Friday, 31 October 2025

సీన్ మార్చేసే ఆ ఒక్క వీడియో... ఆ ఒక్క థంబ్‌నెయిల్!


ఫిలిం ఇండస్ట్రీలో "ఒక్క ఛాన్స్" కోసం కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎలాగైతే తపిస్తారో... కొత్తగా యూట్యూబ్ చానెల్ ప్రారంభించిన కొత్త యూట్యూబర్స్ కూడా వైరల్ అయ్యే ఆ "ఒక్క వీడియో" కోసం అంతగా తపిస్తుంటారు. 

ఒక్క ఛాన్స్ లాగా, ఆ ఒక్క వీడియో సీన్ మొత్తం మార్చేస్తుంది. 

Viral is timing. Growth is strategy. Legacy is built through consistency and patience.

కట్ చేస్తే -

యూట్యూబ్‌లో ఆల్గరిథమ్ అని ఒక్కొక్కళ్ళు ఒక్కో కథ చెప్తుంటారు. అదేమంత అర్థం కాని, అర్థం చేసుకోలేని న్యూక్లియర్ సైన్స్ కాదు. 

సింపుల్‌గా చెప్పాలంటే - మనం ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో చూస్తున్నప్పుడు - ఆటొమాటిగ్గా ఒక మూడు విధాలుగా యూట్యూబ్ మనకు వీడియోల్ని మనకు సజెస్ట్ చేస్తుంది:  

1. మనం చూస్తున్న టాపిక్ మీదనే, అదే యూట్యూబర్ చేసిన ఇతర వీడియోలు.

2. అదే యూట్యూబర్ వేరే టాపిక్‌ల మీద చేసిన పాపులర్ వీడియోలు.

3. మనం చూస్తున్న టాపిక్ మీదనే, వేరే యూట్యూబర్స్ చేసిన వీడియోలు. 

వీటిలో మనకు నచ్చిన థంబ్‌నెయిల్ మీద మనం క్లిక్ చేస్తాం. 

అంతే.     

కట్ చేస్తే -

ఇలా వేరేవాళ్ళు వేరే వీడియోలు చూస్తున్నప్పుడు, యూట్యూబ్ సజెస్ట్ చేసే వీడియోల్లో మన వీడియో ఉండాలి. 

యూట్యూబ్ అలా మన వీడియోను వేలాదిమందికి సజెస్ట్ చెయ్యాలి. 

అప్పుడు - నిజంగా మన కంటెంట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటే - మన వీడియో కూడా వైరల్ అవుతుంది. 

అంతకుముందు డల్‌గా 10, 20, 30 వ్యూస్‌తో పడుకున్న మన పాత వీడియోలన్నీ మళ్ళీ పైకొస్తాయి. 


అయితే - ఇలా ఎప్పుడు, ఏ థంబ్‌నెయిల్‌తో ఉన్న మన ఏ వీడియో వైరల్ అవుతుందన్నది మిలియన్ డాలర్ కొశ్చన్! 

అప్పటిదాకా - నిలకడగా, రెగ్యులర్‌గా, ఒక స్ట్రాటెజిక్ ప్లానింగ్‌తో మనం వీడియోలు అప్‌లోడ్ చేస్తూనే ఉండాలి. 

Every upload is a seed — water it with patience, nurture it with strategy, and stay consistent until it becomes your forest.

- మనోహర్ చిమ్మని     

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani