుండా, సినిమా ఒక్కటే లక్ష్యంగా పెట్టుకొని రావాల్సి ఉంటుంది. 

In cinema, you either give your all or get nothing.
Half efforts don’t make full dreams.

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani