Saturday, 18 October 2025

కొన్ని జ్ఞానోదయాలు చాలా ఆలస్యంగా అవుతాయ్!


కుదిరితే పరిగెత్తు,
లేకపోతే నడువు.
అదీ చేతకాకపోతే,
పాకుతూ పో.
అంతేకానీ ఒకే చోట అలా
కదలకుండా ఉండిపోకు! 
- శ్రీశ్రీ

గతకొద్దిరోజులుగా పూర్తిగా ఒకే ఒక్క లక్ష్యం ఫోకస్డ్‌గా పనిచేసుకొంటూ వెళ్తున్నాను.

ఏదీ పట్టించుకోవడం లేదు. 

నా "10X తెలంగాణ" పాడ్‌కాస్ట్ ఈ నెల్లోనే ప్రారంభించాలనుకుంటున్నాను. 12 రోజులే ఉంది. చూడాలి ఏమవుతుందో. 

కట్ చేస్తే -

నంది అవార్డు సాధించిన నా స్క్రిప్ట్ రైటింగ్ బుక్ "సినిమాస్క్రిప్ట్ రచనాశిల్పం" మూడో రీప్రింట్ ఈ నవంబర్‌లో తప్పకుండా వేస్తున్నాను.  

స్క్రిప్ట్ రైటింగ్ మీదే ఇంకో కొత్త పుస్తకం రాయాలని నేనెప్పుడో ప్లాన్ చేశాను. ఫిలిం కెరీర్, ఫిలిం ప్రొడక్షన్, ఫిలిం డైరెక్షన్ లాంటి ముఖ్యమైన అంశాల మీద కూడా వేర్వేరు బుక్స్ రాయాలని కూడా ఎప్పుడో అనుకున్నాను. 

నాకేదో బాగా తెలుసని కాదు. నేను అధ్యయనం చేసింది, నాకు తెలిసింది రాయాలని. అది కొత్తవాళ్ళకి ఉపయోగపడాలని. అంతే.  

ఒక్కో బుక్‌కి కొన్ని వందల పేజీల డ్రాఫ్ట్ కూడా రాసి, అలా పక్కన పెట్టాను, "తర్వాత చూద్దాం లే" అని.   

ఇవన్నీ తెలిసి చేసే తప్పులు. 

ఇలాంటి అర్థం లేని వాయిదాలు ఇంక వేయొద్దని ఇటీవలి జ్ఞానోదయం తర్వాత గట్టి నిర్ణయం తీసుకున్నాను. 

Writers and filmmakers share the same madness — chasing truth through chaos, until emotion takes shape.

- మనోహర్ చిమ్మని  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani