Thursday, 2 October 2025

Dare to Dream


నా యూట్యూబ్ చానెల్లో ఇప్పుడు నేను చేస్తున్నదంతా ప్రాక్టీస్ అనుకోవచ్చు. పైలట్ వీడియోస్ అని కూడా అనుకోవచ్చు. "ది మనోహర్ చిమ్మని షో" పాడ్‌కాస్ట్ స్టార్ట్ అయ్యాక, నా సోలో వీడియోస్ అప్‌లోడ్ చెయ్యటం ఇక ఉండదు.   

నేను అనుకున్న గెస్టులతో ఎప్పుడెప్పుడు నా పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలు ప్రారంభిద్దామా అని ఎదురుచూస్తున్నాను. 

చాలామంది పీక్ ప్రొడక్టివిటీ ట్రెయినర్స్ "కన్‌సిస్టెన్సీ... కన్‌సిస్టెన్సీ" అని అదేపనిగా చెప్తుంటారు. ఆటమిక్ హాబిట్స్ బుక్‌లో చెప్పేది కూడా అదే... 

"నువ్వు బాధపడుతున్నావా, సంతోషంగా ఉన్నావా, మూడ్‌లో ఉన్నావా, మూడ్ అవుట్ అయ్యావా... ఇవన్నీ కాదు. చేయాలనుకున్న పనిని ఒక్క రోజు కూడా మిస్ కాకుండా చేస్తున్నావా లేదా అన్నది పాయింట్." 

పర్‌ఫెక్షన్ అదే వస్తుంది తర్వాత. 

ఫండింగ్, మ్యాన్ పవర్, టైమ్... లాంటి ప్రతిబంధకాలున్నాయి. అయినా సరే, ఈ నెల లోనే నా పాడ్‌కాస్ట్ ప్రారంభం కావల్సిందే అని గట్టి సంకల్పంతో ఉన్నాను. 

నా బ్లాగ్ పాఠక మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు. 

Great goals sound like jokes to small minds. Dare to dream that big.

- మనోహర్ చిమ్మని  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani