ఏవో కొన్ని జ్ఞాపకాలను వదిలి
ఒక్కొక్కరుగా అందరం
ఎలాగూ పోయేవాళ్ళమే.
కాస్త ముందూ వెనకా, అంతే.
ఈ లోగానే -
అర్థంలేని ఈ ఉరుకులు పరుగులు
ఇన్ని తలకు మించిన భారాలు
ఎన్నో కష్టాలు
ఇన్ని అపార్థాలు
ఇంత నిరంతర వ్యథ
నిజంగా అవసరమా?
కొంచెం సంతోషం కూడా పంచుకుందాం.
చావు, పుట్టుకలు మనచేతిలో ఉండవు. మన అంతిమ క్షణం మనం ఎన్నడూ ఊహించనివిధంగా ఉండొచ్చు. ఎవరికి తెలుసు?
ఏవేవో గుర్తుకొస్తున్న ఈ క్షణం, అంతా ఒక మాయలా అనిపిస్తుంది. నమ్మశక్యం కాకుండా ఉంటుంది. అసలిలా జరిగిందా అనిపిస్తుంది.
కానీ, అన్నీ జరిగాయి.
మంచీ, చెడూ.
ఆనందం, విషాదం.
ఆదరణ, అవమానం.
అదే జీవితం.
జీవితంలో ఎవ్వరు ఎంత ఎదిగినా, ఎగిరెగిరిపడ్దా, ఎన్ని లాజిక్కులు మాట్లాడినా, ఎంత ఈగోతో చెలరేగినా... అందరూ చివరికి ఏదో ఒక శక్తికి, ఒక నమ్మకానికి సరెండర్ అవ్వాల్సిందే.
ఆ శక్తికి, ఆ నమ్మకానికి మనం పెట్టుకొనే పేరు ఏదైనా కావొచ్చు. దేవుడు, దేవత, యూనివర్స్... ఇంకేదైనా కావచ్చు.
సరెండర్ అవ్వక మాత్రం తప్పదు.
అప్పుడే అంతా బాగుంటుంది.
ఆనందమైనా, కన్నీళ్లయినా.
అదే జీవితం.
అదే ఆధ్యాత్మికమ్.
అదే హిప్పీస్.
అదే ఓషో.
అదే ఆర్ట్ ఆఫ్ లివింగ్.
అదే ఇష యోగా...
ఇంకో వంద రూపాలు, వంద పేర్లు.
లక్ష్యం ఒక్కటే... ఆనందం.
ఈ క్షణం సంతోషంగా ఉండగలగడం. అనుక్షణం జీవించగలగటం.
ఆధ్యాత్మికంలో ఉండే ఆ నిరాడంబరత వేరు. ఆ నిర్మలత్వం వేరు.
ఎందరో మహానుభావులు... అందరికీ వందనాలు.
ఆ నిశ్చలత్వం.
ఆ నిశ్శబ్దం.
ఆ మానసిక ప్రశాంతత.
అందుకే, 1920 ల్లోనే మహా అగ్రెసివ్ రచయిత అయిన చలం లాంటివారు కూడా చివరికి రమణమహర్షి ఆశ్రమం చేరక తప్పలేదు.
అలాగని ఆధ్యాత్మికం అంటే అన్నీ వదిలేయటం కూడా కాదు.
కాకూడదు.
ఎందరో మహానుభావులు... అందరికీ వందనాలు.
Being spiritual does not mean giving up everything. The true test is to have everything and yet not to attached to them.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani